Home Blog Page 519

Disha Patani: దిశా పటానీ చేతిపై పచ్చబొట్టు.. ఆ స్టార్ హీరో పేరేనంటోన్న నెటిజన్స్

0

బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. వరుణ్ తేజ్ నటించిన లోఫర్ సినిమాతోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిందీ అందాల తార. ఆ తర్వాత బాలీవుడ్ కు చెక్కేసి అక్కడే సెటిలైపోయింది. ఇటీవలే పాన్ ఇండియా సూపర్ స్టార్ నటించిన ‘కల్కి 2898 ఏడీ’ సినిమాలో ఒక కీలక పాత్రలో నటించి మెప్పించింది. ప్రస్తుతం ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకెళుతోంది. ఇప్పటికే 500 కోట్లు వసూలు చేసిన ఈ మూవీ 1000 కోట్ల దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఇదిలా ఉంటే దిశా పటానీ గురించి ఒక గాసిప్ వేగంగా వ్యాపిస్తోంది. ‘కల్కి 2898 AD’ సినిమాలో నటించిన దిశా పటాని ప్రభాస్‌తో ప్రేమలో పడినట్లు ప్రచారం జరుగుతోంది. దీనికంతటికీ కారణం దిశా పటానీ చేతిపై ఉన్నపచ్చ బొట్టు. దిశా పటానీ తన చేతిపై ‘పీడీ’ టాటూను వేయించుకుంది. దాని అర్థం ఆమెకు తప్ప మరెవరికీ తెలియదు. అయితే నెటిజన్లు మాత్రం రకరకాలుగా ఊహించుకుంటున్నారు. ‘పీడీ అంటే ప్రభాస్, దిశా’ అని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. అలాగే ‘డార్లింగ్ ప్రభాస్’ రివర్స్ వెర్షన్ అని మరికొందరు ఊహించుకుంటున్నారు. ప్రభాస్ తో తన ప్రేమకు గుర్తుగా దిశా పటానీ ఈ టాటూ వేయించుకున్నారని చాలామంది నెటిజన్లు ఊహించుకుంటున్నారు.

సినిమా షూటింగ్ లో తప్పితే ప్రభాస్, దిశా పటానీ ఎప్పుడూ కలిసి తిరిగింది లేదు. కాబట్టి వారి మధ్య ప్రేమ వ్యవహారం ఉండే ప్రసక్తి లేదంటున్నారు మరికొందరు నెటిజన్లు. పైగా ‘కల్కి 2898 AD’ సినిమా ప్రమోషన్‌ వర్క్‌లో దిశా పటానీ పెద్దగా పాల్గొనలేదు. ఓవరాల్ గా ప్రభాస్, దిశా పటానీ ఇద్దరూ దూరం మెయింటెన్ చేశాడు. అలాంటప్పుడు ప్రేమ ఎలా పుడుతుంది అనేది చాలా మంది ప్రశ్న. దిశా పటానీ తన చేతిపై కొత్త టాటూను చూసిన తర్వాత, అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ప్రజలు రకరకాలుగా మాట్లాడటంతో ఆమె కూడా స్పందించింది . ‘నా టాటూపై ప్రజల ఆసక్తిని చూసి నేను సంతోషంగా ఉన్నాను’ అని సోషల్ మీడియా వేదికగా కామెంట్ చేసింది దిశా. అయితే ప్రభాస్ గురించి ఒక్క మాట మాట్లాడ లేదు.

ఇవి కూడా చదవండి

గతంలో దిశా పటానీ టైగర్ ష్రాఫ్‌తో డేటింగ్ చేసింది. అయితే తర్వాతి రోజుల్లో వారి మధ్య బ్రేకప్ అయింది. దిశాకు బాలీవుడ్‌లో మంచి డిమాండ్ ఉంది. సౌత్ ఇండియన్ సినిమాల్లో కూడా నటించి ఫేమస్ అవ్వానుకుంటోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా యాక్టివ్‌గా ఉండే ఆమెను 6 కోట్ల మందికి పైగా ఫాలో అవుతున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Venkatesh: వెంకీ సినిమాలో మరో క్రేజీ హీరోయిన్.. భార్యగా కనిపించనున్న ఆ బ్యూటీ.. ఎవరంటే..

