Home Blog Page 505

Tamil Heroes: బాలీవుడ్‌పై ఫోకస్ పెడుతున్న తమిళ హీరోలు

0

ఇన్నాళ్లూ కేవలం తెలుగు, తమిళ మార్కెట్ మాత్రమే చాలు అనుకున్న అరవ హీరోల ఆలోచనలు మారిపోతున్నాయి. ఇప్పుడిప్పుడే హిందీపై ఫోకస్ చేస్తున్నారు వాళ్లు. ఈ క్రమంలోనే రజినీ, సూర్య, ధనుష్, శివ కార్తికేయన్ లాంటి హీరోలు బాలీవుడ్ మేకర్స్‌తో పని చేస్తున్నారు. ఈ మధ్యే బాలీవుడ్ అగ్ర నిర్మాత సాజిద్ నడియావాలాతో రజినీ సినిమా ఖరారైంది.

Samantha: డబ్బు సంపాదించడానికి కాదు.. వారి మంచికోసమే చెప్పాను.. వార్నింగ్ ఇచ్చిన డాక్టర్‏కు సమంత క్లారిటీ..

0

హీరోయిన్ సమంత కొన్నాళ్లుగా మయోసైటిస్ సమస్యకు చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అలాగే తన ఇన్ స్టా ఖాతాలో ఆరోగ్యంగా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, డాక్టర్స్ సలహాలు నెటిజన్లతో పంచుకుంటుంది. ఈ క్రమంలోనే వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు మందులు వేసుకోవడం కంటే.. నీటిలో హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి పీల్చుకోవడం వల్ల ఉపశమనం లభిస్తుందని సమంత సిఫార్సు చేసింది. అలాగే తనకు ఆ సలహా ఇచ్చిన వైద్యుడిని కూడా ట్యాహ్ చేసింది. అయితే సమంత చేసిన పోస్టుపై డాక్టర్ సిరియాక్ అబ్బి ఫిలిప్స్ అకా ది లివర్ డాక్ తప్పుపట్టారు. ఇంతకంటే బుద్ది తక్కువ పని ఇంకొకటి ఉండదని.. అలా చేయడం వల్ల ప్రాణాలు పోతాయని.. ఈ టెక్నిక్ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలను చూపుతుందని అన్నారు. ఆరోగ్యం పట్ల సమంతకు ఏం తెలియదని..ఇలాంటి సలహాలు ఇస్తున్న ఆమెను జైల్లో పెట్టాలని కామెంట్ చేశారు. తాజాగా ఈ వ్యాఖ్యలపై రియాక్ట్ అయ్యింది సామ్. తనను జైల్లో పెట్టాలని వార్నింగ్ ఇచ్చిన డాక్టర్ మాటలకు వివరణ ఇస్తూ సుధీర్ఘ నోట్ షేర్ చేసింది.

“గత రెండేళ్లుగా నేను నా ఆరోగ్యం దృష్ట్యా అనేక రకాల ఔషదాలను తీసుకోవాల్సి వచ్చింది. నేను తీసుకోవాలని సూచించిన ప్రతిదానిని నేను ముందే ప్రయత్నించాను. పేరున్న నిపుణుల పరిశోధన చేసిన తర్వాత వారు సూచించినవి మాత్రమే నేను ట్రై చేశాను. ఈ చికిత్సలు చాలా ఖరీదైనవి కూడా. వాటిని నేను భరించగలిగాను. ఇంతటి ఖర్చు భరించలేని వారి గురించి మాత్రమే నేను ఆలోచిస్తుంటాను. సంప్రదాయ చికిత్సలు నా ఆరోగ్యాన్ని మెరుగుపరచడం లేదు. కానీ ఇవి ఇతరులకు పనిచేసి ఉంటాయని నేను నమ్ముతున్నాను. చికిత్స విధానాన్ని గట్టిగా వాదించేంత అమాయకురాలిని మాత్రం కాదు. గత రెండు సంవత్సరాలలో నేను ఎదుర్కొన్న, నేర్చుకున్న వాటిని మంచి ఉద్ధేశ్యంతోనే సూచిస్తున్నాను. ముఖ్యంగా చికిత్సలన్నీ ఎక్కువ ఖర్చుతో కూడుకున్నవే. కాబట్టి వాటిని అందరూ ప్రయత్నించకపోవచ్చు. అలాంటి వారికి మార్గనిర్దేశం చేయడానికి మనమందరం విద్యావంతులైన వైద్యులపై ఆధారపడతాము. ఈ చికిత్స గురించి నాకు చెప్పిన డాక్టర్ కూడా మంచి పేరు వ్యక్తే.

ఆయన 25 ఏళ్లుగా DRDOలో సేవలందించిన ఒక ఉన్నతమైన డాక్టర్. ఒక పెద్ద మనిషి నా పోస్ట్ పై, నా ఉద్దేశాలపై బలమైన పదాలతో దాడి చేశాడు. అతడు కూడా వైద్యుడే. నాకంటే అతడికి ఎక్కువ తెలుసు అనడంలో సందేహం లేదు. కానీ నా గురించి మాట్లాడిన అతడి ఉద్దేశాలు గొప్పవని నాకు తెలుసు. అతను తన మాటలతో రెచ్చగొట్టకుండా ఉంటే అది అతని పట్ల గౌరవాన్ని పెంచేది. ముఖ్యంగా నన్ను జైలులో వేయాలని అంటున్నారు. పర్వాలేదు. నేను సెలబ్రెటీ అనే కోణంలో ఆయన అన్నారేమో. నేను సెలబ్రిటీగా కాకుండా వైద్య చికిత్సలు అవసరమైన వారికి సహాయం చేసే ఒక వ్యక్తిగా పోస్ట్ చేశాను. నేను చేసిన పోస్ట్ డబ్బు కోసం మాత్రం కాదు. ఇదే చేయండి అని నేను ఆమోదించడం కూడా లేదు. సంప్రదాయ ఔషదం పనిచేయనివారు మరోదారిని వెతుకుతారు. అలాంటి వారి కోసమే నేను ఆ చికిత్స సూచించాను. లివర్ డాక్ తనను టార్గెట్ చేయడం కంటే నాకు సూచించిన డాక్టర్ తో ఇదే చర్చ జరిపి ఉండే బాగుండేది. నేను ట్యాగ్ చేసిన డాక్టర్ ను మర్వాదపూర్వకంగా ఆహ్వానించి చర్చ జరిపితే బాగుంటుంది. ఇద్దరు అర్హత కలిగిన నిపుణుల మధ్య చర్చ జరిగితే నేను నేర్చుకోవడానికి ఇష్టపడతాను. నేను నా ఆరోగ్యానికి ఉపయోగపడిన చికిత్సల గురించి ఇతరులతో పంచుకుంటున్నాను. కానీ ఎవరికీ హానీ కలిగించడానికి కాదు. నేను కూడా ఇకపై మరింత జాగ్రత్తగా ఉంటాను. ఆయుర్వేదం, హోమియోపి, ఆక్యుపంక్చర్, టిబెటన్, మెడిసిన్, ప్రాణిక్ హీలింగ్ వంటి వాటిని సూచిస్తున్న వ్యక్తులు చాలా మంది ఉన్నారు. నేను వారి సలహా మాత్రమే పాటిస్తాను” అంటూ చెప్పుకొచ్చింది సామ్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సిగ్గు ఉండాలి.. చిన్నారితో దర్శన్‌కి సపోర్ట్‌ ఏంటి..

0

అభిమాని హత్య చేయించిన కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటూ ప్రస్తుతం జైళ్లో గడుపుతున్నాడు కన్నడ స్టార్ హీరో దర్శన్. ప్రస్తుతం ఈ కేసు ఇంకా విచారణలో ఉంది. మరోవైపు దర్శన్ ఉంటోన్న జైలుకు అతని అభిమానుల హడావిడి ఎక్కువైంది. దర్శన్ జైలులో చేరినప్పటి నుంచి చాలా మంది జైలు ముంగిట గూమిగూడి ఆందోళనలు చేస్తున్నారు. దర్శన్ ను కోర్టుకు తీసుకెళ్తుండగా.. ఏదో షూటింగ్ జరుగుతున్నట్టు అభిమానులు ‘డి బాస్’ అంటూ నినాదాలు చేస్తున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో దర్శన్ పై తమ ప్రేమను రకరకాలుగా చాటుకుంటున్నారు అభిమానులు. ఈ నేపథ్యంలో ఒక అభిమాని అత్యుత్సాహం ప్రదర్శించాడు. ఆ కారణంగా విమర్శల పాలవుతున్నాడు. ఇక అసలు విషయం ఏంటంటే.. దర్శన్ పై ఉన్న అభిమానంతో తన యేడాది వయసు ఉన్న కొడుకుకి.. ఏకంగా ఖైదీ డ్రెస్ వేసి ఫొటో షూట్ చేయించాడు ఓ అభిమాని.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

