Home Blog Page 511

గుడ్ న్యూస్.. తెరపైకి వస్తున్న జూనియర్ లయన్‌

0

టాలీవుడ్లో బాలయ్య స్టార్ హీరో..! నందమూరి లెగసీని పర్ఫెక్ట్ గా క్యారీ చేస్తన్న హీరో. అలాంటి స్టార్ హీరో వారసుడు ఇండస్ట్రీలో అడుగుపెడుతున్నాడంటే.. ఓ రేంజ్‌లో ఎక్స్ పెక్టేషన్స్ ఉండడం కామన్. అందరి చూపు ఆ వారసుడి మీదే ఉండడం వెరీ వెరీ కామన్. అయితే అలాంటి చూపులకు ఇప్పుడు మోక్షం రాబోతోంది. నందమూరి బాలయ్య వారసుడి ఎంట్రీకి రంగం సిద్దమవుతోంది. ఎట్ ప్రజెంట్ ఈ యంగ్ లయన్ లేటెస్ట్ లుక్ ఇదే హింట్‌ ఇస్తూ.. నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఎస్ ! ఎంతో వెయిటింగ్ నడుమ.. మోక్షజ్ఙను హీరోగా చూడాలనే ఫీలింగ్ నడుమ.. తన బాబును ను సిల్వర్ స్క్రీన్ పై ప్రజెంట్ చేయాలనే ఎప్పటి నుంచో ఆరాటపడుతున్నారు బాలయ్య. తన ఫ్యాన్స్ అడిగిన ప్రతీసారి.. ఎన్నో వేదికల మీద నుంచి అదే చెబుతూ వస్తున్నారు. మోక్షజ్ఙ ఎంట్రీ త్వరలోనే అంటూ.. ఫ్యాన్స్‌ను అరిపిస్తున్నారు. ఇక ఈక్రమంలోనే.. తాజాగా మోక్షజ్ఙ లేటెస్ట్ పిక్స్‌ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఈ జూనియర్ బాలయ్య లుక్స్‌ అందర్నీ ఫిదా చేస్తున్నాయి.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇకపై నా కొడుకు వస్తాడు.. వారసుడిని రంగంలోకి దించిన లారెన్స్‌

TOP 9 ET News: రోజుకు రూ.100 కోట్లు.. మొత్తంగా చూస్తే.. కుప్పలుగా కోట్లలో డబ్బులు

Varalakshmi SarathKumar: గ్రాండ్‏గా వరలక్ష్మి శరత్ కుమార్ రిసెప్షన్.. సందడి చేసిన సినీతారలు..

0

Varalakshmi SarathKumar: గ్రాండ్‏గా వరలక్ష్మి శరత్ కుమార్ రిసెప్షన్.. సందడి చేసిన సినీతారలు..

కోలీవుడ్ నటి వరలక్ష్మి శరత్ కుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. హీరోయిన్‏గా సినీరంగంలోకి అడుగుపెట్టిన వరలక్ష్మి.. ఆ తర్వాత పవర్ ఫుల్ లేడీ విలన్ గా మారింది. హీరోయిన్ రోల్స్ పక్కన పెట్టి విలన్ పాత్రలతో అదరగొట్టేస్తుంది. ఎలాంటి పాత్రలలోనై తన యాక్టింగ్, మేనరిజంతో మెప్పిస్తుంది. తమిళంలోనే కాకుండా తెలుగులోనూ అనేక సూపర్ హిట్ చిత్రాల్లో కీలకపాత్రలు పోషించింది. తాజాగా వరలక్ష్మి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. ముంబైకి చెందిన ఆర్ట్ గ్యాలరిస్ట్ నికోలయ్ సచ్‏దేవ్ ను వివాహం చేసుకుంది. థాయ్ లాండ్ వేదికగా జూలై 2న వీరి వివాహం జరిగింది. తాజాగా చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేయగా.. సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై సందడి చేశారు. టాలీవుడ్, కోలీవుడ్ సినీ నటీనటులు ఈ రిసెప్షన్ లో సందడి చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

