Home Blog Page 507

Nandamuri Mokshagna:బాలయ్య కుమారుడి సినిమాకు డైరెక్టర్ ఫిక్స్.. స్వయంగా ట్వీట్ చేసిన మోక్షు.. ఫ్యాన్స్ కు పండగే

0

నందమూరి అభిమానులకు పండగ లాంటి వార్త. నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ తేజ సినిమా ఎంట్రీకి రంగం సిద్ధమైంది. ఇందుకోసం ఇప్పటికే స్లిమ్ గా, స్టైలిష్ గా తయారయ్యాడు మోక్షు. అంతేకాదు తన డెబ్యూపై సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అప్ డేట్స్ ఇస్తూనే ఉన్నాడు. ఇటీవల తన స్టైలిష్ లుక్ కు సంబంధించిన ఫొటోలు షేర్ చేసిన మోక్షు.. ‘వస్తున్నా.. మీ అందరి ఆశీస్సులు కావాలి’ ఒక పోస్టు చేశాడు. ఇప్పుడు వరుసగా మరో రెండు పోస్టులు షేర్ చేశాడు. ‘ఊహించనిది ఊహించండి.. ప్రశాంత్‌ వర్మతో’ అని ఒక ట్వీట్‌ చేశాడు. అలాగే మరో పోస్ట్ లో.. ‘ఈ సంవత్సరం బాలకృష్ణ ఎన్‌బీకే 109, ఎన్టీఆర్‌ దేవర, మోక్షు అరంగేట్రం. నందమూరి నామ సంవత్సరం’ అంటూ అభివర్ణించాడు. సో.. మొత్తానికి మోక్షజ్ఞ ఎంట్రీ ఫిక్స్ అయ్యిందన్న మాట. అది కూడా హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా రేంజ్‌ లో ఫేమస్ అయి పోయిన ప్రశాంత్ వర్మతో. ప్రస్తుతం ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ గా మారింది. దీనిని చూసిన నందమూరి అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. హనుమాన్ సినిమాతో తేజ సజ్జాను పాన్ ఇండియా హీరోగా మార్చిన ప్రశాంత్ వర్మ బాలయ్య వారసుడిని ఏ విధంగా చూపిస్తాడోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

కాగా బాలకృష్ణ- ప్రశాంత్ వర్మల మధ్య మంచి అనుబంధం ఉంది. బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరించిన ఆహా అన్ స్టాపబుల్ షోకు ప్రశాంత్ వర్మనే డైరెక్టర్ గా వ్యవహరించారు. అప్పటి నుంచే వీరిద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. ఈ ర్యాపో కారణంగానే తన ‘హనుమాన్’ సినిమా విడుదలయిన తర్వాత బాలయ్య కోసం ఒక స్పెషల్ స్క్రీనింగ్‌ను ఏర్పాటు చేశారు ప్రశాంత్ వర్మ. దీనిని చూసిన బాలయ్య కుర్ర డైరెక్టర్ ట్యాలెంట్ పై ప్రశంసల వర్షం కురిపించారు. అందుకే మోక్షజ్ఞ ఎంట్రీ బాధ్యతలను కూడా ప్రశాంత్ వర్మ చేతుల్లోనే పెట్టాడని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మోక్షు చెప్పినట్లు ఈ ఏడాది నందమూరి నామ సంవత్సరమే అని చెప్పుకోవచ్చు. నందమూరి బాలయ్య- బాబీ డైరెక్షన్ లో వస్తోన్న ఎన్‌బీకే 109, ఎన్టీఆర్ దేవర సినిమాలు కూడా ఈ ఏడాదే రిలీజవుతున్నాయి. మొత్తానికి ఈ ఏడాది నందమూరి ఫ్యాన్స్ కు పండగే.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Nagendran’s Honeymoon OTT: ఐదుగురు భార్యలతో హానీమూన్.. తెలుగులో స్ట్రీమింగ్ కానున్న మలయాళీ వెబ్ సిరీస్..

