Home Blog Page 512

Allu Arjun – Pushpa 2: పక్కా ప్లాన్‌తో వస్తున్న పుష్పరాజ్‌.. పార్టీ గట్టిగానే ప్లాన్ చేసాడు..

0

Tollywood: నోట్లో కత్తి.. ముఖం నిండా నెత్తురు.. కాళీ మాతలా మారిపోయిన ఆర్జీవీ హీరోయిన్‌.. గుర్తు పట్టారా?

0

Tollywood: నోట్లో కత్తి.. ముఖం నిండా నెత్తురు.. కాళీ మాతలా మారిపోయిన ఆర్జీవీ హీరోయిన్‌.. గుర్తు పట్టారా?

నోట్లో కత్తి.. ముఖం నిండా నెత్తురు.. కాళీ మాతలా దర్శనమిస్తోన్న ఈ అందాల తారను గుర్తు పట్టారా? సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పరిచయం చేసిన హీరోయిన్లలో ఈ బ్యూటీ కూడా ఒకరు. ఆర్జీవీ తీసిన పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించిన ఈ సొగసరి పలువురి స్టార్ హీరోల సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ కూడా చేసింది. తన కెరీర్ లో ఎక్కువగా బోల్డ్ మూవీస్ చేసిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ఏకంగా లుక్ మార్చిఅందరికీ షాక్ ఇచ్చింది. మరి ఈ కాళీ మాతను గుర్తు పట్టారా? ఈమె మరెవరో కాదు ‘భూమ్ బద్దలు’ పాటతో కుర్రకారును హుషారెత్తించిన అప్సరా రాణి. సోమవారం (జులై 01) ఆమె పుట్టిన రోజు. ఈ సందర్భంగా తను నటిస్తోన్న లేడీ ఓరియంటెడ్ మూవీ అరాచకం నుంచి ఒక కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో కాళీ మాత ఉగ్ర రూపం దాల్చితే, నెత్తురితో ఒళ్లంతా తడిసి ముద్దైతే ఎలా ఉంటుందో.. ఈ పోస్టర్‌లో అప్సరా రాణి అలా కనిపించింది. ప్రస్తుతం ఈ పోస్టర్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీనిని చూసిన వారందరూ షాక్ అవుతున్నారు. ఎప్పుడూ హాట్ హాట్ గా కనిపించే అప్సరా రాణి ఇలా మారిపోయిందేంటా? అని కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

రాచరికం సినిమాలో అప్సరా రాణితో పాటు విజయ్ శంకర్, వరుణ్ సందేశ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. చిల్ బ్రోస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ఈశ్వర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సురేష్ లంకలపల్లి కథ, స్క్రీన్ ప్లే సమకూరుస్తూ దర్శకత్వం కూడా వహిస్తున్నారు. ఇప్పటికే దాదాపు ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఇందులో హైపర్ ఆది, మహేష్, శ్రీకాంత్ అయ్యంగార్, మెంబూబ్ బాషా, పాచి థాకర్, రూపేష్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వెంగి సంగీతం అందిస్తుండగా, ఆర్య సాయి కృష్ణ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించనున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

రాచరికం సినిమాలో అప్సరా రాణి..

 

View this post on Instagram

 

A post shared by Apsara Rani (@apsararaniofficial_)

అప్సరా రాణి లేటెస్ట్ ఫొటోస్..

 

View this post on Instagram

 

A post shared by Apsara Rani (@apsararaniofficial_)

 

 

View this post on Instagram

 

A post shared by Apsara Rani (@apsararaniofficial_)

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ నటించిన ఒకే ఒక్క యాడ్ ఏంటో తెలుసా..? ఆ విషయంలో మాత్రం ఏకైక హీరో..

0

తెలుగు రాష్ట్రాల్లో ఆ హీరో సినిమా వచ్చిందంటే థియేటర్లు హౌస్ ఫుల్ కావాల్సిందే. అంతగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో పవన్ కళ్యాణ్. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసిన పవన్.. బద్రి మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాతో ఇండస్ట్రీలో పవన్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఆ తర్వాత తమ్ముడు, ఖుషి వంటి చిత్రాలతో మరిన్ని విజయాలను సొంతం చేసుకున్నాడు. పవన్ యాక్టింగ్, మేనరిజంతో కోట్లాది మంది హృదయాల్లో స్థానం సంపాదించుకున్నాడు. వెండితెరపైనే కాకుండా నిజ జీవితంలోనూ హీరోగా అభిమానుల గుండెల్లో దైవంగా ఉన్నారు. పవన్ రియల్ లైఫ్ హీరో అంటూ ఆయన వ్యక్తిత్వానికి ఫిదా అవుతుంటారు. ఓ వైపు సినిమాల్లో నటిస్తున్న పవన్.. దాదాపు పదేళ్లుగా రాజకీయాల్లో పోరాటం చేస్తున్నారు. ఇటీవలే ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో పిఠాపురం ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో విజయం సాధించారు. అలాగే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా, పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా విధులు నిర్వహిస్తున్నారు.