వరలక్ష్మి శరత్ కుమార్, నికోలయ్ సచ్ దేవ్ రిసెప్షన్ వేడులలో తమిళనాడు సీఎం స్టాలిన్ హజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అలాగే నందమూరి బాలకృష్ణ, వెంకటేశ్, శోభన, రజినీకాంత్, సిద్ధార్థ్, ఖుష్బూ, మంచి లక్ష్మి, సందీప్ కిషన్ సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. నికోలయ్ సచ్ దేవ్ ముంబయికి చెందిన వ్యాపారవేత్త. ఆర్ట్ గ్యాలరీలను నిర్వహిస్తుంటారు. ఆన్ లైన్ వేదికగానూ వివిధ రకాల పెయింటింగ్స్, కళాకృతులు విక్రయిస్తుంటారు. 14 ఏళ్లుగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు. ఇక ఇప్పుడు మూడు మూళ్ల బంధంతో ఒక్కటయ్యారు.

 

View this post on Instagram

 

A post shared by Kollywood Cinima (@kollywoodcinima)

 

View this post on Instagram

 

A post shared by Kollywood Cinima (@kollywoodcinima)

 

View this post on Instagram

 

A post shared by Kollywood Cinima (@kollywoodcinima)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

బిగ్ బాస్ 8లోకి ముగ్గురు.. ఇక షో దబిడి దిబిడే

0

ప్రముఖ బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఈ రియాలిటీ షో స్టార్ట్ అయ్యిందంటే చాలు చాలా మంది ఆడియన్స్ టీవీలు, మొబైల్ ఫోన్లకు అతుక్కుపోతారు. అందుకే అన్ని భాషల్లోనూ బిగ్ బాస్ టీవీ షోకు మంచి టీఆర్పీలు వస్తున్నాయి. ఇక తెలుగులోనూ సూపర్ సక్సెస్ అయ్యింది రియాలిటీ షో. ఇప్పటికే ఏడు సీజన్లు పూర్తయ్యాయి. మరీ ముఖ్యంగా గత సీజన్‌కు రికార్డు స్థాయిలో టీఆర్పీలు వచ్చాయి. దీంతో బిగ్ బాస్ సీజన్ 8 ఎప్పుడు స్టార్ట్ అవుతుందా? అని బుల్లితెర ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే సీజన్ 8 కోసం ఇప్పుడే రంగం సిద్ధం చేశారనే టాక్ తాజాగా బయటికి వచ్చింది. దాంతో పాటే బిగ్ బాస్ 8 లోకి వెళ్లేది వీళ్లే అంటూ బయటికి వచ్చిన ఓ ఇద్దరి సెలబ్రిటీల పేర్లు కూడా ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతూ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. యాంకర్స్, సీరియల్ యాక్టర్స్, సోషల్ మీడియా స్టార్స్ ఇలా ఈ ఏడాది నెట్టింట బాగా వైరలైన వారిని బిగ్ బాస్ హౌజ్ లోకి తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గుడ్ న్యూస్.. తెరపైకి వస్తున్న జూనియర్ లయన్‌

ఇకపై నా కొడుకు వస్తాడు.. వారసుడిని రంగంలోకి దించిన లారెన్స్‌

TOP 9 ET News: రోజుకు రూ.100 కోట్లు.. మొత్తంగా చూస్తే.. కుప్పలుగా కోట్లలో డబ్బులు

తప్పతాగి.. పిచ్చి పిచ్చిగా చేసి.. నెట్టింట హీరోయిన్ వీడియో వైరల్

0

బీ టౌన్‌లో సెలబ్రిటీల లైఫ్‌ స్టైలే కాస్త వేరుగా ఉంటుంది. రాత్రైతే మాత్రం.. పబ్స్‌ పార్టీస్‌.. రెస్టారెంట్స్‌ ముందు వీరి హంగామా ఎప్పుడూ ఉంటుంది. అదే వీకెండ్స్‌లో అయితే మాత్రం ఈ రచ్చ పీక్స్‌లో ఉంటుంది. ఆఫ్టర్ పార్టీ వీరి కాళ్లు తడబడడం.. అవి కాస్తా పాపరాట్‌జీ కెమెరాలకు చిక్కి నెట్టింట వైరల్ అవడం కామన్‌గా ఉంటుంది. ఇక ఇప్పుడు సెలబ్రిటీ.. మోడల్.. ఉర్ఫీ జావేద్ విషయంలో కూడా ఇదే జరిగింది. ఈమె ఆప్టర్ పార్టీ తప్పతాగి పిచ్చి పిచ్చిగా వాగుతూ తూలుతూ నడవడం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఎస్ ! ఎప్పుడూ కొత్త కొత్త.. విచిత్రమైన అవుట్ ఫిట్స్‌లో కనిపించి బీ టౌన్‌లో సెన్సేషనల్ అయ్యే ఉర్ఫీ తాజాగా మరోసారి కెమెరాకు చిక్కింది. కానీ తన విచిత్రమైన బట్టల్లో కాదు.. తప్పతాగిన మైకంలో..

