Friday, November 22, 2024
Google search engine
HomeUncategorizedPawan Kalyan: జీతం తీసుకోకుండా పనిచేస్తానన్న పవన్ కల్యాణ్.. 'అన్నా' అంటూ దండం పెట్టిన ప్రముఖ...

Pawan Kalyan: జీతం తీసుకోకుండా పనిచేస్తానన్న పవన్ కల్యాణ్.. ‘అన్నా’ అంటూ దండం పెట్టిన ప్రముఖ డైరెక్టర్

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాఫురం ఎమ్మెల్యేగా గెలిచారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఆ తర్వాత డిప్యూటీ సీఎంగా బాధ్యతలు కూడా చేపట్టి ప్రజా సేవలో తలమునకలయ్యారు. ఇదిలా ఉంటే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో తాను జీతం తీసుకునే పని చేస్తానన్నారు పవన్ కల్యాణ్. జీతం తీసుకుంటూనే ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సి ఉంటుంది కాబట్టి వేతనం తీసుకునే మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తానన్నారు. అయితే ఇప్పుడు ఆయన మనసు మార్చుకున్నారు. తాజాగా పంచాయతీరాజ్ శాఖను రివ్యూ చేస్తున్న సమయంలో అక్కడున్న అప్పులు, లోటు బడ్జెట్ లను గురించి తెలుసుకున్న పవన్ తాను జీతం తీసుకోకపోవడమే కరెక్ట్ అని ప్రకటించారు. అలాగే పంచాయతీ రాజ్ శాఖలో ఫర్నీచర్ కూడా తన సొంత డబ్బులతోనే ఏర్పాటు చేసుకుంటానని వెల్లడించారు. పవన్ తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ తో ‘బ్రో’ సినిమాను తెరకెక్కించిన ప్రముఖ దర్శకుడు, నటుడు సముద్ర ఖణి ఆసక్తికర ట్వీట్ చేశారు. పవన్ జీతం తీసుకోకపోవడంపై తమిళ మీడియా కవర్ చేసిన ఒక న్యూస్ పిక్ ను ట్విట్టర్ లో షేర్ చేసిన ఆయన ‘అన్నా’ అంటూ దండం పెడుతున్న ఎమోజీని షేర్ చేశారు.

ప్రస్తుతం సముద్ర ఖణి ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు ఈ ట్వీట్ ను రీ ట్వీట్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. కాగా సముద్ర ఖని తెరకెక్కించిన బ్రో సినిమాలో పవన్ కల్యాణ్ తో పాటు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కూడా నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ బ్యానర్ పై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. అదే సమయంలో వివాదాల్లోనూ నిలిచింది. ముఖ్యంగా ఏపీ రాజకీయాల్లో పెను దుమారం రేపింది. ప్రస్తుతం సముద్రఖని జబర్దస్త్ నటుడు ధన్ రాజ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు.  రామం రాఘవం పేరుతో ఈ మూవీ తెరకెక్కుతోంది.  త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇవి కూడా చదవండి

సముద్ర ఖని ట్వీట్ ఇదిగో..

పవన్ కల్యాణ్ తో డైరెక్టర్ సముద్ర ఖని..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments