Priyadarshi and Nabha Natesh starrer unique rom-com Darling directed by debutant Aswin Raam has generated significant enthusiasm with the hilarious teaser, followed by two super hit songs. The film produced by K Niranjan Reddy and Smt Chaitanya of PrimeShow Entertainment is due for release on the 19th of this month. Today, hero Vishwak Sen launched the film’s theatrical trailer.
It’s the story of a young couple with different characterizations. The guy is very innocent and his only aim in life is to marry a nice girl and take her on a honeymoon in Paris. However, his dreams shatter with Anandi entering his life as a wife. She beats him every day, shattering all his dreams and making life hell. While many think she is possessed by an evil force, it is revealed that she has split personality disorder. Priyadarshi is outstanding in the role of a typical youth with dreams about marriage, whereas Nabha’s character has different layers and the split personality disorder adds a new dimension to the character.
స్టార్ డాన్స్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. డాన్స్ మాస్టర్ గా అంచలంచలుగా ఎదుగుతూ ఇప్పుడు ఉన్నత స్థాయిలో ఉన్నారు. టాలీవుడ్ లో డాన్స్ మాస్టర్ అంటే ప్రభుదేవా, లారెన్స్ తర్వాత గుర్తొచ్చే పేర్లు శేఖర్ మాస్టర్ , జానీ మాస్టరే.. వీరిద్దరూ స్టార్ హీరోలకు డాన్స్ కొప్రియోగ్రాఫ్ చేస్తూ మంచి ఇమేజ్ సొంతం చేసుకుంటున్నారు. శేఖర్ మాస్టర్ మహేష్ బాబు, అల్లు అర్జున్ , చిరంజీవి లాంటి స్టార్స్ కు చాలా హుక్ స్టెప్స్ చేసి ఫెమస్ అయ్యారు. ఓ వైపు డాన్స్ మాస్టర్ గా బిజీగా గడుపుతూనే మరో వైపు పలు టీవీ షోలకు జడ్జ్ గానూ వ్యవహరిస్తున్నారు శేఖర్ మాస్టర్. ప్రముఖ ఛానెల్ లో టెలికాస్ట్ అవుతున్న ఢీ అనే డాన్స్ షోకు కూడా శేఖర్ మాస్టర్ జడ్జ్ గా వ్యవహరిస్తున్నారు.
తాజాగా శేఖర్ మాస్టర్ స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్నారు. ఢీ సెలబ్రిటీ స్పెషల్ 1 డ్యాన్స్ షో అనే ప్రోగ్రాం విజయాంతంగా పూర్తయ్యింది. ఇక ఇప్పుడు ఢీ సెలబ్రిటీ స్పెషల్ 2 డ్యాన్స్ షో మొదలైంది. ఈ షోకి శేఖర్ మాస్టర్ , క్రేజీ హీరోయిన్ హన్సిక, మరో డాన్స్ మాస్టర్ గణేష్ జడ్జ్ లుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఢీ సెలబ్రిటీ స్పెషల్ 2 నుంచి ఓ ప్రోమోను విడుదల చేశారు.
ఈ ప్రోమోలో హైపర్ ఆది తనదైన పంచులతో నవ్వులు పూయించాడు. ఆతర్వాత ఒకొక్కరు ఒకొక్క థీమ్ తో డాన్స్ చేసి ఆకట్టుకున్నారు. ఇంతలో ఓ కంటెస్టెంట్ డాన్స్ చేస్తూ ఒక్కసారిగా ఆగిపోయాడు. కారణం అడిగితే పక్కన డాన్సర్ గురించి ఆగిపోయాడు అంటూ ఎదో చెప్పాడు. దాంతో ఒక్కసారిగా శేఖర్ మాస్టర్ ఎమోషనల్ అయ్యారు. డాన్స్ అంటే తనకు ఎంత ఇష్టమో ఆయన తన కన్నీళ్లతో చెప్పారు.మేము మేము డాన్సర్స్ కదా మాకు డాన్స్ తప్ప మరొకటి రాదు. డాన్స్ మిస్ అయితే మాస్టర్ ఎక్కడ వెళ్ళిపోతాడా.? మాస్టర్ వెళ్ళిపోతే మాకు ఎక్కడ పని పోతుందా అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఫైనల్ టాస్క్ లో డ్యాన్సర్లు అదరూ అరిస్తే.. అంటూ ఎమోషనల్ అయ్యారు శేఖర్ మాస్టర్. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. చేస్తున్న వృత్తి పై శేఖర్ మాస్టర్ కు ఎంత గౌరవం , ప్రేమ ఉన్నాయో అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన హీరోయిన్ అతుల్య రవి. యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన మీటర్ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన ఈ బ్యూటీ ఆ తర్వాత మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు. ఇక టాలీవుడ్‌లో ఈ బ్యూటీ చేసిన మీటర్ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశపరచడంతో తెలుగులో మరో ఆఫర్ అందుకోలేదు. ప్రస్తుతం అతుల్య రవి తన తల్లి విజయలక్ష్మితో కలిసి కోయంబత్తూరులోని వాడవల్లి మారుతం రోడ్డులో నివసిస్తోంది. తాజాగా ఈ హీరోయిన్ ఉంటున్న ఇంట్లో చోరీ జరిగినట్లు సమాచారం. కొద్దిరోజుల క్రితం ఈ హీరోయిన్ ఇంట్లో నుంచి ఆమె పాస్ పోర్టుతోపాటు 2000 రూపాయిలు కనిపించకుండా పోయాయట. దీంతో అతుల్య రవి తల్లి విజయలక్ష్మి వాడవల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. ఇంట్లో పనిచేసే పనిమనిషి చోరీకి పాల్పడినట్లు తెలిసింది.
తొండముత్తూరు పక్కనే ఉన్న కులత్తుపాలేనికి చెందిన మహిళ కొన్నాళ్లుగా అతుల్య రవి ఇంట్లో పనిచేస్తున్నారు. ఇంట్లో చోరీ జరిగినట్లు అతుల్య రవి తల్లి ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు స్టార్ట్ చేసిన పోలీసులు పనిమనిషిపై అనుమానం వ్యక్తం చేశారు. దీంతో సదరు మహిళను విచారించగా అసలు విషయం బయటకు వచ్చింది. తన స్నేహితురాలు సెల్వి, సుభాషిణితో కలిసి హీరోయిన్ ఇంట్లో దొంగతనం చేశామని.. డబ్బు, పాస్ పోర్టు దొంగిలించినట్లు ఆ పనిమనిషి పోలీస్ విచారణలో చెప్పింది. దీంతో పనిమనిషితోపాటు మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు ప్రభాస్. డార్లింగ్ మ్యారెజ్ గురించి అటు ఫ్యామిలీ మెంబర్స్, ఇటు ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ ఎక్కడికి వెళ్లినా.. లేదా ఏ మూవీ ప్రమోషన్స్ జరిగినా డార్లింగ్ పెళ్లి గురించి ఖచ్చితంగా ఓ ప్రశ్న ఉంటుంది. ఇక ప్రభాస్ పెళ్లి చేసుకున్నాకే మేము మ్యారెజ్ చేసుకుంటామని ఇప్పటికే చాలా మంది హీరోలు ఫన్నీగా కామెంట్స్ కూడా చేసిన సంగతి తెలిసిందే. ఇక డార్లింగ్ పెళ్లి గురించి ఇప్పటికే ఎన్నో రూమర్స్ సోషల్ మీడియాలో వైరలయ్యాయి. టాలీవుడ్ టూ బాలీవుడ్ కు చెందిన ఫలానా హీరోయిన్‌తో డార్లింగ్ ఏడడుగులు వేయనున్నారంటూ నెట్టింట రూమర్స్ వినిపించాయి. ఇక పలువురు జ్యోతిష్యులు కూడా ప్రభాస్ పెళ్లిపై ఆసక్తికర విషయాలు చెప్పారు. ఇక ప్రభాస్ కెరీర్ లో హిట్టు పడదని… పెళ్లి కాదని ఇలా రకరకాల కామెంట్స్ చేశారు. బాహుబలి తర్వాత పెళ్లి చేసుకుంటానని చెప్పిన ప్రభాస్.. ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదు. చేతినిండా సినిమాలతో అస్సలు తీరకలేకుండా గడిపేస్తున్నారు. తాజాగా ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా దేవి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ డార్లింగ్ పెళ్లి గురించి చెప్పుకొచ్చారు.