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బిగ్ బాస్ 8లోకి ముగ్గురు.. ఇక షో దబిడి దిబిడే

గుడ్ న్యూస్.. తెరపైకి వస్తున్న జూనియర్ లయన్‌

ఇకపై నా కొడుకు వస్తాడు.. వారసుడిని రంగంలోకి దించిన లారెన్స్‌

TOP 9 ET News: రోజుకు రూ.100 కోట్లు.. మొత్తంగా చూస్తే.. కుప్పలుగా కోట్లలో డబ్బులు

 

Kangana Ranaut: కంగనాను కొట్టిన సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్‏కు ఊహించని షాక్..

0

గత నెలలో చండీగఢ్‌ విమానాశ్రయంలో బీజేపీ ఎంపీ, బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్‌ను కుల్విందన్ అనే సీఐఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుల్ చెంపదెబ్బ కొట్టిన సంగతి తెలిసిందే. ఈ సంఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. రైతుల నిరసనపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకే కంగనాను కొట్టినట్లు సదరు కానిస్టేబుల్ వెల్లిడించింది. బీజేపి ఎంపీ ఫిర్యాదుతో కుల్విందర్ పై సస్పెన్షన్ వేటు వేశారు అధికారులు. ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయగా.. సిట్ దర్యాప్తును పూర్తి చేసి ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించింది. ఈ ఘటనలో పలువురు సినీ ప్రముఖులు, సామాన్యులు కుల్విందర్ కు మద్దతు తెలుపగా.. బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ దద్లానీ ఆమెకు ఏకంగా ఉద్యోగం ఇస్తామంటూ ఇన్ స్టా వేదికగా ఆఫర్ ఇచ్చాడు. దీంతో తనకు సపోర్ట్ చేయని వారిపై మండిపడింది కంగనా.

ఇదంతా పక్కన పెడితే కంగనాపై చేయి చేసుకున్న సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ కుల్విందర్ పై సస్పెషన్ వేటు వేసిన అధికారులు తిరిగి ఆమెను వీధుల్లోకి తీసుకున్నారు. అంతేకాకుండా ఆమెపై బదిలీ వేటు వేశారు. కుల్విందర్ ను చండీగఢ్ నుంచి బెంగుళూరు రూరల్ జిల్లా నేలమంగళ తాలూకాలోని డాబస్ టౌన్ సమీపంలోని సెంట్రల్ ఇండస్ట్రీయల్ సెక్యూరిటీ ఫోర్సుకు ఆమెను బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. అయితే ప్రస్తుతం కుల్విందర్ సస్పెన్షన్ లో ఉన్నారు.

బీజేపీ ఎంపీ కంగనాను చెంప దెబ్బ కొట్టిన ఆరోపణలపై సీఐఎస్‌ఎఫ్ కానిస్టేబుల్ కుల్వీందర్ కౌర్‌పై శాఖాపరమైన విచారణ జరుగుతోందని సీఐఎస్‌ఎఫ్ తెలిపింది. దేశంలో రైతులు చేసిన ఉద్యమాన్ని కించపరుస్తూ కంగనా మాట్లాడారని.. ఆ రైతులలో తన తల్లి కూడా ఉన్నారని.. అందుకే కంగనాపై చేయి చేసుకున్నానంటూ కుల్విందర్ తెలిపింది. ఈ ఘటనకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారగా.. బాలీవుడ్ ఇండస్ట్రీలోని పలువురు సెలబ్రెటీస్ కుల్వింద్ కు మద్దతు తెలిపారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Kalki 2898 AD: కల్కి విధ్వంసం.. హైదరాబాద్‏లో మూడు చోట్ల సరికొత్త రికార్డులు.. ఆ విషయంలో ప్రభాస్ ఏకైక హీరో..

