Home Blog Page 509

Tollywood: ఈ పాపను గుర్తు పట్టారా? టాలీవుడ్‌ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్.. ఈ బ్యూటీ అంటే కుర్రాళ్లకు పిచ్చి

0

Tollywood: ఈ పాపను గుర్తు పట్టారా? టాలీవుడ్‌ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్.. ఈ బ్యూటీ అంటే కుర్రాళ్లకు పిచ్చి

పై ఫొటోలో ఉన్న పాపను గుర్తు పట్టారా? సినిమాలు బాగా చూసేవారు పోలికలు చూసి గుర్తు పట్టవచ్చు.. ఈ పాప ఇప్పుడు టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. ఎంతలా అంటే.. గతేడాది ఈ సొగసరి ఏకంగా అరడజనుకు పైగా సినిమాల్లో నటించి మెప్పించింది. రవితేజ, రామ్ పోతినేని, మహేశ్ బాబు, వైష్ణవ్ తేజ్, నితిన్, బాలకృష్ణ వంటి స్టార్ హీరోల సినిమాల్లో తళుక్కుమంది. అందం, అభినయం విషయంలో ఈ క్యూటీకి ఏ మాత్రం వంక పెట్టలేం. ఇక డ్యాన్స్ విషయం అంటారా? ఇరగ దీస్తుందంతే. సాయి పల్లవికి గట్టి పోటీ ఇస్తోంది. అయితే ఆ మధ్యన వరుస పరాజయాలతో కాస్త గ్యాప్ తీసుకున్న ఈ అందాల తార మళ్లీ బిజీగా మారుతోంది. వరుసగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. ఇప్పుడు టాలీవుడ్ లోనే కాదు కోలీవుడ్, బాలీవుడ్ లోనూ పాగా వేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. మరి ఈ క్యూటీ ఎవరో ఈ పాటికే చాలా మందికి అర్థమై ఉంటుంది. యస్. ఆమె మరెవరో కాదు పెళ్లి సందడి తో కుర్రాళ్ల మనసులను కొల్ల గొట్టిన టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ శ్రీలీల. ఇది ఆమె చిన్న నాటి ఫొటో.

చేతిలో క్రేజీ ప్రాజెక్టులు..

గతేడాది ఏకంగా 4 సినిమాల్లో నటించింది శ్రీలీల. రామ్ పోతినేని స్కంద, వైష్ణవ్ తేజ్ ఆది కేశవ, నితిన్ ఎక్స్ ట్రార్డినరి మ్యాన్, బాలకృష్ణ భగవంత్ కేసరి సినిమాల్లో కనిపించింది. ఇందులో భగవంత్ కేసరి మాత్రమే విజయం సాధించింది. ఇక ఈ ఏడాది ప్రారంభంలో మహేశ్ బాబుతో కలిసి చేసిన గుంటూరు కారం సినిమా కూడా యావరేజ్ గానే నిలిచింది. దీంతో కొద్దిగా గ్యాప్ తీసుకుందీ అందాల తార.
ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్, నితిన్ రాబిన్ హుడ్, రవితేజ RT 75 (వర్కింగ్ టైటిల్) వంటి క్రేజీ ప్రాజెక్టులున్నాయి.

శ్రీలీల లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ ఫొటోస్..

 

View this post on Instagram

 

A post shared by Sreeleela (@sreeleela14)

సాగర తీరాన శ్రీలీల..

 

View this post on Instagram

 

A post shared by Sreeleela (@sreeleela14)

ట్రెడిషినల్ డ్రెస్ లో శ్రీలీల..

 

View this post on Instagram

 

A post shared by Sreeleela (@sreeleela14)

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

Srikanth OTT: ఇట్స్ అఫీషియల్.. మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి IMDB టాప్ రేటింగ్ మూవీ.. ఎందులో చూడొచ్చంటే?

