Home Blog Page 520

Kill Movie OTT: ఒంటరిగా చూడాలంటే గుండె ధైర్యం కావాలి.. ఓటీటీలోకి వచ్చేస్తోన్న యాక్షన్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

0

Kill Movie OTT: ఒంటరిగా చూడాలంటే గుండె ధైర్యం కావాలి.. ఓటీటీలోకి వచ్చేస్తోన్న యాక్షన్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

ఓటీటీలో ఎప్పటికప్పుడు కొత్త కొత్త కంటెంట్ చిత్రాలు, వెబ్ సిరీస్ తీసుకువస్తున్నారు మేకర్స్. హర్రర్ కామెడీ, సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ మూవీస్ తో సినీ ప్రియులను ఆకట్టుకుంటున్నారు. కానీ ఇప్పటివరకు ఇండియన్ మూవీ లవర్స్ ఎన్నడూ చూడని మోస్ట్ వయోలెంటే సినిమాను తీసుకురాబోతున్నారు. థియేటర్లలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన యానిమల్ సినిమాకు మించి వయోలెన్స్ ఉన్న సినిమా. అదే కిల్. హాలీవుడ్ రీమేక్ గా వస్తున్న ఈ కొత్త యాక్షన్ థ్రిల్లర్ మూవీని ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేందుకు రెడీ అయ్యారు మేకర్స్. ఈ చిత్రాన్ని శుక్రవారం (జూలై 5) నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ చేయనున్నారు.

ఇప్పటివరకు మూవీ లవర్స్ చూడని అత్యంత హింసాత్మక సినిమాగా రాబోతుంది కిల్. బాలీవుడ్ ప్రొడ్యుసర్ కరణ్ జోహార్, గునీత్ మోంగా, అపూర్వ మెహతా కలిసి నిర్మించిన ఈ సినిమాకు నిఖిల్ నగేష్ భట్ దర్శకత్వం వహించారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ చూస్తే ఈ సినిమా హింస ఏ స్థాయిలో ఉండబోతుందో అర్థమయ్యింది. రైల్లో జరిగిన నరమేధమే ఈ మూవీ. ఈ సినిమాలో లక్ష్య రాఘవ్ జుయెల్, ఆశిష్ విధ్యార్థి, హర్ష్ చాయా, తాన్యా మణిక్ తలా, అభిషేక్ చౌహాన్ కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమా ట్రైలర్ లోని ఇది ఇండియాలో ఇప్పటివరకు ఎవరూ చూడని అత్యంత హింసాత్మక సినిమా అంటూ మేకర్స్ చెప్పడం విశేషం. ఇందులో అమృత్ తులికా అనే జంట చుట్టూ తిరిగే స్టోరీ. ఈసినిమా హిందీలోనే రిలీజ్ కాబోతుంది.

కథ విషయానికి వస్తే.. రైల్లో ఓ జంట ప్రయాణిస్తుంది. అయితే ఆకస్మాత్తుగా వచ్చిన ఓ దొంగల ముఠా కత్తులు, తుపాకులతో నానా బీభత్సం సృష్టిస్తుంది. అదే సమయంలో ఆ జంట విడిపోతుంది. దీంతో హీరో చాలా క్రూరంగా మారతాడు. ఆ దొంగల ముఠాలోని సభ్యులను అత్యంత కిరాతకంగా చంపేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది..? అసలు ఆ హీరోకు ఏమైంది ? అనేది మూవీ.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

SSMB 29: మహేష్ బాబు రాజమౌళి సినిమాలో సలార్ నటుడు.. ఆ పాత్ర కోసమేనా..?

0

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా కోసం అభిమానులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా ఓ మోస్తరు విజయం సాధించడంతో మహేష్ బాబు అభిమానులు నిరాశపడ్డారు. స్టార్ హీరోలంతా బడా సినిమాలు చేస్తూ పాన్ ఇండియా లెవల్ లో హిట్స్ కొడుతుంటే మహేష్ బాబు మాత్రం లోకల్ గానే సినిమాలు చేస్తున్నారంటూ కాస్త నిరాశ చెందారు. కరెక్ట్ గా అదే టైంలో ఎంట్రీ ఇచ్చారు రాజమౌళి. ఆర్ఆర్ఆర్ సినిమాతో సంచలన విజయం సాధించిన ఆయన ఇప్పుడు మహేష్ తో ఏకంగా పాన్ వరల్డ్ సినిమా చేయడానికి రెడీ అయ్యారు. మహేష్ బాబు రాజమౌళి కాంబోలో సినిమా అని అనౌన్స్ చేసిన దగ్గర నుంచి అభిమానుల్లో ఆసక్తి రెట్టింపు అయ్యింది. ఇక ఇప్పుడు ఈ సినిమా పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా కోసం మహేష్ లుక్ మారుస్తున్నారు. ఈ సినిమాలో బీస్ట్ లుక్ లో మహేష్ కనిపిస్తారని అంటున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో విలన్ ఎవరనే విషయం గురించి రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.