0

Nagendran’s Honeymoon OTT: ఐదుగురు భార్యలతో హానీమూన్.. తెలుగులో స్ట్రీమింగ్ కానున్న మలయాళీ వెబ్ సిరీస్..

ఇటీవల బాక్సాఫీస్ వద్ద మలయాళీ చిత్రాలు సూపర్ హిట్ అవుతున్నాయి. స్టార్ హీరోహీరోయిన్స్, భారీ బడ్జెట్ సినిమాలు కాకుండా విభిన్నమైన కంటెంట్ కథలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అతి తక్కువ బడ్జెట్ తో నిర్మించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్నాయి. ప్రేమలు, మంజుమ్మల్ బాయ్స్, భ్రమయుగం, ఆవేశం, ఆడు జీవితం వంటి చిత్రాలు సౌత్ ఇండియాలో అత్యధిక వసూళ్లు రాబట్టాయి. ఈ చిత్రాలన్నింటిని తిరిగి తెలుగు, తమిళం, కన్నడ భాషలలోనూ విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ అడియన్స్ ముందుకు రాబోతుంది. డిఫరెంట్ పాయింట్ తీసుకుని ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా రూపొందించి సక్సెస్ అవుతున్నారు డైరెక్టర్. అందులో నాగేంద్రన్స్ హానీమూన్ ఒకటి.

నేషనల్ అవార్డ్ విన్నర్ సూరజ్ వెంజరమూడ్ ప్రధాన పాత్రలో నటించిన మలయాళీ వెబ్ సిరీస్ నాగేంద్రన్స్ హానీమూన్. ఒక జీవితం ఐదుగురు భార్యలు అనేది ఉపశీర్షిక. ఇప్పటికే విడుదలైన టైటిల్ పోస్టర్ ఆసక్తిని కలిగించింది. అలాగే ఇటీవల ఈ వెబ్ సిరీస్ టీజర్ కూడా విడుదల చేయగా.. ప్రేక్షకులలో క్యూరియాసిటీని కలిగించింది. ఇక ఇప్పుడు నాగేంద్రన్స్ హానీమూన్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది.

ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఆగస్ట్ 17 నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ చేయనున్నారు. మలయాళంతోపాటు తెలుగు, తమిళం, ఇతర భాషలలో కూడా రిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది. ఈ వెబ్ సిరీస్ లో గ్రేస్ ఆంటోని, కని కుశృతి, శ్వేత మీనన్, ఆల్పీ పంజికరణ్, నిరంజన అనూప్ కీలకపాత్రలు పోషించారు. డైరెక్టర్ రెంజీ ఫణిక్కర్ దర్శక్తవం వహించిన కామెడీ వెబ్ సిరీస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Kalki 2898 AD Box Office Collections: బాక్సాఫీస్ వద్ద కల్కి ఊచకోత.. 9 రోజుల్లో ఎంత కలెక్షన్స్ వచ్చాయంటే..

0

“టిప్పర్ లారీ వెళ్లి స్కూటర్ ని గుద్దితే ఎలా ఉంటదో తెలుసా ?”.. రెబల్ స్టార్ ప్రభాస్ బాక్సాఫీస్ వార్‏కి దిగితే ఇదిలా అలాగే ఉంటుంది మరి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ‘కల్కి 2898 AD’ బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టిస్తోంది. వరల్డ్ వైడ్ ఈ మూవీ కలెక్షన్ల సునామీ చూస్తుంటే.. ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన టాప్-5 చిత్రాలలో ఒకటిగా నిలుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం ‘కల్కి’ సినిమాకి బాక్సాఫీస్ దగ్గర ఎదురే లేదన్నట్టుగా ఉంది. మొదటి రోజే సినిమాకి పాజిటివ్ టాక్ రావడం, ఇతర సినిమాల నుంచి పోటీ లేకపోవడంతో.. పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తోంది. ‘కల్కి’ మూవీ వారం రోజుల్లోనే ‘బాహుబలి’ లైఫ్ టైం కలెక్షన్స్ ని దాటేసింది. ‘బాహుబలి-1′ ఫుల్ రన్ లో రూ.600 కోట్ల గ్రాస్ రాబట్టగా.. కల్కి’ కేవలం ఆరు రోజుల్లోనే ఈ ఫీట్ సాధించి, టాలీవుడ్ హిస్టరీలో హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన నాలుగో సినిమాగా నిలిచింది. ఇక ఇప్పుడు రూ.800 కోట్లకు పైగా వసూల్లు రాబట్టింది. ఈ సినిమా రెండో శుక్రవారం అంటే నిన్నటికి రూ.19.7 కోట్లు కలెక్ట్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