0

ఇప్పటి వరకు ఇండియన్ సినిమా హిస్టరీలో తొలి వారాంతానికి 500 కోట్ల మార్క్‌ టచ్ చేసిన సినిమా మరోటి లేదు. నియర్‌ ఫ్యూచర్‌లో మరో సినిమాకు ఆ ఛాన్స్ ఉండే అవకాశం కూడా కనిపించటం లేదు.

డైరెక్టర్ నాగ్ అశ్విన్ రూపొందించిన కల్కి 2898 ఏడి సరికొత్త రికార్డులు సృష్టిస్తుంది. జూన్ 27న విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు సునామి సృష్టిస్తుంది. దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ కలెక్షన్స్ అదరగొడుతుంది. ఇప్పటికే వరల్డ్ వైడ్ రూ.700 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి అనేక చోట్ల పలు రికార్డ్స్ బ్రేక్ చేసింది. ఇందులో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, అమితాబ్, దిశా పటానీ, దీపికా పదుకొణె, కమల్ హాసన్, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, మాళవిక నాయర్, రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ కీలకపాత్రలు పోషించిన సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్.. బిగ్‌ కాస్టింగ్‌తో రూపొందించిన మూవీ… సంచలనాలు నమోదు చేస్తోంది. తాజాగా కల్కి ఖాతాలో మరో రికార్డ్ వచ్చి చేరింది.

పాన్ ఇండియా లెవల్లో ప్రభాస్ క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ముఖ్యంగా డార్లింగ్ సినిమా రిలీజ్ అంటే హైదరాబాద్ లో ఉండే హంగామా గురించి చెప్పక్కర్లేదు. సింగిల్ స్క్రీన్ నుంచి మల్టిప్లెక్స్ వరకు అన్ని థియేటర్స్ కళకళలాడతాయి. ఇక వీకెండ్ మూడు రోజులు అయితే హౌస్ ఫుల్ కావాల్సిందే. తాజాగా ప్రభాస్ నటించిన కల్కి సినిమాతో హైదరాబాద్ లోని మూడు మల్టీప్లెక్స్ థియేటర్స్ లో సరికొత్త రికార్డ్ సెట్ చేసింది. హైదరాబాద్ గచ్చిబౌలిలో మహేష్ బాబుకు సంబందించిన AMB సినిమాస్ మల్టీప్లెక్స్ థియేటర్ లో మొత్తం 7 స్క్రీన్స్ ఉన్నాయి. కల్కి రిలీజ్ రోజున అన్ని స్క్రీన్స్ లో కలిపి మొత్తం 40 షోల వరకు వేసినట్లు తెలుస్తోంది. నివేదికల ప్రకారం AMBలో రూ. కోటి వరకు గ్రాస్ కలెక్షన్స్ ఫాస్ట్ గా సాధించిన సినిమాగా కల్కి నిలిచింది. ఈ విషయాన్ని AMB స్వయంగా పోస్ట్ చేసింది. ఇప్పటివరకు AMBలో మహేష్ సినిమా కూడా ఇంత ఫాస్ట్ గా కోటి గ్రాస్ కలెక్ట్ చేయలేదు. దీంతో మహేష్ ఇలాకాలో ప్రభాస్ సరికొత్త రికార్డ్ అంటున్నారు.

అలాగే హైదరాబాద్ నల్లగండ్లలో ఇటీవలే అపర్ణ సినిమాస్ అనే మల్టీప్లెక్స్ థియేటర్ ప్రారంభించగా.. అక్కడ కూడా ఒక్కరోజే కల్కి సినిమా 42 షోలు వేయగా.. ఆల్మోస్ట్ అన్ని ఫుల్ అయ్యాయి. ఇక్కడ కూడా ఫస్ట్ టైం రూ. కోటి గ్రాస్ సాధించినట్లు తెలుస్తోంది. ఐదు రోజుల్లోనే పది లక్షలు రాబట్టింది. ఇలాగే హైదరాబాద్ లోని ప్రసాద్ ఐమాక్స్ థియేటర్లో కల్కి రిలీజ్ రోజున 36 షోలు వేయగా.. రూ.కోటి గ్రాస్ రాబట్టింది. ఇరవై ఏళ్లలో చాలా ఫాస్ట్ గా కోటి గ్రాస్ సాధించిన సినిమాగా కల్కి నిలిచింది. దీంతో హైదరాబాద్ లో మూడు చోట్ల కల్కి రికార్డులు సెట్ చేసిందంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Maname OTT: ఓటీటీలోకి శర్వానంద్ మనమే.. స్ట్రీమింగ్ ఎక్కడ కానుందంటే..