‘ఇలాంటి భార్య ఎవ్వరికీ ఉండొద్దు’ హార్దిక్ భార్యపై ఫైర్ అవుతున్న క్రికెట్ ఫ్యాన్స్

TOP 9 ET News: ప్రభాస్‌ ఒక్కడి కారణంగా 5వేల కోట్లు లాభం

తల్లీ కూతురిని గదిలో బంధించి అడ్డుగోడ కట్టేసిన బంధువులు

Tollywood: అయ్యా బాబోయ్.. 27 ఏళ్ల వయసులోనే1000 కోట్లకు వారసురాలు.. ఈ హీరోయిన్ బ్యాగ్రౌండ్ తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది..

0

సినీ పరిశ్రమలోకి కథానాయికగా అడుగుపెట్టి అతి తక్కువ సమయంలోనే స్టార్ డమ్ అందుకుంది. మొదటి సినిమాతోనే నటిగా మంచి మార్కులు కొట్టేసిన ఆ బ్యూటీ.. వైవిధ్యమైన సినిమాలకు ఎంచుకుంటూ తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ముఖ్యంగా మహిళా ప్రాధాన్యత కంటెంట్ చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ఇన్నాళ్లు బాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే నటిగా ఉన్న ఆమె ఇప్పుడు తెలుగు అడియన్స్ ముందుకు వస్తుంది. సెలబ్రెటీ ఫ్యామిలీకి చెందిన ఆ చిన్నారి.. మొదట్లో నెపోటిజం విమర్శలను ఎదుర్కొంది. కానీ రోజు రోజుకీ తన నటన, సినిమాలతో ప్రశంసలు అందుకుంటుంది. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో చాలా బిజీగా ఉంటుంది. ప్రస్తుతం ఆ హీరోయిన్ వయసు 27 ఏళ్లు. కానీ ఇప్పుడే రూ.1000 కోట్లు సంపాదించింది. తల్లిదండ్రుల ఆస్తులు కాకుండా సొంతంగానే ఎన్నో వ్యాపారాలు, బ్రాండ్ యాడ్స్, సినిమాలు చేస్తూ కోట్లకు యజమాని అయ్యింది. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరో తెలుసా.. ? తనే హీరోయిన్ జాన్వీ కపూర్.

దివంగత హీరోయిన్ శ్రీదేవి పెద్ద కూతురే జాన్వీ. ధడక్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన జాన్వీ తొలి చిత్రంతోనే నటిగా మెప్పించింది. ఆ తర్వాత హిందీలో బ్యాక్ టూ బ్యాక్ మూవీస్ చేస్తూ స్టార్ డమ్ సొంతం చేసుకుంది. ఇటీవలే మిస్టర్ అండ్ మిసెస్ మహి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ కావడంతోపాటు.. జాన్వీ కపూర్ నటనపై ప్రశంసలు వచ్చాయి. ఈ చిత్రానికి అడియన్స్ నుంచి మంచి స్పందన వచ్చింది.ప్రస్తుతం తెలుగులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన దేవర చిత్రంలో నటిస్తుంది. డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి.

అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు కాంబోలో రాబోతున్న ఆర్సీ 16 ప్రాజెక్టులోనూ కనిపించనుంది. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ కానుంది. ఇవే కాకుండా త్వరలోనే కోలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాలని ప్రయత్నాలు మొదలుపెట్టింది. తల్లి ఒకప్పటి స్టార్ హీరోయిన్. తండ్రి హిందీ సినీ పరిశ్రమలో బడా నిర్మాత. అలాగే జాన్నీ లైఫ్ స్టైల్ కూడా చాలా లగ్జరీగానే ఉంటుంది. ప్రస్తుతం జాన్వీ తన తండ్రి బోనీ కపూర్, చెల్లెలు ఖుషీ కపూర్ తో కలిసి ముంబైలోని బాంద్రాలో నివసిస్తున్నారు. అలాగే కుబెలిస్క్ అనే భవనంలో డూప్లెక్స్ హౌస్ కొనుగోలు చేసింది. ఆ ఇల్లు ధర రూ.65 కోట్లు. అలాగే చెన్నైలో 1.5 ఎకరాల్లో ఇల్లు ఉంది. అలాగే జాన్వీ వద్ద 5 రకాల పెంపుడు కుక్కలు ఉన్నాయి. రూ.2.5 లక్షల విలువైన అమెరికన్ అకిటా కుక్క కూడా ఉంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Aarambham OTT: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు థ్రిల్లర్ మూవీ.. ఆరంభం ఎక్కడ స్ట్రీమింగ్ కానుందంటే..

0

Aarambham OTT: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు థ్రిల్లర్ మూవీ.. ఆరంభం ఎక్కడ స్ట్రీమింగ్ కానుందంటే..

C/o కంచరపాలెం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటుడు మోహన్ భగత్. ఈ సినిమాలో సహజ నటనతో ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు మోహన్ భగత్ ప్రధాన పాత్రలో నటించిన మైండ్ బ్లోయింగ్ టైమ్ ట్రావెల్ థ్రిల్లర్ ఆరంభం. డైరెక్టర్ అజయ్ నాగ్ వి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. టైమ్ ట్రావెల్, డెజావూ అంశాలను అద్భుతంగా బ్లెండ్ చేసిన ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ప్రేక్షకులకు గొప్ప సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందిస్తుందని అంటున్నారు మేకర్స్. జూలై 5 అర్దరాత్రి నుంచి ఈ మూవీ అందుబాటులోకి వచ్చింది.

ఆరంభం మూవీలో సుప్రితా సత్యనారాయణ్, భూషణ్, రవీంద్ర విజయ్, లక్ష్మణ్ మీసాల కీలకపాత్రలలో నటించగా.. సిన్జిత్ యర్రంమిల్లి సంగీతం అందించారు. ఈ ఏడాది మే 10న అడియన్స్ ముందుకు వచ్చింది. సైంటిఫిక్ థ్రిల్లర్ మూవీకి పాజిటివ్ రివ్యూస్ రాగా.. కమర్షియల్ హిట్ మాత్రం కాలేదు. ఈ సినిమాతో మోహన్ భగత్ సింగ్ మరోసారి అలరించారు.

కథ విషయానికి వస్తే..
ఓ గ్రామానికి చెందిన మిగిల్ (మోహన్ భగత్) హత్య కేసులో రెండున్నరేళ్లుగా శిక్ష అనుభవిస్తుంటాడు. అతడిని ఊరితీసే సమయానికి ఖైదీ నంబర్ 299 కాలా ఘటి జైలు నుంచి ఎలాంటి ఆధారాలు లేకుండా తప్పించుకుంటాడు. ఈ మిస్టీరియస్ ఎస్కేప్ అధికారులను అయోమయానికి గురిచేస్తుంది. ఈ కేసును ఛేదించడానికి ఇద్దరు డిటెక్టివ్ లు వస్తారు. వారి పరిశోధనలో ఎన్నో విషయాలు వెలుగులోకి వస్తాయి. అసలు మిగిల్ ఎవరిని హత్య చేసి జైలుకు వచ్చాడు..? అసలు అతడు ఎలా తప్పించుకోగలిగాడు ? అనేవి తెలియాలంటే ఈసినిమా చూడాల్సిందే. టైమ్ ట్రావెల్, డెజావు కాన్సెప్ట్ బ్లెండ్ చేసి మైండ్ బెండింగ్ ఎలిమెంట్స్ థ్రిల్లర్ చేసే ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Tollywood News: లాస్‌ ఏంజెల్స్ లో గోట్‌ | సీనియర్‌ ఎన్టీఆర్‌లాగా పవన్‌ కల్యాణ్‌

0

Tollywood News: డ్రగ్స్ పై స్పందించిన మోహన్ బాబు | మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నయనతార

0

Mohanu Babu: యువత డ్రగ్స్ కి బానిసలు కాకుండా ఉండేలా అవగాహన కల్పిస్తూ సినీ ప్రముఖులు వీడియోలు చేయాలని తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి పిలుపునిచ్చారు. దీనికి స్పందించారు మంచు మోహన్‌బాబు. గతంలో కొన్ని వీడియోలు చేశానని, అయినా, సీఎం ఆదేశం మేరకు మరికొన్ని సందేశాత్మక వీడియోలు రూపొందించి, ఉడతా భక్తిగా సమాజ సేవ చేసుకుంటానని చెప్పారు.