పవన్ కు చాలా మంది అభిమానులు ఉన్నారు. యూత్ మాత్రమే కాదు.. సినీ పెద్దలు, రాజకీయ ప్రముఖులు కూడా పవన్ వ్యక్తిత్వానికి అభిమానులే. ఇదంతా పక్కన పెడితే దాదాపు రెండు దశబ్దాలుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించారు. కానీ ఇన్నేళ్లలో పవన్ కేవలం ఒకే ఒక్క యాడ్ చేశారు. కెరీర్ ప్రారంభంలో పవన్ చేసిన మొదటి యాడ్ పెప్సీ. 2001లోనే ఇండియాలో మోస్ట్ పాపులర్ బ్రాండ్ ఇది. అప్పట్లో పెప్సీ కూల్ డ్రింగ్ సంస్థకు పవన్ బ్రాండ్ అంబాసిడర్. సౌత్ ఇండస్ట్రీలో ఓ స్టార్ హీరో ప్రొడక్ట్స్ యాడ్ ఇవ్వడం అదే తొలిసారి. ఆ తర్వాతే మెగాస్టార్ చిరంజీవి థమ్స్ అప్ యాడ్ ఇచ్చారు.

అప్పట్లో ఎక్కడ చూసిన పవన్ పెప్సీ యాడ్ పోస్టర్ కనిపించేవి. అప్పట్లో పెప్సీ యాడ్ చేసినందుకు ఆయనకు రెమ్యునరేషన్ అధికంగానే ఇచ్చారట. ఈ యాడ్ చేసినందుకు అప్పట్లో పవన్ ఏకంగా రూ.70 నుంచి రూ.100 కోట్ల వరకు పారితోషికం తీసుకున్నారని సమాచారం. అప్పట్లో ఈ రేంజ్ రెమ్యునరేషన్ తీసుకున్న ఏకైక హీరో పవన్. ఆ తర్వాత పవన్ మరో యాడ్ చేయలేదు. కేవలం సినిమాలపైనే దృష్టి సారించారు. ప్రస్తుతం పవన్ ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాల్లో నటిస్తున్నారు.

Pawan

Pawan

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Actor Abbas: ప్రేమదేశం హీరో అబ్బాస్ కూతురిని చూశారా..? ఎంత అందంగా ఉందో.. ఫోటోస్ వైరల్..

0

ఒకప్పుడు సౌత్ ఇండియాలో లవర్ బాయ్. యూత్ ఫాలోయింగ్ ఎక్కువే. ముఖ్యంగా అమ్మాయిల కలల రాకూమారుడు. మొదటి సినిమాతోనే హీరోగా ఎంతో క్రేజ్ సంపాదించుకున్నాడు. ప్రేమకథ చిత్రాలతో అభిమానుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్నాడు. ఆ హీరో హెయిర్ స్టైల్ అప్పట్లో చాలా ట్రెండ్. కుర్రాళ్లు ఆ హీరో హెయిర్ స్టైల్ ఫాలో అయ్యేవారంటే అప్పట్లో ఏ రేంజ్ ఫాలోయింగ్ ఉండేదో అర్థం చేసుకోవచ్చు. అతడు మరెవరో కాదు.. హీరో అబ్బాస్. ఈ పేరు చెబితే ఠక్కున గుర్తొచ్చే సినిమా ప్రేమ దేశం. 1996లో విడుదలైన ఈ మూవీ అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది. ఇందులో వినీత్, అబ్బాస్, టబు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాతోనే అబ్బాస్ చాలా పాపులర్ అయ్యాడు. ఇటు తెలుగులోనూ ఈ హీరోకు మంచి గుర్తింపు వచ్చింది. ప్రేమ దేశం తర్వాత ఎన్నో పాపులర్ చిత్రాల్లో నటించి ఫేమ్ సొంతం చేసుకున్నాడు. కానీ ఆ తర్వాత సినిమాలో ఎంపికలో పొరపాట్లతో స్టార్ హీరోగా ఇమేజ్ తగ్గిపోయింది. దీంతో అవకాశాలు రావడం ఆగిపోయాయి.