0

బాలీవుడ్ నటుడు రాజ్‌కుమార్ రావ్ నటించిన సినిమా శ్రీకాంత్. తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, బొల్లాంట్‌ ఇండస్ట్రీస్‌ వ్యవస్థాపకుడు శ్రీకాంత్‌ బొల్లా జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తుషార్ హీరానందానీ తెరకెక్కించిన ఈ బయోపిక్ లో సీనియర్ నటి జ్యోతిక, అలయా ఎఫ్, శరద్ కేల్కర్ కూడా ముఖ్యమైన పాత్రలు పోషించారు. సుమారు రెండు నెలల క్రితం థియేటర్లలో ( మే10) రిలీజైన ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ముఖ్యంగా దృష్టి లోపం కారణంగా ఎన్నో సవాళ్లను ఎదుర్కొని తన కలల్ని సాకారం చేసుకున్న శ్రీకాంత్ బొల్లా పాత్రలో రాజ్ కుమార్ రావ్ నటించాడనే బదులు జీవించాడనే చెప్పుకోవచ్చు. రేటింగ్‌ పరంగా కూడా ఈ సినిమాకు భారీగా రెస్పాన్స్‌ వచ్చింది. IMDb 7.9 రేటింగ్‌తో ఈ చిత్రం సెన్సేషన్ క్రియేట్‌ చేసింది. బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఓ మోస్తరు వసూళ్లను సాధించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. శ్రీకాంత్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం (జులై 5) నుంచి ఈ బయోపిక్ స్ట్రీమింగ్ కానుంది. అంటే మరికొన్ని గంటల్లోనే శ్రీకాంత్ సినిమా ఓటీటీలోకి రాబోతోంది. ఈ విషయాన్ని నెట్‌ ఫ్లిక్స్ సంస్థ అధికారికంగా ప్రకటించింది.

భూషణ్‌ కుమార్‌, నిధి పర్మార్‌ సంయుక్తంగా శ్రీకాంత్ నిర్మించారు. ఇక సినిమా కథ విషయానికి వస్తే.. బొల్లాంట్‌ ఇండస్ట్రీస్‌ వ్యవస్థాపకుడు శ్రీకాంత్‌ బొల్లా జీవిత కథను కళ్లకు కట్టినట్లు ఈ సినిమాలో చూపించారు. మచిలీపట్నం దగ్గర సీతారామపురంలో పుట్టి పెరిగిన శ్రీకాంత్ చిన్నప్పుడే కంటిచూపు కోల్పోయారు. స్కూల్ డేస్ నుంచి అవమానాలను ఎదుర్కొన్న శ్రీకాంత్ అమెరికాలోని MIT నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన తొలి అంతర్జాతీయ అంధ విద్యార్థిగా చరిత్రకెక్కాడు. తన చదువుకు తగ్గట్టుగా అమెరికా లాంటి అగ్ర దేశాల్లో ఉద్యోగవకాశం వచ్చినా తన సొంత గడ్డపైనే ఆవిష్కరణలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా 2012లో శ్రీకాంత్ పర్యావరణహిత వస్తువులు తయారు చేసే బొల్లాంట్ ఇండస్ట్రీస్ స్థాపించారు. థియేటర్లలో శ్రీకాంత్ సినిమాను మిస్ అయ్యారా? అయితే ఎంచెక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి

ఇవి కూడా చదవండి

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Mirzapur 3 OTT: మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి మీర్జాపూర్ 3.. ఎక్కడ స్ట్రీమింగ్ కానుందంటే..

0

Mirzapur 3 OTT: మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి మీర్జాపూర్ 3.. ఎక్కడ స్ట్రీమింగ్ కానుందంటే..

ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో సంచలనం సృష్టించిన వెబ్ సిరీస్ లలో మీర్జాపూర్ ఒకటి. ఈ సిరీస్ కు అన్ని వర్గాల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. క్రైమ్ యాక్షన్ నేపథ్యంలో వచ్చిన ఈ సిరీస్ కు యూత్ ఎక్కువగా అట్రాక్ట్ అయ్యారు. ఇప్పటివరకు వచ్చిన మీర్జాపూర్ రెండు సీజన్స్ సూపర్ హిట్ అయ్యాయి. ఇక ఇప్పుడు మూడో సీజన్ రాబోతుంది. అలీ ఫజల్, పంకజ్ త్రిపాఠి, విజయ్ వర్మ, శ్వేతా త్రిపాఠి, పంకజ్ త్రిపాఠి ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్ ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. గతంలో విజయాలను అందుకున్న రెండు సీజన్ల మాదిరిగానే ఇప్పుడు మూడో సీజన్ లోనూ ఎలాంటి ట్విస్టులు ఉండనున్నాయో అని అడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు మరికొన్ని గంటల్లో మీర్జాపూర్ 3 స్ట్రీమింగ్ కానుంది.

ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో జూలై 5న అర్ధరాత్రి 12 గంటల నుంచి ఈసిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఈసారి సీజన్ 3లో మొత్తం పది ఎపిసోడ్స్ ఉంటాయని తెలుస్తోంది. అలాగే ఈసారి పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్, విజయ్ వర్మ, శ్వేతా త్రిపాఠి, రసిక దుగ్గల్, రాజేష్ తైలాంగ్, షీబా చద్దా, ఇషా తల్వార్ వంటి తారలు ఈ సిరీస్‌లో ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. మీర్జాపూర్ మొదటి సీజన్ 2018లో విడుదలైంది. రిలీజ్ అయిన వెంటనే ఈ సిరీస్ సూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత 2020లో వచ్చిన రెండవ సీజన్ కూడా మంచి విజయాన్ని అందుకుంది.

సీజన్ 2 ప్రేక్షకులను ఎమోషనల్ గా కట్టిపడేసింది. గన్స్, డ్రగ్స్ మాఫియా చుట్టూ ఈ సిరీస్ కథ తిరుగుతుంది. మీర్జాపూర్ మొత్తం కాలీన్ భాయ్ (పంకజ్ త్రిపాఠి) చేతిలో ఉడంగా.. అక్కడి మాఫియా సామ్రాజ్యానికి అతడే మహారాజు. కాలీన్ భాయ్ కొడుకు మున్నా భాయ్ (దివ్యేంద్) ఓ పెళ్లి కొడుకును కాల్చి చంపేస్తాడు. ఆ కేసును లాయర్ రమాకాంత్ పండిత్ (రాజేశ్ తైలాంగ్ ) వాధిస్తాడు. కొడుకును కాపాడుకునేందుకు కాలీన్ భాయ్ భారీ ప్లాన్ వేస్తాడు. రెండవ సీజన్ ముగింపులో కాలీన్ భాయ్ కొడుకు హత్యకు గురవుతాడు. ఇప్పుడు మున్నా భయ్యా పాత్ర కొత్త సీజన్‌లో కనిపించదు. షో కథ అలీ ఫజల్, పంకజ్ త్రిపాఠి చుట్టూ తిరుగుతుంది.

 

View this post on Instagram

 

A post shared by prime video IN (@primevideoin)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Athulya Ravi: హీరోయిన్ అతుల్య రవి ఇంట్లో చోరీ.. పనిమనిషిని అరెస్ట్ చేసిన పోలీసులు..

0

తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన హీరోయిన్ అతుల్య రవి. యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన మీటర్ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన ఈ బ్యూటీ ఆ తర్వాత మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు. 2017లో కాదల్ ఖాన్ కటుటే సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత ఏమాలి, నాదోడిది 2 వంటి పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే అందం, అభినయంతో ఆకట్టుకున్న అతుల్య రవికి అంతగా అవకాశాలు మాత్రం రావడం లేదు. మీటర్ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశపరచడంతో తెలుగులో మరో ఆఫర్ అందుకోలేదు. ప్రస్తుతం అతుల్య రవి తన తల్లి విజయలక్ష్మితో కలిసి కోయంబత్తూరులోని వాడవల్లి మారుతం రోడ్డులో నివసిస్తుంది. తాజాగా ఈ హీరోయి ఇంట్లో చోరీ జరిగినట్లు సమాచారం. కొద్దిరోజుల క్రితం హీరోయిన్ పాస్ పోర్టుతోపాటు రూ.2000 దొంగిలించినట్లు తెలుస్తోంది. చాలా రోజులుగా ఇంట్లో తన పాస్ పోర్టుతోపాటు డబ్బులు కూడా కనిపించడం లేదంటూ పోలీసులను ఆశ్రయించారు.

