Home Blog Page 504

Raj Tarun: లావణ్య ఎక్కడుంది.? హీరో రాజ్ తరుణ్ కేసులో మరో షాకింగ్ ట్విస్ట్.. పూర్తి వివరాలు

0

లావణ్య లా పతా? కంప్లైంట్‌ ఇచ్చిన తరువాత ఆమె కన్పించకపోవడం వెనుక మతలబు ఏంటి? సహజీవన వివాద కథా చిత్రమ్‌లో ట్విస్ట్‌ల మీద ట్విస్టులు వెలుగు చూస్తున్నాయి. రాజ్‌ తరుణ్‌ తనను మోసం చేశాడని.. మాల్వీ మల్హోత్రా అండ్‌ ఫ్యామిలీ నుంచి తనకు థ్రెట్‌ ఉందని.. లావణ్య ఫిర్యాదు చేయడం అందరికీ తెలిసిందే. ఆరోపణలకు తగిన ఆధారాలు చూపాలని పోలీసులకు ఆమెకు నోటీసులు ఇవ్వడం లేటెస్ట్‌ అప్‌డేట్‌. ఇక మరో ట్విస్ట్‌ కూడా వుంది. అదే లావణ్యపై నటి మాల్వీ మల్హోత్రా పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం.

రాజ్‌ తరుణ్‌పై లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. మస్తాన్‌ సాయితో లావణ్య రిలేషన్‌ షిప్‌లో ఉందంటూ సంచలన ఆరోపణ చేశాడు రాజ్‌ తరుణ్‌. ఇక లేటెస్ట్‌గా మాల్వీ మల్హోత్రా ఫ్రేమ్‌లోకి వచ్చింది. తనపై తప్పుడు ప్రచారం చేస్తోందంటూ లావణ్యపై కంప్లైంట్ ఇచ్చిందామె. అసలు కథ ఏంటో కానీ కంప్లైంట్ మీద కంప్లైంట్‌తో సహజీవన కథా చిత్రమ్‌ రసవత్తర టర్న్‌లు తీసుకుంటోంది. 11 ఏళ్ల లివ్‌ ఇన్‌ టుగెదర్‌ రిలేషన్‌ ఎందుకు బీటలు వారె? ఊయ్యాలా జంపాల అన్నట్టుగా ఒకే ఇంట్లో పై పోర్షన్‌లో ఆమె.. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో అతను.. సహజీవన బంధం సడెన్‌గా ఎందుకు బ్రేకపాయె? క్లిష్ట పరిస్థితుల్లో అండగా నిలిచిన కృతజ్ఞత భావం అతనికి ఉండగా.. అంత వెన్నుదన్నుగా వుండి ఆల్‌ ఆఫ్‌ సడెన్‌గా అతనిపైనే కంప్లైంట్ ఇవ్వనేలా? లావణ్య కంప్లైంట్ ద్వారా సహజీవన ముచ్చట బయటకు వచ్చింది. ఔను మేం కలిసి వున్నాం. కానీ అది ఒకప్పుడు.. ఇప్పుడు కాదని క్లారిటీ ఇచ్చాడు రాజ్‌ తరుణ్‌. డ్రగ్స్‌ కేసులో లావణ్య ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఆ ముచ్చటే ఇద్దరి మధ్య డిఫెరెన్సెన్స్‌‌కు కారణమైందా? డ్రగ్స్‌ ఒక్కటే కాదు ఆమె మస్తాన్‌ సాయి అనే వ్యక్తితో రిలేషన్‌ షిప్‌లో ఉందని.. కొన్ని సంచలనాలను తెరపైకి తెచ్చాడు రాజ్‌ తరుణ్‌.