అనేక సినిమాల్లో సెకండ్ హీరోగా కనిపించడం.. ముఖ్యంగా లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో హీరోగా కనిపించాడు. ఆ తర్వాత వెండితెరపై అబ్బాస్ కనిపించడం తగ్గిపోయింది. చివరగా 2009లో వచ్చిన బ్యాంక్ అనే సినిమాలో కనిపించాడు. తెలుగు, తమిళ్ భాషలలో మొత్తం 50కు పైగా చిత్రాల్లో కనిపించిన అబ్బాస్.. తర్వాత చాలా కాలం సినిమాలకు దూరమయ్యాడు. యాడ్స్ చేస్తూ మరోసారి అడియన్స్ ముందుకు వచ్చిన అబ్బాస్.. ఫ్యామిలీతో కలిసి న్యూజిలాండ్ లో సెటిల్ అయ్యారు. అక్కడ ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. ఆర్థిక సమస్యలు వెంటాడడంతో చిన్న చిన్న ఉద్యోగాలు చేశారు. ప్రస్తుతం ఓ మోటివేషనల్ స్పికర్ గా, సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా వర్క్ చేస్తున్నారు.

ఇప్పుడు సినిమాలకు దూరంగా ఫ్యామిలీతో కలిసి సంతోషంగా గడుపుతున్నారు. అబ్బాస్ సినిమాల గురించి తప్పా.. అతడి ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు ఎవరికి తెలియదు. కానీ అబ్బాస్ భార్య, పిల్లలు మాత్రం చాలా అందంగా ఉంటారు. అబ్బాస్ 1997లో ఏరూమ్ అలి అనే మహిళను వివాహం చేసుకున్నారు. వీరికి కూతురు ఏమిరా అలి, కొడుకు అయమాన్ అలి ఉన్నారు. తాజాగా అబ్బాస్ ఫ్యామీలీ ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. ముఖ్యంగా కూతురు ఏమిరా అలి లేటేస్ట్ లుక్ అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నాయి. స్టార్ హీరోయిన్స్ ను మించిన అందంతో.. చూడగానే ఫిదా అయ్యాలా కనిపిస్తుంది. ప్రస్తుత అబ్బాస్ ఫ్యామిలీ ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి.

Abbas Daughter

Abbas Daughter

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

OTT Movie: ఓటీటీలోకి వచ్చేసిన కొరియన్ హారర్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఎందులో చూడొచ్చంటే?

0

కొరియన్ సినిమాలు, వెబ్ సిరీస్‍లకు వరల్డ్ వైడ్ గా క్రేజ్ ఉంది. ఓటీటీల్లో కూడా కొరియన్ కంటెంట్ కు బాగా ఆదరణ ఉంటోంది. అందుకు తగ్గట్టుగానే పలు ఓటీటీ సంస్థలు ఎప్పటికప్పుడు కొరియన్ సినిమాలను, వెబ్ సిరీస్ లను స్ట్రీమింగ్ కు తీసుకొస్తుంటాయి. ఆయా భాషల వారికి సులభంగా అర్థమయ్యేలా డబ్ చేసి మరీ అందుబాటులోకి తీసుకొస్తుంటాయి. అలా కొరియన్ సినిమాలను ఇష్టపడే వారి కోసం మరో సూపర్ హిట్ సినిమా స్ట్రీమింగ్ కు వచ్చేసింది. అదే హౌస్ ఆఫ్ ది డిస్సపియర్డ్. సుమారు ఏడేళ్ల క్రితం కొరియన్ థియేటర్లలో రిలీజైన ఈ సైకలాజికల్ థ్రిల్లర్ సూపర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ఇప్పుడీ సినిమా ఇండియాలో డైరెక్టుగా ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో హౌస్ ఆఫ్ ది డిస్సపియర్డ్ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. కొరియన్‍ లాంగ్వేజ్ తో పాటు తెలుగు, హిందీ, తమిళం భాషల్లోనూ ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.

భర్త, కుమారుడు ఎలా చనిపోయారు?

