Home Blog Page 502

‘ఇలాంటి భార్య ఎవ్వరికీ ఉండొద్దు’ హార్దిక్ భార్యపై ఫైర్ అవుతున్న క్రికెట్ ఫ్యాన్స్

0

బార్బడోస్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్లో భారత్ చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. భారత్ గెలుపులో హార్దిక్ పాండ్యా కీలక పాత్ర పోషించాడు. ఇక కప్ గెలిచిన అనంతరం గ్రౌండ్ లోనే కన్నీళ్లు పెట్టుకున్నాడు హార్దిక్. గత కొన్నినెలలుగా తాను పడుతోన్న మానసిక వేదన గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యాడు. అయితే వరల్డ్ కప్ గెలిచిన తర్వాత హార్దిక్ భార్య నటాషా అసలు స్పందించకపోవడం ఇప్పుడు విమర్శలకు దారితీస్తోంది. హార్దిక్ వైఫ్‌ నటాషా.. భారత్ చారిత్రాత్మక విక్టరీని.. సెలబ్రేట్ చేసుకోవడం కాదుకదా… అటు హార్దిక్ కు కానీ, ఇటు టీమిండియాకు కానీ విషెస్ చెబుతూ ఒక్క పోస్ట్ కూడా తన సోషల్ మీడియా హ్యాండిల్లో పోస్ట్ చేయలేదు. దీంతో ఈమె తీరు మరోసారి హార్దిక్ ఫ్యాన్స్‌కు చిర్రెత్తుకొచ్చేలా చేస్తోంది. ఆమెపై నెట్టింట తీవ్ర విమర్శలు వచ్చేలా చేస్తోంది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

TOP 9 ET News: ప్రభాస్‌ ఒక్కడి కారణంగా 5వేల కోట్లు లాభం

తల్లీ కూతురిని గదిలో బంధించి అడ్డుగోడ కట్టేసిన బంధువులు

Raj Tarun: లావణ్య ఆరోపణలపై స్పందించిన హీరో రాజ్ తరుణ్.. అందుకే ఆమెను దూరం పెట్టానంటూ..

0

తనను ప్రేమించి మోసం చేశాడంటూ లావణ్య అనే యువతి చేసిన ఆరోపణలపై టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ స్పందించాడు.
లావణ్యతో రిలేషన్‌లో ఉన్నమాట వాస్తవమేనని అయితే కొన్ని కారణాలతో దూరం పెట్టినట్లు రాజ్ తరుణ్ తెలిపాడు. ‘ నాపై లావణ్య చేస్తోన్న ఆరోపణల్లో ఏ మాత్రం నిజం లేదు. ఆమెతో రిలేషన్ షిప్‌లో ఉన్న మాట వాస్తవమే, కానీ ఆమె డ్రగ్స్ కు అలవాటు పడిపోయింది. అలాగే వేరే వారితో అఫైర్ పెట్టుకుంది. అందుకే ఆమెను దూరం పెట్టాను. లావణ్యకు కేవలం డబ్బులు మాత్రమే కావాలి. అందుకే ఈ కొత్త డ్రామా ఆడుతోంది. ఆమె నన్ను బాగా టార్చర్ పెట్టింది. కన్న తండ్రిని కూడా మోసం చేసింది. ఆమె నన్ను బాగా ఇబ్బంది పెడుతుండడంతో నేను లీగల్ గా ప్రొసీడ్ అవుతున్నాను. ఒకసారి పెళ్లి చేసుకున్నాను అంటుంది. ఇంకోసారి పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశానని చెబుతోంది. లావణ్యతో నాకెలాంటి శారీరక సంబంధం లేదు. ఈ విషయం పోలీసులకు చెబితే నా రిప్యుటేషన్ ఎక్కడ దెబ్బతింటుందోననే భయపడి చెప్పలేదు. లావణ్యను డ్రగ్స్ కేసులో ఇరికించే ఉద్దేశం ఉంటే.. నాకీలాంటి పరిస్థితి వచ్చేది కాదు కదా? మస్తాన్ అనే వ్యక్తితో లావణ్యకు సంబంధం ఉంది. ఆమె డబ్బుల కోసమే ఇదంతా చేస్తోంది. ఆమె పేరెంట్స్ తో కూడా నాకెలాంటి ఇబ్బందులు ఎదురు కాలేదు. 2017 నుంచి ఆమెకు దూరంగా ఉంటున్నాను’ అని రాజ్ తరుణ్ మీడియాతో చెప్పుకొచ్చాడు.

సినిమా వరకే మా రిలేషన్..

కాగా సహ న‌టి మాల్వి మల్హోత్రాపై లావ‌ణ్య చేస్తోన్న ఆరోపణలను ఖండించాడు రాజ్ తరుణ్. మాల్వి మల్హోత్రా నాకు మంచి ఫ్రెండ్ మాత్రమే. మాల్వి మల్హోత్రా నేను క‌లిసి తిర‌గ‌బ‌డ‌రా సామీ అనే సినిమాలో న‌టించాం. ఆ సినిమా వ‌ర‌కే మా రిలేష‌న్. లావ‌ణ్య కావాల‌ని మా ఇద్దరిపై త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేస్తుంది’ అని చెప్పుకొచ్చాడీ యంగ్ హీరో.

ఇవి కూడా చదవండి

అంతకు ముందు రాజ్ తరుణ్ తనను ప్రేమ పేరుతో మోసం చేశాడంటూ లావణ్య నా ర్సింగి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. 11 ఏళ్లుగా తాను, రాజ్ తరుణ్ రిలేషన్‌లో ఉన్నట్లు ఆమె అందులో తెలిపింది. తామిద్దరం గుడిలో రహస్యంగా పెళ్లి కూడా చేసుకున్నట్లు చెబుతోంది. రాజ్‌తరుణ్‌ను వదిలేయాలని.. లేదంటే చంపేస్తామని బెదిరిస్తున్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. తనను అన్యాయంగా డ్రగ్స్ కేసులో ఇరికించారని.. 45 రోజులు జైల్లో ఉన్నానని లావణ్య వాపోయింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

OTT: ఓటీటీలోకి వచ్చేసిన హాలీవుడ్ యాక్ష‌న్ అడ్వెంచర్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?

0

హాలీవుడ్ సినిమాలు చూసే వారికి సూపర్‌ హిట్‌ ఫ్రాంచైజీ ‘మ్యాడ్‌ మ్యాక్స్‌’ గురించి తెలిసే ఉంటుంది. యాక్షన్, అడ్వెంచర్ అండ్ సర్వైవల్ జానర్ లో వచ్చిన ఈ సినిమాలు సినీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. 1979లో ‘మ్యాడ్‌ మ్యాక్స్‌’ పేరుతో మొదటి సినిమా వచ్చింది. ఆ తర్వాత 1981లో మ్యాడ్ మ్యాక్స్ 2 (ది రోడ్ వారియర్). 1985లో మ్యాడ్ మ్యాక్స్ 3 (బియాండ్‌ థండర్‌ డోమ్‌), 2015లో మ్యాడ్ మ్యాక్స్ (ఫ్యూరీ రోడ్).. ఇలా మొత్తం నాలుగు సినిమాలు ఈ ఫ్రాంఛైజీలో వచ్చాయి. అన్ని సినిమాలు ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులను విశేషంగా అలరించాయి. ఈ సూపర్ హిట్ ఫ్రాంఛైజీ నుంచి వచ్చిన మరో సినిమానే ఫ్యూరియోసా: ఏ మ్యాడ్‌ మ్యాక్స్‌ సాగా. 2015 లో వ‌చ్చిన మ్యాడ్ మ్యాక్స్ (ఫ్యూరీ రోడ్) సినిమాకు ప్రీక్వెల్‌గా ఈ మూవీ తెరకెక్కింది. ఈ ఫ్రాంఛైజీ మొదటి మూడు భాగాలలో మెల్‌ గిబ్సన్‌ హీరోగా నటించగా నాలుగో చిత్రం ‘మ్యాడ్‌ మ్యాక్స్‌: ఫ్యూరీ రోడ్‌ నుంచి టామ్‌ హార్డీ హీరోగా నటించారు. మే 23న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఫ్యూరియోసా: ఏ మ్యాడ్‌ మ్యాక్స్‌ సాగా సూపర్ హిట్ గా నిలిచింది. హాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లనే రాబట్టింది. ఇప్పుడీ సూపర్ హిట్ సినిమా సైలెట్ గా ఓటీటీలోకి వచ్చేసింది. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం (జులై 05) అర్ధరాత్రి నుంచే ఫ్యూరియోసా సినిమాను స్ట్రీమింగ్ కు అందుబాటులోకి తీసుకొచ్చింది.

