Home Blog Page 516

Game Changer: గేమ్ ఛేంజర్ రిలీజ్‌పై బాంబ్ పేల్చిన శంకర్

0

Kakuda Movie OTT: ఆ గ్రామాన్ని వెంటాడుతోన్న దెయ్యం.. వణుకుపుట్టించే హారర్ కామెడీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

0

సాధారణంగా హారర్ మూవీస్ చూడాలని చాలా మంది ఆసక్తిగా ఉంటుంది. కానీ ఒంటరిగా చూడాలంటే ఎంతో ధైర్యం కావాలి. కానీ అదే హారర్ మూవీకి కామెడీ తోడైతే..ఇప్పుడు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ అలాంటి కంటెంట్ తరహా చిత్రాలు తీసుకువచ్చేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇన్నాళ్లు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్, కామెడీ ఎంటర్టైనర్స్ స్ట్రీమింగ్ అయ్యాయి. కానీ ఇప్పుడిప్పుడే హారర్ కామెడీ చిత్రాలు అడియన్స్ ముందుకు వస్తున్నాయి. అందులో కాకుదా ఒకటి. బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా, రితేష్ దేశ్ ముఖ్ ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ సినిమా అటు వెన్నులో వణుకు పుట్టిస్తూనే మరోవైపు కడుపుబ్బా నవ్విస్తుంది. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ సినిమాపై ఆసక్తిని కలిగించగా.. తాజాగా కాకుదా మూవీ ట్రైలర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్.

ఈ సినిమాను థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రాన్ని జూలై 12 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5లో స్ట్రీమింగ్ చేయనున్నారు. ఇటీవల బ్లాక్ బస్టర్ హిట్ అయిన ముంజ్యా సినిమాను తెరకెక్కించిన డైరెక్టర్ ఆదిత్య సర్పోదర్ కాకుదా చిత్రానికి దర్శకత్వం వహించారు. ముంజ్యా మూవీ రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టగా.. ఇప్పుడు కాకుదా సైతం ఓటీటీలో మంచి రెస్పాన్స్ అందుకోనున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది.

ట్రైలర్ విషయానికి వస్తే.. రాజస్థాన్ రాష్ట్రంలోని రథోడీ అనే గ్రామం శాపగ్రస్తమైంది. ఆ ఊళ్లోకి ప్రతి మంగళవారం రాత్రి 7.15 గంటలకు కాకుదా అనే దెయ్యం వస్తుందని చెబుతూ ట్రైలర్ స్టార్ట్ అయ్యింది. ఊళ్లో ఉన్న అన్ని ఇళ్లకు రెండు డోర్లు ఉంటాయి. ఒకటి పెద్దగా ఉండగా.. మరొకటి చిన్నది. ఆ చిన్న డోరును ఆ సమయానికి ప్రతి ఒక్కరూ తెరిచి ఉంచాలి. ఒకవేళ ఎవరైనా తెరచి ఉంచకపోతే 13 రోజుల్లో ఆ ఇంటి మనిషి పని అయిపోయినట్లే. అయితే ఆ చిన్న డోరును తెరిచి ఉంచకపోవడంతో సోనాక్షి భర్త ఆ దెయ్యానికి దొరికిపోతాడు. ఆ ఊరికి వచ్చిన దెయ్యాలను పట్టుకునే వ్యక్తి రితేష్ దేశ్ ముఖ్ తో కలిసి దెయ్యం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంది సోనాక్షి. ఆ సమయంలో వారిద్దరికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి..? సోనాక్షి భర్త ఏమయ్యాడు..? అసలు కాకుదా ద్యెయం ఎవరు ? అనే విషయాలు సినిమాలోనే చూడాలి.



మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Mokshagna Teja: నందమూరి వారసుడి ఆగమనం.. ఫ్యాన్స్‌కు పూనకాలు

0

అంతా బానే ఉంది గానీ వారసుడిని పరిచయం చేసే బాధ్యత బాలయ్య ఎవరికి ఇవ్వబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. దానికి ప్రశాంత్ వర్మ పేరు బలంగా వినిపిస్తుంది. గతంలో అన్‌స్టాపబుల్‌కు కూడా పనిచేసారు ప్రశాంత్. అప్పుడే ఈయనపై బాలయ్యకు గురి కుదిరింది. మరి నిజంగానే ప్రశాంత్ వర్మ, మోక్షు కాంబో సెట్ అవుతుందేమో చూడాలిక.

Vishwak Sen: లైలాగా మారిన మాస్ కా దాస్.. విశ్వక్ సేన్ నయా మూవీ

0

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. హిట్లు, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా దూసుకుపోతున్నాడు. ఇటీవలే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాలో తన మాస్ యాక్టింగ్ తో ప్రేక్షకులను మెప్పించాడు విశ్వక్ సేన్. ఈ నగరానికి ఏమైంది సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న విశ్వక్ సేన్.. ఆతర్వాత ఫలక్ నామా దాస్ సినిమాతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. ఆతర్వాత వరుసగా సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించారు. ఇక ఇప్పుడు వరుస సినిమాలను లైనప్ చేశాడు. ఇప్పటికే మెకానిక్ రాకీ అనే సినిమాను ఇప్పటికే చేస్తున్నట్టు ప్రకటించాడు. తాజాగా మరో ఇంట్రస్టింగ్ సినిమాను అనౌన్స్ చేశాడు విశ్వక్. ఈ సినిమాకు లైలా అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ను ఖరారు చేశారు.

