Home Blog Page 521

Kalki 2898 AD: ఇది రెబల్ స్టార్ రేంజ్..! అక్కడ టాప్ 10ల్లో ఆరు ప్రభాస్ సినిమాలే..

0

ప్రభాస్ హీరోగా నటించిన కల్కి 2898 ఏడీసినిమా జూన్ 27న థియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమా ఇండియాలోనే కాకుండా విదేశాల్లో కూడా భారీ వసూళ్లను రాబట్టింది. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకొని బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఈ సినిమా. మొదటి రోజే భారీగా వసూల్ చేసింది ఈ సినిమా.. కేవలం 5 రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 555 కోట్ల రూపాయల బిజినెస్ చేసింది. ఈ సినిమాలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్ మధ్య పోరు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటించాడు. అలాగే కల్కి సినిమాలో విలన్ గా నటించిన కమల్ హాసన్ కూడా చాలా డేంజరస్ స్టైల్ లో కనిపిస్తున్నాడు.

ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా స్థాయి మరింత పెరిగింది. పాన్ ఇండియా మూవీ కల్కికి సౌత్‌లోనే కాకుండా నార్త్‌లోనూ క్రేజ్ సొంతం చేసుకుంది. ప్రాంతీయ భాషతో పాటు హిందీ ప్రేక్షకుల్లోనూ ఈ సినిమా మంచి వసూళ్లను రాబడుతోంది. ‘కల్కి 2898 AD’ విడుదలై 6 రోజులు అయ్యింది. ఆరురోజులకు ఈ మూవీ రూ.625 కోట్లు రాబట్టింది. ప్రభాస్ చిత్రం మొదటి రోజు భారతదేశంలో 95.3 కోట్ల రూపాయల బిజినెస్ చేసింది. అయితే ఈ సినిమా హిందీలో తొలిరోజు  22.5 కోట్లు రాబట్టింది. రెండో రోజు కూడా  భారీగానే రాబట్టింది. . అలాగే మూడో రోజు ఈ వసూళ్లు రూ.26 కోట్లకు చేరాయి.

నాల్గవ రోజు, ‘కల్కి 2898 AD’ హిందీ భాషలో 40 కోట్లు సాధించింది అయితే ఐదో రోజు సినిమా లెక్కల్లో భారీ తగ్గుదల కనిపించింది. హిందీలో కల్కి రూ.16.5 కోట్లు రాబట్టిందట. ఆరో రోజు  రూ.14 కోట్ల బిజినెస్ చేస్తుందని తెలుస్తోంది. ఓవరాల్ గా ఈ సినిమా హిందీలో ఇప్పటి వరకు రూ.142 కోట్లకు పైగా రాబట్టింది.

హిందీలో అత్యధిక వసూళ్లు సాధించిన 10 సౌత్ సినిమాల జాబితాలో ప్రభాస్ 6 సినిమాలు ఉన్నాయి. అదే సమయంలో, ‘బాహుబలి 2- ది కన్‌క్లూజన్’ హిందీలో దక్షిణాదిలో అతిపెద్ద వసూళ్లు సాధించడమే కాకుండా, ‘జవాన్’, ‘గదర్ 2’ , ‘పఠాన్’ తర్వాత నాల్గవ అతిపెద్ద చిత్రంగా నిలిచింది. రెండవ స్థానంలో, యష్ యొక్క KGF: చాప్టర్ 2 అతిపెద్ద వసూళ్లు. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌ల RRR మూడో స్థానంలో కొనసాగుతోంది. కాగా కల్కి చిత్రం 6 రోజుల్లో హిందీలో 142 కోట్ల రూపాయలను దాటింది. అంటే త్వరలో హిందీలో అత్యధిక వసూళ్లు రాబట్టిన ఐదు చిత్రాల జాబితాలో ప్రభాస్ ఈ చిత్రం తన స్థానాన్ని పదిలం చేసుకోనుందన్నమాట. అయితే మొదటి మూడు సినిమాల రికార్డును బద్దలు కొట్టాలంటే చాలా వసూల్ చేయాలి ఈ సినిమా. ప్రభాస్ సినిమా టాప్ 3 స్థానానికి చేరుకోవాలంటే RRRని బీట్ చేయాలి. ఈ సినిమా హిందీ వసూళ్లు 272 కోట్లు. యష్  KGF 2 టాప్ 2 స్థానాన్ని ఆక్రమించింది. దీన్ని బద్దలు కొట్టాలంటే ఈ సినిమా రూ.435 కోట్లకు పైగా బిజినెస్ చేయాల్సి ఉంటుంది. ‘బాహుబలి 2’ టాప్ పొజిషన్‌ను అందుకోవాలంటే ‘కల్కి’ రూ.511 కోట్లకు పైగా రాబట్టాలి. చూడాలి మరి ఏం జరుగుతుందో.. 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Ranveer Singh: రణవీర్ సింగ్ సినిమా పక్కన పెట్టేసిన శంకర్.. కారణం ఇదేనా..