అయితే ప్రస్తుతం ఈ సినిమా కేవలం రెంటల్ బేసిస్ లో మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలోనే అమెజాన్ ప్రైమ్ యూజర్లకు ఉచితంగా చూసే అవకాశం రానుంది. మొదటి నాలుగు సినిమాలను తెరకెక్కించిన అస్ట్రేలియన్ డైరెక్ట‌ర్ జార్జ్ మిల్లర్ ఫ్యూరియోసా: ఏ మ్యాడ్‌ మ్యాక్స్‌ సాగా కు కూడా దర్శకత్వం వహించారు. ఇందులో థోర్ ఫేమ్ క్రిస్ హెమ్స్ వర్త్ హీరోగా నటించాడు. ది మెన్ మూవీ ఫేమ్ అన్యా టేలర్, చార్లస్ థెరన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ ఫ్రాంఛైజీలో ఐదో భాగం మ్యాడ్ మ్యాక్స్ (ది వేస్ట్ ల్యాండ్) షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Telugu Indian Idol Season 3: కీలక దశకు ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3.. టాప్-12 కంటెస్టెంట్స్ వీళ్లే

0

ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 కీలకమైన ఓటింగ్ దశలోకి ప్రవేశించింది. గత మూడు వారాలుగా స్ట్రీమింగ్ అయిన ఆరు థ్రిల్లింగ్ ఎపిసోడ్‌లు వీక్షకులను ఆకర్షించాయి. ఇప్పుడు మూడో సీజన్ కీలకమైన ఓటింగ్ దశకు చేరుకోవడంతో ఈ వారం నుంచి సింగింగ్ పోటీలు మరింత రసవత్తరంగా సాగనున్నాయి. వచ్చే వారం నుంచి పబ్లిక్ ఓటింగ్ ఆధారంగా ప్రతి వారం ఒక కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతారు. చివరి వారాల్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీలు కూడా ఉంటాయి. మిగిలిన 5-6 ఫైనలిస్టులు రాబోయే గ్రాండ్ ఫినాలేలో టైటిల్ కోసం పోటీపడతారు. కాగా ఇండియన్ ఐడల్ విజేతలను ఎంచుకోవడానికి సామాన్యులకు కూడా అవకాశం కల్పిస్తోంది ఆహా. అంటే మీకు ఇష్టమైన కంటెస్టెంట్స్ కు ఓటు వేసి మద్దతు తెలపవచ్చు. ఇందుకోసం ఆహా యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకుని మీకు నచ్చిన కంటెస్టెంట్ కు ఓటు వేయవచ్చు. కాగా ప్రతి పోటీదారునికి నిర్దేశించిన నంబర్‌లకు మిస్డ్ కాల్స్ ఇవ్వడం ద్వారా కూడా ప్రజలు ఓటు వేయవచ్చు. ఓటింగ్ లైన్లు శుక్రవారం రాత్రి 7 గంటల నుండి అందుబాటులో ఉంటాయి. ఆదివారం ఉదయం 7 గంటల వరకు ఓటు వేసే అవకాశం ఉంటుంది.

ఆహా ఇండియన్ ఐడల్ మూడో సీజన్‌కు సంబంధించిన ఆడిషన్‌లకు అత్యధిక స్పందన లభించింది, 15,000 కంటే ఎక్కువ మంది ఔత్సాహిక గాయకులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. చివరకు 12 మంది టాప్ కంటెస్టెంట్స్ తదుపరి రౌండ్ కు అర్హత సాధించారు. ఈ ఫైనలిస్టులలో భరత్ రాజ్, కీర్తన, కేశవ్ రామ్, హరి ప్రియ, శ్రీ కీర్తి, నసీరుదిన్, స్కంద, దువ్వూరి శ్రీధృతి, రజనీ శ్రీ, సాయి వల్లభ, ఖుషాల్ శర్మ, అనిరుధ్ సుస్వరం వంటి ట్యాలెంటెడ్ సింగర్లు ఉన్నారు. ఇందులో ఆరుగురు పోటీదారులకు గోల్డెన్ మైక్‌లు లభించగా, మిగిలిన ఆరుగురికి గోల్డెన్ టిక్కెట్‌లు లభించాయి.