0

టాలీవుడ్ ఇండస్ట్రీలో నెమ్మదిగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు విక్టరీ వెంకటేశ్. ఈ ఏడాది సంక్రాంతికి సైంధవ్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. డైరెక్టర్ శైలేశ్ కొలను దర్శకత్వం వహించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ రివ్యూ అందుకుంది. కానీ అంతగా కలెక్షన్స్ మాత్రం రాబట్టలేకపోయింది. ఈ సినిమా తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకున్న వెంకీ.. తాజాగా తన కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు. సైంధవ్ తర్వాత తన నెక్ట్స్ మూవీ అనిల్ రావిపూడి డైరెక్షన్లో చేయనున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై శిరీష్ నిర్మిస్తుండగా.. ఈ మూవీలో గుంటూరు కారం ఫేమ్ మీనాక్షి చౌదరి కనిపించనుంది.

త్వరలోనే ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు సమాచారం. అయితే తాజాగా ఈ మూవీ గురించి మరో క్రేజీ అప్డేట్ ఇచ్చింది చిత్రయూనిట్. ఈ సినిమాలో మరో హీరోయిన్ కనిపించనుంది. తను మరెవరో కాదు.. ఐశ్వర్య రాజేశ్. ఈ విషయాన్ని డైరెక్టర్ అనిల్ రావిపూడి స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ మూవీలో వెంకటేశ్ భార్యగా ఐశ్వర్య, ప్రియురాలిగా మీనాక్షి కనిపించనున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు.

ఇదిలా ఉంటే.. కోలీవుడ్ ఇండస్ట్రీలో వరసు చిత్రాలతో అలరిస్తుంది ఐశ్వర్య రాజేశ్. ముఖ్యంగా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంది. కేవలం గ్లామర్ రోల్స్, హీరోయిన్ గా కాకుండా కంటెంట్ ప్రాధాన్యతను బట్టి వైవిధ్యమైన సినిమాలు చేసేందుకు రెడీ అవుతుంది. తెలుగులో విజయ్ దేవరకొండ సరసన నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో కనిపించింది. చాలా కాలం తర్వాత తెలుగులో మంచి ఆఫర్ అందుకుంది. వెంకీ అనిల్ రావిపూడి సినిమాను రేపు పూజా కార్యక్రమాలతో స్టార్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇన్నాళ్లు కామెడీ, యాక్షన్ చిత్రాలతో అలరించిన డైరెక్టర్ అనిల్ రావిపూడి ఇప్పుడు డిఫరెంట్ జోనర్ తో ప్రేక్షకులను అలరించేందుకు రానున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Nag Ashwin: ఈ రికార్డులకు కారణం అక్కడ కూర్చున్న వ్యక్తే.. ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేసిన డైరెక్టర్ నాగ్ అశ్విన్..

0

ఈ యుగంలో బాక్సాఫీస్ బిగ్గెస్ట్ స్టార్ ప్రభాస్ అని అన్నారు డైరెక్టర్ నాగ్ అశ్విన్. ప్రస్తుతం పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద కల్కి సినిమా కలెక్షన్స్ పరంగా సరికొత్త రికార్డులు సృష్టిస్తోందని.. ఆ రికార్డులకు కారణం ప్రభాస్ అంటూ డార్లింగ్ పై ప్రశంసలు కురిపించారు. కల్కి సినిమాతోపాటు ప్రభాస్ గురించి చెబుతూ తన ట్విట్టర్ ఖాతాలో ఆసక్తికర ట్వీట్ చేశారు. “ఈ విజయాలన్నింటికీ కారణం కారణం అక్కడ క్యాజువల్ గా కూర్చొన్న వ్యక్తే. ఆయన ఈ యుగంలోనే బిగ్గెస్ట్ బాక్సాఫీస్ స్టార్. నాకు దర్శకత్వంలో చాలా స్వేచ్ఛనిచ్చారు. మేకింగ్ విషయంలో ఎన్నో విలువైన సూచనలు చేశారు. మనందరి డార్లింగ్. భైరవ (కల్కిలో ప్రభాస్ పేరు) ఇప్పుడు K____” అంటూ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు.