0

బాలీవుడ్ మోస్ట్ ఎనర్జిటిక్ హీరో రణవీర్ సింగ్ వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. గత ఏడాది రణవీర్ హీరోగా నటించిన ‘రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ’ విడుదలై మంచి విజయం అందుకుంది. ఈ చిత్రంలో అతని సరసన అలియా భట్ కనిపించింది. ఇక రణవీర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ సింగం ఎగైన్’. ఈ సినిమాలో రణవీర్ తో కలిసి, అజయ్‌ దేవగన్‌, రోహిత్‌ శెట్టిల సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను ముందుగా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకున్నారు. ఇప్పుడు వాయిదా పడింది ఈ సినిమా. ఈ సినిమా తర్వాత రణ్‌వీర్‌ సింగ్‌ ఖాతాలో రెండు భారీ సినిమాలు ఉన్నాయి. మొదటిది- డాన్ 3, రెండవది- శక్తిమాన్. ఈ ఏడాది ఆయన సినిమా ఒకటి మాత్రమే విడుదల కానుంది. దీని తర్వాత తదుపరి చిత్రానికి సన్నాహాలు ప్రారంభించనున్నారు.

తాజాగా ‘హనుమాన్’ దర్శకుడు ప్రశాంత్ వర్మతో రణవీర్ సింగ్ ఓ భారీ చిత్రాన్ని చేయబోతున్నాడు. సినిమాలో కొంత భాగాన్ని కూడా చిత్రీకరించారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీగా నిర్మిస్తుంది. అయితే ఆ తర్వాత ఈ సినిమా నుంచి రణవీర్ సింగ్ తప్పుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. రణవీర్ సింగ్ సినిమాని మధ్యలోనే వదిలేయడంతో సినిమా ఆగిపోయిందని టాక్ వినిపిస్తుంది. ఇప్పుడు ఆయన మరో సినిమాకు సంబంధించిన అప్ డేట్ వచ్చింది.

రణవీర్ సింగ్, సౌత్ ప్రముఖ దర్శకుడు ఎస్ శంకర్ కలిసి ‘అపరిచిత్’  సినిమా చేస్తున్నారని ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో శంకర్ ‘అపరిచిత్’ హిందీ రీమేక్ కోసం ప్లాన్ చేస్తున్నానని, అయితే ఈ చిత్రం అనౌన్స్ చేసిన తర్వాత అనేక ఇతర ప్రాజెక్టులు కూడా వచ్చాయని చెప్పాడు శంకర్. ‘అపరిచిత్’ కంటే పెద్ద సినిమా కోసం నిర్మాతలు ఉత్సాహంగా ఉన్నారని, ఇంతకంటే పెద్ద సినిమా తీయాలనుకుంటున్నారని అంటున్నారు. ఈ  కారణంగానే ఈ సినిమా ప్రస్తుతానికి వాయిదా పడింది. ఈ రెండు విడుద‌ల త‌ర్వాత సినిమా చేయాలా లేదా అనే విష‌యంపై నిర్ణ‌యం తీసుకుంటున్నాము అన్నారు శంకర్. ప్రస్తుతం శంకర్ చేతిలో రెండు భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. మొదటిది- కమల్ హాసన్ ఇండియన్ 2 , రెండవది రామ్ చరణ్ గేమ్ ఛేంజర్. త్వరలో కమల్ హాసన్ సినిమా భారీగా విడుదల కానుంది. ఐతే రెండో సినిమా విడుదల తేదీని ఇంకా ప్రకటించలేదు. దీనిపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Telugu Indian Idol Season 3: సెన్సేషనల్ బెంచ్‌మార్క్ సెట్ చేసిన తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3..

