అమితాబ్ బచ్చన్ ఎంత క్రమశిక్షణతో ఉంటారో, రణ్‌బీర్‌లోనూ అదే క్రమశిక్షణను చూశాను. ట్రైనింగ్‌కి ఎన్ని సార్లు లేట్‌గా వచ్చారో చెప్పమంటే, నేను వేళ్ల మీద లెక్కపెట్టి చెప్పేయగలను. సినిమాలో కేరక్టర్ ఏం డిమాండ్ చేస్తుందో, దాని మీదే ఫోకస్ చేస్తారు రణ్‌బీర్.
Shankar: రణ్‌వీర్‌సింగ్ తో సినిమా.. శంకర్ ఏమన్నారంటే ??
బాలీవుడ్ హీరోలతో సౌత్ కెప్టెన్లు సినిమాలు చేయడం ఇప్పుడు అలవాటుగా మారిపోయింది. ఆల్రెడీ షాహిద్ కపూర్‌తోనూ, రణ్‌బీర్ కపూర్‌తోనూ బ్లాక్ బస్టర్ విజయాలు అందుకున్నారు తెలుగు డైరక్టర్ సందీప్ రెడ్డి వంగా. షారుఖ్ ఖాన్‌తో అట్లీ జవాన్ చేసిన రికార్డుల గురించి ఇంకా నార్త్ జనాలు మాట్లాడుకుంటూనే ఉన్నారు.
మురుగదాస్ డైరక్షన్లో సికందర్లో నటిస్తున్నారు సల్మాన్‌ఖాన్. విష్ణు డైరక్షన్లో సిద్ధార్థ్ మల్హోత్రా నటించిన షేర్షా ప్రేక్షకాదరణ పొందింది. మన వాళ్లు ఉత్తరాదిన ఢంకా భజాయిస్తున్న ఈ సమయంలో.. రణ్వీర్ సింగ్, శంకర్ కాంబోలో రావాల్సిన సినిమా గురించి మాట్లాడుతున్నారు నార్త్ జనాలు.
ఇటీవల ఇండియన్2 ప్రమోషన్లలో ఈ సినిమా గురించి ప్రస్తావించారు శంకర్. రణ్ వీర్‌సింగ్‌తో సినిమా చేయాలనుకున్న మాట నిజమేనని అన్నారు. అపరిచితుడు సినిమాను హిందీలో రణ్వీర్ సింగ్‌తో తెరకెక్కించాలని భావించారట. నిర్మాతలు కూడా ముందు ఓకే అనుకున్నారట. అయితే శంకర్ అండ్ రణ్ వీర్ అప్పుడు తమ తమ కమిట్మెంట్లతో బిజీగా ఉన్నారట.
ఈ క్రమంలోనే చాలా భారీ భారీ సినిమాలు ప్రేక్షకులను పలకరించాయి. ఇలాంటి తరుణంలో అపరిచితుడును మించి ఏదైనా చేస్తే బావుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారట నిర్మాతలు. వారి అభిప్రాయాన్ని గౌరవించి ఆ ప్రాజెక్టును హోల్డ్ లో ఉంచారట. ప్రస్తుతం ఇండియన్2 సినిమా ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు శంకర్. ఈ నెల 12న ఇండియన్2 సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ఇండియన్3కి సంబంధించి మేజర్ పార్ట్ షెడ్యూల్స్ పూర్తి చేశారట. మరో ఆరు నెలల్లో ఆ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. మరోవైపు గేమ్ చేంజర్ షూటింగ్ పూర్తి చేసి, సినిమాను విడుదల చేయాలి. ఇవన్నీ పూర్తయితేనే రణ్వీర్ సింగ్ సినిమా గురించి ఆలోచిస్తానని అన్నారు శంకర్.
భవిష్యత్తులో జేమ్స్ బాండ్ తరహా సినిమాలు తీయాలని ఉందని అన్నారు కెప్టెన్ శంకర్. హిస్టారికల్, సైన్స్ ఫిక్షన్ సినిమాలూ చేయాలనుకుంటున్నట్టు చెప్పారు. తాను అనుకుంటున్న కథల స్పాన్ ఎక్కువని, భారీ బడ్జెట్‌తో తెరకెక్కించాల్సినవేనని అన్నారు. వీఎఫ్ ఎక్స్ కి ప్రాధాన్యం ఉంటుందని, అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగిస్తానని చెప్పారు. దీన్ని బట్టి రణ్వీర్తో జేమ్స్ బాండ్ తరహా ప్రాజెక్టును ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? అనే చర్చలూ జోరుగానే సాగుతున్నాయి.