రాజమౌళి సినిమాల్లో విలన్‌లకు కూడా చాలా ప్రాధాన్యత ఉంటుంది. విలన్‌లను చాలా పవర్ ఫుల్ గా ఇంట్రెస్టింగ్ గా చూపిస్తాడు జక్కన్న. ‘ఈగ’ సినిమాలో సుదీప్, ‘బాహుబలి’ సినిమాలో రానా దగ్గుబాటి ఇలా చాలా పవర్ ఫుల్ గా చూపించారు. ఆయన సినిమాల్లో విలన్లు అందరి దృష్టిని ఆకర్షించారు. ఇప్పుడు రాజమౌళి కొత్త సినిమాకి కూడా ఖడక్ విలన్‌నే ఎంచుకున్నాడని టాక్ వినిపిస్తుంది. అతను మరెవరో కాదు పృథ్వీరాజ్ సుకుమారన్.

ఇటీవల విడుదలైన ‘బడే మియా చోటే మియా’ సినిమాలో పృథ్వీరాజ్ విలన్‌గా నటించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టినా.. పృథ్వీరాజ్ నటనకు చాలా ప్రశంసలు లభించాయి. అలాగే రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమాలోనూ ఆయన తన నటనతో ఆకట్టుకున్నాడు. పృథ్వీరాజ్ పవర్‌ఫుల్ క్యారెక్టర్‌ని ప్రజలు మెచ్చుకున్నారు. ఇప్పుడు రాజమౌళి పృథ్వీరాజ్‌తో చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది. ఈ సినిమా ఆఫర్‌ని పృథ్వీరాజ్ సంతోషంగా అంగీకరించాడని కూడా అంటున్నారు. ప్రస్తుతం రాజమౌళి నటీనటుల ఎంపికలో బిజీగా ఉన్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి చేశాడు. సినిమా కథ ఆఫ్రికా అడవుల్లో సాగుతుందని తెలుస్తోంది. ఇందుకోసం సోనీ పిక్చర్స్ లేదా డిస్నీ స్టూడియోస్‌లో భారీ సెట్‌ వేసే ఆలోచనలో రాజమౌళి ఉన్నాడు. ఈ సినిమా 2025లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. పృథ్వీరాజ్ సుకుమారన్ డిమాండ్ ఇటీవల పెరిగింది. మలయాళంలోనే కాకుండా ఇతర భాషల్లో కూడా సినిమాలు చేస్తున్నాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

చిన్న సినిమా పెద్ద విజయం.. స్టార్ హీరోలు లేకుండా వందకోట్లు వసూల్ చేసిన మూవీ

0

చిన్న సినిమాల సందడి ఇటీవలే కాలంలో ఎక్కువుగా కనిపిస్తుంది. ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా చడీ చప్పుడూ లేకుండా వచ్చిన సినిమాలు మంచి విజయాలను అందుకోవడంతో పాటు భారీగా కలెక్షన్స్ కూడా సాధిస్తున్నాయి. అన్ని భాషల్లో చిన్న సినిమాలు అదరగొడుతున్నాయి. పెద్ద పెద్ద స్టార్స్ తమ సినిమాలను పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ చేస్తుంటే.. చిన్న సినిమాలు తమదైన స్టైల్ లో విజయాలు సాధిస్తున్నారు. కాగా బాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమాలు దారుణంగా నిరాశపరుస్తున్నాయి. అక్షయ్ కుమార్ నటించిన సినిమాలు కూడా ఆశించిన స్థాయిలో వసూళ్లు సాధించలేకపోయాయి. ఇదిలా ఉంటే స్టార్ ఆర్టిస్టులు లేని ఓ చిన్న సినిమా 100 కోట్ల రూపాయలు వసూలు చేసి అందరి దృష్టిని ఆకర్షించింది.

బాలీవుడ్ సినిమా ‘ముంజ్యా’ సూపర్ హిట్ సొంతం చేసుకుంది. హారర్ కథాంశంతో తెరకెక్కిన చిత్రమిది. స్టార్ నటీనటుల సినిమాల్లో కూడా ‘మంజ్యా’ సినిమా మంచి వసూళ్లను రాబట్టింది. ట్రైలర్ విడుదలయ్యే వరకు ‘ముంజ్యా’ సినిమాపై అంతగా క్రేజ్ లేదు. అయితే ట్రైలర్ విడుదలయ్యాక ఈ సినిమా గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. జూన్ 7న ‘ముంజ్యా’ థియేటర్లలో విడుదలైంది. మొదటి షోకి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. ఆ తర్వాత రోజుల్లో ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టింది.

ఈ చిత్రాన్ని మాడాక్ ఫిల్మ్స్ పతాకంపై దినేష్ విజన్, అమర్ కౌశిక్ నిర్మించారు. ఆదిత్య సర్పోత్దార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. దర్శకుడు చెప్పిన హారర్ కథకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. శర్వరీ వాఘ్, అభయ్ వర్మ, మోనా సింగ్, సత్యరాజ్ తదితరులు ఈ చిత్రంలో నటించారు. ‘ముంజ్యా’ తొలిరోజు వసూళ్లు రూ.4.21 కోట్లు. రెండో రోజు 7.40 కోట్ల రూపాయలు రాబట్టింది. మూడో రోజు 8.43 కోట్ల రూపాయలు వచ్చాయి. ఆ తర్వాత రోజుకి 3, 4 కోట్ల రూపాయల వసూళ్లతో సినిమా దూసుకెళ్లింది. వీకెండ్స్ లో కలెక్షన్లు పెరిగాయి. సక్సెస్ ఫుల్ గా 25 రోజుల తర్వాత ఈ సినిమా టోటల్ కలెక్షన్ 100 కోట్ల రూపాయలను దాటేసింది. ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 AD’ ఇటీవల విడుదలైంది. హిందీలోనూ ఈ సినిమా సందడి చేస్తోంది. ‘కల్కి 2898 AD’ విడుదలైన తర్వాత ‘ముంజ్యా’ కలెక్షన్లు పడిపోయాయి. అప్పటికే  100 కోట్ల గ్రాస్ కలెక్ట్  చేసింది ముంజ్యా. ఇక ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని ఈగర్ గా ఎదురుచూస్తున్నారు ఆడియన్స్. త్వరలోనే ఈ సూపర్ హిట్ మూవీ ఓటీటీలో రిలీజ్ కానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Rashmika Mandanna: మరోసారి విజయ్‌కు జోడీగా నేషనల్ క్రష్.. ఫుల్ ఖుష్ అవుతున్న ఫ్యాన్స్..

0

Rashmika Mandanna: మరోసారి విజయ్‌కు జోడీగా నేషనల్ క్రష్.. ఫుల్ ఖుష్ అవుతున్న ఫ్యాన్స్..

టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. రీసెంట్ గా కల్కి సినిమాలో నటించాడు విజయ్. ఈ సినిమాలో చిన్న పాత్రలో కనిపించి మెప్పించాడు. కాగా విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ నిత్యం వార్తలు వినిపిస్తున్నాయి. రష్మిక మందన్న మళ్లీ జంటగా నటిస్తున్నారని టాక్ వినిపిస్తుంది. వీరిద్దరిని తెరపై కలిపేందుకు టాలీవుడ్ డైరెక్టర్ రాహుల్ ప్లాన్ చేస్తున్నాడు. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న తొలిసారి జంటగా నటించిన చిత్రం ‘గీత గోవిందం’. ఆ సినిమాతోనే ఇద్దరూ ఫేమస్ అయ్యారు. ఆ సినిమా రష్మికకు టాలీవుడ్‌లో మంచి పేరు తెచ్చిపెట్టింది ఈ సినిమా. ఆ తర్వాత రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ జంటగా నటించిన చిత్రం ‘డియర్ కామ్రేడ్’.

అన్నీ అనుకున్నట్లు జరిగితే విజయ్ దేవరకొండ ‘ఫ్యామిలీ స్టార్’ సినిమాతో రష్మిక మందన్న హీరోయిన్‌గా చేయాలి. అయితే తర్వాత ఆ పాత్రను మృణాల్ ఠాకూర్‌కి వచ్చింది. ఇప్పుడు ‘టాక్సీవాలా’ ఫేమ్ రాహుల్ కొత్త సినిమా కోసం సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాలో రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ జంటగా నటించనున్నారని టాక్ వినిపిస్తుంది.