శ్యామలా దేవి మాట్లాడుతూ.. “మంచితనం మనిషిని ఏ స్థాయికి తీసుకెళ్తుందో ప్రభాస్ సక్సెస్ తో రుజువైంది. బాహుబలి తర్వాత ప్రభాస్ కు విజయం దక్కదని కొందరు అన్నారు. కానీ వారి అంచనాలు అన్ని తారుమారు అయ్యాయి. ప్రభాస్ పెళ్లి విషయంలోనూ అంతే జరుగుతుంది. కోట్లాది మంది అభిమానులు ఆశించినట్లుగా తన సినిమాలు ఉండేందుకు ప్రభాస్ ఎంతగానో శ్రమిస్తున్నాడు. బాధ్యతగా తీసుకుని దృష్టి మరలకుండా సినిమాలు చేస్తున్నాడు. ప్రభాస్ కు పెళ్లి చేయాలని మాకు ఉంటుంది. కానీ సమయం రావాలి. ఆ నమ్మకంతోనే ఉన్నాం. అన్ని విషయాలు పైనుంచి కృష్ణంరాజు చూసుకుంటారు. ఇప్పటివరకు ఆయన ఆశించినవన్నీ జరిగాయి. మ్యారేజ్ కూడా జరుగుతుంది ” అంటూ చెప్పుకొచ్చారు.
ప్రభాస్ పెళ్లి గురించి శ్యామలాదేవి మాట్లాడడం ఇది మొదటిసారి కాదు. గతంలో అనేకసార్లు డార్లింగ్ పెళ్లి గురించి వచ్చిన రూమర్స్ పై స్పందించారు. అలాగే ఏ మూవీ ఈవెంట్స్ అయినా.. ఎక్కడికి వెళ్లినా ప్రభాస్ మ్యారెజ్ గురించి ప్రశ్న రావడం.. శ్యామలాదేవి స్పందించడం జరుగుతుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడి సినిమా బాక్సాఫీస్ షేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఆచి తూచి సినిమాలు చేస్తున్నాడు. రోడ్డు ప్రమాదం నుంచి బయట పడిన తర్వాత తేజ్ స్పీడ్ తగ్గించాడు. కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తూ మంచి విజయాలను అందుకుంటున్నాడు. విరూపాక్ష సినిమాతో సూపర్ హిట్ అందుకున్న తేజ్ ఆతర్వాత బ్రో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి నటించాడు తేజ్. ఈ సినిమా కూడా పర్లేదు అనిపించుకుంది. ఇక ఇప్పుడు వరుసగా సినిమాలను లైనప్ చేసి ఆయా షూటింగ్స్ తో బిజీగా ఉన్నాడు తేజ్. అలాగే సోషల్ మీడియాలో సాయి ధరమ్ తేజ్ చాలా యాక్టివ్ గా ఉంటాడు. ఇటీవలే మావయ్య పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత ఆ ఆనందంలో తేజ్ చేసిన అల్లరి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే తేజ్ తాజాగా తల్లిదండ్రులకు ఓ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ఓ సుదీర్ఘ పోస్ట్ షేర్ చేశాడు. సోషల్ మీడియా చాలా ప్రమాదకరంగా మారింది అని తేజ్ అభిప్రాయపడ్డాడు. ” సోషల్ మీడియా చాలా క్రూరంగా, ప్రమాదకరంగా మారిపోయింది. దయ చేసి జాగ్రత్తగా ఉండండి. కంట్రోల్ చేయడం చాలా కష్టంగా మారింది. పొరపాటున ఒక్క పోస్ట్ పెడితే చాలు దారుణమైన పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది.
కాబట్టి మీరు మీ పిల్లల ఫోటోలు, లేదా వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసేటప్పుడు దయచేసి జాగ్రత్తగా ఉండండి.. అలాగే పోస్ట్ చేసేముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. ఇది నా అభ్యర్థన. దయచేసి సోషల్ మీడియాలో ఉండే జంతువులను ప్రమాదకరంగా మార్చకండి. దయచేసి మీ పిల్లలఫోటోలను లేదా వీడియోలను పోస్ట్ చేసే ముందు జాగ్రత్తగా ఉండండి. కొంతమంది చేసే కామెంట్స్ చూసి మీరు తట్టుకోలేరు. మిమ్మల్ని ఎంతగానో బాధపెడతాయి ఆ కామెంట్స్.. మీ పిల్లల ఫోటోలు, వీడియోలు షేర్ చేయకపోవడం మంచిది అని నా భావన. అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు తేజ్. ఈ పోస్ట్ పై నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. కరెక్ట్ గా చెప్పారు అన్న అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
సాయి ధరమ్ తేజ్ పోస్ట్..