ఇదంతా పక్కన పెడితే ప్రభాస్ పాత్ర గురించి అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించారు. కల్కి సినిమాలో భైరవగా అలరించిన ప్రభాస్.. కొద్ది సమయంపాటు కర్ణుడిగా కనిపించిన సంగతి తెలిసిందే. ఆలస్యమయ్యిందా ఆచార్య పుత్రా అంటూ చివరి పది నిమిషాలలో కర్ణుడిగా కనిపించి గూస్ బంప్స్ తెప్పించారు. ‘ఆలస్యమైందా ఆచార్య పుత్ర’ అంటూ ప్రభాస్‌ విల్లు పట్టుకుని రథంపై నిలబడితే థియేటర్ మొత్తం అరుపులతో దద్ధరిల్లింది. దీంతో కల్కి పార్ట్ 2లో కర్ణుడిగా ప్రభాస్ కనిపించడం ఖాయమనుకున్నారంతా. ఇక ఇప్పుడు అదే విషయాన్ని నాగ్ అశ్విన్ కూడా క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. కల్కి పార్ట్ 2లో ప్రభాస్ అదే పాత్రలో కనిపించనున్నాడనే ఉద్దేశంతోనే నాగ్ అశ్విన్.. ప్రభాస్ భైరవ.. ఇప్పుడు K అంటూ ఆసక్తి కలిగించాడని అంటున్నారు ఫ్యాన్స్.

మొత్తానికి కల్కి పార్ట్ 2లో ప్రభాస్ పాత్రపై క్లూ ఇస్తూ ప్రేక్షకులలో మరింత క్యూరియాసిటినీ కలిగించాడు. ఇదిలా ఉంటే ప్రస్తుతం పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద కల్కి 2898 ఏడి విధ్వంసం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. అటు విదేశాల్లోనూ కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది కల్కి. జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేస్తుంది. వైజయంతి బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమా ఇప్పటికే రూ.500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇందులో కమల్ హాసన్, అమితాబ్, దీపికా పదుకొణె, దిశా పటానీ, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ కీలకపాత్రలు పోషించిన సంగతి తెలిసిందే.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Tollywood: అలాంటి సీన్స్ చేయకపోవడం వల్లే ఆఫర్స్ పోయాయి.. కిస్ సీన్ చేయాలంటే ఏడ్చేసిన హీరోయిన్..

0

ఇప్పటికీ సినీ పరిశ్రమలో చాలా మంది హీరోయిన్స్ రొమాంటిక్ సీన్స్‏కు దూరంగానే ఉంటున్నారు. లిప్ లాక్, కిస్ నుంచి గ్లామరస్ రొమాంటిక్ సన్నివేశాలు చేయడానికి ఒప్పుకోవడం లేదు. ఈ కారణంగానే ఎంతో మంది తారలు ఆఫర్స్ కోల్పోతున్నారు. అందం, టాలెంట్ ఉన్నప్పటికీ అలాంటి సీన్స్ చేయడానికి అంగీకరించకపోవడం.. శ్రుతి మించి గ్లామర్ షో ఉండడంతో ఎన్నో ప్రాజెక్ట్స్ వదిలేసుకున్నారు. అయితే వారికి కొన్నేళ్లకు అసలు ఎలాంటి అవకాశం రాదని అంటున్నారు. అందులో ఈ హీరోయిన్ కూడా ఒకరు. ఇప్పుడిప్పుడే ప్రేక్షకులకు దగ్గరవుతుంది శ్రుతి శర్మ. ఇటీవల ఓటీటీలో సూపర్ హిట్ అయిన వెబ్ సిరీస్ హిరామండిలో కీలకపాత్రలో కనిపించింది. 2018 నుంచి టీవీలో పాపులర్ క్యారెక్టర్ పోషిస్తుంది. గత్ బంధన్ షోతో నటిగా కెరీర్ ప్రారంభించింది.

ఆ తర్వాత ఇండియాస్ నెక్ట్స్ సూపర్ స్టార్స్ షోలో పాల్గొంది. ఆ తర్వాత నవీన్ పోలిశెట్టి నటించిన ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ చిత్రంలో కనిపించింది. అలాగే పగ్లైట్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఇటీవల హిరామండి సిరీస్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రుతి మాట్లాడుతూ.. తనకు రొమాంటిక్ సీన్స్ చేయడం, స్క్రీన్ పై ముద్దు సన్నివేశాల్లో నటించడం ఇష్టం లేదని తెలిపింది. ఎప్పటికీ తాను స్క్రీన్ పై రొమాన్స్ సీన్ చేయనని.. అందుకే ఎన్నో ప్రాజెక్ట్స్ వదులుకోవాల్సి వచ్చిందని తెలిపింది. అయితే తన నిర్ణయం గురించి బాధపడడం లేదని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం శ్రుతి చేసిన కామెంట్స్ వైరలవుతున్నాయి.

డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన హిరామాండి వెబ్ సిరీస్ లో శ్రుతి షామా అనే పనిమనిషి పాత్రలో కనిపించింది. ఇందులో ఆమె నటనకు ప్రశంసు అందుకుంది. హిరామండి సిరీస్ లో శ్రుతి మొదటిసారి కిస్ సీన్ లో నటించింది. షూటింగ్ కంటే ముందు స్క్రిప్ట్ మొత్తం చదివిన శ్రుతి కిస్ చేయాల్సి రావడంతో ఏడ్చేసింది. కానీ ఆ తర్వాత ఆ సీన్ చేసేందుకు ఒప్పుకున్నట్లు తెలిపింది. హిరామండి సక్సెస్ తర్వాత తనకు ఆఫర్స్ వస్తున్నాయని తెలిపింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Tollywood: ఈ అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా..? వరుస హిట్లతో ఫుల్ జోష్.. కానీ ఊహించని విధంగా..

0

సోషల్ మీడియాలో సినీతారల స్కూల్ డేస్, కాలేజీ ఫోటోస్ వైరలవుతున్నాయి. పలువురు హీరోయిన్స్ అప్పటికీ ఇప్పటికీ చాలా మారిపోయారు. అసలు కొందరిని గుర్తుపట్టడమే చాలా కష్టం. అందులో ఈ అమ్మాయి కూడా ఒకరు. పైన ఫోటోలో తన స్కూల్ ఫ్రెండ్స్ తో కలిసి ఫోటోలకు ఫోజులిస్తున్న ఆ అమ్మాయి తెలుగులో ఫేమస్ హీరోయిన్. స్టార్ హీరో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది. అమాయకమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. అందం, అభినయంతో మంచి మార్కులు కొట్టేసింది. తొలి చిత్రంతోనే యూత్ లో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత ఈ బ్యూటీకి తెలుగులో మంచి ఆఫర్స్ వచ్చాయి. అంతేకాదు.. ఈ హీరోయిన్ నటించిన సినిమాలన్ని సూపర్ హిట్ కావడంతో ఈ బ్యూటీకి ఆఫర్స్ క్యూ కడతాయి అనుకున్నారంతా. కానీ అందుకు భిన్నంగా ఒకటి రెండు చిత్రాలతో సరిపెట్టుకుంది. ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా సైలెంట్ అయ్యింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..? తనే హీరోయిన్ సంయుక్త మీనన్.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ మూవీలో నిత్యా మీనన్ కథానాయికగా నటించగా.. రానా భార్యగా సెకండ్ హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయమైంది సంయుక్త. తొలి చిత్రంతోనే నటనతో కట్టిపడేసిన సంయుక్త.. ఆ తర్వాత మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నటించిన విరాట పర్వం మూవీతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత ధనుష్ సరసన సార్ మూవీతో మెప్పించి గోల్డెన్ బ్యూటీగా ట్యాగ్ సొంతం చేసుకుంది. అయితే వరుస హిట్స్ అందుకుంటూ ఫుల్ ఫాంలో ఉన్న సంయుక్తకు సౌత్ ఇండస్ట్రీలో ఆశించినంతగా అవకాశాలు మాత్రం రాలేదు. ఈ బ్యూటీ నటించిన చిత్రాలన్ని సూపర్ హిట్ కాగా.. ఒకటి రెండు చిత్రాలతో నెట్టుకొచ్చింది.

ఇక నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటించిన డెవిల్ చిత్రంలో చివరగా కనిపించిన సంయుక్త..ఈ సినిమాతో తొలిసారి పరాజయం అందుకుంది. ఇదిలా ఉంటే. ప్రస్తుతం నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తున్న స్వయంభూ సినిమాలో నటిస్తోంది సంయుక్త. అలాగే ఇన్నాళ్లు సోషల్ మీడియాలో సైలెంట్ అయిన సంయుక్త తిరిగి యాక్టివ్ అయ్యింది. ఇప్పుడిప్పుడే వరుసగా ఫోటోషూట్స్ షేర్ చేస్తుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Vijay Devarakonda- Rashmika: విజయ్ దేవరకొండ- రష్మికలపై మరో కొత్త రూమర్.. అతని కోసం మళ్లీ కలవనున్న లవ్ బర్డ్స్

0

ఇప్పుడు ‘టాక్సీవాలా’ ఫేమ్ రాహుల్ సాంకృత్యాన్ కొత్త సినిమా కోసం సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాలో రష్మిక మందన్న, విజయ్ లను హీరో, హీరోయిన్లుగా తీసుకోవాలని భావిస్తున్నాడట.