రాహుల్ దర్శకత్వం వహించనున్న కొత్త సినిమా రాయలసీమ ప్రాంత నేపథ్యంలో సాగనుంది. ఈ సినిమాలో రష్మిక పాత్ర రాయలసీమ యాసలో మాట్లాడుతుందని తెలుస్తోంది. రష్మిక మందన్న ఇప్పటికే ‘పుష్ప’ సినిమాలో అలాంటి పాత్ర చేసింది. అందుకే రాహుల్ డైరెక్షన్ లో వస్తున్న సినిమాలోరష్మిక మందన్నా అయితే బాగుంటుందని టీమ్ భావిస్తుంది. విజయ్ దేవరకొండ కోసమే ఈ పాత్రకు రష్మిక మందన్న ఒప్పుకుంటుందనే నమ్మకంతో రాహుల్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్ గురించి విజయ్ దేవరకొండ కానీ, రష్మిక మందన్న కానీ ఎలాంటి అప్డేట్ రాలేదు. రష్మిక మందన్న ప్రస్తుతం బిజీగా ఉంది. ‘పుష్ప 2’ సినిమా విడుదల కోసం ఎదురుచూస్తుంది. ‘కుబేర’, ‘ది గర్ల్‌ఫ్రెండ్’, ‘సికిందర్’ వంటి బడా సినిమాల్లోనటిస్తుంది రష్మిక. ఈ ప్రాజెక్టులన్నింటిపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

రష్మిక మందన్న ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

రష్మిక మందన్న ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Ajith Kumar: ఆసుపత్రిలో భార్య షాలిని.. షూటింగ్ నుంచి హడావిడిగా అజిత్.. అసలేం జరిగిందంటే..

0

కోలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోలలో అజిత్ కుమార్ ఒకరు. దక్షిణాదిలో ఈ హీరోకు స్పెషల్ ఫాలోయింగ్ ఉంది. తెలుగులోనూ అజిత్ కు చాలా మంది అభిమానులు ఉన్నారు. స్టార్ హీరో అయినా సింపుల్ లైఫ్ గడిపేస్తుంటారు అజిత్. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో థియేటర్లలో సందడి చేస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో తునీవు సినిమాతో హిట్ అందుకున్న అజిత్.. ప్రస్తుతం విదా ముయర్చి, గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ రెండు సినిమాల షూటింగ్స్ శరవేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం విడతలి చివరి షూటింగ్ కోసం అజర్ బైజాన్ వెళ్లారు. అయితే నిన్న హడావిడిగా అజర్‌బైజాన్ నుంచి చెన్నైకి తిరిగి వచ్చారు అజిత్. చెన్నై ఎయిర్ పోర్టు నుంచి నేరుగా ఆసుపత్రికి వెళ్లారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.

అజిత్ ఆసుపత్రికి వెళ్లడానికి కారణం అతడి భార్య హీరోయిన్ షాలిని. చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో షాలినికి చిన్నపాటి సర్జరీ జరిగిందని సమాచారం. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం బాగానే ఉందని.. తన భార్యను చూసేందుకే అజిత్ అజర్ బైజాన్ నుంచి చెన్నై వచ్చారని, షాలిని కోలుకున్న తర్వాత నటుడు అజిత్ మరోసారి అజర్ బైజాన్ లో డిలిజెన్స్ షూటింగ్ లో పాల్గొంటారని సమాచారం. ఆసుపత్రి బెడ్ పై ఉన్న షాలిని చేతులు పట్టుకుని ఉన్న అజిత్ ఫోటోస్ వైరలవుతుండగా.. షాలిని త్వరగా కోలుకోవాలని.. బ్యూటీఫుల్ కపూల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.

గత కొంత కాలంగా షాలిని కొన్ని శారీరక సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు అజిత్ షూటింగ్ లో బిజీగా ఉండడంతో షాలిని సర్జరీ సమయంలో ఆమెతోపాటు ఉండలేకపోయాడు. కొత్త సినిమా కోసం అజర్ బైజాన్ వెళ్లాల్సి రావడంతో తన భార్య సర్జరీకి అవసరమైన పనులు కంప్లీట్ చేసి.. అందుకు సంబంధించిన వైద్యులతో మాట్లాడి విదేశాలకు వెళ్లారట. షూటింగ్ వాయిదా వేస్తే నిర్మాతకు ఆర్థికంగా నష్టం కలుగుతుందని.. అందుకే తన భార్యకు సర్జరీ చేయాల్సి వచ్చినా షూటింగ్ కు వెళ్లినట్లు తెలుస్తోంది. నివేదికల ప్రకారం తన షూటింగ్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుని భార్యను చూసేందుకు హడావిడిగా చెన్నై చేరుకున్నాడు అజిత్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Comedian Raghu: కమెడియన్ రఘు కూతుళ్లను ఎప్పుడైనా చూశారా..? ఇద్దరూ ఎంత క్యూట్‏గా ఉన్నారో..