To whom so ever it may concern, my kind request to all the parents is to please use some sort of discretion when you post a video or photos of your kids as the world of social media has become ruthless and dangerous and is very difficult to control or stop these animals from…
యాబైకి పైగా చిత్రాల్లో హీరోయిన్‌గా, విలక్షణ పాత్రల్లో మెప్పించిన నటి అంజలి. తాజాగా ఆమె ప్రధాన పాత్రలో జీ 5, పిక్సల్ పిక్చర్స్ ఇండియా బ్యానర్స్‌పై రూపొందుతోన్న వెబ్ సిరీస్ ‘బహిష్కరణ’. ముఖేష్ ప్రజాపతి ఈ సిరీస్‌ను తెరకెక్కిస్తున్నారు. విలేజ్ రివేంజ్ డ్రామా జోనర్‌లో రూపొందుతోన్న ఈ సిరీస్‌లో 6 ఎపిసోడ్స్ ఉంటాయి. ఈ వెబ్ సిరీస్ జూలై 19 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కాబోతోంది. తాజాగా ఈ సిరీస్ టీజర్‌ను విడుదల చేశారు. టీజర్‌ను గమనిస్తే.. రేడియోలో చక్కటి పాట వస్తుంటుంది.. ప్రశాంతమైన పల్లెటూరు.. బస్సులో కూర్చున్న అమ్మాయి ఆ స్వచ్చమైన గాలిని ఆస్వాదిస్తుంటుంది.. ఈ సన్నివేశంతో ప్రారంభమైన టీజర్‌కు ఈ ప్రపంచం లొంగిపోయేది రెండిటికే .. ఒకటి సొమ్ముకి, ఇంకొకటి సోకు అనే డైలాగ్ ఓ అమ్మాయి ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకున్న తీరుని చెప్పే ప్రయత్నం చేస్తుంది. అంజలి మరో విలక్షణమైన పాత్రలో మెప్పించే ప్రయత్నం చేసిందని టీజర్‌లో ఆమె నటించిన సన్నివేశాలను చూస్తుంటే అర్థమవుతుంది.
ఓ వైపు ప్రేమ కురిపిస్తూనే మరో వైపు ఆగ్రహావేశంతో ఊగిపోయే ఆమె పాత్రను చూస్తుంటే ఆమె పోషించిన పాత్రలోని భావోద్వేగాలు ఎంత లోతుల్లో ఉన్నాయో అర్థమవుతుంది. ప్రశాంతంగా ఉండే ఆ పల్లెటూరుకి అమ్మాయి ఎందుకు వచ్చింది.. ఆమెకు అక్కడ ఎదురైన పరిస్థితులేంటి? ఆమె ఎవరిపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంది.. ఎందుకు? అనే విషయాలు తెలియాలంటే జూలై 19న జీ 5లో స్ట్రీమింగ్ కానున్న ‘బహిష్కరణ’ సిరీస్ చూడాల్సిందే. ఈ సిరీస్‌కు ప్రసన్నకుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా సిద్ధార్థ్ సదాశివుని సంగీతాన్ని సమకూరుస్తున్నారు. రవితేజ గిరిజాల ఎడిటర్‌గా బాధ్యతలను నిర్వహిస్తున్నారు.
భారతదేశంలో అతి పెద్ద ఓటీటీ మాధ్యమం జీ5. పలు భాషల్లో వైవిధ్యమైన సినిమాలు, సిరీస్‌లతో ప్రేక్షకులకు అపరిమితమైన వినోదాన్ని ఇది అందిస్తోంది. ఇదే క్రమంలో ‘బహిష్కరణ’ వంటి డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఆడియెన్స్‌ను త్వరలోనే అలరించనుంది.