ఇక లావణ్యది మరో వెర్షన్‌. తనను మోసం చేశాడని నార్సింగ్‌ పీఎస్‌లో కంప్లైంట్ ఇచ్చిందామె. 11 ఏళ్లు కలిసి వున్నాం. కష్ట సమయంలో అతనికి అండగా వున్నా. కానీ నేను ఆపదలో ఉన్నప్పుడు అతను ముఖం చాటేశాడు. అందుకు కారణం మాల్వీ మల్హోత్రా. తనను రాజ్‌తరుణ్‌ను దూరం చేయాలని మాల్వీ మల్హోత్రా ఆమె కుటుంబసభ్యులు ప్రయత్నించారని.. తనను బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారామె. వాళ్ల నుంచి తనకు ప్రాణహాని వుందని.. రక్షణ కల్పించాలని కూడా విజ్క్షప్తి చేసింది లావణ్య. లావణ్య ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు విచారణ చేపట్టారు. ఈ క్రమంలోనే రాజ్‌ తరుణ్‌ స్పందించాడు. ఆమె తనను ఎంతలా టార్చర్‌ చేసేదో చెప్పాడు. ఎప్పుడో పోలీసులకు ఫిర్యాదు చేయాలనుకున్నాను.. కానీ ఇమేజ్‌ డ్యామేజ్‌ అవుతందని తనను తాను కంట్రోల్‌ చేసుకున్నట్టు చెప్పాడు. ఇక టార్చర్‌ భరించలేక తాను పోలీసులను అప్రోచ్‌ అవుదామని ఆలోచిస్తున్న తరుణంలో తనకన్నా ముందే లావణ్య పావులు కదిపిందన్నాడు. తమ మధ్య జరిగిన ఆర్ధిక లావాదేవీలు.. మస్తాన్‌ సాయితో ఆమె రిలేషన్‌ షిప్‌.. డబ్బు కోసం బ్లాక్‌ మెయిలింగ్‌.. ప్రతీ అంశాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్తానన్నాడు. ఇక కథ ఇందాక వచ్చింది కాబట్టీ న్యాయపోరాటానికి కూడా తాను సిద్ధమన్నాడు.

ఇవి కూడా చదవండి

రాజ్‌ తరుణ్‌.. కంప్లైంట్ ఇవ్వబోతున్నారా? ఎప్పుడు? ఏమని?…ఈ ప్రశ్నల సంగతి ఎలా వున్నా తిరగబడే సామీ అన్నట్టుగా లావణ్య కంప్లైంట్‌ కథ చిత్రమ్‌ మరో టర్న్‌ తీసుకుంది. ఫిర్యాదులో ఆమె చేసిన ఆరోపణలకు ఆధారాలను ఇవ్వాలని లావణ్యను కోరారు పోలీసులు. కానీ కంప్లైంట్ ఇచ్చాక ఆమె ఖాకీలకు కనపడలేదు. కనీసం వినపడలేదు. ఫోన్‌ చేసినా రెస్పాన్స్‌ లేకపోవడంతో వాట్సాప్‌లో నోటీస్‌ ఇచ్చారు. రాజ్‌ తరుణ్‌ వ్యవహారం సహా మాల్వీ మల్హోత్రా ఆమె కుటుంసభ్యులు బెదిరించారనే ఆరోపణలకు సంబంధించి వివరణ ఇవ్వాలన్నారు. గడువు 48 గంటలు. ఈలోపు లావణ్య రెస్పాండ్‌ అవుతుందా? తను చేసిన ఆరోపణలకు తగిన ఆధారాలను పోలీసులకు సమర్పిస్తుందా? లేదంటే కంప్లైంట్ తిరగబడినట్టేనా?.. ఏమో గుర్రం ఎటైనా తిరగబడనూ వచ్చు.. అనే టాక్‌ విన్పిస్తోందిప్పుడు.

ఇది చదవండి: సంతకం కింద రెండు చుక్కలు పెట్టే అలవాటు మీకుందా.? దీని అర్ధం ఏంటో తెల్సా

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Samantha: సమంత ఆరోగ్య చిట్కాపై పూనమ్ కౌర్ సంచలన వ్యాఖ్యలు.. అలా అనేసిందేంటి?