నిన్న ఒక్కరోజే కల్కి సినిమాకు తెలుగు నుంచి రూ.5.4 కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది. అలాగే తమిళం, మలయాళం, కన్నడ, భాషల నుంచి భారీగానే కలెక్షన్స్ వచ్చినట్లు సమాచారం. విడుదలైన 9 రోజుల్లోనే ఇండియాలో రూ.431.55 కోట్లు వసూలు చేసినట్లు గణాంకాలు చెబుతున్నారు. ఇందులో తెలుగులో 24.1 కోట్లు, హిందీ నుంచి రూ.171.9 కోట్లు, కన్నడ నుంచి 3 కోట్లు, మలయాళం నుంచి 14.9 కోట్లుగా ఉన్నాయి. మొత్తం ప్రపంచవ్యాప్తంగా తొమ్మిది రోజుల కలెక్షన్స్ రూ.800 కోట్లు వచ్చినట్లుగా చిత్రయూనిట్ పోస్టర్ రిలీజ్ చేసింది. ఇక ఆ తరువాతి టార్గెట్ రూ.1300 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి, రెండో స్థానంలో ఉన్న ‘ఆర్ఆర్ఆర్’ అవుతుంది.

దీనిని కూడా దాటేయడం ‘కల్కి’కి పెద్ద కష్టమేమి కాదు. ప్రస్తుతం ‘కల్కి’ జోరు చూస్తుంటే.. రెండు వారాలు పూర్తయ్యే సరికి రూ.1000 కోట్ల క్లబ్ లో చేరే అవకాశముంది. ఇక శని, ఆదివారాలు వీకెండ్స్ లో కల్కి కలెక్షన్స్ మరింత పెరగనున్నాయి. ఆ దెబ్బకి.. మూడు వారాల్లోనే ‘ఆర్ఆర్ఆర్’ లైఫ్ టైం కలెక్షన్స్ ని ‘కల్కి’ దాటే అవకాశముంది. అదే జరిగితే, తెలుగు సినిమాల పరంగా రూ.1800 కోట్ల గ్రాస్ తో ‘బాహుబలి-2’ టాప్ లో ఉండగా.. రూ.1400 కోట్లకు పైగా గ్రాస్ తో ‘కల్కి’ సెకండ్ ప్లేస్ లోకి వస్తుంది. ఇక ఇండియన్ సినిమాల పరంగా చూస్తే.. మొదటి రెండు స్థానాల్లో ‘దంగల్’, ‘బాహుబలి-2’ ఉండగా.. ‘కల్కి’ మూడో స్థానంలో నిలుస్తుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Raviteja: లేటు వయసులో మాస్‌ మహరాజ్‌ రొమాన్స్‌