Kalki 2898 AD: కల్కి 600 నాటౌట్.. థౌజెండ్ వాలా పేలుతుందా
500 కోట్లు.. ఒకప్పుడు ఇంత కలెక్షన్ రావాలంటే తలకిందులుగా తపస్సు చేసేవాళ్లు మన హీరోలు. కేవలం బాలీవుడ్లో మాత్రమే అప్పుడప్పుడూ ఈ ఫిగర్ కనిపించేది. కానీ ఇప్పుడలా కదు.. చెప్పులేసుకున్నంత ఈజీగా 500 కోట్లు వసూలు చేస్తున్నారు. మరి దక్షిణాదిన ఎవరి ఖాతాలో ఎన్ని 500 క్రోర్స్ మూవీస్ ఉన్నాయో చూద్దామా..?
మార్కెట్ పెరిగినపుడు కలెక్షన్లు కూడా భారీగానే పెరుగుతుంటాయి. బాహుబలి నుంచి తెలుగు సినిమాల జాతకం మారిపోయింది. తాజాగా కల్కి దాన్ని పీక్స్‌కు తీసుకెళ్లింది. అందరి ఊహలకు మించి వసూలు చేస్తుంది కల్కి. కేవలం 5 రోజుల్లోనే 600 కోట్లు గ్రాస్ వసూలు చేసింది ఈ చిత్రం. ప్రభాస్ కెరీర్లో 4వ 500 కోట్ల సినిమా ఇది. ముందు సినిమా సలార్ కూడా 500 కోట్లు వసూలు చేసింది.
మిగిలిన హీరోలు 500 కోట్లు వసూలు చేయడానికి నానా తంటాలు పడుతుంటే.. ప్రభాస్ మాత్రం ప్రతీ సినిమాతోనూ దాన్ని కొల్లగొడుతున్నారు. కల్కి దూకుడు చూస్తుంటే 800 కోట్లు వసూలు చేయడం ఖాయంగా కనిపిస్తుంది. గతేడాది వచ్చిన సలార్ 650 కోట్లు వసూలు చేసింది. దానికి ముందు బాహుబలి 2 1800 కోట్లు వసూలు చేయగా.. బాహుబలి 600 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది.
సౌత్ ఇండియాలో ప్రభాస్ ఒక్కడే 4 సార్లు 500కోట్లు దాటారు. ఈయన తర్వాతి స్థానంలో రజినీకాంత్ ఉన్నారు. ఈయన నటించిన 2.0, జైలర్ సినిమాలు 500 కోట్ల కంటే ఎక్కువ వసూలు చేసాయి. శంకర్ 2.0 దాదాపు 750 కోట్లు వసూలు చేస్తే.. జైలర్ 600 కోట్ల వరకు వసూలు చేసి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.
ప్రభాస్, రజినీ తర్వాత సోలోగా ఈ రికార్డ్ అందుకున్న హీరో విజయ్ మాత్రమే. గతేడాది లియో సినిమాతో ఈ రికార్డ్ అందుకున్నారు దళపతి. ఈ చిత్రం దాదాపు 560 కోట్లు వసూలు చేసింది. ఎన్టీఆర్, రామ్ చరణ్ సైతం RRRతో 500 కోట్లు దాటారు. ఈ సినిమా ఏకంగా 1200 కోట్లు వసూలు చేసింది. అలాగే యశ్ కూడా కేజియఫ్ 2తో ఈ రికార్డ్ సొంతం చేసుకున్నారు.