అందాల ఆరబోతతోనే.. హీరోయిన్లకు బంపర్‌ ఛాన్సులు.. శ్రుతి కామెంట్స్

0

ఇప్పటికీ సినీ పరిశ్రమలో చాలా మంది హీరోయిన్స్ రొమాంటిక్ సీన్స్‏కు దూరంగానే ఉంటున్నారు. లిప్ లాక్, కిస్ నుంచి గ్లామరస్ రొమాంటిక్ సన్నివేశాలు చేయడానికి ఒప్పుకోవడం లేదు. ఈ కారణంగానే ఎంతో మంది తారలు ఆఫర్స్ కోల్పోతున్నారు. అందం, టాలెంట్ ఉన్నప్పటికీ అలాంటి సీన్స్ చేయడానికి అంగీకరించకపోవడంతో సినిమాలు లేక ఖాళీగా ఉంటున్నారు. ఇక హీరామండి సినిమాలో ఇంటిమసీ సీన్స్ చేయనంత వరకు తన పరిస్థితి కూడా ఇంతే అంటూ తాజాగా కుండబద్దలు కొట్టారు శ్రుతి శర్మ. ఇటీవల హిరామండి సిరీస్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రుతి శర్మ.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఓపెన్ అయ్యారు. హీరామండి ముందు వరకు తనకు రొమాంటిక్ సీన్స్ చేయడం, స్క్రీన్ పై ముద్దు సన్నివేశాల్లో నటించడం ఇష్టం లేదని చెప్పారు. ఎప్పటికీ తాను స్క్రీన్ పై రొమాన్స్ సీన్ చేయనని.. అందుకే ఎన్నో ప్రాజెక్ట్స్ వదులుకోవాల్సి వచ్చిందన్నారు. అయితే హీరామండి తర్వాత తన నిర్ణయం మార్చుకున్నట్టు చెప్పుకొచ్చారు ఈమె.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అందం అందర్నీ ఫిదా చేస్తున్న.. హీరో అబ్బాస్ కూతురు

సిగ్గు ఉండాలి.. చిన్నారితో దర్శన్‌కి సపోర్ట్‌ ఏంటి..

‘ఇలాంటి భార్య ఎవ్వరికీ ఉండొద్దు’ హార్దిక్ భార్యపై ఫైర్ అవుతున్న క్రికెట్ ఫ్యాన్స్