0

తెలుగు ఓటీటీ సెన్సేషన్ ఆహా సూపర్ హిట్ సినిమాలతో పాటు సరికొత్త గేమ్ షోలు, ఆకట్టుకుంటే టాక్ షోలతో ప్రేక్షకులను అలరిస్తుంది. అలాగే అద్భుతమైన సింగింగ్ కాంపిటేషన్ ను కూడా నిర్వహిస్తుంది ఆహా. టాప్ 12 సింగర్స్‌తో కూడిన తెలుగు ఇండియన్ ఐడల్ 3 గ్రాండ్ గాలా, తెలుగులో రియాల్టీ షోలలో కొత్త బెంచ్‌మార్క్ సెట్ చేసింది. ఈ సీజన్ గ్రాండ్ గాలా ఆడియన్స్, జడ్జస్ ని మెస్మరైజ్ చేసింది. గ్రాండ్ గాలా ఎపిసోడ్స్ ఆడియన్స్ కి సరికొత్త అనుభూతిని పంచాయి. చెన్నై స్ట్రింగ్స్ ఆర్కెస్ట్రా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టారు. టాలెంటెడ్ కంపోజర్ థమన్, యంగ్ సింగర్ స్కందతో కలిసి వేదికపైకి వచ్చారు. వారిద్దరి పెర్ఫార్మెన్స్ ఎనర్జీని నింపింది.

థమన్, కార్తీక్ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలైన “గేమ్ ఛేంజర్”, “పుష్ప 2″లో తమ వర్క్ గురించి చెప్పడం అందరినీ అలరించింది. థమన్ తన సూపర్ హిట్ “మగువా మగువా” పాట వెనుక స్ఫూర్తిని పంచుకోవడం హార్ట్ టచ్చింగ్ మూమెంట్. తన తల్లికి ట్రిబ్యుట్ గా ఈ పాట చేశాని చెప్పడం ఎమోషనల్ డెప్త్ జోడించింది.

మాస్ట్రో ఇళయరాజాకి శ్రీ కీర్తి యొక్క అద్భుత ప్రదర్శన యొక్క వీడియోను పంపాలని కార్తీక్ డిసైడ్ అవ్వడం మరో హైలెట్. యువ గాయని కీర్తన జడ్జ్ కార్తీక్‌కు మ్యూజిక్ లెసన్ ని చెప్పడం మరో ఆకర్షణగా నిలిచింది. ఇది నెక్స్ట్ జనరేషన్ ట్యాలెంట్ ప్రజెంట్ చేసింది. మొత్తనికి సరికొత్త బెంచ్‌మార్క్ సెట్ చేసిన తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 గ్రాండ్ గాలా మస్ట్ వాచ్ షో గా నిలిచింది. అందరి ఫేవరేట్ తెలుగు ఇండియన్ ఐడల్ 3 ఆహాలో ప్రతి శుక్రవారం, శనివారం రాత్రి 7 గంటలకు ప్రసారం అవుతుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Shraddha Kapoor: ఒక్క వీడియోకి మిలియన్ లైకులు, భారీ వ్యూస్.. ప్రభాస్ హీరోయిన్ క్రేజ్ మాములుగా లేదుగా..