TOP 9 ET News: రోజుకు రూ.100 కోట్లు.. మొత్తంగా చూస్తే.. కుప్పలుగా కోట్లలో డబ్బులు
కల్కి మూవీ కలెక్షన్స్‌లో ప్రభంజనం సృష్టిస్తోంది. డే 1 వరల్డ్ వైడ్ దాదాపు 191 క్రోర్ గ్రాస్‌తో కలెక్షన్స్ షురూ చేసిన ఈ మూవీ.. పెర్ డే యావరేజ్‌గా.. 100 కోట్ల కంటే ఎక్కువ కలెక్షన్స్‌ను రాబడుతూ వస్తోంది. కలెక్షన్స్ గ్రాఫ్ ఎక్కడా తగ్గకుండా… వెయ్యి కోట్ల వైపు పరుగులు పెడుతోంది. ఇక ఇప్పటి కైతే 6 రోజులకు గాను.. దాదాపు 680 కోట్లు కొల్లగొట్టింది ప్రభాస్ కల్కి మూవీ. ఇక కలెక్షన్స్ చూస్తున్న నెటిజన్స్ అండ్ కొంత మంది ఫిల్మ్ సెలబ్రిటీస్ షాకవుతున్నారు. కల్కి ప్రొడ్యూసర్ అశ్వినీ దత్‌కు కుప్పలు తెప్పలుగా కోట్లలో డబ్బులు వచ్చి ఉంటాయని కామెంట్ చేస్తున్నారు. ఓజీ సంగతేంటి.. ! హర హర మ్యాటరేంటి! ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ కథేంటి ! అంటూ తన వైపు ఆశగా చూస్తూ.. ఆ సినిమాల గురించి ఆరా తీస్తున్న ఫ్యాన్స్‌కు.. ఎట్టకేలకు నోరు విప్పి ఆన్సర్ ఇచ్చారు పవన్. మూడు నెలల తర్వాతే.. వీలు చూసుకుని కుదిరినప్పుడల్లా.. సినిమాలు చేస్తా అంటూ.. కాకినాడ ఉప్పాడ సభలో చెప్పారు. తన మాటలతో ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అవుతున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇన్‌స్టాలో విరిగిన పన్ను చూసి సోదరుడిని గుర్తుపట్టిన మహిళ
ఐస్‌క్రీంలో మనిషి చేతి వేలు.. మిస్టరీని ఛేదించిన పోలీసులు
Airtel: ఎయిర్‌టెల్ ప్రీ పెయిడ్, పోస్ట్ పెయిడ్ ధరల పెంపు
సొరకాయా.. మజాకా !! బోలెడన్ని ప్రయోజనాలు
Harom Hara: ఘట్టమనేని అభిమానులకు గుడ్ న్యూస్.. OTTలోకి వస్తోన్న హరోం హర
Actress Anuja: అలనాటి స్టార్ కమెడియన్ అనూజ గుర్తుందా..? ఇప్పుడేం చేస్తుందంటే.. లేటేస్ట్ లుక్ వైరల్..
సినీ పరిశ్రమ ఓ రంగుల ప్రపంచం. ఇక్కడ గుర్తింపు తెచ్చుకోవాలని ఎంతో మంది కలలు కంటారు. ప్రతిభతోపాటు కాస్త అదృష్టం కూడా కలిస్తే ఇండస్ట్రీలో స్టార్ డమ్ సంపాదించుకుంటారు. కానీ వచ్చిన గుర్తింపును ఎక్కువ కాలం నిలబెట్టుకోవడమే అసలైన సవాలు. ఒక్క సినిమాతో క్లిక్ అయి ఆ తర్వాత వందలాది చిత్రాల్లో నటించిన నటీనటులు ఇప్పుడు ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. అప్పట్లో తక్కువ సమయంలోనే తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుని వెండితెరపై కనిపించి కనుమరుగయ్యారు. తమదై నటనతో ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించిన నటీనటులు ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటున్నారు. అందులో అనూజ ఒకరు. ఈ పేరు చెబితే అసలు గుర్తుపట్టలేరు.
అనూజ ఒకప్పుడు లేడీ కమెడియన్‌గా ఎన్నో చిత్రాల్లో నటించింది. తెలుగమ్మాయి అయినప్పటికీ మలయాళం ద్వారా సినీ పరిశ్రమకు పరిచయమైంది. దక్షిణాదిలో అనేక చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హీరోయిన్ గా నటించింది. 1980లో కథానాయికగా, లేడీ కమెడియన్ గా, సహాయ నటిగా దాదాపు 200లకు పైగా చిత్రాల్లో నటించింది. బ్రహ్మానందం, అనూజ కాంబినేషన్లో వచ్చిన కామెడీ సీన్లకు అప్పట్లో చాలా క్రేజ్ ఉండేది. చంటి, పెళ్లి చేసుకుందాం సినిమాల్లో తనదైన నటనతో గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు, తమిళం, మలయాళం భాషలలో అనేక చిత్రాల్లో నటించి మెప్పించారు. 2004 వరకు సినిమాల్లో యాక్టివ్ గా ఉన్నారు.
