Pawan Kalyan: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఆగిపోనుందా? నెటిజన్‌కు గట్టిగా ఇచ్చిపడేసిన డైరెక్టర్ హరీశ్‌ శంకర్

0
19
పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ ఆగిపోనుందా? ఇచ్చిపడేసిన డైరెక్టర్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్- హరీశ్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దీంతో ఉస్తాద్ భగత్ సింగ్ పై అభిమానుల అంచనాలు భారీగానే ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే ఈ మూవీ నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్స్, గ్లింప్స్ ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అయితే పవన్ కల్యాణ్ ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా బిజీబిజీగా ఉంటున్నారు. దీంతో ఎప్పటిలాగానే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాపై రూమర్లు వస్తున్నాయి. గతంలో పలు సార్లు ఈ సినిమా ఆగిపోయినట్లు పుకార్లు షికార్లు చేశాయి. అయితే డైరెక్టర్ హరీశ్ శంకర్ మాత్రం వీటికి స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తున్నాడు. తన సినిమా అప్ డేట్స్ ను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నాడు. తాజాగా ఒక నెటిజన్ ‘ఉస్తాద్ భగత్‌ సింగ్‌’ ఆగిపోనుందంటూ ట్వీట్ చేశాడు. దీనికి స్పందించిన హరీశ్ శంకర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. ‘సినిమా మొదలేకాదు అని రూమర్స్‌ వచ్చినప్పుడే పట్టించుకోలేదు. ఇప్పుడు ఇలాంటి వాటి గురించి చదివే సమయం కూడా లేదు’ అని తనదైన శైలిలో రిప్లై ఇచ్చాడీ స్టార్ డైరెక్టర్.

ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో పవన్ కల్యాణ్ సరసన క్రేజీ హీరోయిన్ శ్రీలీల నటిస్తోంది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు. అశుతోష్ రాణా, నవాబ్ షా, చమ్మక్ చంద్ర, గిరి, గౌతమి తదితరులు ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

హరీశ్ శంకర్ ట్వీట్..

ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో పవన్ కల్యాణ్..

డైరెక్టర్ హరీశ్ శంకర్ ,పవన్ కల్యాణ్ లతో శ్రీలీల..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here