అతుల్య రవి తల్లి విజయలక్ష్మి వాడవల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. ఇంట్లో పనిచేసే పనిమనిషి చోరికి పాల్పడినట్లు తెలిసింది. తొండముత్తూరు పక్కనే ఉన్న కులత్తుపాలేనికి చెందిన మహిళ(46) కొన్నాళ్లుగా అతుల్య రవి ఇంట్లో పనిచేస్తున్నారు. ఇంట్లో చోరీ జరిగినట్లు అతుల్య రవి తల్లి ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు స్టార్ట్ చేసిన పోలీసులు పనిమనిషిపై అనుమానం వ్యక్తం చేశారు. దీంతో సదరు మహిళను విచారించగా అసలు విషయం బయటకు వచ్చింది.

తన స్నేహితురాలు సెల్వి, సుభాషిణితో కలిసి హీరోయిన్ ఇంట్లో దొంగతనం చేశామని.. డబ్బు, పాస్ పోర్టు దొంగించినట్లు తెలిపారు. పనిమనిషితోపాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద నుంచి రూ.1500 స్వాధీనం చేసుకున్నారు. ఇంకా పాస్ పోర్టు ఎక్కడ దాచిపెట్టారు అనే విషయాలు తెలియరాలేదు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Bigg Boss Season 8 Telugu: బిగ్‏బాస్ సీజన్ 8కు సర్వం సిద్ధం.. కంటెస్టెంట్స్ రెడీ.. ఎప్పుడు స్టార్ట్ కానుందంటే..

0

బుల్లితెరపై అత్యంత క్రేజ్ ఉన్న రియాల్టీ షో బిగ్‏బాస్. భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల్లోనూ ఈ షో విజయవంతంగా రన్ అవుతుంది. హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం భాషలలో ఈ షోకు ప్రత్యేక అభిమానులు ఉన్నారు. దాదాపు మూడు నెలలపాటు నడిచే ఈ రియాల్టీ షో గురించి నిత్యం ఏదోక న్యూస్ నెట్టింట వైరలవుతుంటుంది. ఇక ఇందులోకి ఎంటరయ్యే పోటీదారుల గురించి తెలుసుకోవడానికి నెటిజన్స్ తెగ ఆసక్తి చూపిస్తుంటారు. హిందీలో ప్రస్తుతం బిగ్‏బాస్ ఓటీటీ సీజన్ 3 నడుస్తుండగా.. త్వరలోనే తెలుగులో సీజన్ 8 స్టార్ట్ కానుంది. ఇప్పటివరకు తెలుగులో నడిచిన అన్ని సీజన్లలో ది వరస్ట్ సీజన్ అంటే బిగ్‏బాస్ సీజన్ 6. జనాలకు ముక్కు మొఖం తెలియని కంటెస్టెంట్స్ తీసుకువచ్చి తలకు చేతులుకు పెట్టుకున్నారు మేకర్స్. సీజన్ 6 అట్టర్ ప్లాప్ కావడంతో సీజన్ 7 మరింత ఫోకస్ పెట్టి కంటెస్టెంట్స్ ఎంపిక చేయగా.. సూపర్ సక్సెస్ అయ్యింది.

బిగ్‏బాస్ కంటెస్టెంట్స్‌కు విపరీతమైన అభిమానులు ఉంటారు. గతంలో ఒకరి ఫ్యాన్స్ ఒకరిపై దాడికి పాల్పడిన సందర్భాలు ఉన్నాయి. అలాగే బిగ్‏బాస్ విజేతపై పలు కేసులు కూడా నమోదయ్యాయి. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు బిగ్‏బాస్ సీజన్ 8 రాబోతుంది. ఈసారి ఈ షోను కాస్త ముందుగానే ప్రారంభించేందుకు రెడీ అయ్యారు మేకర్స్. తాజా సమాచారం ప్రకారం ఆగస్ట్ 4న బిగ్‏బాస్ సీజన్8 స్టార్ట్ కానుందని తెలుస్తోంది. అలాగే ఈసారి షోలో అడుగుపెట్టే కంటెస్టెంట్స్ కూడా ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది.