కానీ ఆ తర్వాత పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమయ్యారు. సినిమాల్లో బిజీగా ఉన్న సమయంలోనే ప్రేమ వివాహం చేసుకుని ఇండస్ట్రీకి దూరంగా ఉండిపోయారు అనూజ. చాలా కాలం తర్వాత ఇప్పుడిప్పుడే ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్ అవుతున్నారు. నిత్యం తన ఇన్ స్టా ఖాతాలో ఏదోక పోస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం అనూజ లేటేస్ట్ ఫోటోస్ చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Niharika NM Entering into tollywood
Niharika NM Recognized as the entertainment and comedy queen, (Forbes Asia 30 under 30, 2022), is an Indian digital content creator, who gained significant recognition for her humorous and relatable Instagram reels. Additionally, she has represented India twice in a row as the only creator to serve as a global ambassador for Creators for Change, a YouTube initiative that leverages the influence of creators to raise awareness and engage audiences on important social issues.
Born in Chennai and brought up in Bengaluru, Niharika’s taste in comedy is extremely diverse. An engineer who finished her MBA in the USA while juggling digital content creation, Niharika has immense love for theater. It was in Class 10 when Niharika was introduced to YouTube and three years later, she started expressing herself on the internet, leading to a successful career graph. With a follower base of over 6 million, Niharika has become a case study at Chapman University, California where she pursued her MBA.
Kalki 2898 AD Collections: రూ.1000 కోట్లకు చేరువలో కల్కి.. ఏడు రోజుల్లో ఎంత రాట్టిందంటే..
డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన కల్కి… ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. కల్కి సినిమాలో రియల్ లొకేషన్స్ కంటే విజువల్ ఎఫెక్ట్స్‌కే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు. ఈ సినిమా గత వారం రోజులుగా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తుంది. ఇప్పటికే 500 కోట్ల మార్క్ చేసిన కల్కి తాజాగా మరో మైలురాయిని దాటింది.
ఇప్పటికే పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద రికార్డ్స్ బ్రేక్ చేస్తోన్న కల్కి ఇప్పటివరకు రూ.700 కోట్లకు పైగ వసూళ్లు రాబట్టింది. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ కొత్త పోస్టర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. హీరో లేకుండా కేవలం దీపికా పదుకొణె పాత్రకు సంబంధించిన లుక్ హైలెట్ చేయడం విశేషం.
ఈ మైథాలజీ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ రూ.1000 కోట్ల క్లబ్ లో చేరడమే తరువాయి అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నిన్న ఒక్క రోజే రూ.95.3 కోట్ల నెట్ రాబట్టినట్లు తెలుస్తోంది. ఇండస్ట్రీలో ట్రాకర్ సక్నిల్క్ ప్రకారం ఇండియాలో కల్కి రూ.393.4 కోట్లకు పైగా వసూలు చేసింది.
ఈ మైథాలజీ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ రూ.1000 కోట్ల క్లబ్ లో చేరడమే తరువాయి అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నిన్న ఒక్క రోజే రూ.95.3 కోట్ల నెట్ రాబట్టినట్లు తెలుస్తోంది. ఇండస్ట్రీలో ట్రాకర్ సక్నిల్క్ ప్రకారం ఇండియాలో కల్కి రూ.393.4 కోట్లకు పైగా వసూలు చేసింది.
భారత దేశంలో కల్కి తెలుగు వెర్షన్ మొదటి వారంలో రూ.202.8 కోట్లు, హిందీ వెర్షన్ రూ.152.5 కోట్లు వసూలు చేసింది. హిందీ మార్కె్ట్లో ఈ ఏడాది అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా కల్కి నిలిచింది. బాలీవుడ్ హంగామా ప్రకారం రూ.199.45 కోట్లతో ఫైటర్ మొదటి స్థానంలో ఉండగా.. రూ.149.49 కోట్లతో రెండవ స్థానంలో కల్కి ఉంది.
Brahmamudi, July 4th Episode: కళ్యాణ్, రాజ్‌లపై కోడి గుడ్లు, టమాటాలు.. అనామిక ఛాలెంజ్!
ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. కోర్టులో నుంచి బయటకు వస్తారు. నా వంతు ప్రయత్నం నేను చేశాను సర్. కానీ కళ్యాణ్ గారు అనామికను టార్చర్ పెట్టలేదని, తనే ఇదంతా కావాలని చేసినట్టు సాక్ష్యం ఏదైనా ఉందా? లాయర్ అడుగుతాడు. భార్యని భర్త ఎలా చూసుకుంటాడు అన్న దానికి సాక్ష్యం ఎలా ఉంటుంది లాయర్ గారూ.. అది నమ్మకం మీద ఉంటుంది. ఏ రోజు ఎలా ఉందని సాక్ష్యం పెట్టుకుంటారా? అని ధాన్య లక్ష్మి అడుగుతుంది. కళ్యాణ్ తనపై చేయి చేసుకున్నట్టు సాక్ష్యం ఉంది. కోర్టులో అందరి ముందూ మీ అబ్బాయి ఒప్పుకున్నాడు. మరి దీనికి కూడా సాక్ష్యం కావాలి. కోర్టుకు సాక్ష్యాలే కావాలి అని లాయర్ అంటే.. అలాంటి సాక్ష్యాలు వాళ్ల దగ్గర ఏమీ ఉండవు లాయర్ గారు. ఎందుకంటే నా మొగుడు నాతో అలా ప్రేమగా ఎప్పుడూ నడచుకోలేదు కదా.. అని అనామిక అంటే.. కళ్యాణ్ కోపంగా ఉంటుంది.
అనామిక ఛాలెంజ్..
నోరు మూయవే రాక్షసి.. నిన్ను నా కూతురులా చూసుకున్నా. ఎన్ని తప్పులు చేసినా వెనకేసుకొచ్చాను. దానికి ఈ రోజు బాగా సమాధానం చెప్పావ్ అని ధాన్య లక్ష్మి అంటుంది. చూడండి అత్తయ్యా ఇప్పటికీ నా బాల్ నా చేతిలోనే ఉంది. మీ అబ్బాయి చేసిన తప్పులన్నింటికీ నాకు క్షమాపణ చెప్పి తిరిగి ఆ ఇంటికి తీసుకెళ్తాడేమో అడగండి. నేను ఇక్కడే కేసు వాపస్ తీసుకుంటానని అనామిక అంటుంది. కుదరదని కళ్యాణ్ అనేసరికి.. సరే అయితే చూద్దాం సాక్ష్యాలు తీసుకురండి చూద్దాం అని వెళ్లిపోతుంది. ఏం జరిగినా నేను చూసుకుంటాను ధైర్యంగా ఉండమని రాజ్ అంటాడు. ఈలోపు రుద్రాణి.. రేయ్ నేను చెప్పింది చేశావా అని అడిగితే.. అంతా ప్లాన్ చేశాను మామ్. ఇప్పుడు సీన్ చూడు. కళ్యాణ్‌కు సన్మానం చేస్తారని రాహుల్ అంటాడు.
రాజ్, కళ్యాణ్‌లపై టమాటాలు, గుడ్లు..
ఆ తర్వాత కళ్యాణ్‌ను పోలీసులు తీసుకెళ్తుండగా.. రాహుల్ మనుషులు కావాలనే అతనిపై టమాటాలు, గుడ్లు విసురుతారు. అది చూసిన రాజ్ వాళ్లు.. వెంటనే వెళ్లి అడ్డు పడతారు. రాజ్ పై కూడా టమాటాలు, గుడ్లు విసురుతారు ఆ తర్వాత వాళ్లను పోలీసులు అడ్డుకుంటారు. ఇక రాజ్ తన పదునైన మాటలతో వాళ్లకు సిగ్గు వచ్చేలా మాట్లాడతాడు. నిజం తెలిసిన రోజు మీరే సిగ్గుతో తల దించుకుంటారని అంటాడు. అది చూసి అనామిక నవ్వుతుంది.
ఇవి కూడా చదవండి
గుండెల్ని పిండేసే సీన్..