0

Maname OTT: ఓటీటీలోకి శర్వానంద్ మనమే.. స్ట్రీమింగ్ ఎక్కడ కానుందంటే..

వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో శర్వానంద్. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చిత్రాలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఇటీవల మనమే సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ మూవీలో శర్వానంద్ సరసన ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి కథానాయికగా నటించింది. ఈ సినిమా థియేటర్లలో విడుదలై మిక్స్డ్ టాక్ టాక్ అందుకుంది. ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయింది. రోటిన్ స్టోరీ అయినా.. డైరెక్షన్, శర్వానంద్, కృతి నటనకు మంచి మార్కులే పడ్డాయి. భారీగా కలెక్షన్స్ వసూలు చేయకపోయినా నిర్మాతలకు మాత్రం లాభాలను తెచ్చిపెట్టింది ఈ మూవీ. థియేటర్లలో పాజిటివ్ రివ్యూస్ అందుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ చేసుకుంది.

తాజా సమాచారం ప్రకారం శర్వానంద్, కృతి కలిసి నటించిన మనమే సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో జూలై 12 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ సినిమాలో రాహుల రవీంద్రన్, శివ కందుకూరి కీలకపాత్రలు పోషించగా.. ఖుషి మూవీ ఫేమ్ హేషమ్ అబ్దుల్ వహాబ్ మ్యూజిక్ అందించాడు. ఈ సినిమాలో మొత్తం పదహారు పాటలు ఉన్నాయి.

కథ విషయానికి వస్తే..
విక్రమ్ (శర్వానంద్) ప్రాణ స్నేహితుడు, అతడి భార్య ఓ ప్రమాదంలో కన్నుమూస్తారు. వాళ్ల కొడుకు ఖుషి (విక్రమ్ ఆదిత్య) సంరక్షణ బాధ్యత విక్రమ్ తోపాటు సుభద్ర (కృతి శెట్టి)పై పడుతుంది. దీంతో ఖుషి కోసం పెళ్లి కాకుండా తల్లిదండ్రులుగా మారతాయి. వారిద్దరి జీవితంలోకి ఖుషి వచ్చాక ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి..? జోసెఫ్ (రాహుల్ రవీంద్రన్), కార్తీక్ (శివ కందుకూరి) ఎవరు ? అనేది తెలియాలంటే మనమే సినిమా చూడాల్సిందే. ఇన్నాళ్లు థియేటర్లలో అలరించిన మనమే మూవీ ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Darshan: ‘పిచ్చి అంటారు సార్ దీన్ని’.. ఏడాది బిడ్డకు దర్శన్‌లా ఖైదీ వేషం వేయించిన అభిమాని.. ఫొటోషూట్ కూడా

0

Darshan: ‘పిచ్చి అంటారు సార్ దీన్ని’.. ఏడాది బిడ్డకు దర్శన్‌లా ఖైదీ వేషం వేయించిన అభిమాని.. ఫొటోషూట్ కూడా

అభిమాని హత్య చేయించిన కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటూ ప్రస్తుతం జైళ్లో గడుపుతున్నాడు కన్నడ స్టార్ హీరో దర్శన్. ప్రస్తుతం ఈ కేసు ఇంకా విచారణలో ఉంది. మరోవైపు దర్శన్ ఉంటోన్న జైలుకు అతని అభిమానుల హడావిడి ఎక్కువైంది. దర్శన్ జైలులో చేరినప్పటి నుంచి చాలా మంది జైలు ముంగిట గూమిగూడి ఆందోళనలు చేస్తున్నారు. దర్శన్ ను కోర్టుకు తీసుకెళ్తుండగా.. షూటింగ్ జరుగుతోందంటూ అభిమానులు ‘డి బాస్’ అంటూ నినాదాలు చేస్తున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో దర్శన్ పై తమ ప్రేమను రకరకాలుగా చాటుకుంటున్నారు అభిమానులు. ఈ నేపథ్యంలో ఒక అభిమాని అత్యుత్సాహం ప్రదర్శించాడు. దర్శన్ పై ఉన్న అభిమానంతో కుమారుడికి ఏకంగా ఖైదీ డ్రెస్ తొడిగించి ఫొటో షూట్ చేయించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ‘బ్రాండ్ ఆఫ్ శాండల్‌హుడ్ డి బాస్ ఫ్యాన్స్ మైసూర్’ అనే సోషల్ మీడియా ఖాతా లో ఈ పిల్లాడి ఫొటోను షేర్ చేశారు. ఇందులో ఏడాది వయసున్న చిన్నారిని ఖైదీ వేషధారణలో ముస్తాబు చేశారు. దర్శన్‌కు ఇచ్చిన అండర్ ట్రయల్ ఖైదీ నంబర్‌ 6106నే చిన్నారి డ్రెస్ పై కూడా వేయించారు. పిల్లాడి పక్కన ‘జై డి బాస్’, ఖైదీ నంబర్ 6106 అంటూ అక్షరాలు కూడా ఏర్పాటుచేశారు.