కుమారి ఆంటీతోపాటు సోషల్ మీడియాలో ఫేమస్ అయిన బర్రెలక్క, అమృత ప్రణయ్, అలాగే యూట్యూబర్ నేత్ర, మోటివేషనల్ స్పికర్ వంశీ బిగ్‏బాస్ హౌస్ లో అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. అలాగే బుల్లితెరపై సీరియల్స్ ద్వారా ఫేమస్ అయిన నటీనటులు కూడా ఉండనున్నట్లు తెలుస్తోంది. బ్రహ్మమూడి ఫేమ్ కావ్య కూడా ఈ సారి హౌస్ లోకి రానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Film News: వెంకీమామకి జోడిగా ఆ క్రేజీ హీరోయిన్ .. నయా టెక్నాలజీతో శంకర్..!

0

Tollywood: ద్యావుడా.. ఈ అమ్మాయి ఆ స్టార్ హీరోయినా..? ఇప్పుడు అబ్బాయిల హాట్ ఫేవరేట్ ఈ బ్యూటీ..

0

తెలుగు ప్రేక్షకులకు ఒక్కసారి ఇష్టపడ్డారంటే గుండెల్లో పెట్టుకుని ఆరాధిస్తుంటారు. ఒక్క సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో క్లిక్ అయితే చాలా సోషల్ మీడియాలో ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోతుంది. తొలి సినిమాతోనే ఫుల్ క్రేజ్ సొంతం చేసుకుని.. అందం, అభినయంతో యూత్ ఫేవరేట్ హీరోయిన్ గా నిలిచిపోతారు. సినిమాలు తగ్గినా ఆ హీరోయిన్ క్రేజ్ మాత్రం అస్సలు తగ్గదు. అందులోనూ ఈ అమ్మాయి ఒకరు. తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది. ఇప్పుడిప్పుడే టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డమ్ అడుగులు వేస్తున్న హీరోయిన్. ప్రస్తుతం ఈ బ్యూటీకి సంబంధించిన స్కూల్ డేస్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరలవుతుంది. పైన ఫోటోను చూస్తున్నారు కదా.. అందులో కనిపిస్తున్న ఆ అమ్మాయి ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్. ఒక్క సినిమాతో ఓ రేంజ్ ఫాలోయింగ్ అందుకుంది. తెలుగు ప్రేక్షకులకు చాలా ఇష్టమైన కేరళ కుట్టి. యాక్టింగ్ మాత్రమే కాకుండా నాట్యమయూరి కూడా. ఇక ఇన్ స్టాలో ఈ అమ్మాడి క్రేజ్ చూస్తే మతిపోవాల్సిందే. ఆమె మరెవరో కాదండి.. హీరోయిన్ అనంతిక సనీల్ కుమార్.

2022లో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. రాజమండ్రి రోజ్ మిల్క్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ మూవీ అంతగా హిట్ కాలేదు. అనంతికకు గుర్తింపు కూడా రాలేదు. కానీ ఇటీవల సూపర్ హిట్ అయిన మ్యాడ్ మూవీతో ఈ అమ్మాడి క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ సినిమాలో అందం, అభినయంతో యువతను కట్టిపడేసింది. దీంతో యూత్ లో మంచి ఫాలోయింగ్ వచ్చింది. ముఖ్యంగా అబ్బాయిల హృదయాల్లో స్థానం సంపాదించుకుంది. ఇక ఆ తర్వాత రజినీకాంత్ నటించిన లాల్ సలామ్ మూవీలో కనిపించింది. ఇందులో ఆమె విష్ణు విశాల్ జోడిగా కనిపించింది.

ప్రస్తుతం డైరెక్టర్ ఫణింద్ర నర్సెట్టి రూపొందిస్తున్న 8 వసంతాలు చిత్రంలో నటిస్తుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంటుంది. అనంతిక సనీల్ కుమార్ 2000లో జన్మించింది. విక్రమ్ ప్రభు తెరకెక్కించిన రైడ్ సినిమాతో కెరీర్ ప్రారంభించింది. ప్రస్తుతం అనంతికకు ఇన్ స్టాలో 857K ఫాలోవర్స్ ఉన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Movie Upadates: కల్కిదుమ్మురేపే రికార్డ్స్.. గేమ్ ఛేంజర్ రిలీజ్ అప్పుడే..

0

Chandrabose: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చంద్ర బోస్.. రూ. 36 లక్షలతో సొంతూరికి ఏం చేశారో తెలుసా?