ఈ సీన్ తర్వాత కృష్ణ మూర్తి వచ్చి అప్పూని కోర్టుకు రావాలని చెప్పతాడు. ఏంటి అప్పూ కోర్టుకు రావాలా? వాళ్లు గొడవ పడితే నా కూతురికి ఏంటి సంబంధం? అది కోర్టుకు వెళ్లడానికి నేను ఒప్పుకోను అని కనకం అంటుంది. అలా అడ్డుపడితే పోలీసులు వస్తారే అని కృష్ణ మూర్తి అంటే.. రానివ్వండి వాళ్లను పట్టుకుని దులిపేస్తానని కనకం అంటుంది. అలా అయితే వాళ్లు నిన్ను కూడా తీసుకెళ్తారని అంటాడు. ఇక అప్పుడు కనకానికి అర్థమయ్యేలా చేప్తుంది. ఆ గొడవ జరిగింది నా గురించే కదా అని అనామిక చెప్పింది. కాబట్టి నేను కూడా వెళ్లాలి. ఇప్పుడు నేను కోర్టుకు వెళ్లకపోతే.. అందరూ అనుకున్నదే నిజం అవుతుంది. కాబట్టి నేను వెళ్లడమే మంచిదని అప్పూ అంటే.. కనకం ఒప్పుకోదు. అప్పూ నచ్చజెప్తుంది. నేను ఒక్కదానినే కోర్టుకు వెళ్తాను అంటుంది. వద్ద నేను కూడా వస్తాను. అక్కడ కళ్యాణ్‌ని ఎంతలా అవమానించారో చూశావు కదా.. నిన్ను కూడా అలానే అంటారు అంటుంది. వద్దని అప్పూ చెప్తుంది. లేదు నేను కూడా వస్తాను. ఆ జడ్జి కాళ్లు పట్టుకుని అయినా నీకు పడే శిక్ష నేను వేసుకుంటాను అని కనకం అంటే.. అప్పూ బాధ పడుతుంది.
సీతా రామయ్య బాధ..
ఈ సీన్ కట్ చేస్తే.. అనామిక చేసిన పనికి ఇంట్లో వాళ్లందరూ బాధ పడతారు. ఈ రోజు మన వంశ చరిత్రలో ఏనాడూ జరగనంత పరాభవం జరిగింది. కుటుంబ పరువు మొత్తం పోయింది. కుటుంబాన్ని మొత్తాన్ని కోర్టు గుమ్మం ఎక్కించింది. ఏం సాధించాలని? ఏం పొందాలని? ఎందుకు ఇంత దూరం వెళ్లింది? అనామికకు ఎలాంటి అపకారం చేయలేదు కదా.. అని సీతా రామయ్య అంటాడు. మన కుటుంబంలో కూడా ఆవేశం తన్నుక్కొచ్చిందంటే అందుకు అనామిక ప్రవర్తనే కారణమని పెద్దావిడ అంటుంది. టీవీలో మాట్లాడి.. పోలీస్ కేసు పెట్టి.. కోర్టు దాకా తెచ్చింది. కేవలం కళ్యాణ్ ప్రేమించాడని.. పెళ్లి చేశాం. అందుకు అనుభవిస్తున్నామని ఇందిరా దేవి అంటుంది. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది అది కాదు అత్తయ్యా.. మన కళ్యాణ్ గురించి ఆలోచించాలని అంటుంది. అంటే ఏంటి.. ఇప్పుడు మనం అందరం అనామికను క్షమాపణ అడిగి.. ఇంటి కోడలిగా తీసుకురావాలా అని సుభాష్ అంటే.. ఇంకేం చేయాలి? మన కళ్యాణ్ గురించి తప్పదు కదా అని ధాన్య లక్ష్మి అంటుంది.
పూచిక పుల్లతో తీసి పారేసింది..
మీరందరూ ఇంటి పరిస్థితి పరువు గురించి ఆలోచిస్తున్నారే తప్పా.. నా కొడుకు పరిస్థితి గురించి ఒక్కరు కూడా పట్టించు కోవడం లేదని అంటుంది ధాన్యలక్ష్మి. నోర్ముయ ఏం మాట్లాడుతున్నావ్? పెళ్లి అయిన తర్వాత కళ్యాణ్‌ని ఒక్కసారైనా నమ్మావా? అప్పూ విషయంలో ఎంత అవమానించినా.. అనుమానించినా.. నా కొడుకు అన్నింటినీ తట్టుకుని నిలబడ్డాడు. ఈ ఇంట్లో ప్రతీ ఒక్కరినీ పూచిక పుల్లతో తీసి పారేసిందని ప్రకాశం సీరియస్ అవుతాడు. ఆగు బాబాయ్ నవ్వు ఆవేశ పడకు.. పిన్నీ నువ్వు కంగారు పడి, భయ పడి.. అనామికను ఇంటికి తీసుకొస్తే.. ఈ ఇల్లు నాలుగు రోజుల్లో ముక్కలై పోతుంది. కళ్యాణ్‌ను మన నుంచి దూరంగా తీసుకెళ్లి పోతుందని రాజ్ అంటాడు.