0

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక ఆరోగ్య చిట్కా ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. హైడ్రోజన్ పైరాక్సైడ్ నెబ్యులైజేషన్ వాడకంపై సామ్ సూచించిన చిట్కాపై డాక్టర్లతో పాటు పలువురు ప్రముఖులు తీవ్రంగా మండిపడుతున్నారు. సమంత చెప్పినట్లు చేస్తే ప్రాణాలు పోతాయంటూ ప్రముఖ వైద్య నిపుణులు హెచ్చరించారు. అంతేకాదు సామ్ ను నిరక్షరాస్యులిగా అభివర్ణించాడు. ఇలాంటి సలహాలు ఇస్తోన్న సామ్ ను జైలుకు పంపాలంటూ కూడా డిమాండ్ చేశాడు. దీనికి వంత పాడుతూ ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల కూడా సామ్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘జనాలకు హెల్త్ టిప్స్ ఇస్తున్న సెలబ్రిటీలను నేను ఒకే ఒక్క ప్రశ్న అడగదల్చుకున్నాను. మీ చికిత్సా విధానం అవతలివారికి ఉపయోగపడకపోగా చనిపోతే పరిస్థితేంటి? ఎదుటివారికి సాయం చేయాలన్న మీ ఆలోచన మంచిదే.. కాదనను.. కానీ జరగరానిది జరిగితే మీరు బాధ్యత వహిస్తారా? మీకు సలహా ఇచ్చిన డాక్టర్‌ బాధ్యత తీసుకుంటారా?’ అంటూ ట్విట్టర్ వేదికగా సామ్ పై విమర్శలు కురిపించింది జ్వాల.

తాజాగా మరో ప్రముఖనటి పూనమ్ కౌర్ కూడా సమంత ఆరోగ్య చిట్కాపై స్పందించింది. జ్వాల ట్వీట్ కు రిప్లై ఇచ్చిన ఆమె.. ‘ఇది సెల్ఫ్ గ్లోరిఫికేషన్ జ్వాలా, దేన్ని అయినా అడ్వర్టైజ్ చేసేయొచ్చు అనే దానికి ఉదాహరణ. చాలా మంది ప్రముఖులు చక్కెర తీసుకోరు. కానీ వారు తీసుకోని చక్కెర ఉన్న పానీయాలు, చాక్లెట్ల గురించి విచ్చల విడిగా ప్రమోషన్స్ చేస్తూ ఉంటారు. ఇదంతా డార్క్ రియాలిటీ’ అని పూనమ్ కౌర్ ట్వీట్ చేసింది. ప్రస్తుతం గుత్తా జ్వాల, పూనమ్ కౌర్ ట్వీట్స్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. చాలా మంది నెటిజన్లు వీరిని సమర్థిస్తూ కామెంట్లు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

పూనమ్ కౌర్ ట్వీట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Trisha krishnan: కనపడదు కానీ స్మార్ట్ ప్లస్ బ్యూటీ.. అన్ని ఇండస్ట్రీల్లో త్రిష అడుగులు..

0

పొన్నియిన్ సెల్వన్ తరువాత విజయ్‌, లోకేష్ కాంబినేషన్‌లో తెరకెక్కిన లియో సినిమాతో ఆడియన్స్‌ ముందుకు వచ్చారు త్రిష.

Nani:ఇప్పటిదాకా ఓ లెక్క.. ఇకపై ఇంకో లెక్క అంటున్న నాని.. స్పీడు పెంచుతున్న నేచురల్‌ స్టార్‌

0

సీనియర్ల చేతుల్లో ఒకటికి నాలుగు సినిమాలున్నప్పుడు, మనం నిదానంగా నడుస్తామంటే ఎలా? అని ఆలోచిస్తున్నారు యంగ్‌ హీరోలు. వారందరిలోనూ ఓ అడుగు ముందుకేశారు నేచురల్‌ స్టార్‌. ఇప్పటిదాకా ఓ లెక్క.. ఇకపై ఇంకో లెక్క అన్నట్టుందట ఆయన వైఖరిని గమనిస్తే… ఇంతకీ ఏంటదీ? చూసేద్దాం రండి….

Sara Ali Khan: యంగ్‌స్టర్స్ కి సలహాలిస్తున్న సారా అలీ ఖాన్‌

0

Salman Khan: సల్మాన్‌ అట్లీ సినిమాలో సౌత్‌ హీరో !! ఎవరంటే ??

0

సల్మాన్‌తో అట్లీ తెరకెక్కించబోయే సినిమా ప్యాన్‌ ఇండియా రేంజ్‌లో భారీ బడ్జెట్‌తో ఉంటుందనే టాక్‌ ఉంది. ఈ సినిమాలో నార్త్ నుంచి సల్మాన్‌ఖాన్‌, సౌత్‌ నుంచి మరో స్టార్‌ హీరో నటిస్తారని టాక్‌. నార్త్, సౌత్‌కి సంబంధించి భారీ కొలాబరేషన్‌గా ఈ మూవీ ఉంటుందన్నది ఇప్పుడు నార్త్ లో వైరల్‌ న్యూస్‌.