0

బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే.. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన సాహో సినిమాలో నటించింది ఈ చిన్నది. సుజిత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించింది శ్రద్ధా కపూర్. ఆ తర్వాత తెలుగులో మరో సినిమా చేయలేదు శ్రద్ధా కపూర్. బాలీవుడ్ లో మాత్రం బిజీగా మారిపోయింది. అక్కడ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది శ్రద్ధా కపూర్. సినిమాలతోనే కాదు సోషల్ మీడియాలోనూ ఈ చిన్నది చాలా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా శ్రద్ధా కపూర్ కు సంబందించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శ్రద్ధా కొద్ది గంటల క్రితం ఒక వీడియోను పోస్ట్ చేసింది. ఈ ముద్దుగుమ్మ పోస్ట్ చేసిన వీడియోను ఇప్పటివరకు 8 మిలియన్ల మంది వీక్షించారు.

ప్రస్తుతం, శ్రద్ధా వీడియో వైరల్ అవ్వడంతో పాటు సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ వీడియోలో శ్రద్ధా చాలా సంతోషంగా కనిపించింది. ఒక వీడియోను పోస్ట్ చేస్తూ, నటి 2024లో తాను ఇప్పటివరకు చేసిన వాటిని చూపించింది. వీడియోను పోస్ట్ చేస్తూ.. శ్రద్ధా.. ‘2024 సగం పూర్తయింది, ఈ సంవత్సరం ఇప్పటివరకు మీరు ఏమి చేశారో చెప్పండి.?’ అంటూ రాసుకొచ్చింది. శ్రద్ధా పోస్ట్‌పై అభిమానులు కూడా స్పందిస్తున్నారు. ప్రస్తుతం ఈ అమ్మడి వీడియో తెగ వైరల్ అవుతుంది. ఇదిలా ఉంటేశ్రద్ధా తన వ్యక్తిగత జీవితం కారణంగా గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తోంది. గత కొన్ని రోజులుగా రాహుల్ మోడీతో శ్రద్ధా ప్రేమలో ఉందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరి ఫోటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇది మాత్రమే కాదు, అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్‌కు కూడా శ్రద్ధ , రాహుల్ కలిసి ఎంట్రీ ఇచ్చారు. అప్పటి నుంచి వీరిద్దరి అనుబంధం గురించి చర్చ ఊపందుకుంది. ఇక శ్రద్ధ ఎప్పుడు పెళ్లి చేసుకుంటుంది.? ఈ అమ్మడు ఎప్పుడు గుడ్ న్యూస్ చెప్తుందా అని ఈగర్ గా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్.. శ్రద్ధా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. సోషల్ మీడియాలో కూడా ఆమెకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈబ్యూటీ తన అభిమానులతో టచ్‌లో ఉండటానికి ఎప్పుడూ తన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. నటి పోస్ట్‌లపై అభిమానులు లైక్స్, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

తొలిరాత్రి టార్చర్.. స్నేహితులకు భార్యను వేలం వేసిన భర్త.. రాత్రంతా గడపాలంటూ ఆ హీరోయిన్‏కు చిత్రహింసలు..

0

తొలిరాత్రి టార్చర్.. స్నేహితులకు భార్యను వేలం వేసిన భర్త.. రాత్రంతా గడపాలంటూ ఆ హీరోయిన్‏కు చిత్రహింసలు..