కోర్టులో నోరు తెరవండి..
చిన్న అత్తయ్యా అనామిక ఏం ఆశించి ఇంత చేస్తుందో.. మీరు ఇంకా అర్థం చేసుకోకుండా మాట్లాడితే ఎలా? కవి గారెకి ఏ శిక్షా పడకుండా క్షేమంగా తీసుకురావాలని అందరం కోరుకుంటున్నాం. మీరు అపార్థాలతో అనామిక లాగే వేరు చేసి మాట్లాడకండి అని కావ్య అంటే.. నువ్వు మధ్యలో మాట్లాడకు కావ్యా.. మొత్తం నీ చెల్లి, నీ కుటుంబమే ఈ పరిస్థితికి కారణమని ధాన్య లక్ష్మి అంటుంది. సరే మేము అందరం వెళ్లి.. అనామిక ముందు తల దించుకుని తప్పు ఒప్పుకుంటాం. కవి గారెని వదిలేస్తుందా? మీరు వెళ్లి మీ ముద్దుల కోడలికి చెప్పండి.. వింటుందోమో చూద్దాం. అనామిక లాగ మీరు మా కుటుంబం ఆరోపణలు చేయకండని కావ్య అంటే.. ధాన్య లక్ష్మి ఎవరితో మాట్లాడుతున్నావ్?అర్థమవుతుందా అని అడుగుతుంది. అప్పుడే స్పప్న అందుకుంటుంది. మా కుటుంబంపై పడుతున్నారు? మీకు దమ్ము లేదా? ధైర్యం లేదా? కోడల్ని అదుపులో పెట్టుకోవడం చేత కాదా? ఊరి మీద వదిలేసి మా కుటుంబాన్ని అంటారేంటి? మీకు చేతనైతే కోర్టులో నోరు తెరవండి నోరు అని స్వప్న అంటుంది. ఇక ధాన్య లక్ష్మికి సర్ది చెప్తాడు రాజ్. ఇక ఇవాళ్టితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
ఇకపై నా కొడుకు వస్తాడు.. వారసుడిని రంగంలోకి దించిన లారెన్స్
ప్రముఖ కొరియోగ్రాఫర్, డైరెక్టర్, నటుడు రాఘవ లారెన్స్ గురించి సినీ జనాలకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తన సినిమాలతో అభిమానులను అలరిస్తోన్న ఈ హీరో కష్టాల్లో ఉన్న వారికి తనవంతుగా సాయం చేయడంలో ఎప్పుడూ ముందుంటాడు. ఇప్పటికే ఒక సేవా ట్రస్టును ఏర్పాటు చేసి ఎంతో మంది పిల్లలను చేరదీశాడీ రియల్ హీరో. గుండెజబ్బుతో బాధపడుతున్నఎంతో మంది చిన్నారులకు ఉచితంగా ఆపరేషన్లు చేయించాడు. ఈ మధ్యన పేదలకు ట్రాక్టర్లు, బైక్స్, ఆటోలు, తోపుడు బండ్లు, కుట్టు మిషన్లు అందజేసి తన గొప్ప మనసును చాటుకున్నాడు. అలాగే వికలాంగులకు ట్రై సైకిల్స్ ను కూడా అందజేశాడు. ఇలా చెప్పుకుంటూ పోతే లారెన్స్ చేస్తోన్న సేవా కార్యక్రమాలు చాలానే ఉన్నాయి. ఇక ఈ సంగతి పక్కన పెడితే తాజాగా లారెన్స్ తన కుమారునికి సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకున్నాడు. సాధారణంగా సినిమా సెలబ్రిటీలు తమ బిడ్డలను ఎప్పుడెప్పుడు ఇండస్ట్రీకి పరిచయం చేద్దామా? అని ఆలోచిస్తుంటారు. కానీ లారెన్స్ మాత్రం అందుకు భిన్నమైన నిర్ణయం తీసుకుని మరోసారి తన విశాల హృదయాన్ని చాటుకున్నాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
TOP 9 ET News: రోజుకు రూ.100 కోట్లు.. మొత్తంగా చూస్తే.. కుప్పలుగా కోట్లలో డబ్బులు
Telugu Indian Idol Season 3: తను నవ్వుతుంటే అలా చూస్తూ ఉండిపోతా.. ఇండియన్ ఐడల్ షోలో విజయ్ దేవరకొండ.