Khushi Kapoor : తేనె కళ్లతో మెరిసిపోతున్న బాలీవుడ్ బార్బీ.. ఖుషీ కపూర్ స్టన్నింగ్ ఫోటోస్..

0

Anant Ambani Wedding: గ్రాండ్‌గా అనంత్ అంబానీ- రాధికల సంగీత్.. సందడి చేసిన అందాల తారలు.. ఫొటోస్ చూశారా?

0

అనంత్ అంబానీ- రాధికల సంగీత్ వేడుకలకు హాజరైన వారిలో దీపికా పదుకొణె, జాన్వీ కపూర్, ఖుషి కపూర్, సారా అలీఖాన్, అనన్యా పాండే తదితరులు ఉన్నారు

Bigg Boss Telugu 8: బర్రెలక్క, హేమతో సహా ఈసారి బిగ్ బాస్ లేడీ కంటెస్టెంట్స్ వీరే.. హౌజ్‌లో రచ్చ మాములుగా ఉండదు

0

Bigg Boss Telugu 8: బర్రెలక్క, హేమతో సహా ఈసారి బిగ్ బాస్ లేడీ కంటెస్టెంట్స్ వీరే.. హౌజ్‌లో రచ్చ మాములుగా ఉండదు

బుల్లితెర ప్రేక్షకులను అమితంగా అలరిస్తోన్న బిగ్ బాస్ రియాలిటీ షో మళ్లీ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఏడు సీజన్లు సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకున్న ఈ సెలబ్రిటీ గేమ్ షో ఎనిమిదో సీజన్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఆగస్టు ఆఖరి వారం లేదా సెప్టెంబర్ మొదటి వారంలో బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభం కావచ్చని తెలుస్తోంది. త్వరలోనే దీనిపై ఒక అధికారిక ప్రకటన రానుంది. మరోవైపు ఈసారి బిగ్ బాస్ కంటెస్టెంట్ల వివరాలు సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. అలాగే ఆది రెడ్డి లాంటి బిగ్ బాస్ విశ్లేషకుల నుంచి కూడా తరచూ ఏదో ఒక లీక్స్ వస్తూనే ఉన్నాయి. కాగా ఈసారి పలువురు సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లు, యూట్యూబర్లు బిగ్ బాస్ హౌజ్ లోకి రానున్నారని సమాచారం. అలాగే గత ఏడాది కాలంగా వివిధ కారణాలతో వార్తల్లో నిలిచిన సెలబ్రిటీలను కూడా హౌజ్ లోకి రప్పించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక లేడీ కంటెస్టెంట్ల విషయానికి వస్తే.. నలుగురి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వారిలో బెంగళూరు రేవ్ పార్టీలో అడ్డంగా దొరికిపోయి జైలు కెళ్లిన హేమ, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసిన బర్రెలక్క, రోడ్ సైడ్ ఫుడ్ స్టాల్ పెట్టుకుని బాగా ఫేమస్ అయిన కుమారీ ఆంటీ ఈసారి బిగ్ బాస్ హౌజ్ లో మెయిన్ లేడీ కంటెస్టెంట్స్ గా రావచ్చని సమాచారం.

ఈసారి బిగ్ బాస్ లేడీ కంటెస్టెంట్ల లిస్టులో ప్రముఖంగా వినిపిస్తోన్న మరో పేరు అమృతా ప్రణయ్. వేరే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడంతో తన తండ్రే స్వయంగా ఆమె భర్తను హత్య చేయించాడు. దీంతో తండ్రిపైనే కేసు పెట్టిందామె. తన పర్సనల్ లైఫ్ తో వార్తల్లో నిలిచిన అమృతా ప్రణయ్ బిగ్ బాస్ 8లో కంటెస్టెంట్‌గా రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు విశ్లేషకులు. వీరితో పాటు సురేఖా వాణి, జబర్దస్త్ యాంకర్ రీతూ చౌదరి, బ్రహ్మముడి కావ్య ల పేర్లు కూడా ప్రధానంగా వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతానికి ఇవన్నీ కేవలం రూమర్లు మాత్రమే. అలాగనీ వీటిలో నిజం లేకపోలేదు. అయితే కంటెస్టెంట్స్ లిస్ట్ పై ఫుల్ క్లారిటీ రావాలంటే షో లాంచింగ్ వరకు వేచి ఉండాల్సిందే.