సినిమా ఓ రంగుల ప్రపంచం. తెరపై అందమైన జీవితాలు.. తమ నటనతో ప్రేక్షకులను అలరించిన ఎంతో మంది నటీనటులు. కానీ నిజజీవితం మాత్రం అందుకు భిన్నంగా ఉంటుంది. ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‏గా ఓ వెలుగు వెలిగిన హీరోయిన్ జీవితం పెళ్లి తర్వాత నరకంగా మారింది. వెండితెరపై ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించిన ఆ స్టార్ హీరోయిన్‍కు నరకం చూపించాడు ఆమె భర్త. దశాబ్దాలపాటు ఇండస్ట్రీని శాసించిన ఆ తార జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది. చివరకు తన భర్త నుంచి దూరమై ఇప్పుడు ఒంటరిగా ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతుంది. చాలా కాలం సినిమాలకు దూరంగా ఉన్న ఈ హీరోయిన్.. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇస్తుంది. ఆమె మరెవరో కాదు.. బాలీవుడ్ బ్యూటీ కరిష్మా కపూర్. ఇండస్ట్రీలో కపూర్ ఫ్యామిలీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ కుటుంబం నుంచి వచ్చిన చాలామంది హీరోలుగా, నిర్మాతలుగా, దర్శకులుగా, హీరోయిన్లుగా రాణిస్తున్నారు. అదే ఫ్యామిలీ నుంచి 1991లో నటిగా ఎంటరై ఎన్నో హిట్ చిత్రాల్లో నటించింది.

షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ వంటి స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో నటించింది. చాలా కాలం సినిమాలకు దూరంగా ఉన్న కరీష్మా ఇప్పుడిప్పుడే రీఎంట్రీ ఇస్తుంది. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కరిష్మా పెళ్లి తర్వాత తన జీవితం ఎంత నరకంగా మారిందో చెప్పుకొచ్చింది. కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడే దేశంలోని అతిపెద్ద వ్యాపారవేత్త సంజయ్ కపూర్ ను వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పింది. కానీ 2016లోనే భర్తతో విడాకులు తీసుకుంది. భర్తతో విడిపోయిన తర్వాత కరిష్మా చేసిన కామెంట్స్ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించాయి. పెళ్లైన తొలిరాత్రే తన భర్త సంజయ్ తనను చిత్రహింసలకు గురిచేశాడని తెలిపింది. పెళ్లి తర్వాత హనీమూన్‏కు వెళ్లిన సమయంలో అతడి స్నేహితులతో రాత్రి గడపాలని ఒత్తిడి చేశాడని.. డబ్బు కోసం తనను వేలం వేయడానికి కూడా సిద్ధమయ్యాడని తెలిపింది.

అలాగే తన తల్లితో కూడా కొట్టించాలని చూశాడని తెలిపింది. సంజయ్ కపూర్ విడాకుల సమయంలో కరిష్మాకు విలాసవంతమైన ఇంటితోపాటు రూ.14 కోట్లు భరణంగా ఇచ్చాడని అప్పట్లో టాక్ నడిచింది. కరిష్మా కపూర్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఉన్న సమయంలోనే అభిషేక్ బచ్చన్ తో ప్రేమలో పడింది. వీరిద్దరు పెళ్లి చేసుకుని నిర్ణయించుకుని నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. కానీ పెళ్లికి ముందే మనస్పర్థలతో విడిపోయారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Pawan Kalyan: అప్పులు తీర్చడానికే ఆ సినిమా చేశాను.. పవన్ కళ్యాణ్..

0

మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు పవన్ కళ్యాణ్. సినిమాలపరంగా కాకుండా ఆయన వ్యక్తిత్వానికే కోట్లాది మంది అభిమానులున్నారు. పవన్ కు సంబంధించిన ఏ చిన్న విషయమైన క్షణాల్లో నెట్టింట వైరలవుతుంది. ఇన్నాళ్లు బ్యాక్ టూ బ్యాక్ హిట్ చిత్రాలతో అలరించిన పవన్.. ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎంగా.. పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా విధులు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా తనదైన మార్క్ చూపిస్తున్నారు. ఇదిలా ఉంటే.. పవన్ నటించిన సూపర్ హిట్ చిత్రాల్లో గబ్బర్ సింగ్ ఒకటి. ఇందులో పవన్ యాక్టింగ్, మేనరిజం, డైలాగ్ డెలివరీ అన్ని ప్రేక్షకులను కట్టిపడేశాయి. ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ ట్రెండ్ సెట్ చేసిన సినిమా అంటే అదే. మండుటెండలో బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. “నాక్కొంచెం తిక్కుంది.. కానీ దానికో లెక్కుంది.. ” అంటూ పవన్ కచెప్పిన డైలాగ్స్ తో థియేటర్లు షేక్ అయ్యాయి.