Nazriya Nazim: సింపుల్ లుక్.. కానీ చాలా కాస్ట్లీ గురూ.. నజ్రియా ధరించిన ఆ వాచ్ ప్రత్యేకత ఏంటో తెలుసా..?

0

నజ్రియా నజీమ్.. సౌత్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ అని చెప్పవచ్చు. మలయాళం భాషలో ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన ఈ బ్యూటీ.. ఇటు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. దక్షిణాది అడియన్స్ అభిమాన హీరోయిన్ ఈ ముద్దుగుమ్మ. ఆర్య నటించిన రాజా రాణి సినిమాతో ఒక్కసారిగా ఫేమస్ అయ్యింది నజ్రియా. ఈ మూవీతో యువతకు ఫేవరేట్ కథానాయికగా మారింది. భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్న నజ్రియా.. న్యాచురల్ స్టార్ నాని నటించిన అంటే సుందరానికి సినిమాలో కనిపించింది. ఆ తర్వాత మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు. కానీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం ఏదోక ఫోటోస్ షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు నజ్రియాకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ నెట్టింట వైరలవుతుంది.

జై బోలో తెలంగాణ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మలయాళీ హీరోయిన్ మీరా నందన్ ఇటీవల పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకలో మలయాళీ ఇండస్ట్రీలో చాలా మంది నటీనటులు పాల్గొన్నారు. మీరా నందన్ పెళ్లిలో నజ్రియా స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది. తన భర్త నటుడు ఫహద్ ఫాజిల్ తో కలిసి అందరి దృష్టిని ఆకర్షించింది. లేత గులాబీ రంగు చీరలో సింపుల్ లుక్ లో మరింత అందంగా కనిపించింది నజ్రియా. అయితే ఈ వేడుకలో నజ్రియా ధరించిన లగ్జరీ వాచ్ నెటిజన్స్ దృష్టిని ఆకర్షించింది.

ఇంకేముంది.. నజ్రియా ధరించిన వాచ్ ధర తెలుసుకోవడానికి నెట్టింట సెర్చింగ్ స్టార్ట్ చేశారు. నజ్రియా రోలెక్స్ డేట్‌జస్ట్ 36 మోడల్ వాచ్‌ని ధరించింది. వాచ్‌లో పాలిష్ చేసిన ఓస్టెర్‌స్టీల్ స్టెయిన్‌లెస్ స్టీల్ కేస్ 18K పసుపు బంగారంలో బ్రాస్‌లెట్ ఉన్నాయి. వాచ్‌లో వైట్ మదర్-ఆఫ్-పెర్ల్ డయల్ కూడా ఉంది. ఈ లగ్జరీ రోలెక్స్ వాచ్ ధర రూ.11,84,419 అని తెలుస్తోంది. పెళ్లి తర్వాత నజ్రియా చాలా తక్కువ సినిమాల్లోనే నటించింది. నటిగానే కాకుండా నిర్మాతగాను కొనసాగుతుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Maharaja OTT: ఓటీటీలోకి వచ్చేస్తోన్న విజయ్ సేతుపతి మహారాజా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

0

మక్కల్ సెల్వన్ సినిమాలకు పెద్దగా ప్రచారం అవసరం లేదు. ఎలాంటి హడావిడి లేకుండా సైలెంట్‏గా థియేటర్లలో విడుదలై సంచలనం సృష్టిస్తాయి. హీరోయిజం కాకుండా కంటెంట్ ప్రాధాన్యతను బట్టి సినిమాలను ఎంచుకుంటూ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తున్నాడు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి. ఈ హీరో చిత్రాలు థియేటర్లలో భారీ విజయాన్ని అందుకుంటూ సెన్సెషన్ క్రియేట్ చేస్తాయి. ప్రస్తుతం విజయ్ సేతుపతి నటించిన మహారాజా కూడా బాక్సాఫీస్ వద్ద విధ్వంసమే సృష్టిస్తుంది. డైరెక్టర్ నితిలన్ సామినాథన్ తెరకెక్కించిన ఈ చిత్రం విజయవంతంగా దూసుకుపోతుంది. మక్కల్ సెల్వన్ కెరీర్ లో 50వ సినిమాగా వచ్చిన మహారాజా చిత్రానికి అడియన్స్ బ్రహ్మరథం పట్టారు. ఓవైపు పాన్ ఇండియా బాక్సాఫీస్ ను కల్కి చిత్రం ఏలేస్తున్న తమిళనాడులో మాత్రం మహారాజా సినిమా గట్టి పోటినిస్తుంది.