ఈ ఫొటోను చూసిన దర్శన్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే సామాన్యులు మాత్రం విమర్శలు గుప్పిస్తున్నారు.
ఖైదీ వేషధారణలో చిన్నారి ఫొటో తీయడం దారుణమంటూ సదరు అభిమానిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై నెట్టింట విస్తృతంగా చర్చ జరుగుతోంది. ‘ఇలా చేయడం అభిమానం అనిపించుకోదు.. పిచ్చి అంటారు దీన్ని’ అని కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

ఖైదీ వేషధారణలో ఏడాది బాలుడు.. ఫొటోస్ ఇదిగో..

 

కాగా నటుడిపై ఉన్న పిచ్చి ప్రేమ కోసం అభిమానులు ప్రతిరోజూ ట్రెండ్ అవుతున్నారు. కొందరు దర్శన్ అండర్ ట్రైయల్ ఖైదీ నంబర్ ను టాటూలుగా వేయించుకున్నారు.

6106 నంబర్ ను పచ్చ బొట్టుగా వేయించుకుంటోన్న అభిమానులు..

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Samantha: నువ్వు ఒక వారియర్.. నీకోసం ప్రార్థిస్తుంటాను.. వైరలవుతున్న సమంత పోస్ట్..

0

అతి తక్కువ సమయంలోనే దక్షిణాది చిత్ర పరిశ్రమలో స్టార్ డమ్ అందుకున్న హీరోయిన్ సమంత. వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించిన సామ్.. గత కొన్నాళ్లుగా మయోసైటిస్ సమస్యతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఓవైపు ఈ సమస్యకు చికిత్స తీసుకుంటూనే మరోవైపు కొన్ని సినిమాల్లో నటించింది. కానీ విజయ్ దేవరకొండ సరసన ఖుషి సినిమా తర్వాత ఆమె సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. కొన్ని రోజులుగా విశ్రాంతి తీసుకుంటున్న సామ్.. ఇప్పుడిప్పుడే సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తుంది. తన సొంత నిర్మాణ సంస్థ బ్యానర్ పై మా ఇంటి బంగారం అనే చిత్రంలో నటిస్తుంది. ఇప్పటికే రిలీజ్ అయిన టైటిల్ పోస్టర్ ఆసక్తిని కలిగించగా.. ఆ తర్వాత ఎలాంటి వివరాలు అనౌన్స్ చేయలేదు. అలాగే మలయాళంలో సూపర్ స్టార్ మమ్ముట్టి చిత్రంలో సామ్ నటించనుందని టాక్ వినిపిస్తుంది. కానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇదిలా ఉంటే.. సినిమాల్లో సైలెంట్ అయినా.. సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్‏గా ఉంటుంది. ఎప్పటికప్పుడు హెల్త్ అప్డేట్స్ ఇస్తూ.. అలాగే కొన్ని పోస్టులు కూడా పెడుతుంది.

తాజాగా బాలీవుడ్ బుల్లితెర నటి హీనా ఖాన్‏ కోసం ఆసక్తికర పోస్ట్ చేసింది. హీనా ఖాన్ ప్రస్తుతం క్యాన్సర్ తో పోరాడుతున్న సంగతి తెలిసిందే. తనకు ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ 3వ దశలో ఉందంటూ ఇటీవల సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఇక ఇతాజాగా తాను కీమోథెరపీ సెషన్ కోసం ఆసుపత్రిలో ఉన్నట్లు ఓ ఫోటో షేర్ చేసింది. ఇక హీనా ఖాన్ పోస్టుకు సమంత రియాక్ట్ అవుతూ “నీ కోసం నేను ప్రార్థిస్తున్నాను. నువ్వు యోధురాలివి” అంటూ ఇన్ స్టా స్టోరీలో హీనాకు ధైర్యం చెప్పింది.