0

Tollywood News: 100 కోట్ల బడ్జెట్ తో మీడియం రేంజ్ హీరోల సినిమాలు

0

Balakrishna: హీరోయిన్ రిసెప్షన్.. బాలయ్య ఫన్నీ మూమెంట్

0

కోలీవుడ్ నటి వరలక్ష్మి శరత్ కుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. హీరోయిన్‏గా సినీరంగంలోకి అడుగుపెట్టిన వరలక్ష్మి.. ఆ తర్వాత పవర్ ఫుల్ లేడీ విలన్ గా మారింది. హీరోయిన్ రోల్స్ పక్కన పెట్టి విలన్ పాత్రలతో అదరగొట్టేస్తోంది. ఎలాంటి పాత్రలలోనై తన యాక్టింగ్, మేనరిజంతో మెప్పిస్తుంది. తమిళంలోనే కాకుండా తెలుగులోనూ అనేక సూపర్ హిట్ చిత్రాల్లో కీలకపాత్రలు పోషించింది. తాజాగా వరలక్ష్మి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. ముంబైకి చెందిన ఆర్ట్ గ్యాలరిస్ట్ నికోలయ్ సచ్‏దేవ్ ను వివాహం చేసుకుంది. థాయ్ లాండ్ వేదికగా జూలై 2న వీరి వివాహం జరిగింది. తాజాగా చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేయగా.. సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై సందడి చేశారు. టాలీవుడ్, కోలీవుడ్ సినీ నటీనటులు ఈ రిసెప్షన్ లో సందడి చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక వరలక్ష్మి శరత్ కుమార్, నికోలయ్ సచ్ దేవ్ రిసెప్షన్ వేడులకు తమిళనాడు సీఎం స్టాలిన్ విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు. అలాగే నందమూరి బాలకృష్ణ, వెంకటేశ్, శోభన, రజినీకాంత్, సిద్ధార్థ్, ఖుష్బూ, మంచి లక్ష్మి, సందీప్ కిషన్ సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. అందులోనూ శోభన, ఖుష్బూ సెల్ఫీలో బాలయ్య వెనక ఫన్నీగా భరత నాట్యం చేస్తున్నట్టు ఫోజ్ ఇవ్వడం నెట్టింట అందర్నీ ఆకట్టుకుంటోది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Manamey: OTT స్ట్రీమింగ్‌కు సిద్దమైన మనమే !! ఎప్పుడంటే ??

Maharaja: గుడ్ న్యూస్ OTTలోకి వచ్చేస్తోన్న మహరాజా…

TOP 9 ET News: ప్రభాస్ పేరుతో మోసం..అవి అస్సలు నమ్మకండి

ఒక వైపు సినిమాలు.. మరో వైపు టిఫిన్ బండి నడుపుతూ.. ఈ నటిని గుర్తుపట్టారా..?

0

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ఎంతో కష్టపడి వచ్చిన వారు ఉన్నారు. కృష్ణానగర్ రోడ్ల పై అవకాశాల కోసం చెప్పులు అరిగేలా తిరిగిన వారు వందలు, వేలల్లో ఉన్నారు. ఒక్క అవకాశం దొరికితే తమ టాలెంట్ ను నిరూపించుకొని నటులుగా మారాలని చూస్తుంటారు. అలా మారిన వారు చాలా మందే ఉన్నారు. అయితే కొంతమంది మాత్రం సినిమాల్లో నటించిన తర్వాత ఇప్పుడు అవకాశాలు లేక ఎదో ఒక ఉపాధి వెతుక్కొని జీవనం సాగిస్తున్నారు. సినిమా అవకాశాలు తగ్గడం.. ఆర్ధిక సమస్యలు పెరగడంతో చాలా మంది ఇలా ఇతర పనులు చేసుకుంటున్నారు. అయితే తాజాగా ఓ నటి రోడ్డు పై టిఫిన్ బండి నడుపుతూ కనిపించారు. ఆమె ఎవరో గుర్తుపట్టారా.? చాలా సినిమాల్లో నటించారు ఆమె .

ఆమె చాలా సినిమాల్లో నటించారు. అలాగే యాంకర్ గానూ చేశారు. అలాగే సీరియల్స్ లోనూ నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఇలా టిఫిన్ బండి నడుపుతూ కనిపించడంతో అందరూ షాక్ అవుతున్నారు. ఆమె పేరు గీత. నల్లగొండ జిల్లాలోని నకిరేకల్ పట్టణంలో నివసించే గీత.. సినిమాలు, సీరియల్స్ చేస్తూనే టిఫిన్ సెంటర్ నడుపుతూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు.