జీ5 3,500 సినిమాల లైబ్రరీ ఉన్న ప్లాట్‌ఫార్మ్ . 1,750 టీవీ షోలు, 700 ఒరిజినల్స్, 5 లక్షలకు పైగా ఆన్ డిమాండ్ కంటెంట్ ఉంది. 12 భాషల్లో (హిందీ, ఇంగ్లిష్, బెంగాలీ, మలయాళం, తెలుగు, తమిళ్, మరాఠీ, ఒరియా, భోజ్‌పురి, గుజరాతీ, పంజాబీ)లో అందుబాటులో ఉంది. ఒరిజినల్స్, ఇంటర్నేషనల్ మూవీస్, టీవీ షోస్, మ్యూజిక్, కిడ్స్ షోస్, ఎడ్‌టెక్, సినీ ప్లేస్, న్యూస్, లైవ్ టీవీ, హెల్త్, లైఫ్‌స్టైల్ విభాగాల్లో ప్రేక్షకులను రంజింపజేస్తోంది. జీ5 12 భాషల్లో అత్యద్భుతమైన కంటెంట్‌ని ప్రేక్షకులకు అందిస్తుంది
ప్రముఖ సినీ గేయ రచయిత కనుకుంట్ల సుభాస్ చంద్రబోస్ గొప్ప మనసును చాటుకున్నారు. గతంలో తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ తన సొంతూరులో ఓ మంచి పని చేసి అందరి మన్ననలు అందుకున్నారు. ఇక తన సాహిత్యంతో తెలుగు సినిమా ఇండస్ట్రీపై చెరగని ముద్ర వేసిన చంద్రబోస్ ట్రిపుల్ ఆర్ మూవీలో రాసిన నాటు నాటు పాటకు ఆస్కార్ పురస్కారం అందుకున్నారు. ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు వచ్చిన సందర్భంగా .. చంద్ర బోస్ తన సొంతూరు అయిన జయశంకర్ భూపాల పల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగెలోని గ్రామ ప్రజలు ఆయనను ఘనంగా సన్మానించారు. చల్లగరిగె ప్రజలు తనపై చూపిన ప్రేమాభిమానాలకు ముగ్ధుడైన ఆయన అక్కడ ఆస్కార్ గ్రంథాలయం ఏర్పాటు చేస్తామని మాటిచ్చాడు. ఇప్పుడు ఆ మాటను నిలబెట్టుకున్నారు చంద్రబోస్.
గ్రామంలో ఇది వరకు ఉన్న పాత గ్రంథాలయాన్ని తొలగించి 36 లక్షలతో కొత్త భవనాన్ని చంద్రబోస్ నిర్మించారు. జులై 04న ఈ ఆస్కార్ గ్రంథాయాన్ని ప్రారంభించారు. భూపాలపల్ల ఎమ్మెల్యే గండ్ర త్యనారాయణరావు, చంద్రబోస్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఇక ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతుండగా.. చంద్రబోస్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడనే కామెంట్ నెట్టింట వస్తోంది.
సెలబ్రెటీల త్రో బ్యాక్ ఫోటోలు సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతూ ఉంటాయి. వందల కొద్దీ హీరోయిన్స్ ఫోటోలు సోషల్ మీడియా షేర్ చేస్తూ సందడి చేస్తుంటారు అభిమానులు .. ముఖ్యంగా హీరోయిన్స్ చైల్డ్ హుడ్ ఫోటోలు ఎక్కువగా వైరల్ అవుతుంటాయి.
పై ఫొటోలో రెండు పిలకల పిల్లను గుర్తుపట్టారా.? కఇప్పుడు క్రేజీ హీరోయిన్ ఆమె. చేసింది తక్కువ సినిమాలే అయినా విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. ఓ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఈ అమ్మడికి. ఆమె ఎవరో కనిపెట్టారా.?
ఆ ముద్దుగుమ్మ పేరు రిద్ధి కుమార్.. రాజ్ తరుణ్ హీరోగా నటించిన లవర్ అనేసినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయం అయ్యింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. లవర్ సినిమాలో ఈ అమ్మడి నటనకు మంచి మార్కులు పడ్డాయి.
అలాగే రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన రాధే శ్యామ్ మూవీలో కూడా నటించి మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ఈ సినిమాలో ఆమె కనిపించేది కొంత సేపే అయినా తన నటనతో ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ.
ఈ బ్యూటీ తెలుగులోనే మలయాళం, మరాఠి భాషల్లోనూ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక ఇప్పుడు ఈ బ్యూటీ మరోసారి ప్రభాస్ సినిమాలో నటించనుంది. రాజా సాబ్ సినిమాలో రిద్ధి కుమార్ నటిస్తుంది. ఈ సినిమా తప్ప మరో సినిమా ఈ బ్యూటీ చేతిలో లేదు.
గంగోత్రి’ సినిమాతో బాలనటిగా ఇండస్ట్రీకి పరిచయమైంది కొత్త గూడెంకు చెందిన కావ్య కళ్యాణ్ రామ్. ఆ సినిమాలో 'వల్లంగి పిట్ట' అంటూ తెలుగు ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకుంది. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని బలగం సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.
బలగం సినిమాలో కావ్య నటనకు అందరూ ఫిదా అయ్యారు. ఆ తర్వాత ఉస్తాద్, మసూద సినిమాల్లోనూ నటించిందీ అందాల తార.
సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది కావ్య. తన లేటెస్ట్ ఫొటోలు, వీడియోలను అందులో షేర చేస్తూ ఫాలోవర్లను మాయ చేస్తోంది.
ఎక్కువగా మోడ్రన్ డ్రెస్ లో కనిపించే ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ట్రెడిషనల్ లుక్‌లో దర్శనమిచ్చింది. లంగా ఓణి కట్టుకొని ఫొటోలకు పోజుల్చింది.
అలా కావ్య కల్యాణ్ రామ్ షేర్ చేసిన ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి. వీటిని చూసిన ఫ్యాన్స్, నెటిజన్లు క్రేజీ కామెంట్లు చేస్తున్నారు.
సమంత.. స్టార్ హీరోయిన్.. టాలీవుడ్, కోలీవుడ్‌తోపాటు.. బాలీవుడ్‌నూ ఏలేస్తోంది. అంతేకాదు.. సోషల్ మీడియా.. అందులోనూ.. ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. అయితే.. కొన్నాళ్ల క్రితం మయోసైటిస్ అనే వ్యాధికి గురైన సమంత.. అప్పుడప్పుడు ఆరోగ్యానికి సంబంధించిన అప్‌డేట్స్, కొటేషన్స్ పోస్టు చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే.. తాజాగా సమంత ఇన్‌స్టాలో పెట్టిన ఓ పోస్టు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆ పోస్టు ఆమెను వివాదంలోకి లాగింది. ఇక మయొసైటిస్ నుంచి కోలుకుంటున్న సమంత.. కొన్నాళ్లుగా ప్రత్యామ్నాయ వైద్య విధానాల్ని అనుసరిస్తోంది. వాటికి సంబంధించిన వివరాల్ని కూడా ఆమె ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటోంది. దానిలో భాగంగానే.. సమంత నెబ్యులైజర్‌ను ఉపయోగిస్తున్న ఫోటోను షేర్ చేసింది.
అంతేకాదు సాధారణ వైరల్ ఇన్ఫెక్షన్లు వచ్చినపుడు డిస్టిల్డ్ వాటర్‌లో హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి నెబ్యులైజ్ చెయ్యండని చెప్తూ లివర్ డాక్టర్ తన ఇన్‌స్టాలో పెట్టినట్లు సమంత చెప్పుకొచ్చింది. అంతే.. సమంత చెప్పిన ఆ ఫార్ములాపై కొందరు డాక్టర్లు మండిపడ్డారు. ఆమెపై ఒక్కసారిగా విమర్శలతో విరుకుపడ్డారు. అందులోనూ మెయిన్‌గా హైడ్రోజన్ పెరాక్సైడ్‌తో చేసే నెబ్యులైజేషన్ గురించి సమంత ప్రస్తావించడంపై అభయ్ ఫిలిప్ అనే లివర్ డాక్టర్ భగ్గుమన్నారు. తనకుతాను డాక్టర్ లా ఫీల్ అయి ఉచిత సలహాలు ఇవ్వొద్దని సమంతకు సూచించారు. సమంత చెప్పిందని ఎవరైనా ప్రయత్నిస్తే ప్రాణాలు పోతాయని హెచ్చరించారు. హైడ్రోజన్ పెరాక్సైడ్ పీల్చడం వల్ల కలిగే ప్రమాదాలను హైలైట్ చేస్తూ.. అమెరికాకు చెందిన ఆస్తమా, అలెర్జీ ఫౌండేషన్ హెచ్చరికలను ప్రస్తావించారు. సెలబ్రిటీ ముసుగులో తప్పుడు సమాచారంతో తప్పుదోవ పట్టిస్తున్న సమంతపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని, ఆమెను జైల్లో పెట్టాలని డిమాండ్ చేశారు డాక్టర్ అభయ్ ఫిలిప్.