0

ప్రముఖ సినీ గేయ రచయిత కనుకుంట్ల సుభాస్ చంద్రబోస్ గొప్ప మనసును చాటుకున్నారు. గతంలో తాను ఇచ్చిన ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ తన సొంతూరులో ఓ మంచి పని చేసి అందరి మన్ననలు అందుకుంటున్నారు. అదేంటంటే.. తన సాహిత్యంతో తెలుగు సినిమా ఇండస్ట్రీపై చెరగని ముద్ర వేసిన చంద్రబోస్ ఆర్ఆర్ఆర్ మూవీలో ఆయన రాసిన నాటు నాటు పాటకు ఆస్కార్ పురస్కారం అందుకున్నారు. ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు వచ్చిన సమయంలో చంద్ర బోస్ తన సొంతూరు అయిన జయశంకర్ భూపాల పల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగెలోని గ్రామ ప్రజలు ఆయనను ఘనంగా సన్మానించారు. చల్లగరిగె ప్రజలు తనపై చూపిన ప్రేమాభిమానాలకు ముగ్ధుడైన ఆయన అక్కడ ఆస్కార్ గ్రంథాలయం ఏర్పాటు చేస్తామని మాటిచ్చాడు. ఇప్పుడు ఆ మాటను నిలబెట్టుకున్నారాయన. గ్రామంలో ఇది వరకు ఉన్న పాత గ్రంథాలయాన్ని తొలగించి రూ.36 లక్షలతో కొత్త భవనాన్ని చంద్రబోస్ నిర్మించారు. గురువారం (జులై 04)న ఈ ఆస్కార్ గ్రంథాయాన్ని ప్రారంభించనున్నారు. భూపాలపల్ల ఎమ్మెల్యే గండ్ర త్యనారాయణరావు, చంద్రబోస్‌ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగనుంది.

కాగా మొత్తం రెండు అంతస్థులతో సకల సౌకర్యాలతో ఆస్కార్ గ్రంథాయలయాన్ని నిర్మించారు చంద్ర బోస్. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు అవసరమయ్యే అన్ని రకాల పుస్తకాలను ఈ గ్రంథాలయంలో ఏర్పాటు చేయనున్నారు. ‘చల్ల గరిగె గ్రామస్థులకు ఇచ్చిన మాట ప్రకారం సరస్వతి గుడిని నిర్మించాను. ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. నేను చల్లగరిగలోని నా ఇంటి పక్కన ఉన్న గ్రంథాలయంలో ఎన్నో సాహిత్య పుస్తకాలు చదివాను. వాటి వల్లే నేను ఉన్నతస్థాయికి ఎదిగాను’ అని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు చంద్ర బోస్. కాగా తన సాహిత్యంతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి సుమారు 30 ఏళ్లుగా సేవలందిస్తున్నారాయన. ఇప్పటివరకు సుమారు 860 సినిమాల్లో 3600కి పాటలు రాశారు. ఆర్‌ఆర్‌ఆర్‌లోని నాటు నాటు పాటకు ఏకంగా ఆస్కార్ పురస్కారం అందుకున్నారు. అంతకు ముందు కొండ పొలం సినిమాలోని ధమ్ ధమ్ ధమ్ పాటకు ఉత్తమ గీత రచయితగా జాతీయ అవార్డును అందుకున్నారు.

ఇవి కూడా చదవండి

ఆస్కార్ అవార్డుతో చంద్ర బోస్..

సైమా ఉత్సవాల్లో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Naga Chaitanya: రిటైర్‌ అయ్యాక ఆ ఊరు వెళ్లిసెటిల్‌ అంటున్న నాగచైతన్య !!

0

చెన్నై, హైదరాబాద్‌ గుర్తుకురాగానే దోశ కీమా, దోశ చికెన్‌ కర్రీ, దోశ మటన్‌ కర్రీ గుర్తుకొస్తుందని, నార్త్ కి వెళ్లినప్పుడు ఈ డిషెస్‌ని మిస్‌ అవుతానని అన్నారు చైతన్య. ఎన్ని మిస్‌ అయినా సరే, రిటైర్‌ అయ్యాక మాత్రం గోవాలోనే సెటిల్‌ అవుతానని అంటున్నారు మిస్టర్‌ చైతూ అక్కినేని.