హౌస్ ఆఫ్ ది డిస్సపియర్డ్ సినిమాకు లిమ్ డీ వూంగ్ దర్శకత్వం వహించారు. ఇందులో యుంజిన్ కిన్, కే పాప్ స్టార్ ఓకే టయిక్ ఇయాన్, జా జయీ యూన్, పార్క్ సంగ్ హూన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. రిత్మికల్ గ్రీన్, జియాన్ ఎంటర్‌టైన్‍మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ థ్రిల్లర్ సినిమాకు కిమ్ వూ గెయిన్ సంగీతం అందించారు. ఇక సినిమా స్టోరీ లైన్ విషయానికి వస్తే.. భర్త, కొడుకును హత్య చేశారనే తప్పుడు ఆరోపణలతో హీ (యుంజిన్ కిమ్) 25 ఏళ్లు జైలు శిక్ష అనుభవిస్తుంది. ఆ తర్వాత బయటికి వచ్చి తన ఇంటికి తిరిగి వెళుతుంది. తన భర్త, కొడుకు చావుకు కారణాలేంటో కనుక్కునే ప్రయత్నం చేస్తుంది. మరి ఆమె ప్రయత్నం సక్సెస్ అయిందా లేదా తెలుసుకోవాలంటే హౌస్ ఆఫ్ ది డిస్సపియర్డ్ మూవీ చూడాల్సిందే. కొరియన్ సినిమాలు అందులోనూ థ్రిల్లర్ సినిమాలు చూసేవారికి ఇది మంచి ఛాయిస్ అని చెప్పుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Pawan Kalyan: జీతం తీసుకోకుండా పనిచేస్తానన్న పవన్ కల్యాణ్.. ‘అన్నా’ అంటూ దండం పెట్టిన ప్రముఖ డైరెక్టర్

0

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాఫురం ఎమ్మెల్యేగా గెలిచారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఆ తర్వాత డిప్యూటీ సీఎంగా బాధ్యతలు కూడా చేపట్టి ప్రజా సేవలో తలమునకలయ్యారు. ఇదిలా ఉంటే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో తాను జీతం తీసుకునే పని చేస్తానన్నారు పవన్ కల్యాణ్. జీతం తీసుకుంటూనే ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సి ఉంటుంది కాబట్టి వేతనం తీసుకునే మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తానన్నారు. అయితే ఇప్పుడు ఆయన మనసు మార్చుకున్నారు. తాజాగా పంచాయతీరాజ్ శాఖను రివ్యూ చేస్తున్న సమయంలో అక్కడున్న అప్పులు, లోటు బడ్జెట్ లను గురించి తెలుసుకున్న పవన్ తాను జీతం తీసుకోకపోవడమే కరెక్ట్ అని ప్రకటించారు. అలాగే పంచాయతీ రాజ్ శాఖలో ఫర్నీచర్ కూడా తన సొంత డబ్బులతోనే ఏర్పాటు చేసుకుంటానని వెల్లడించారు. పవన్ తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ తో ‘బ్రో’ సినిమాను తెరకెక్కించిన ప్రముఖ దర్శకుడు, నటుడు సముద్ర ఖణి ఆసక్తికర ట్వీట్ చేశారు. పవన్ జీతం తీసుకోకపోవడంపై తమిళ మీడియా కవర్ చేసిన ఒక న్యూస్ పిక్ ను ట్విట్టర్ లో షేర్ చేసిన ఆయన ‘అన్నా’ అంటూ దండం పెడుతున్న ఎమోజీని షేర్ చేశారు.

ప్రస్తుతం సముద్ర ఖణి ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు ఈ ట్వీట్ ను రీ ట్వీట్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. కాగా సముద్ర ఖని తెరకెక్కించిన బ్రో సినిమాలో పవన్ కల్యాణ్ తో పాటు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కూడా నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ బ్యానర్ పై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. అదే సమయంలో వివాదాల్లోనూ నిలిచింది. ముఖ్యంగా ఏపీ రాజకీయాల్లో పెను దుమారం రేపింది. ప్రస్తుతం సముద్రఖని జబర్దస్త్ నటుడు ధన్ రాజ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు.  రామం రాఘవం పేరుతో ఈ మూవీ తెరకెక్కుతోంది.  త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇవి కూడా చదవండి

సముద్ర ఖని ట్వీట్ ఇదిగో..

పవన్ కల్యాణ్ తో డైరెక్టర్ సముద్ర ఖని..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Bellamkonda Sai Sreenivas: హిట్ కోసం రిస్క్ తప్పదు అంటున్న బెల్లంకొండ హీరో..

0

ప్రస్తుతం సౌత్‌లో ఫాంటసీ, పీరియాడిక్ సినిమాల ట్రెండ్ నడుస్తోంది. అందుకే బెల్లంకొండ హీరో కూడా ఇదే జానర్‌లో సినిమాకు రెడీ అవుతున్నారు. అయితే ఈ జానర్‌లో సినిమా అంటే భారీ బడ్జెట్‌ తప్పనిసరి, అదే సమయంలో సక్సెస్ రేష్యో చాలా తక్కువ. అందుకే సాయి శ్రీనివాస్ రిస్క్ చేస్తున్నారా? అన్న డిస్కష్ జరుగుతోంది.