ఈ సినిమాలో విజయ్ సేతుపతితో పాటు మమతా మోహన్‌దాస్, అభిరామి, దివ్య భారతి, అనురాగ్ కశ్యప్, సింగం పులి, నట్టి, మునీస్కాంత్, బాయ్జ్ మణికందన్ తదితరులు నటించారు. సమాజంలో అమ్మాయిలపై లైంగిక వేధింపుల సంఘటనలను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇందులో మరోసారి తన నటనతో కట్టిపడేశాడు విజయ్ సేతుపతి. విడుదలైన మొదటి పది రోజుల్లోనే రూ.81 కోట్లు వసూలు చేసింది. త్వరలోనే ఈ సినిమా రూ.100 కోట్ల గ్రాస్ దాటే అవకాశం లేకపోలేదు. ప్రస్తుతం తమిళనాడులో ఈ సినిమా థియేటర్లను షేక్ చేస్తుంది.

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా దూసుకుపోతున్న ఈ సూపర్ హిట్ మూవీ ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. ఇప్పటివరకు మహారాజా ఓటీటీ స్ట్రీమింగ్ పై అనేక రూమర్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. కానీ అధికారికంగా ఎలాంటి అప్డేట్ రాలేదు. తాజాగా ఫిల్మ్ వర్గాల్లో మహారాజా ఓటీటీ విడుదల గురించి ఓ ఆసక్తికర న్యూస్ వైరలవుతుంది. అసలు విషయమేంటంటే.. తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం మహారాజా చిత్రం ఈ నెల 19న ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుందట. ఈ విషయంపై ఇంకా అఫీషియల్ ప్రకటన రాలేదు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Pawan Kalyan: సినిమాల్లో నటించడంపై పవన్ కళ్యాణ్ కామెంట్స్.. ఇక పై పవన్ నిర్ణయం అదే..

0

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈరోజు కాకినాడ జిల్లా ఉప్పాడ తీరప్రాంతంలో పర్యటించారు. పవన్‏కు స్థానికులు, అధికారులు స్వాగతం పలికారు. అనంతరం అక్కడి పరిస్థితుల గురించి అటవీశాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఉప్పాడలోని మత్స్యకార కుటుంబాల సమస్యలు పరిష్కరిస్తానని వారికి హామీ ఇచ్చారు. ఆ తర్వాత సాయంత్రం పిఠాపురంలో నిర్వహించిన వారాహి సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సినిమాలపై స్పందించాలని అభిమానులు కోరగా కీలక కామెంట్స్ చేశారు. సినిమాల్లో నటించడంపై పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ఇక పై మూడు నెలలపాటు సినిమా చిత్రీకరణలకు దూరంగా ఉంటానని అన్నారు. వీలున్పప్పుడు ఒకట్రెండు రోజులు షూటింగ్‏కు కేటాయిస్తానని అన్నారు.

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేతిలో నాలుగైదు చిత్రాలు ఉన్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో ఓజీ.. క్రిష్ తెరకెక్కిస్తున్న హరిహర వీరమల్లు, డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాల్లో పవన్ నటిస్తున్నారు. ఈ సినిమాలు చాలా రోజులుగా షూటింగ్ జరుపుకుంటుండగా.. ఇటు రాజకీయాల్లో పవన్ బిజీ కావడంతో ఈ సినిమా షూటింగ్స్ తాత్కలికంగా బ్రేక్ పడింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈ మూవీస్ నుంచి పవన్ పోస్టర్స్ రిలీజ్ చేస్తూ అభిమానుల్లో ఉత్సాహం నింపారు మేకర్స్. ఈచిత్రాల గురించి పవన్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకంటే ముందు నుంచి పవన్ సినిమా చిత్రీకరణలకు బ్రేక్ ఇచ్చాడు. ఏపీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి భారీ మెజారిటీతో గెలుపొందిన పవన్.. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా విధులు నిర్వహిస్తున్నారు. సినిమాల్లో నటిస్తానని పవన్ చెప్పడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Oy Movie: ఓయ్ సినిమాకు 15 ఏళ్లు.. ఆ క్వశ్చన్ అడిగిన నెటిజన్.. దండం పెట్టేసిన డైరెక్టర్..