0

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో చాలా మంది కమెడియన్స్ గుర్తింపు తెచ్చుకున్నారు. తమ కామెడీ టైమింగ్ తో జనాల్లో క్రేజ్ సంపాదించుకున్నారు. కామెడీ పంచులు, యాస, మేనరిజంతో ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఎంఎస్ నారాయణ, వేణు మాదవ్, ఏవీఎస్, బ్రహ్మానందం, అలీ ఇలా చెప్పుకుంటే ఎంతో మంది హాస్య నటులు తెరపై తమ నటనతో నవ్వులు పూయించారు. అలాంటి వారిలో రఘు కారుమంచి ఒకరు. తెలంగాణ యాసలో మాట్లాడుతూ.. డిఫరెంట్ మేనరిజంతో అందరికీ దగ్గరయ్యాడు. జూనియర్ ఎన్టీఆర్ నటించిన బ్లాక్ బస్టర్ హిట్ ఆది మూవీతో సినీరంగంలోకి అడుగుపెట్టాడు రఘు. ఆ తర్వాత పలు చిత్రాల్లలో నటించి అలరించారు. తారక్ నటించిన అదుర్స్ సినిమాతో రఘుకు మరింత పాపులారిటీ వచ్చింది. తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో ఫేమస్ అయిన రఘు.. సినిమాల్లోకి రావడానికి ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు.

సాఫ్ట్ వేర్ ఉద్యోగం వదిలేసి సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించాడు. డైరెక్టర్ వివి వినాయక్ తో ఉన్న స్నేహబంధం కారణంగా ఎన్టీఆర్ సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది. మొదటి సినిమా అది చిత్రంతో నవ్వులు పూయించిన రఘు.. ఆ తర్వాత అదుర్స్ సినిమాలో తన కామెడీ డైలాగ్స్, మేనరిజంతో పాపులర్ అయ్యాడు. ఈ సినిమాతో తెలుగు సినీ ప్రియులకు రఘు పేరు రిజిసర్ అయ్యింది. సినిమాల్లో నటించిన రఘు ఆ తర్వాత కొన్నాళ్లు జబర్దస్త్ కామెడీ షోలో కనిపించాడు. అలాగే సినిమాల్లోనూ నటించి అలరించాడు. ఇప్పటివరకు దాదాపు రూ.200పైగా సినిమాల్లో నటించాడు. ఇదిలా ఉంటే.. రఘు ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు ఎవరికీ తెలియవు.

Raghu

Raghu

తెనాలికి చెందిన రఘు హైదరాబాద్ లో పుట్టి పెరిగాడు. ఇక్కడే ఎంబీఏ పూర్తి చేసి సాఫ్ట్ వేర్ ఉద్యోగంలో చేరాడు. రఘుకు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. పెద్ద కూతురు పేరు స్వప్నిక, చిన్న కూతురు పేరు తేజస్వీ. చేతినిండా సినిమాలతో బిజీగా ఉండే రఘు.. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. తాజాగా తన ఫ్యామిలీ, కూతుళ్లతో దిగిన ఫోటోలను షేర్ చేశాడు. రఘు కూతురు ఇద్దరు ఇంజనీరింగ్ చదువుతున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Danush: ధనుష్ నెక్స్ట్ ప్రాజెక్ట్ అదేనా.? సూర్య స్క్రిప్ట్ ఆయనకి షిఫ్ట్.?

0

Rakshit Atluri’s “Operation Raavan” Grand Theatrical Release on Worldwide on August 2nd

0

The upcoming film “Operation Raavan” stars Rakshit Atluri and Radhika Sarath Kumar in lead roles. The film is produced by Dhyan Atluri as a new-age suspense thriller and directed by Venkata Satya. Sangeerthana Vipin plays the heroine.

The film is a bilingual psycho thriller. The makers have announced today that the movie “Operation Raavan,” which has completed all its programs, will have a grand theatrical release worldwide on August 2 in Telugu and Tamil.

