Pawan Kalyan: ఈ ఫొటోలో పవర్ స్టార్‌తో ఉన్న అమ్మాయిని గుర్తుపట్టారా..? ఆమె ఎవరో తెలుసా..

0
60
ఈ ఫొటోలో పవర్ స్టార్‌తో ఉన్న అమ్మాయిని గుర్తుపట్టారా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన  అత్తారింటికి దారేది సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాతో పవర్ స్టార్ భారీ విజయాన్ని అందుకున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా కలెక్షన్స్ పరంగా కుమ్మేసింది. శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్ఎల్‌పి పతాకంపై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించగా 2013లో ఈ సినిమా విడుదలైంది. పవన్ కళ్యాణ్, సమంత జంటగా నటించిన ఈ సినిమాలో బొమన్ ఇరానీ, నదియా, ప్రణీత, బ్రహ్మానందం ముఖ్య పాత్రలు పోషించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు. ఇక ఈ సినిమాలో భారీ విజయం సాధించడంతో పవన్ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. గబ్బర్ సింగ్ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన ఈ సినిమా భారీ విజయం సాధించింది.

ఇది కూడా చదవండి : Venu Swamy: మరో బాంబ్ పేల్చిన వేణుస్వామి..! ఆ టాలీవుడ్ హీరోయిన్ కూడా విడాకులు తీసుకుంటుందంటూ..

ఇక ఈ సినిమాలోని సాంగ్స్ అన్ని సూపర్ హిట్ గా నిలిచాయి. అత్తారింటికి దారేది సినిమాలోని పాటలన్ని ఇప్పటికీ అలరిస్తున్నాయి. ఇక ఈ సినిమాలో పవన్ ఓ పేరడీ సాంగ్ చేశారు. ఈ సాంగ్ లో పవన్ బాబాజీ గెటప్ లో కనిపించి ఆకట్టుకున్నారు. ఇక పై ఫొటోలో పవన్ కళ్యాణ్ తో ఉన్న అమ్మాయిని గుర్తుపట్టారా.? చాలా సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో సైడ్ డాన్సర్ గా కనిపించింది ఆమె.

ఇది కూడా చదవండి : వర్షాకాలంలో వేడి పుట్టించే సినిమా..! ఓటీటీని ఊపేస్తున్న రొమాంటిక్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే

ఆమె పేరు కళ్యాణి.. చాలా సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసింది కళ్యాణి. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే కళ్యాణికి చాలా ఇష్టం. ఆయన తో చాలా ఫోటోలు దిగింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహరవీరమల్లు సినిమాలోనూ కళ్యాణి నటిస్తుంది. ఆ షూటింగ్ సెట్ లో ఆయనతో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే కళ్యాణి తన ఫోటోలు, రీల్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here