0

టాలీవుడ్ లవర్ బాయ్ సిద్ధార్థ్ నటించిన సూపర్ హిట్ చిత్రాల్లో ఓయ్ ఒకటి. డైరెక్టర్ ఆనంద్ రంగా దర్శకత్వం వహించిన ఈ సినిమా థియేటర్లలో మిశ్రమ స్పందన అందుకుంది. అప్పట్లో ఈ మూవీ స్టోరీ జనాలకు అంతగా కనెక్ట్ కాలేదు. కానీ మ్యూజిక్ పరంగా హిట్ అయ్యింది. ఈ సినిమాలోని ప్రతి సాంగ్ మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. ఇప్పటికీ ఎక్కడో ఒక చోట ఓయ్ మూవీ సాంగ్స్ వినిపిస్తుంటాయి. గతంలో బాక్సా్‌ఫీస్ వద్ద పరాజయమైన ఈ సినిమా ఇటీవల రీరిలీజ్ చేయగా భారీ విజయాన్ని అందుకుంది. ఈ ఏడాది వాలెంటైన్స్ డే సందర్భంగా మళ్లీ విడుదల చేస్తే థియేటర్స్ నిండిపోయాయి. అంతేకాదు యూత్ నుంచి ఈ సినిమాకు ఓ రేంజ్ రెస్పాన్స్ వచ్చింది. సిద్ధార్థ్, షామిలి నటనకు అడియన్స్ ఫిదా అయ్యారు. ఇక ఓయ్ సినిమా పాటలతో థియటర్లలో జోష్ నెలకొంది. ఈ సినిమా విడుదలై నేటికి పదిహేళ్లు అవుతుంది.

ఇక ఇదే విషయాన్ని చెబుతూ తన సంతోషాన్ని బయటపెట్టాడు డైరెక్టర్ ఆనంద్ రంగా. ఓయ్ విడుదలై నేటికి పదిహేనేళ్లు అంటూ ట్వీట్ చేయగా.. నెటిజన్స్ భిన్నంగా రియాక్ట్ అయ్యారు. ఓయ్ సినిమాకు సీక్వెల్ తీయమని ఓ నెటిజన్ అడగ్గా.. ఎవరు యాక్ట్ చేస్తారు..? ఎవరు నిర్మిస్తారు..? అని రిటర్న్ క్వశ్చన్ అడిగాడు. అలాగే మళ్లీ ఓయ్ సినిమాను రీరిలీజ్ చేయాలని మరో నెటిజన్ అడగ్గా.. ఎలాంటి ఆన్సర్ ఇవ్వకుండా సింపుల్ గా దండం పెట్టేశాడు.

ఓయ్ సినిమా వంటి మంచి సినిమాను మళ్లీ తీయాలని మరో నెటిజన్ అడగ్దా.. తప్పకుండా అంటూ రిప్లై ఇచ్చాడు. సినిమాను వైజాగ్ లో ఎందుకు షూట్ చేశారని అడగ్గా.. తనకు వైజాగ్ అంటే చాలా ఇష్టమని అందుకే చేశానని అన్నారు. ఇటీవల ఓయ్ రీరిలీజ్ సందర్భంగా ఓ నెటిజన్ ఇంత మంచి సినిమా తీసి ఎక్కడికిపోయావ్.. గుండు నాయాలా అంటూ మాట్లాడితే లైట్ తీసుకున్నాడు ఆనంద్ రంగా. నిజమే నాది గుంటూ అంటూ ఫన్నీగా ఆన్సర్ ఇవ్వడంతో వెంటనే సదరు నెటిజన్ సారీ చెప్పేశాడు. ఇక ఇప్పుడు మరోసారి నెట్టింట అభిమానులతో ముచ్చటించాడు ఆనంద్ రంగా.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.