ఆమె మాట్లాడుతూ.. నకిరేకల్ లో రామకృష్ణ థియేటర్ వెంకటేశ్వర్లు థియేటర్ ఉన్నాయి. ఈ థియటర్స్ నుంచి వచ్చే సౌండ్స్ విన్నప్పుడల్లా.. తనకు కూడా సినిమాల్లో నటించాలని, స్క్రీన్ పైన కనిపించాలని ఆశ కలిగిందని తెలిపారు. అలాగే టిక్ టాక్, డబ్ స్మాష్‌లాంటి యాప్స్ వాడి నటను మెరుగుపరుచుకున్నానని తెలిపారు. అలా వీడియోలు చేస్తూ తన నటన ఎలా ఉందో చూసుకునేదాన్ని.. ఆ వీడియోలు చూసిన స్నేహితులు కూడా నన్ను ప్రశంసించడం చేసేవారు. పెళ్ళై పిల్లలు పుట్టిన తర్వాత కూడా నేను ఇలా వీడియోలు చేశాను. ఆతర్వాత కొంతమంది పరిచయంతో సినిమా రంగంలోకి వచ్చాను. అలా టీవీ సీరియల్స్ లో అవకాశం దక్కింది అని తెలిపారు గీత. గృహప్రవేశం, మనసు మమత, గుప్పెడంత మనసు, నిన్నే పెళ్ళాడతా, నాలుగు స్తంభాలాట, రాధమ్మ కూతురులాంటి సీరియల్స్ లో నటించారు. అలాగే ప్రేమ విమానం,  లగ్గం, ట్రెండింగ్ లవ్ స్టోరీ సినిమాల్లోనూ నటించారు గీత. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ ఛేంజర్  సినిమాలోనూ నటించినట్టు ఆమె తెలిపారు. ఇలా సినిమాల్లో చేస్తూనే మార్ వైపు టిఫిన్ బండి నడుపుతున్న గీతను పలువురు ప్రశంసిస్తున్నారు.

Geetha

నటి గీత 

Geetha 1

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కంగనాను కొట్టిన CISF కానిస్టేబుల్‏కు ఊహించని షాక్..

0

గత నెలలో చండీగఢ్‌ విమానాశ్రయంలో బీజేపీ ఎంపీ, బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్‌ను కుల్విందన్ అనే cisf మహిళా కానిస్టేబుల్ చెంపదెబ్బ కొట్టిన సంగతి తెలిసిందే. ఈ ఘటన తర్వాత ఆమెను సస్పెండ్ చేసిన అధికారులు తాజాగా ఆమెను సర్వీసులోకి తీసుకున్నారు. కానీ పనిష్మెంట్ కింద వేరే చోటికి బదిలీ చేశారు. ఎస్ ! కంగనాపై చేయి చేసుకున్న సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ కుల్విందర్ పై సస్పెషన్ వేటు వేసిన అధికారులు తిరిగి ఆమెను విధుల్లోకి తీసుకున్నారు. కానీ ఇంతకు ముందు పని చేసిన దగ్గరే కాకుండా ఆమెను వేరే చోటుకి ట్రాన్స్‌ ఫర్ చేశారు. కుల్విందర్ ను చండీగఢ్ నుంచి బెంగుళూరు రూరల్ జిల్లా నేలమంగళ తాలూకాలోని డాబస్ టౌన్ సమీపంలోని సెంట్రల్ ఇండస్ట్రీయల్ సెక్యూరిటీ ఫోర్సుకు బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Balakrishna: హీరోయిన్ రిసెప్షన్.. బాలయ్య ఫన్నీ మూమెంట్

Manamey: OTT స్ట్రీమింగ్‌కు సిద్దమైన మనమే !! ఎప్పుడంటే ??

Maharaja: గుడ్ న్యూస్ OTTలోకి వచ్చేస్తోన్న మహరాజా…

TOP 9 ET News: ప్రభాస్ పేరుతో మోసం..అవి అస్సలు నమ్మకండి

Raj Tarun: రాజ్ తరుణ్ కేసులో ఊహించని ట్విస్ట్.. లావణ్యకు నోటీసులు ఇచ్చిన పోలీసులు..