The poster released during the release date announcement of “Operation Raavan” was captioned as “A Psycho Story.” This poster, featuring an action sequence with hero Rakshit Atluri, is generating interest. Radhika Sarath Kumar, Charan Raj, and Tamil actor Vidya Sagar are playing other important roles in the movie “Operation Raavan.” The movie team is confident about its success.

Tollywood: ఒకప్పుడు స్టార్ హీరోయిన్.. ఇప్పుడు వైల్డ్ ఫోటోగ్రాఫర్‏గా మారిన స్టార్ హీరోయిన్.. ఎవరో తెలుసా..?

0

Tollywood: ఒకప్పుడు స్టార్ హీరోయిన్.. ఇప్పుడు వైల్డ్ ఫోటోగ్రాఫర్‏గా మారిన స్టార్ హీరోయిన్.. ఎవరో తెలుసా..?

తొలి సినిమాతోనే తెలుగు కుర్రాళ్ల హృదయాలను దొచేసింది ఓ హీరోయిన్. అందం, అభినయంతోపాటు సంప్రదాయంగా కనిపించి యువతలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. మొదటి మూవీతోనే భారీ విజయాన్ని అందుకుని అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ సినిమా తర్వాత తెలుగులో బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్స్ అందుకుంటూ అతి తక్కువ సమయంలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. దశాబ్ద కాలంపాటు సినిమాల్లో అలరించిన ఆ తార ఇప్పటికీ సింగిల్. పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా లైఫ్ ఎంజాయ్ చేస్తుంది. చాలా కాలం సినిమాలకు దూరమై ఆ బ్యూటీ.. ఇప్పుడు ఫుల్ టైమ్ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ గా సెటిల్ అయ్యింది. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరో తెలుసా..? తనే హీరోయిన్ సదా. 2003లో నితిన్ హీరోగా పరిచయమైన జయం సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టింది. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుని ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది.

తెలుగు, కన్నడ, తమిళంలో అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది. హోమ్లీ లుక్, అద్భుతమైన నటన, ఆకట్టుకునే అందంతో అప్పట్లో కుర్రాళ్ల ఫేవరేట్ హీరోయిన్ గా మారింది. డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించిన అపరిచితుడు సినిమాలో సదా కథానాయికగా నటించగా.. అప్పట్లో ఈ మూవీ సూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత వరుస ఆఫర్స్ అందుకున్న సదా ఖాతాలో నెమ్మదిగా డిజాస్టర్స్ వచ్చి చేరాయి. దీంతో సదాకు ఆఫర్స్ తగ్గిపోయాయి. ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటున్న సదా.. కొన్నాళ్లుగా బుల్లితెరపై పలు షోలలో జడ్జిగా వ్యవహరిస్తుంది.

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం సదా వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీపై దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. కొన్ని నెలలుగా సదా ఇన్ స్టాలో వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీకి సంబంధించిన ఫోటోస్, వీడియోస్ కనిపిస్తున్నాయి. అడవిలో సింహాలు, పులులు, ఏనుగులు, పక్షులను అందంగా ఫోటోస్, వీడియోస్ తీస్తూ తన ఇన్ స్టాలో షేర్ చేసింది. సదా చేసిన పోస్టులకు భారీ సంఖ్యలో లైక్స్ వస్తున్నాయి. అందమైన అమ్మాయి పులులు, సింహాలను అంతే అందంగా కెమెరాలో బంధిస్తుందంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. ప్రస్తుతం నచ్చిన పని చేసుకుంటూ హ్యాపీగా ఉన్నానని.. తన ఫ్రీడమ్ ను పోగొట్టుకోవాలని లేదని.. నచ్చిన వ్యక్తి ఇప్పటివరకు దొరకలేదని.. అందుకే పెళ్లి అనే ఆలోచన రాలేదని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

 

View this post on Instagram

 

A post shared by Sadha Sayed (@sadaa17)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

OTT : ఓటీటీ డీల్ సెట్ అయితే తప్ప నో రిలీజ్..ఆ హీరోలకి డిజిటల్ కష్టాలు..

0

కానీ రవితేజ, నాని, నాగచైతన్య, నితిన్ లాంటి మీడియం రేంజ్ హీరోల విషయంలోనే సమస్య వస్తోంది. ముందు బిజినెస్‌ లాక్ అయితే తప్ప రిలీజ్ థియేట్రికల్ రిలీజ్ విషయంలో నిర్ణయం తీసుకోలేని పరిస్థితి.