తాజాగా ఈ సినిమా నుంచి ప్రీ లుక్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో విశ్వక్ లేడీ గెటప్ లో కనిపించనున్నాడు. మొదటిసారి విశ్వక్ లేడీ గెటప్ లో కనిపించనున్నాడు. షైన్ స్క్రీన్స్ నిర్మాణంలో రామ్ నారాయణ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. విశ్వక్ లేడీ గెటప్ లో కనిపించనుండడంతో ఈ సినిమా పై ఆసక్తి నెలకొంది. విశ్వక్ సీన్ లేడీ గెటప్ లో ఎలా ఉంటాడు.? ఎలా నటిస్తాడు.. అని అంతా మాట్లాడుకుంటున్నారు.

తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమం నిర్వహించారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఈ సినిమాలో ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా నటిస్తుంది. త్వరలోనే ఈ సినిమానుంచి క్రేజీ అప్డేట్స్ రానున్నాయి. తాజాగా విడుదల చేసిన పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ పోస్టర్ లో విశ్వక్ సేన్ లేడీ గెటప్ లో కనిపించాడు. కళ్ళు మాత్రమే కనపడేలా పోస్టర్ రిలీజ్ చేసారు. అచ్చం అమ్మాయిలా మెస్మరైజ్ చేశాడు విశ్వక్. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

TOP 9 ET News: నార్త్‌ అమెరికాలో రూ.100 కోట్ల వసూళ్లుకల్కి ప్రభంజనం

0

ప్రభాస్ కల్కి మూవీ కలెక్షన్స్ ను కుమ్మేస్తోంది. బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. రిలీజ్ అయి దాదాపు 5 రోజులైనా కూడా.. కల్కి థియేటర్స్‌ హౌజ్ ఫుల్ అవడం ఇప్పుడు కామన్గా కనిపిస్తోంది. ఇలాగే మరో 5 రోజులు కంటిన్యూ అయితే కల్కి వెయ్యి కోట్ల మార్క్ అందుకోవడం కష్టం కాదనే టాక్ ఫిల్మ్ అనలిస్టుల నుంచి కాస్త గట్టిగా వస్తోంది. దాంతో పాటే డే5… ఈ మూవీ… 635 కోట్లు వసూలు చేయడం ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అవుతోంది. నార్త్‌ అమెరికాలో ప్రభాస్ చెలరేగిపోయాడు. ఎవరికీ సాధ్యం కాని విధంగా తన క్రేజ్‌తో విద్వంసం సృష్టిస్తున్నాడు. కల్కి మూవీ కలెక్షన్స్‌తో హాలీవుడ్‌లో షేక్ చేస్తున్నాడు. ఇప్పుటికే ప్రీ రిలీజ్ టికెట్ సేల్స్‌తో కల్కీ రిలీజ్కు ముందే నార్త అమెరికాను ఊపేసిన ప్రభాస్‌.. ఆఫ్టర్ కల్కి రిలీజ్ కలెక్షన్స్‌తో.. మరో సారి అదే పని మరో సారి చేస్తున్నాడు. నార్త్ అమెరికాలో ఏకంగా 100 కోట్లు వసూలు చేసి.. ఎవర్‌ గ్రీన్ హిస్టరీని క్రియేట్ చేశాడు. ఈ ఫీట్ సాధించిన ఫస్ట్ ఎవర్‌ హీరోగా రికార్డ్ కెక్కాడు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మాల్దీవుల అధ్యక్షుడిపై క్షుద్రపూజలు !! ఇద్దరు మంత్రుల అరెస్టు

జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా పెరగాలంటే ఇలా చేయండి

గృహిణిగా ఉండాలంటే భర్త ఆస్తిలో సగం వాటా ఇవ్వాలి

టీచర్‌ ట్రాన్స్‌ఫర్‌ అయ్యాడని.. బోరుమన్న విద్యార్థులు

అదంతా ఫేక్ న్యూస్.. వాట్సాప్‌లో వచ్చేదంతా నమ్మితే ఎలా ??

Double iSmart: డబుల్ స్పీడ్‌లో డబుల్ ఇస్మార్ట్‌

0

ఎక్కడ ఆపారో అక్కడే మొదలుపెట్టారు పూరీ జగన్నాథ్, రామ్ పోతినేని. ఇస్మార్ట్ శంకర్ తర్వాత ఇద్దరికీ టైమ్ బాగోలేదు. అప్పుడొచ్చిన హిట్టు.. మళ్లీ ఇప్పటి వరకు రానని మొండికేసింది. అందుకే డబుల్ ఇస్మార్ట్‌తో డబుల్ స్పీడ్‌లో దాన్ని ఒడిసిపట్టుకోవాలని ఫిక్సైపోయారు ఈ జోడీ. దానికోసమే చేయాల్సిన మాస్ ప్రయత్నాలన్నీ చేస్తున్నారు.