ఈ సినిమా 2012 మే 11న విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఇందులో శ్రుతి హాసన్ కథానాయికగా నటించగా.. అలీ, కోట శ్రీనివాస్ రావు కీలకపాత్రలు పోషించారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో సెన్సెషన్ క్రియేట్ చేసిన ఈ సినిమాను పవన్ కళ్యాణ్ చేసేందుకు ఆసక్తి చూపించలేదట. కానీ తప్పని పరిస్థితుల్లో తన అన్నయ్య నాగబాబు అప్పులు తీర్చేందుకు ఈ సినిమాను చేయాల్సి వచ్చిందని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. హిందీలో సూపర్ హిట్ అయిన దబాంగ్ సినిమాను రీమేక్ చేయాలని చిత్రయూనిట్ తనకు ఆ సినిమా విడుదలైన రెండు, మూడు నెలలకు చూపించారని.. అప్పుడు చూస్తే తనకు ఆ మూవీ ఏం అర్థం కాలేదని అన్నారు. “సల్మాన్ ఖాన్ నటించిన ఆ కథలో కొత్తగా ఏముంది.. సల్మాన్ పర్సనల్ మూవీలా ఉంది. తల్లి, కొడుకు కథే ఉంది కదా.. కొత్తదనం ఏముంది.. ? అనిపించింది. అందుకే చేయలేనని చెప్పాను. కానీ కొన్ని రోజులకు నాగబాబు అన్నయ్య ఏదో సినిమాకు సంబంధించి ఫైనాన్షియల్ సమస్యలు ఉంటే ఆ బాధ్యతలు నేను తీసుకున్నాను. వెంటనే సినిమా స్టార్ట్ చేసి అప్పు తీర్చాలి అనుకున్నాను. అప్పుడు తక్కువ బడ్జెట్ లో తొందరగా కంప్లీట్ అయ్యే సినిమా గురించి ఆలోచించి గబ్బర్ సింగ్ మూవీ చేశాను” అని అన్నారు.

అలాగే సర్దార్ గబ్బర్ సింగ్ కూడా అలాంటి కారణంగానే చేయాల్సి వచ్చిందని అన్నారు. ప్రస్తుతం పవన్ చేతిలో నాలుగైదు సినిమాలు ఉన్నాయి. హరి హర వీరమల్లుతోపాటు.. ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Sudheer Babu: ఈ ప్రాజెక్ట్‌కు చాలా ప్రత్యేకతలు.. సుధీర్ బాబు ఏం చేయబోతున్నారు ??

0

సూపర్ న్యాచురల్ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ చిత్రానికి వెంకట్‌ కళ్యాణ్ దర్శకుడు. ఈ సినిమాకు మరో ప్రత్యేకత కూడా ఉంది. రుస్తుం, టాయ్‌లెట్‌ ఏక్‌ ప్రేమ్‌ కథ, ప్యాడ్‌, పారి లాంటి నేషనల్ అవార్డు విన్నింగ్ సినిమాలను నిర్మించిన ప్రేర్నా అరోరా ఓ లీడింగ్ స్టూడియోతో కలిసి సుధీర్ బాబు సినిమాను నిర్మించబోతున్నారు. సుధీర్ బాబుకు బాలీవుడ్‌లోనూ గుర్తింపు ఉంది.

