Pawan Kalyan: పవన్ కళ్యాణ్‏తో అనసూయ స్పెషల్ సాంగ్.. ఇక మోత మోగిపోవాల్సిందేనంటోన్న రంగమ్మత్త..

0
26
పవన్ కళ్యాణ్‏తో అనసూయ స్పెషల్ సాంగ్..

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతిలో నాలుగైదు సినిమాల వరకు ఉన్నాయి. కానీ అటు ఏపీ అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచే పవన్ రాజకీయాల్లో బిజీగా ఉండడంతో ఈ సినిమాలన్ని తాత్కాలికంగా ఆగిపోయాయి. పిఠాపురం ఎమ్మెల్యేగా భారీ మోజారిటీతో గెలిచిన అనంతరం.. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు పూర్తిగా ప్రజాసేవకు అంకితమయ్యారు. కొన్నిరోజుల తర్వాత సినిమా షూటింగ్స్ పూర్తిచేస్తానని.. ఆలస్యమవుతున్నందుకు నిర్మాతలకు క్షమాపణలు చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, గ్లింప్స్ సినిమాలపై మరింత హైప్ పెంచగా.. తాజాగా పవర్ స్టార్ అభిమానులకు మరో సర్ ప్రైజ్ ఇచ్చింది నటి, యాంకర్ అనసూయ. ప్రస్తుతం బుల్లితెరపై వస్తున్న కిర్రాక్ బాయ్స్ ఖిలాడి గర్ల్స్ షో లేటెస్ట్ ప్రోమోలో ఆసక్తికరమైన అప్డేట్ రివీల్ చేసింది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబోలో సాంగ్ చేశానని.. ఇక మోత మోగిపోవడం ఖాయం అంటూ అసలు విషయం చెప్పేసింది. “ఫస్ట్ టైం ఈ విషయాన్ని రివీల్ చేస్తున్నాను.. ఈ విషయాన్ని చాలా గర్వంగా చెప్తున్నాను.. నేను పవన్ సర్ తో ఒక బ్యూటీఫుల్ డాన్స్ చేశాను. ఆ పాట మోత మోగిపోతుంది” అంటూ హింట్ ఇచ్చేసింది అనసూయ. అయితే ఏ సినిమాలో అనేది మాత్రం క్లారిటీ రాలేదు. పవన్ సినిమాలో అనసూయ పాట అందులోనూ మోత మోగిపోద్ది అని చెప్పడంతో అది కచ్చితంగా స్పెషల్ సాంగ్ అయ్యింటుందని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. దీంతో ఇప్పుడు పవన్, అనసూయ మధ్యలో రాబోయే స్పెషల్ సాంగ్ కోసం ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు.

గతంలోనూ పలు చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ తో అలరించింది అనసూయ. ఇక ఇప్పుడు ఏకంగా పవన్ తో స్పెషల్ సాంగ్ చేయనుండడంతో ఆ సాంగ్ పై ఓ రేంజ్ హైప్ ఏర్పడింది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం పవన్ సినిమాల విషయానికి వస్తే.. డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్, డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో ఓజీ చిత్రాల్లో నటిస్తున్నారు. ఇవే కాకుండా హరిహర వీరమల్లు సినిమాలో పవన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ చిత్రాలను కంప్లీట్ చేయనున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here