Raashii Khanna: అలాంటి వారిని ఉరి తీయాలి.. రాశిఖన్నా డిమాండ్

0

Kajal Aggarwal: బ్లాక్ కలర్ డ్రస్ లో మైండ్ బ్లాక్ చేస్తోన్న చందమామ

0

 అందాల చందమామ కాజల్ అగర్వాల్.. ప్రస్తుతం రీఎంట్రీతో వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన కాజల్ అగర్వాల్. టాలీవుడ్ లో దాదాపు అందరు స్టార్ హీరోలతో సినిమాలు చేసింది. 

Kalki 2898 AD: రూ.1000 కోట్లు పక్కా.. ఇదిగో ఇదే లెక్క..!

0

ప్రభాస్ కల్కి మూవీ కలెక్షన్స్ ను కుమ్మేస్తోంది. బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. రిలీజ్ అయి దాదాపు 5 రోజులైనా కూడా.. థియేటర్స్‌ అంతటా… హౌజ్ ఫుల్ అవడం కామన్గా కనిపిస్తోంది. ఇలాగే మరో 5 రోజులు కంటిన్యూ అయితే కల్కి వెయ్యి కోట్ల మార్క్ అందుకోవడం కష్టం కాదనే టాక్ ఫిల్మ్ అనలిస్టుల నుంచి వస్తోంది. దాంతో పాటే డే5… ఈ మూవీ… 635 కోట్లు వసూలు చేయడం ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అవుతోంది. ఎస్ ! ఎన్నో అంచనాల మధ్య జూన్ 27న రిలీజ్ అయిన కల్కి మూవీ… డే 1 అందరి అంచనాలను అందుకుంది. అంతటా యునానిమస్‌గా సూపర్ డూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. దాంతో పాటే డే1 వరల్డ్ వైడ్ 191.5 క్రోర్ గ్రాస్‌ను వసూలు చేసింది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

TOP 9 ET News: నార్త్‌ అమెరికాలో రూ.100 కోట్ల వసూళ్లుకల్కి ప్రభంజనం

Dil Movie: అమ్మబాబోయ్.. నితిన్ దిల్ సినిమా హీరోయిన్ ఎంతలా మారిపోయింది..

0

నితిన్ కెరీర్ లో బిగెస్ట్ హిట్ గా నిలిచిన సినిమాల్లో దిల్ సినిమా ఒకటి. యాక్షన్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. అప్పటిలో యువతను ఈసినిమా ఓ ఊపేసింది. నితిన్, నేహ ప్రధాన పాత్రల్లో నటించారు. ఆర్. పి. పట్నాయక్ సంగీత దర్శకత్వం వహించాడు. దిల్ రాజుకు నిర్మాతగా ఇది మొదటి సినిమా. ఈ సినిమా పేరు ఆయన పేరులో భాగం అయ్యింది. అప్పటి నుంచి ఆయనను దిల్ రాజు అని పిలవడం మొదలు పెట్టారు. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ కూడా తన నటనతో ఆకట్టుకున్నారు. అలాగే ఈ సినిమాలో నితిన్ కు వాయిస్ ఇచ్చింది ఎవరో కాదు హీరో శివాజీ. ఇదిలా ఉంటే ఈ సినిమాలో నితిన్ కు జోడీగా నటించిన ముద్దుగుమ్మ గుర్తుందా.? ఆమె పేరు నేహ.. ఈ చిన్నది దిల్ సినిమా తర్వాత పెద్దగా అకనిపించలేదు ఈ బ్యూటీ..

నేహా బాంబ్  తెలుగు, హిందీ సినిమాలలో నటించింది. దిల్ సినిమాతో తెలుగు సినీరంగంలోకి  అడుగుపెట్టింది. ఆ తరువాత కొన్ని తెలుగు సినిమాల్లో నటించింది. అతడే ఒక సైన్యం, బొమ్మరిల్లు, దుబాయ్ శీను సినిమాల్లో కనిపించింది ఈ చిన్నది. బొమ్మరిల్లు, దుబాయ్ శీను సినిమాల్లో చిన్న పాత్రలో కనిపించింది. ఆతర్వాత ఈ బ్యూటీ సినిమాలకు దూరం అయ్యింది. హీరోయిన్ నేహా ప్రస్తుతం ఎలా ఉంది.? ఏం చేస్తుంది.? అని నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు.

ఈ అమ్మడు సినిమాలతో కంటే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఇప్పుడు ఈ అమ్మడు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా దూరం అయ్యింది. సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది ఈ చిన్నది. ఈ అమ్మడి లేటెస్ట్ ఫోటోలు చూసి అభిమానులు షాక్ అవుతున్నారు. ఈ ఫోటోల పై నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

నేహా బాంబ్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

నేహా బాంబ్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.