Game Changer: గేమ్ ఛేంజర్ రిలీజ్‌పై బాంబ్ పేల్చిన శంకర్

0

Kakuda Movie OTT: ఆ గ్రామాన్ని వెంటాడుతోన్న దెయ్యం.. వణుకుపుట్టించే హారర్ కామెడీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

0

సాధారణంగా హారర్ మూవీస్ చూడాలని చాలా మంది ఆసక్తిగా ఉంటుంది. కానీ ఒంటరిగా చూడాలంటే ఎంతో ధైర్యం కావాలి. కానీ అదే హారర్ మూవీకి కామెడీ తోడైతే..ఇప్పుడు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ అలాంటి కంటెంట్ తరహా చిత్రాలు తీసుకువచ్చేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇన్నాళ్లు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్, కామెడీ ఎంటర్టైనర్స్ స్ట్రీమింగ్ అయ్యాయి. కానీ ఇప్పుడిప్పుడే హారర్ కామెడీ చిత్రాలు అడియన్స్ ముందుకు వస్తున్నాయి. అందులో కాకుదా ఒకటి. బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా, రితేష్ దేశ్ ముఖ్ ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ సినిమా అటు వెన్నులో వణుకు పుట్టిస్తూనే మరోవైపు కడుపుబ్బా నవ్విస్తుంది. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ సినిమాపై ఆసక్తిని కలిగించగా.. తాజాగా కాకుదా మూవీ ట్రైలర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్.

ఈ సినిమాను థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రాన్ని జూలై 12 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5లో స్ట్రీమింగ్ చేయనున్నారు. ఇటీవల బ్లాక్ బస్టర్ హిట్ అయిన ముంజ్యా సినిమాను తెరకెక్కించిన డైరెక్టర్ ఆదిత్య సర్పోదర్ కాకుదా చిత్రానికి దర్శకత్వం వహించారు. ముంజ్యా మూవీ రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టగా.. ఇప్పుడు కాకుదా సైతం ఓటీటీలో మంచి రెస్పాన్స్ అందుకోనున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది.

ట్రైలర్ విషయానికి వస్తే.. రాజస్థాన్ రాష్ట్రంలోని రథోడీ అనే గ్రామం శాపగ్రస్తమైంది. ఆ ఊళ్లోకి ప్రతి మంగళవారం రాత్రి 7.15 గంటలకు కాకుదా అనే దెయ్యం వస్తుందని చెబుతూ ట్రైలర్ స్టార్ట్ అయ్యింది. ఊళ్లో ఉన్న అన్ని ఇళ్లకు రెండు డోర్లు ఉంటాయి. ఒకటి పెద్దగా ఉండగా.. మరొకటి చిన్నది. ఆ చిన్న డోరును ఆ సమయానికి ప్రతి ఒక్కరూ తెరిచి ఉంచాలి. ఒకవేళ ఎవరైనా తెరచి ఉంచకపోతే 13 రోజుల్లో ఆ ఇంటి మనిషి పని అయిపోయినట్లే. అయితే ఆ చిన్న డోరును తెరిచి ఉంచకపోవడంతో సోనాక్షి భర్త ఆ దెయ్యానికి దొరికిపోతాడు. ఆ ఊరికి వచ్చిన దెయ్యాలను పట్టుకునే వ్యక్తి రితేష్ దేశ్ ముఖ్ తో కలిసి దెయ్యం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంది సోనాక్షి. ఆ సమయంలో వారిద్దరికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి..? సోనాక్షి భర్త ఏమయ్యాడు..? అసలు కాకుదా ద్యెయం ఎవరు ? అనే విషయాలు సినిమాలోనే చూడాలి.



మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Mokshagna Teja: నందమూరి వారసుడి ఆగమనం.. ఫ్యాన్స్‌కు పూనకాలు

0

అంతా బానే ఉంది గానీ వారసుడిని పరిచయం చేసే బాధ్యత బాలయ్య ఎవరికి ఇవ్వబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. దానికి ప్రశాంత్ వర్మ పేరు బలంగా వినిపిస్తుంది. గతంలో అన్‌స్టాపబుల్‌కు కూడా పనిచేసారు ప్రశాంత్. అప్పుడే ఈయనపై బాలయ్యకు గురి కుదిరింది. మరి నిజంగానే ప్రశాంత్ వర్మ, మోక్షు కాంబో సెట్ అవుతుందేమో చూడాలిక.