0

Raj Tarun: రాజ్ తరుణ్ కేసులో ఊహించని ట్విస్ట్.. లావణ్యకు నోటీసులు ఇచ్చిన పోలీసులు..

హీరో రాజ్‌ తరుణ్‌పై లావణ్య అనే యువతి నార్సింగ్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. రాజ్‌తరుణ్‌ తను 11 ఏళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నామన్నారు. కానీ ..ఇప్పుడు మాల్వీ మల్హోత్ర( తిరగబడారా సామి సినిమా హీరోయిన్) అనే యువతి మోజులో పడి తనను నిర్లక్ష్యం చేస్తున్నాడని రాజ్‌తరుణ్‌పై కంప్లేంట్‌ చేశారామె. అంతేకాదు మాల్వీ మల్హోత్ర ఆమె బంధువులు తనను బెదిరిస్తున్నారని..తనకు రక్షణ కల్పించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. మాల్వీ మల్హోత్ర – రాజ్‌తరుణ్‌ ఇద్దరూ తిరుగబడరస్వామిలో కలిసి నటించారు. లావణ్య ఆరోపిస్తున్నట్టుగా మాల్వీ మల్హోత్రతో రాజ్‌ తరుణ్‌ రిలేషన్‌ ఫిస్‌లో ఉన్నారా? పెళ్లి చేసుకోబుతున్నారా?

లావణ్య తన కంప్లేంట్‌లో మాల్వీ మల్హోత్రతో పాటు ఆమె కుటుంబసభ్యులపై కూడా ఫిర్యాదు చేశారు. రాజ్‌ తరుణ్‌కు తాను దూరం కావాలని వాళ్లు బెదిరిస్తున్నారని వాపోయారామె. రాజ్‌తరుణ్‌ లేకపోతే తాను ఉండలేననీ.. అతనితోనే కలసి బతకాలని కోరుకుంటున్నట్టు కూడా ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇలా లావణ్య కంప్లేంట్‌ తెరపైకి రాగానే అలా రాజ్‌ తరుణ్‌ తన వెర్షన్‌ విన్పించారు. సహజీవనం నిజమే. కానీ అది ఒన్స్‌ అపానే టైమ్‌. ఇప్పుడు తను మరో వ్యక్తితో రిలేషన్‌లో ఉందని.. డబ్బు కోసం తనను బ్లాక్‌ మెయిలింగ్‌ చేస్తుందని ఆరోపించారాయన. మరి ఏది నిజం? ఎవరు నిజం? రిలేషన్‌ షిప్‌ వివాద ఫ్రేమ్‌ డ్రగ్‌ రీల్‌ అండ్‌ రోల్‌ ఏంటీ? కథ మాములుగా లేదు బయ్యా… సినిమాకు మించిన ట్విస్టులు బయటపడుతున్నాయి. చివరాఖరకు ఇది ఏ కథా సిత్రమ్‌ అవుతుందనే చర్చ జోరందుకుందిప్పుడు.

ఇదిలా ఉంటే ఇప్పుడు ఊహించని ట్విస్ట్ ఇచ్చారు పోలీసులు. లావణ్యకు నార్సింగ్‌ పోలీసులు నోటీసులు జారీ చేశారు. రాజ్ తరుణ్ పై ఆమె చేసిన ఆరోపణలకు ఆధారాలు సమర్పించాలని పోలీసులు ఆదేశిస్తూ.. ఆమెకి 91 సీఆర్‌పీసీ కింద  నోటీసులు జారీ చేశారు. అయితే నోటీసుల తర్వాత లావణ్య పోలీసులకు రెస్పాండ్ అవ్వలేదని తెలుస్తోంది. ఇంతవరకు లావణ్య పోలీసులకు అందుబాటులోకి రాకపోవడంతో ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు రాజ్ తరుణ్ లావణ్య పై షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆమె మస్తాన్‌ అనే వ్యక్తితో రిలేషన్ లో ఉందని చెప్పాడు. దీనిని లావణ్య ఖండించింది. నార్సింగ్‌ పోలీసులు ఎప్పుడు పిలిస్తే అప్పుడు అతను వస్తాడు అని తెలిపింది లావణ్య.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