Samantha, Hina Khan

Samantha, Hina Khan

ఇక సమంత పోస్టుకు హీనా ఖాన్ స్పందిస్తూ.. “ఒకరిని తీసుకున్నాకే మరొకటి తెలుసుకోవడం జరుగుతుంది. మీరు నిజమైన స్టార్ అని నాకు తెలుసు. ఎందుకంటే జీవితంలో ఎదురైన అడ్డంకులను మీరు ఎదుర్కొన్న విధానం అద్భుతమైనది. మీరు చాలా ప్రేమ, ఆశీర్వాదాలు ” అంటూ రాసుకొచ్చింది. హే రిష్తా క్యా కేహలతా హై సీరియల్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైంది. ఆ తర్వాత పలు సీరియల్స్, సినిమాల్లో నటించింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Kalki 2898 AD: ప్రభాస్ క్రేజ్ అంటే ఇది.. బాక్సాఫీస్‏ను షేక్ చేస్తోన్న కల్కి.. ఆ రికార్డ్ డార్లింగ్‏కే సొంతం..

0

ప్రస్తుతం పాన్ ఇండియా బాక్సాఫీస్‏ను షేక్ చేస్తోంది కల్కి 2898 ఏడి. డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన అద్భుతమైన విజువల్ వండర్ చూసి అడియన్స్ ఫిదా అవుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్స్ సునామీ సృష్టిస్తోంది కల్కి. భారతీయ పురాణాలకు, సైన్స్ ఫిక్షన్ జోడించి డైరెక్టర్ నాగ్ అశ్విన్ రూపొందించిన ఈ మూవీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇందులో భైరవ పాత్రలో ప్రభాస్, అశ్వత్థామగా అమితాబ్, కమల్, దీపికా, విజయ్ దేవరకొండ యాక్టింగ్ మరో హైలెట్ అంటున్నారు. ప్రస్తుతం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఉగ్రరూపం దాల్చుతోందనే చెప్పాలి. మొదటి రోజే రూ. 191.5 కోట్లు రాబట్టిన ఈ సినిమా ఇటు ఐదు రోజుల్లో రికార్డ్స్ బ్రేక్ చేసింది. ఈ చిత్రానికి వరల్డ్ వైడ్ అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. అలాగే అదే స్థాయిలోనూ కలెక్షన్స్ కూడా వస్తున్నాయి. ఇక ఇప్పుడు వారం రోజులు కాకుండానే రూ.500 కోట్లను క్రాస్ చేసింది కల్కి.

సినిమా ట్రేడ్ అనలిస్ట్ రమేష్ బాల ప్రకారం సోమవారం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద కల్కి 2898 ఏడి రూ.600 కోట్ల మార్క్ క్రాస్ చేసింది. వరల్డ్ వైడ్ దాదాపు రూ.625 కోట్లు వసూలు చేసింది. ఇప్పటివరకు ఇండియాలో రూ.343.6 కోట్లు రాబట్టినట్లు సమాచారం. అలాగే కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే రూ.182 కోట్లు రాబట్టినట్లు సమాచారం. Sacnilk ప్రకారం నార్త్ ఇండస్ట్రీలో రూ.128 కోట్లు కలెక్షన్స్ వసూలు చేసింది. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ ప్రాంతాలలో ఈ సినిమా జోరు కొనసాగుతుంది.

అలాగే కల్కి మరో ఘనతను సాధించింది. ఉత్తర అమెరికాలో 12 మిలియన్స్ డాలర్లు వసూళ్లను అధిగమించింది. ఈ ప్రాంతంలో అత్యంత వేగంగా రూ.100 కోట్ల గ్రాస్ నమోదు చేసిన భారతీయ సినిమాగా కల్కి నిలిచింది. ఇక ఇదే జోరు కొనసాగితే త్వరలోనే కల్కి రూ.1000 కోట్ల మార్క్ చేరుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ వారాంతంలో కల్కి రూ.1000 కోట్ల మార్క్ క్రాస్ చేయడం ఖాయంగా తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.