రౌడీ హీరో విజయ్ దేవరకొండకు యూత్‌లో ఉన్న ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. ముఖ్యంగా అమ్మాయల కలల రాకూమారుడు. ఇటీవలే ఫ్యామిలీ స్టార్ సినిమాతో ప్రేక్షకులను అలరించిన విజయ్.. తాజాగా కల్కి సినిమాలో అర్జునుడి పాత్రలో కనిపించాడు. భారీ అంచనాల మధ్య విడుదలైన కల్కి సినిమాలో అర్జునుడిగా గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇక ఇప్పుడు తన రాబోయే ప్రాజెక్ట్ షూటింగ్స్ లో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న విజయ్.. తాజాగా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో వస్తున్న తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3కి అతిథిగా వచ్చారు. ఇందుకు సంబంధించిన ప్రోమోను ఆహా రిలీజ్ చేసింది. తెలుగు ఇండియన్ ఐడల్ షో స్టేజ్ పై విజయ్ ఎప్పటిలాగే ఫుల్ సందడి చేసినట్లుగా తెలుస్తోంది.
అర్జున్ రెడ్డి బీజీఎంతో స్టేజ్ పైకి పవర్ ఫుల్ ఎంట్రీ ఇచ్చారు విజయ్ దేవరకొండ. ఆ వెంటనే సింగర్ కార్తీక్ మాట్లాడుతూ.. పండగలకు చేస్తారు సెలబ్రేషన్స్.. విజయ్ దేవరకొండ ఒక సెన్సెషన్ అంటూ హైప్ ఇచ్చాడు. దీంతో ఇది ఒరిజినల్ ఆ అని విజయ్ డౌట్ పడగా.. ప్రాపర్లీ డూప్లీకేటెడ్ ఒరిజినల్ ప్రో అంటూ ఫన్నీ కామెంట్ చేశాడు థమన్. ఆ తర్వాత కంటెస్టెంట్ అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇక ఆ తర్వాత ఓ లేడీ కంటెస్టెంట్ గురువు అంటూ చిన్నపిల్లాడిని స్టేజ్ పైకి తీసుకువచ్చారు. ఆ బాబుతో థమన్, కార్తీక్, విజయ్ దేవరకొండ కామెడీ చేసి క్రికెట్ ఆడారు. విజయ్ దేవరకొండ హీరో కాబట్టి గురూజీ అని పిలుస్తున్నా అంటూ ఆ చిన్నోడు చెప్పడం నవ్వులు పూయించింది. కాసేపు ఆ బాబుతో కలిసి క్రికెట్ ఆడగ్గా.. చిటింగ్ చేస్తూ ఆ బాబును ఆటపట్టించాడు థమన్.
ఇక ఆ తర్వాత స్కంద అనే కంటెస్టెంట్ విజయ్ దేవరకొండ నటించిన గీతా గోవిందం సినిమాలోని ఇంకేమ్ ఇంకేమ్ కావాలి సాంగ్ పడి మెప్పించాడు. ఆ తర్వాత స్టేజ్ పై తన తల్లి గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యాడు. ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ కూడా తన తల్లితో ఉన్న బాండింగ్ గుర్తుచేసుకున్నాడు. “దేవుడికి థాంక్స్ చెప్పాలి. మనకు అమ్మలను ఇచ్చినందుకు. మా అమ్మ నవ్వుతూ హ్యాపీగా ఉంటే నేను అన్ని పనులు ఆపేసి అలాగే చూస్తుంటాను” అని అన్నాడు. ఇక ఆ తర్వాత కేశవ్ అనే కంటెస్టెంట్ పాటకు ఫిదా అయిన కార్తిక్ అతడిని తన బ్యాండ్ లో జాయిన్ అవుతావా అంటూ ఆఫర్ ఇచ్చాడు. అలాగే తన పేరెంట్స్ వీడియో మెసేజ్ తెప్పించి సర్ ప్రైజ్ చేశాడు విజయ్. ఇక మరో కంటెంస్టెంట్ మణిశర్మ కంపోజ్ చేసిన పాటను అద్భుతంగా పాడడంతో వీడియో రికార్డ్ చేసి మణిశర్మకు పంపించారు మ్యూజిక్ డైరెక్టర్ థమన్. ఇండియన్ ఐడల్ షోలో విజయ్ దేవరకొండ సందడి చేయడంతో ప్రస్తుతం ఈ ప్రోమో వైరలవుతుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.