Kalpana Rai: నటనతో కడుపుబ్బా నవ్వించిన కల్పనా రాయ్.. చివరి రోజుల్లో ఆకలితో అలమటించి.. ఆ కష్టాలు తెలిస్తే కన్నీళ్లు ఆగవు..

0

Kalpana Rai: నటనతో కడుపుబ్బా నవ్వించిన కల్పనా రాయ్.. చివరి రోజుల్లో ఆకలితో అలమటించి.. ఆ కష్టాలు తెలిస్తే కన్నీళ్లు ఆగవు..

తెలుగు తెరపై ఎంతో మంది హాస్యనటులు తమదైన నటనతో సినీ ప్రియులను కడుపుబ్బా నవ్వించారు. కామెడీ పంచులు, బాడీ లాంగ్వేజ్‏తో ప్రేక్షకులను అలరించారు. వందలాది చిత్రాల్లో కీలకపాత్రలు పోషించి నటనతో ప్రేక్షకుల పెదాలపైకి నవ్వులు తెప్పించిన కమెడియన్లలో కల్పనా రాయ్. తన యాస, డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్ తో అప్పట్లో ఎన్నో గుర్తిండిపోయే పాత్రలతో మెప్పించింది. దాదాపు 430కు పైగా సినిమాల్లో నటించింది. జంబలకిడి పంబ, ప్రేమించచుకుందాం రా, కలిసుందం రా వంటి చిత్రాల్లో నటించింది. వందల సినిమాలు చేసి సినీ రంగంలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న కల్పనా రాయ్.. చివరి రోజుల్లో మాత్రం ఆర్థిక కష్టాలతో కొట్టుమిట్టాడింది. కూతురు మోసం చేసి వెళ్లిపోవడంతో మానసిక వేదన అనుభవించింది. చివరకు ఆకలితో అలమటించి ప్రాణాలు కోల్పోయింది.

కల్పనా రాయ్.. అచ్చ తెలుగింటి ఆడపడుచు. 1950లో కాకినాడలో జన్మించిన ఆమె అసలు పేరు సత్యవతి. యుక్తవయసులో ఎంతో అందంగా ఉండేది. ఒంటినిండా బంగారు నగలు వేసుకుని నడుచుకుంటూ వస్తుంటే రెండు కళ్లు చాలేవి కాదట. నటనపై ఆసక్తితో సినీరంగంలోకి అడుగుపెట్టింది. నీడలేని ఆడది సినిమాతో వెండితెరకు పరిచయమైంది. కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా వందలాది చిత్రాల్లో నటించింది. సినిమాల్లో నవ్వించడం.. సెట్ లో అందరికీ కడుపు నిండా అన్నం పెట్టేది. కష్టాల్లో ఉన్నవారికి తన వంతు సాయం చేసేది. కానీ ఆ మంచితనమే ఆమెకు శాపంగా మారింది. ఆస్తి తగ్గగానే అందరూ దూరమయ్యారు. పెళ్లి చేసుకుండా ఒంటరిగా ఉన్న కల్పనా.. ఓ అమ్మాయిని దత్తత తీసుకుని పెంచుకుంది. కానీ ఆ అమ్మాయి పెద్దయ్యాక ఓ అబ్బాయిని ప్రేమించి అతడితో వెళ్లిపోయింది. ప్రాణంగా పెంచుకున్న కూతురు తనను మోసం చేసి వెళ్లిపోవడంతో మానసిక క్షోభకు గురైంది.

కూతురు వెళ్లిపోవడం.. డబ్బు ఆవిరి కావడంతో ఆమెను పట్టించుకునేవాళ్లే కరువయ్యారు. చనిపోయేముందు పది రోజులపాటు తిండిలేక ఆకలితో అలమటించింది. ఎందరికో తన చేతులతో వండి కడుపునింపిన కల్పనా రాయ్ ఆకలికి తట్టుకోలేక ధీన స్థితిలో కన్నుమూసింది. ఆమె చనిపోయిన తర్వాత చితికి నిప్పు పెట్టడానికి కూడా డబ్బుల్లేని పరిస్థితికు చేరుకుంది. అంతటి కష్టం ఏ ఆర్టిస్టుకూ రాకూడదు. కళామతల్లిని నమ్ముకున్న ఆమె చితి పేర్చేందుకు వేరేవాళ్లు డబ్బు చేశారని గతంలో నటి జయ శ్రీ చెప్పుకొచ్చింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పాపం !! ఆ విషయంలో.. జాన్వీ ప్లేస్‌ కబ్జా చేస్తున్న దిశా పటాని..

0

Prabhas: సరికొత్త రికార్డ్ ను తన ఖాతాలో వేసుకున్న డార్లింగ్ ప్రభాస్.. 

0