Alekhya: ‘ఆ నమ్మకాన్ని ఎప్పుడూ కోల్పోలేదు!..’ ​అలేఖ్య తారకరత్న ఎమోషనల్

0

దివంగత తారకరత్న, అలేఖ్యలది లవ్ మ్యారేజ్ అన్న విషయం తెలిసిందే. అయితే వారి వివాహాన్ని తారకరత్న తల్లిదండ్రులు అంగీకరించలేదు. అప్పటినుంచి తారకతర్న.. తన భార్యా పిల్లలతో కలిసి కుటుంబానికి దూరంగానే ఉన్నారు. ఫ్యామిలీ ఫంక్షన్స్, ఇతర కార్యక్రమాల్లో కూడా తారకరత్న దంపతులు కనిపించలేదు. అయితే బాలకృష్ణ, ఇతర ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం తారకతర్నతో సన్నిహితంగానే మెలిగేవారు. కాగా తారకతర్న విషాద మరణాంతరం కూడా అలేఖ్య.. అత్తమామలు ఇంట్లో కాకుండా విడిగానే ఉంటుంది.

తాజాగా అలేఖ్య తన ఇన్ స్టా ఫాలోవర్స్‌తో చిట్ చాట్ చేసింది. ఈ క్రమంలో ఓ నెటిజన్ కుటుంబం గురించి ఓ ప్రశ్న అడిగాడు. ‘తారకరత్న వాళ్ల తల్లిదండ్రులు.. మిమ్మల్ని, పిల్లల్ని యాక్సెప్ట్ చేస్తారన్న నమ్మకం ఇంకా ఉందా?’ అని ప్రశ్నించగా.. అలేఖ్య చాలా పరిణితితో కూడిన సమాధానం ఇచ్చింది. ఆమె లైఫ్‌లో ఎంత పాజిటివ్ యాటిట్యూడ్‌తో ఉంటారనే ఈ సమాధానం ద్వారా గ్రహించవచ్చు.

“నమ్మకమే మమ్మల్ని ఇన్నేళ్లు ముందుకు సాగేలా చేసింది. ఆ విషయంలో తారకరత్న ఎప్పుడూ తన నమ్మకాన్ని కోల్పోలేదు.. నేను అదే దృక్ఫథంతో ముందుకు సాగుతున్నాను.. ఏదో ఒక రోజు కచ్చితంగా అది జరుగుతుంది.. నాకు నమ్మకం ఉంది.. పిల్లలకి ఓ కుటుంబం ఉంటుంది అంటూ ఉంటుంది..” అని సమాధానమిచ్చారు అలేఖ్య.

Alekhya Post

Alekhya Post

తారకరత్న గత ఏడాది ఫిబ్రవరిలో కన్నుమూసిన విషయం తెలిసిందే. లోకేష్ యువగళం పాదయాత్రలో గుండెపోటుతో కుప్పకూలిన తారకరత్నను బతికించేందుకు డాక్టర్లు శతవిధాలా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అప్పటి నుంచి అలేఖ్య సోషల్ మీడియాలో తన భర్త తారకరత్నని తలుచుకుంటూ ఎమోషనల్ అవుతునే ఉన్నారు. అలేఖ్య, పిల్లలకు అండగా నందమూరి బాలకృష్ణ, విజయసాయి రెడ్డి నిలబడుతున్నారు. ఏ కష్టం వచ్చినా కూడా ఆ ఇద్దరూ తమకు తోడుగా ఉంటారని గతంలో ఓ సందర్భంలో అలేఖ్య పేర్కొన్నారు. ఇక తారకరత్న భార్య అలేఖ్యరెడ్డికి వైసీపీ నేత విజయసాయి రెడ్డి చాలా దగ్గరి బంధుత్వం ఉంది. అలేఖ్య విజయసాయి రెడ్డి భార్య.. చెల్లెలు కూతురు. అంటే విజయసాయి రెడ్డికి అలేఖ్య కూతురు వరుస అవుతోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.