Pawan Kalyan: అన్నయ్య అప్పు తీర్చడానికి రిస్క్‌ తీసుకున్న పవర్ స్టార్.!

0
18
అన్నయ్య అప్పు తీర్చడానికి రిస్క్‌ తీసుకున్న పవర్ స్టార్.!

తెరిచిన పుస్తకంలాగే ఉండే పవన్‌ కళ్యాణ్‌ జీవితంలో.. చాలా తెలియని ఇంట్రెస్టింగ్ విషయాలు ఉంటాయి. ఓ సినిమా ఒప్పుకోవడానికి.. చేయడానికి ఆయనకు ఎన్నో రీజన్స్‌ ఉంటాయి. అయితే అవన్నీ అప్పడప్పుడూ తన మాటలతో బయటపెట్టి నెట్టింట వైరల్ అవుతుంటారు. పవర్ స్టార్ అలా.. రీసెంట్‌గా తాను గబ్బర్ సింగ్ మూవీ ఎందుకు చేయాల్సి వచ్చిందో చెప్పుకొచ్చారు. తన మాటలతో.. గబ్బర్‌ సింగ్ బిహైండ్ ఇంట్రెస్టింగ్ విషయాన్ని అందరికీ తెలిసేలా చేశారు.

ఇక పవన్ నటించిన సూపర్ హిట్ చిత్రాల్లో గబ్బర్ సింగ్ ఒకటి. ఇందులో పవన్ యాక్టింగ్, మేనరిజం, డైలాగ్ డెలివరీ అన్ని ప్రేక్షకులను కట్టిపడేశాయి. ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ ట్రెండ్ సెట్ చేసిన సినిమా అంటే అదే. మండుటెండలో బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. 2012 మే 11న విడుదలై భారీ విజయాన్ని అందుకున్న ఈ మూవీని చేసేందుకు మొదట పవర్ స్టార్ ఆసక్తి చూపించలేదట. కానీ తప్పని పరిస్థితుల్లో తన అన్నయ్య నాగబాబు అప్పులు తీర్చేందుకు ఈ సినిమాను చేయాల్సి వచ్చిందట.

ఇక అసలు విషయం ఏంటంటే..! హిందీలో సూపర్ హిట్ అయిన దబాంగ్ సినిమాను రీమేక్ చేయాలని పవన్‌కు ఈ మూవీ మేకర్స్ .. ఆ సినిమా రిలీజ్ అయిన రెండు, మూడు నెలలకు చూపించారట. వారి బలవంతంతో ఆ సినిమా చూసిన తనకు.. రొటీన్ సినిమాలా అనిపించిందని.. అందుకే ఆ సినిమా చేయడానికి ఒప్పుకోలేదని చెప్పారు పవన్. అయితే కొన్ని రోజులకు నాగబాబు సినిమాకు సంబంధించి ఫైనాన్షియల్ సమస్యలు రావడంతో.. ఆ బాధ్యతను తాను తీసుకున్నానని.. ఆ అప్పు తీర్చేందుకే తక్కువ బడ్జెట్ లో.. తొందరగా కంప్లీట్ అయ్యే సినిమా దబంగ్ అని ఫీలై..ఆ సినిమా ఒప్పుకొన్నట్టు ఓ మీటింగ్‌లో జనసైనికులకు చెప్పుకొచ్చారు పవర్‌ స్టార్.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here