Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్ కళ్ళు నెత్తికెక్కాయి.. ఇదే అతని నిజస్వరూపం.. షాకింగ్ విషయం చెప్పిన షకీలా

0
19
Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్ కళ్ళు నెత్తికెక్కాయి.. ఇదే అతని నిజస్వరూపం.. షాకింగ్ విషయం చెప్పిన షకీలా

Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్ కళ్ళు నెత్తికెక్కాయి.. ఇదే అతని నిజస్వరూపం.. షాకింగ్ విషయం చెప్పిన షకీలా

బిగ్ బాస్ గేమ్ షోకు ఎంతటి ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే చాలా భాషల్లో టెలికాస్ట్ అవుతున్న బిగ్ బాస్ మన దగ్గర కూడా మంచి క్రేజ్ తెచ్చుకుంది. తెలుగులో బిగ్ బాస్ విజయవంతంగా ఏడూ సీజన్స్ పూర్తి చేసుకుంది. కాగా త్వరలోనే బిగ్ బాస్ సీజన్ 8 మొదలవ్వనుంది. ఇదిలా ఉంటే బిగ్ బాస్ తెలుగు సీజన్స్ లో ఏడో సీజన్ కు మంచి టీఆర్ఫీ వచ్చింది. ఈ సీజన్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా పల్లవి ప్రశాంత్ హౌస్ లోకి అడుగు పెట్టడం.. రైతు బిడ్డగా వచ్చి విన్నర్ గా నిలవడం ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలాగే బిగ్ బాస్ హౌస్ లోనూ భారీగా రచ్చ జరిగింది. సీరియల్ బ్యాచ్ తో పల్లవి ప్రశాంత్ పెట్టుకున్న గొడవలు. మధ్యలో రతికా రోజ్ తో పల్లవి ప్రశాంత్ ప్రేమాయణం. ఆతర్వాత శోభా శెట్టి శివాజీ మధ్య గొడవలు.. ఇలా చాలా రచ్చ జరిగింది సీజన్ 7లో.. అయితే తాజాగా పల్లవి ప్రశాంత్ పై షకీల చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

సీజన్ 7లో షకీలా కూడా పాల్గొన్న విషయం తెలిసిందే. కాకపొతే ఆమె ఎక్కువ వారాలు హౌస్ లో లేదు. రెండు వారాలు హౌస్ లో ఉన్న ఆమె ఆ తర్వాత హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. తాజాగా ఓ ఇంట్రవ్యూలో షకీలా మాట్లాడుతూ బిగ్ బాస్ లో పాల్గొన్న కంటెస్టెంట్స్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ క్రమంలోనే పల్లవి ప్రశాంత్ పై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు షకీలా. పల్లవి ప్రశాంత్ కు కళ్లు నెత్తికెక్కాయి అని అన్నారు షకీలా.

ఆమె మాట్లాడుతూ.. బిగ్ బాస్  హౌస్‌లో నేను ఉన్నప్పుడు నాకు ప్రియాంక, అమర్ దీప్ , దామిని , సందీప్ మాత్రమే నిజాయితీగా అనిపించారు. వారి మాటల్లో నాకు ఎక్కడ తప్పులు కనిపించలేదు. చాలా నిజాయితీగా అనిపించారు. ముఖ్యంగా వాళ్లలో నేను నిజాయితీ చూసాను.  పల్లవి ప్రశాంత్ నన్ను ఏం చేసిన ఐ డోంట్ కేర్.. అతను బిగ్ బాస్ హౌస్ లోకి పిల్లి లాగా వచ్చాడు.. అన్న, అక్క అనుకుంటూ చాలా వినయంగా నటించాడు. ఆ తర్వాత కాస్త గుర్తింపు వచ్చిన తర్వాత ఓట్లు పడుతున్నాయి ఫ్యాన్స్ పెరిగారు అని తెలిసిన తర్వాత కళ్ళు నెత్తికెక్కాయి. సీనియర్ ఆర్టిస్టులు ఉన్నారన్నది కూడా చూడకుండా యాటిట్యూడ్‌గా బిహేవ్ చేశాడు. అంతే కాదు చాలా పొగరు చూపించాడు. పెద్దవాళ్ళు, సీనియస్ ఉన్నారు కూడా మర్యాద ఇవ్వకుండా కాలు మీద కాలేసుకుని కూర్చోవడం నాకు నచ్చలేదు. అదే అతని నిజస్వరూపం అని మండిపడ్డారు షకీలా. అలాగే బిగ్ బాస్ షో పైన కూడా షాకింగ్ కామెంట్స్ చేశారు షకీలా.. కేవలం పేమెంట్ కోసమే నేను హౌస్ లోకి వెళ్ళాను. పబ్లిసిటీ కోసమే వాళ్ళు నన్ను  తీసుకున్నారు అని తెలిపారు షకీలా.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here