ఇవి కూడా చదవండి

గోల్డెన్ మైక్ అందుకున్న కంటెస్టెంట్స్ నేరుగా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 తదుపరి రౌండ్‌కు చేరుకున్నారు. అదే సమయంలో, గోల్డెన్ టిక్కెట్‌ను పొందిన వారు పోటీలో చోటు కోసం న్యాయనిర్ణేతల నుండి ఆమోదం పొందాల్సి ఉంటుంది.

గోల్డెన్ మైక్ గ్రహీతలు:
1. స్కంద
2. హరిప్రియ
3. శ్రీ కీర్తి
4. కేశవ్ రామ్
5. సాయి వల్లభ
6. అనిరుధ్ సుస్వరం

గోల్డెన్ టిక్కెట్ గ్రహీతలు:

1. ఎల్ కీర్తన
2. భరత్ రాజ్
3. రజనీ శ్రీ పూర్ణిమ
4. నజీరుద్దీన్ షేక్
5. ఖుషాల్ శర్మ
6. దువ్వూరి శ్రీధృతి

కాగా ప్రతి శుక్రవారం, శనివారం రాత్రి 7 గంటలకు ఆహాలో ప్రసారమయ్యే తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 అప్ డేట్స్ ను పొందవచ్చు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Allari Naresh: కన్ఫ్యూజన్‌ లో అల్లరి నరేష్.? ఎటు తేల్చుకోలేని పరిస్థితి.. ఎందుకంటే.?

0

Deepika Padukone: దీపికకు పుట్టబోయేది ఆడ బిడ్డా? మగ బిడ్డా? ప్రముఖ జ్యోతిష్యుడు ఏం చెప్పాడో తెలుసా?

0

ప్రముఖ బాలీవుడ్ నటి దీపికా పదుకొణె జీవితంలో త్వరలో కొత్త అధ్యాయం ప్రారంభం కానుంది . త్వరలో ఆమె పండంటి బిడ్డకు జన్మనివ్వనుంది. దీంతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె దంపతులకు మగపిల్లాడా లేక ఆడపిల్లా అనే చర్చ ఇప్పటికే మొదలైంది. సోషల్ మీడియాలో ఫేమస్ అయిన పండిట్ జగన్నాథ్ గురూజీ ఈ విషయంపై జోస్యం కూడా చెప్పాడు. దీని ప్రకారం దీపికా పదుకొణె మగబిడ్డకు జన్మనివ్వబోతోందని జగన్నాథ్ గురూజీ తెలిపారు. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పండిట్ జగన్నాథ్ గురూజీ జోస్యం చెప్పారు. దీపికా పదుకొణె, రణ్‌వీర్‌సింగ్‌లకు మగబిడ్డ పుడితే అదృష్టవంతులు అవుతారని అన్నారు. ‘దీపిక, రణ్ వీర్ జాతకం ప్రకారం.. వారికి మగబిడ్డ పుడుతాడు. వారి జీవితానికి యువరాజు అవుతాడు. యువరాజులా ఉండే అబ్బాయి వారికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకొస్తారు’ అని పండిట్ జగన్నాథ్ చెప్పుకొచ్చారు. మరి ఈ జ్యోతిష్యుడి అంచనాలు నిజమవుతాయా? కాదా? అన్నది మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 29న దీపికా పదుకొణెలు గర్భం దాల్చినట్లు ప్రకటించింది. బహుశా సెప్టెంబర్‌లో దీపికా పదుకొణె తల్లి గా ప్రమోషన్ పొందనుంది.

కాగా నిండు గర్భిణి అయిన దీపిక పదుకొణె ఇటీవల ‘కల్కి 2898 AD’ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొంది. ఈ సినిమాలో కూడా గర్భిణి పాత్రలో నటించి అందరి దృష్టిని ఆకర్షించింది. కాగా సినీ పరిశ్రమలో దీపికా పదుకొణెకు చాలా డిమాండ్ ఉంది. అయితే ప్రస్తుతం గర్భవతి కావడంతో సినిమా పనులకు దూరంగా ఉంటోందీ అందాల తార.

ఇవి కూడా చదవండి

కల్కి సినిమా ప్రమోషన్లలో దీపికా పదుకొణె..

దీపిక పదుకొణె లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ ఫొటోలు..

కల్కి తర్వాత దీపిక నటించిన ‘ సింగం అగైన్’ సినిమా కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో రణవీర్ సింగ్ కూడా నటించాడు. రోహిత్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రం నవంబర్ 1న విడుదల కానుంది.

కల్కి సినిమాలో దీపికా పదుకొణె..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Maanas Nagulapalli: గ్రాండ్‌గా ‘బ్రహ్మముడి’ మానస్ భార్య సీమంతం.. ఫొటోస్ చూశారా?

0

Pooja Hegde: ఆ విషయంలో టిల్లు సలహాలు పాటిస్తున్న పూజా హెగ్డే.!

0

Hardik Pandya: T20 ప్రపంచ కప్ విజయాన్ని కొడుకుతో కలిసి సెలబ్రేట్ చేసుకున్న హార్దిక్.. కనిపించని నటాషా.. వీడియో

0

అనుభవజ్ఞుడైన ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా టీ20 ప్రపంచకప్ లో అద్భుతంగా రాణించాడు. భారత్ విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు. . ముఖ్యంగా దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో పాండ్యా మూడు ఓవర్లలో 20 పరుగులిచ్చి మూడు ముఖ్యమైన వికెట్లు తీశాడు. భారత జట్టు ఇప్పుడు దేశానికి తిరిగి వచ్చింది. జట్టులోని ఆటగాళ్లందరూ ఈ విజయాన్ని తమ అభిమానులతో గురువారం (జూలై 4న) జరుపుకొన్నారు. ఆ తర్వాత భారత జట్టులోని ఆటగాళ్లందరూ తమ ఇళ్లకు తిరిగివచ్చి కుటుంబసభ్యులతో కలిసి సంబరాలు చేసుకున్నారు. వారిలో హార్దిక్ పాండ్యా కూడా ఉన్నాడు. టీ20 ప్రపంచకప్ గెలిచి స్వదేశానికి వచ్చిన హార్దిక్ పాండ్యా ఈ టీ20 ప్రపంచకప్ విజయాన్ని తన కుటుంబంతో కలిసి సెలబ్రేట్ చేసుకున్నాడు. హార్దిక్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసిన ఈ ఫోటోలలో హార్దిక్ పాండ్యా కుమారుడు అగస్త్య మాత్రమే కనిపిస్తున్నాడు. కానీ అతని భార్య నటాషా మాత్రమే కనిపించలేదు.

తన కొడుకుతో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన పాండ్యా.. ‘నా నంబర్ వన్ ! నేనేం చేసినా నీ కోసమే చేస్తాను’ అని రాసుకున్నాడు. అయితే ఈ ఫోటోల్లో హార్దిక్ భార్య నటాషా మాత్రం ఎక్కడా కనిపించలేదు. దీంతో వీరిద్దరి వైవాహిక బంధంలో చీలిక వచ్చిందన్న వార్తలకు మరింత బలం చేకూరుతోంది. అలాగే మరోసారి వీరి విడాకుల పుకార్లు తెరపైకి వచ్చాయి.

ఇవి కూడా చదవండి

టీ20 ప్రపంచకప్‌లో హార్దిక్ పాండ్యా అద్భుత ప్రదర్శన చేశాడు. ఈ టోర్నీలో పాండ్యా బ్యాట్‌తో 144 పరుగులు చేసి బౌలింగ్‌లో 11 వికెట్లు పడగొట్టాడు. ఫైనల్ మ్యాచ్ లోనూ తన బౌలింగ్ తో సంచలనం సృష్టించాడు. మూడు ఓవర్లలో 20 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. ఇది కాకుండా, అతను చివరి ఓవర్లో 16 పరుగులు డిఫెండ్ చేశాడు. టీ20 ప్రపంచకప్‌లో అత్యుత్తమ ప్రదర్శనతో ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో పాండ్యాకు బహుమతి లభించడంతో పాటు తాజాగా టీ20 ఆల్‌రౌండర్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Salaar 2: డార్లింగ్ ఫ్యాన్స్ గుడ్ న్యూస్.. సలార్‌2 షూటింగ్‌ ఎంత పూర్తయిందో తెలుసా.?

0