శివాజీ కూడా.. కంటెస్టెంట్ గా కాదండోయ్..

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

Tollywood: ఓర్నీ.! 40 ఏళ్ల వయసులో రెచ్చిపోతున్న రవితేజ హీరోయిన్.. చూస్తే మెంటలెక్కాల్సిందే

0

పైన పేర్కొన్న ఫోటోలోని సర్కిల్ చేసిన బ్యూటీని గుర్తుపట్టారా.? ఈమె ఒక్కప్పుడు టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా కుర్రకారును ఓ ఊపు ఊపింది. తెలుగులో ఈ హీరోయిన్ చేసింది తక్కువ చిత్రాలే అయినప్పటికీ.. కన్నడ భాషలో మాత్రం టాప్ స్టార్స్ సరసన నటించి మెప్పించింది. అందం, అభినయం పరంగా మంచి మార్కులు కొట్టేసింది. అలాగే గ్లామర్ షోకు ఏమాత్రం అడ్డుచెప్పలేదు ఈ బ్యూటీ. సిల్వర్ స్క్రీన్‌కి ఈ అందాల భామ గుడ్‌బై చెప్పి.. 12 ఏళ్లు అయింది. అయితే ఇటీవల ఒక ఓటీటీ సినిమా ద్వారా మళ్లీ రీ-ఎంట్రీ ఇచ్చింది. కన్నడ కాంట్రోవర్సీ స్టార్ దర్శన్‌తో ‘భగవాన్’ అనే సినిమాలో నటించి.. ఈ భామ మంచి గుర్తింపు తెచ్చుకుంది. మేము ఎవరి గురించి మాట్లాడుతున్నామో.. మీకు ఈపాటికే అర్ధమై ఉంటుంది. ఆమె మరెవరో కాదు ‘డైసీ బోపన్న’.

ఈ భామ పేరు పెద్దగా తెలుగు ప్రేక్షకులకు తెలియదు. డైసీ హీరోయిన్‌గా తెలుగులో చేసింది కేవలం మూడు సినిమాలే.. కానీ కన్నడంలో 12 చిత్రాల్లో నటించింది. అలాగే ఆ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు గణేష్, శివ రాజ్‌కుమార్, ఉపేంద్ర, దర్శన్‌లతో నటించి మెప్పించింది. తెలుగులో 2004లో రవితేజ నటించిన ‘చంటి’ సినిమాతో ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేసింది. ‘బింబ’, ‘భగవాన్’, ‘గరమ్ మసాలా’, ‘జాక్‌పాట్’, ‘తవారిన సిరి’ లాంటి హిట్స్ తన ఖాతాలో వేసుకుంది.

సుమారు 11 ఏళ్ల పాటు సిల్వర్ స్క్రీన్‌పై హీరోయిన్‌గా మెరిసిన ఈ బ్యూటీ 2011లో అమిత్ జాజు అనే వ్యక్తిని పెళ్లాడి.. ఆ తర్వాత సినిమాలు దూరమైంది. డైసీ బోపన్న కెరీర్‌లో 2012లో కన్నడంలో వచ్చిన ‘క్రేజీ లోక’ చివరి సినిమా. ఇక ఇప్పుడు 12 ఏళ్ల తర్వాత 2024లో ‘రష్’ అనే ఓటీటీ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది డైసీ బోపన్న. ఇందులో రవిబాబు ప్రధాన పాత్రలో కనిపించగా.. దీనిని ఈటీవీ విన్ ఓటీటీలో చూడవచ్చు. కాగా, డైసీ బోపన్న తాజా ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. లేట్ ఎందుకు మీరూ ఓ లుక్కేయండి.

ఇది చదవండి: సంతకం కింద రెండు చుక్కలు పెట్టే అలవాటు మీకుందా.? దీని అర్ధం ఏంటో తెల్సా

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి