హారర్ కంటెంట్ సినిమాలు చూసేందుకు సినీ ప్రియులు చాలా ఆసక్తి చూపిస్తుంటారు. ఊహించని ట్విస్టులు.. భయంకరమైన సన్నివేశాలు.. దెయ్యాలు వెంటాడి చంపడం వంటి సీన్స్ ఉన్నప్పటికీ.. ఓవైపు భయపడుతూనే హారర్ సినిమాలు చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. కానీ ఈ హారర్ సినిమాను తీసిన ఆరుగురు నటీనటులు ప్రొడక్షన్ సమయంలోనే..ఆ తర్వాత చనిపోయారట.. అదే పోల్డర్గైస్ట్.. 1982లో విడుదలైన ఈ హాలీవుడ్ మూవీ గురించి అనేక వార్తలు వినిపిస్తుంటాయి. ఈ సినిమాను తెరకెక్కించిన సమయంలోనే దర్శకనిర్మాతలకు అనూహ్య ఘటనలు ఎదురయ్యాయట.
1982లో రూపొందించిన ఈ పోల్డర్గైస్ట్ సినిమా ఓ క్లాసిక్ మూవీగా నిలిచింది. ప్రస్తుతం ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. అలాగే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లోనూ అందుబాటులో ఉంది. ఈ చిత్రాన్ని ఒంటరిగా చూడాలంటే ఎంతో ధైర్యం ఉండాల్సందే. పోల్డర్గైస్ట్ సినిమాను తెరకెక్కిస్తున్న సమయంలో.. అలాగే రిలీజ్ అయిన తర్వాత ఇందులో పనిచేసిన నలుగురు చనిపోయారు. ఈ సినిమాలో లీడ్ యాక్టర్స్ పెద్ద కూతురిగా కనిపించిన డొమెనిక్ డూన్ 1982లో ఆమె బాయ్ ఫ్రెండ్ చంపేశాడు. ఆ తర్వాత చిన్న కూతురిగా నటించిన హీథర్ ఓరూర్కీ 12 ఏళ్ల వయసులో గుండెపోటుతో మరణించింది. ఆ తర్వాత మరో వ్యక్తి పెర్రీమాన్ 2009లో హత్యకు గురికాగా.. ఇందులో మాంత్రికుడిగా కనిపించిన జూలియన్ బైక్ 1987లో క్యాన్సర్ తో మరణించాడు.
ఓ ఫ్యామిలీ నివసిస్తున్న ఇంటిపై దెయ్యాలు దాడి చేసి వాళ్ల కూతురిని ఎత్తుకుపోయే స్టోరీ ఇది. ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు స్టీఫెన్ స్పీల్ బెర్గ్ స్క్రీన్ ప్లే అందించగా.. టోబీ హూపర్ దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమా క్లైమాక్స్ లో తల్లి డయానా పాత్ర పోషించిన జోబెత్ విలియమ్స్.. అస్తి పంజరాలు ఉన్న ఓ చెరువులోకి దూకుతుంది. ఈ సినిమాలో ఉపయోగించిన అస్తి పంజరాలు ప్రత్యేకంగా తయారు చేసినవి కావు.. నిజమైన మనుషుల ఆస్తిపంజరాలు వాడినట్లు సమచారం. ప్రస్తుతం ఈ సినిమా రెండు ఓటీటీలు అమెజాన్ ప్రైమ్, హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.