TOP 9 ET News: ప్రభాస్‌ ఒక్కడి కారణంగా 5వేల కోట్లు లాభం

తల్లీ కూతురిని గదిలో బంధించి అడ్డుగోడ కట్టేసిన బంధువులు

ఈ హీరోయిన్ వాచ్‌ ధర తెలిస్తే.. దిమ్మతిరిగిపోవాల్సిందే

0

నజ్రియా నజీమ్..! భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్న ఈమె… న్యాచురల్ స్టార్ నాని నటించిన అంటే సుందరానికి సినిమాతో తెలుగులో బిజీ అయ్యే ప్రయత్నం చేసింది. కానీ ఆ తర్వాత సైలెంట్ అయిపోయింది. కానీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటూ.. నిత్యం ఏదోక ఫోటోస్ షేర్ చేస్తూ అభిమానులను మాత్రం ఈమె ఆకట్టుకుంటుకూనే ఉంటారు. ఈ క్రమంలోనే తను చేతికి ఉన్న వాచ్ ధరతో అందర్నీ నెరెళ్ల బెట్టేలా చేస్తున్నారు. ఇక అసలు విషయం ఏంటంటే! జై బోలో తెలంగాణ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మలయాళీ హీరోయిన్ మీరా నందన్ ఇటీవల పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకలో మలయాళీ ఇండస్ట్రీలో చాలా మంది నటీనటులు పాల్గొన్నారు. మీరా నందన్ పెళ్లిలో నజ్రియా స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది. తన భర్త నటుడు ఫహద్ ఫాజిల్ తో కలిసి అందరి దృష్టిని ఆకర్షించింది. లేత గులాబీ రంగు చీరలో సింపుల్ లుక్ లో మరింత అందంగా కనిపించింది నజ్రియా. అయితే ఈ వేడుకలో నజ్రియా ధరించిన లగ్జరీ వాచ్ నెటిజన్స్ దృష్టిని ఆకర్షించింది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అందాల ఆరబోతతోనే.. హీరోయిన్లకు బంపర్‌ ఛాన్సులు.. శ్రుతి కామెంట్స్

అందం అందర్నీ ఫిదా చేస్తున్న.. హీరో అబ్బాస్ కూతురు

సిగ్గు ఉండాలి.. చిన్నారితో దర్శన్‌కి సపోర్ట్‌ ఏంటి..

‘ఇలాంటి భార్య ఎవ్వరికీ ఉండొద్దు’ హార్దిక్ భార్యపై ఫైర్ అవుతున్న క్రికెట్ ఫ్యాన్స్

TOP 9 ET News: ప్రభాస్‌ ఒక్కడి కారణంగా 5వేల కోట్లు లాభం

Disha Patani: దిశా చేతిపై ప్రభాస్‌ ట్యాటూ ?? నెట్టింట వీడియో వైరల్

0

బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. వరుణ్ తేజ్ నటించిన లోఫర్ సినిమాతోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిందీ అందాల తార. ఆ తర్వాత బాలీవుడ్ కు చెక్కేసి అక్కడే సెటిలైపోయింది. ఇటీవలే పాన్ ఇండియా సూపర్ స్టార్ నటించిన ‘కల్కి 2898 ఏడీ’ సినిమాలో ఒక కీలక పాత్రలో నటించి మెప్పించింది. ప్రస్తుతం ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకెళుతోంది. ఇప్పటికే 500 కోట్లు వసూలు చేసిన ఈ మూవీ 1000 కోట్ల దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఇదిలా ఉంటే దిశా పటానీ గురించి ఒక గాసిప్ వైరల్ అవుతోంది. ‘కల్కి 2898 AD’ సినిమాలో నటించిన దిశా పటాని ప్రభాస్‌తో ప్రేమలో పడినట్లు ప్రచారం జరుగుతోంది. దీనికంతటికీ కారణం దిశా పటానీ చేతిపై ఉన్నపచ్చ బొట్టు. దిశా పటానీ తన చేతిపై ‘పీడీ’ టాటూను వేయించుకుంది. దాని అర్థం ఆమెకు తప్ప మరెవరికీ తెలియదు. అయితే నెటిజన్లు మాత్రం రకరకాలుగా ఊహించుకుంటున్నారు. ‘పీడీ అంటే ప్రభాస్, దిశా’ అని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. అలాగే ‘డార్లింగ్ ప్రభాస్’ రివర్స్ వెర్షన్ అని మరికొందరు ఊహించుకుంటున్నారు. ప్రభాస్ తో తన ప్రేమకు గుర్తుగా దిశా పటానీ ఈ టాటూ వేయించుకున్నారని చాలామంది నెటిజన్లు ఊహించుకుంటున్నారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఈ హీరోయిన్ వాచ్‌ ధర తెలిస్తే.. దిమ్మతిరిగిపోవాల్సిందే

అందాల ఆరబోతతోనే.. హీరోయిన్లకు బంపర్‌ ఛాన్సులు.. శ్రుతి కామెంట్స్

అందం అందర్నీ ఫిదా చేస్తున్న.. హీరో అబ్బాస్ కూతురు

సిగ్గు ఉండాలి.. చిన్నారితో దర్శన్‌కి సపోర్ట్‌ ఏంటి..

‘ఇలాంటి భార్య ఎవ్వరికీ ఉండొద్దు’ హార్దిక్ భార్యపై ఫైర్ అవుతున్న క్రికెట్ ఫ్యాన్స్