Prabhas: కల్కి సినిమా కార్మికులందరికీ ప్రభాస్‌ సూపర్ గిఫ్ట్.. ప్రభాస్ రాజు గొప్పతనం.!

0
21
కల్కి కార్మికులందరికీ ప్రభాస్‌ గిఫ్ట్.. ప్రభాస్ రాజు గొప్పతనం.!

ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం ప్రభాస్‌ది. కష్టాల్లో ఉన్నవారికి అడగకుండానే సాయం చేసే గుణం ప్రభాస్‌ది. అభిమానులకు, సినీ కార్మికులకు తనవంతు సాయం చేస్తూ ఎక్కడ పబ్లిసిటీ లేకుండా సింపుల్ గా ఉండేందుకు ఇష్టపడుతుంటాడు. ఇప్పటికే ప్రభాస్ మంచితనం, మనస్తత్వం గురించి చాలా మంది ఇంట్రెస్టింగ్ విషయాలను చెప్పుకొచ్చారు. ఇక తాజాగా కల్కి సినిమాకు కాస్ట్యూమ్ మాస్టర్ గా పనిచేసిన మురళి.. కల్కి కార్మికులకు ప్రభాస్ చేసిన గొప్పచేసిన సాయం గురించి చెప్పారు.

కల్కి మూవీ కోసం ఆ మూవీ టీం పడుతున్న కష్టాన్ని గుర్తించిన ప్రభాస్‌.. కల్కి టీంలో పని చేసిన కార్మికులకు…. ఒక్కొక్కరికీ 10 వేల రూపాయలను గిఫ్ట్ గా ఇచ్చారట. అలా టీంలో ఉన్న వేలాది మందికి పది పది వేల చొప్పున పంచారట. కొందరికైతే వారి పేర్లు అకౌంట్ నెంబర్లు తెలుసుకుని అకౌంట్లోకి ట్రాన్స్‌ఫర్ చేశారట. అంతేకాదు షూటింగ్ జరుగుతున్నన్ని రోజులు అందరికీ రుచికరమైన భోజనం ఏర్పాటు చేశారట ప్రభాస్‌. అయితే తాజాగా ఈ విషయాన్ని కాస్ట్యూమ్ మాస్టర్ మురళి బయటపెట్టడంతో.. ప్రభాస్ చేసిన సాయం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. మరో సారి ప్రభాస్‌ గొప్ప మనసు గురించి నెట్టింట చర్చ నడిచేలా చేస్తోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here