Home Blog Page 499

Pawan Kalyan: సనాతనం సమ్మోహనం.. పవన్ కళ్యాణ్ దీక్ష విరమణ.. వీడియో.

0

ఓ పక్క ఏపీలో తన పాలనను సమర్ధవంతంగా సాగిస్తూ.. మరో పక్క తన శాఖల అధికారులతో.. సమావేశాలు నిర్వహిస్తున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్..! ఇంకో పక్క తనను గెలిపించిన ప్రజల మధ్యకెళ్లి వారి కష్టసుఖాలు తెలుసుకుంటూ.. సభల్లో మాట్లాడుతూ..! యమా బిజీగా ఉన్నారు. అయినా సరే.. వారాహి అమ్మవారి ఆరాధనకు, పూజకు ప్రత్యేక సమయం కేటాయించారు జనసేనాని. ఎల్లవేళల నిష్టగా వారాహి అమ్మవారి దీక్షా నియమాలు పాటిస్తూ.. ఆ అమ్మవారి అనుగ్రహ కటాక్షాలు పొందే ప్రయత్నం చేశారు. ఇక ఈ క్రమంలోనే వారాహి ఏకాదశ దిన దీక్షలో భాగంగా.. ఆదిత్యారాధన చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోతో.. జనసేనుడి జన్మ ధన్యం అనే కామెంట్ తన అన్ని వర్గాల నుంచి, ఫ్యాన్స్ నుంచి వచ్చేలా చేసుకుంటున్నారు ఈయన.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Kerintha: కేక పెట్టించిన కేరింత భామ.. ఇప్పుడు చూస్తే స్టార్ హీరోయిన్స్ కూడా కుళ్లుకోవాల్సిందే

0

ఇండస్ట్రీలో చాలా సినిమాలు ప్రేక్షకులను మెప్పించి మంచి మార్కులు కొట్టేశాయి. చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడా లేకుండా కంటెంట్ కనెక్ట్ అయితే చాలు ప్రేక్షకులు ఆ సినిమాను సూపర్ హిట్ చేస్తున్నారు. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన సినిమాలు కూడా మంచి విజయాలను దక్కించుకుంటున్నాయి. ఇక చాలా సినిమాలు యువతను ఆకట్టుకునే కథలతో తెరకెక్కి సూపర్ హిట్స్ గా నిలుస్తున్నాయి. అలాంటి సినిమాల్లో కేరింత సినిమా ఒకటి. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు కేరింత సినిమాను తెరకెక్కించారు. సాయికిరణ్ అడవి  దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సుమంత్ అశ్విన్, విశ్వంత్ దుడ్డుంపూడి, పార్వతీశం, శ్రీదివ్య, సుకృతి అంబటి, తేజస్వి మదివాడ  ప్రధానపాత్రల్లో నటించారు.

ఇది కూడా చదవండి :Nandamuri Mokshagna: ఇదెక్కడి మాస్ రా మావా..!! నందమూరి మోక్షజ్ఞకు జోడీగా కుర్రాళ్ళ ఫెవరెట్ హీరోయిన్

యువతీ యువకుల మధ్య ఉండే ప్రేమ, స్నేహం ఈ సినిమాలో చక్కగా చూపించాడు దర్శకుడు. అలాగే ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ అందించిన సంగీతం ప్రేక్షకులను అలరించింది. సాయికిరణ్ ఇంతకుముందు తీసిన వినాయకుడు, విలేజ్ లో వినాయకుడు సినిమాలతో సెన్సిబుల్ దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సినిమాను కూడా మంచి కాన్సెప్ట్ తో తెరకెక్కించాడు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో నటించిన చాలా మంది మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే ఈ సినిమాలో పార్వతీశంకు జోడీగా నటించిన హీరోయిన్ గుర్తుందా.? ఆమె పేరు సుకృతి అంబటి.

ఇది కూడా చదవండి: Sai Pallavi: పదేళ్లుగా అతనితో రిలేషన్‌లో ఉన్నా.. అసలు విషయం చెప్పి షాక్ ఇచ్చిన సాయి పల్లవి

కేరింత సినిమా తర్వాత ఆమె పెద్దగా కనిపించలేదు. పెళ్లి చేసుకొని ఫ్యామిలీ లైఫ్ లోకి అడుగుపెట్టింది. కేరింత సినిమాలో భావన అనే పాత్రలో చక్కగా నటించి మెప్పించింది ఈ అమ్మడు. కాగా చిన్నతనంలోనే తల్లి చనిపోవడంతో తండ్రి పెంపకంలోనే పెరిగిన సుకృతి.. ఢిల్లీలోని కులచి హన్స్ రాజ్ స్కూల్లో చదువుకుంది. రాజస్థాన్‌లోని బనస్థలి యూనివర్సిటీలో ఇంజినీరింగ్ పూర్తి చేసింది. సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ అమ్మడు సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.

సుకృతి అంబటి సోషల్ మీడియా పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Payal Rajput: ‘ఆ హీరో ఇంటే చాలా ఇష్టం.. ఏదడిగినా చేసిపెడతా’.. మనసులో మాట బయటపెట్టిన పాయల్ రాజ్‌పుత్

0

‘ఆర్‌ఎక్స్‌ 100’ సినిమాతో రివ్వున టాలీవుడ్ లోకి దూసుకొచ్చింది పంజాబీ బ్యూటీ పాయల్ రాజ్ పుత్. మొదటి సినిమాతోనే అందం, అభినయం పరంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. వరుసగా సినిమా అవకాశాలు కూడా సొంతం చేసుకుంది. అయితే సక్సెస్ మాత్రం ఆర్ ఎక్స్ 100 దగ్గరే ఆగిపోయింది. చాలా రోజులకు గానీ ‘మంగళవారం’ సినిమాతో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కలేదీ అందాల తార. ఇటీవల రక్షణ సినిమాలో పోలీసాఫీసర్ గా కనిపించిన పాయల్ రాజ్ పుత్ తన ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. అలాగే టాలీవుడ్ హీరోలు, హీరోయిన్ల గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకుంది. ‘నాకు సినిమా ఇండస్ట్రీలో ఇలియానా, అనుష్కశెట్టి అంటే ఇష్టం. హీరోల్లో పవన్ ‌కళ్యాణ్‌ సినిమాలు ఎక్కువగా చూస్తాను. అవకాశం వస్తే మహేశ్‌బాబు, ప్రభాస్‌ సినిమాల్లో నటించాలని ఉంది. ప్రభాస్‌ నా ఫేవరెట్‌. ఆయనకు లంచ్‌ ఏర్పాటు చేయాలనుకుంటున్నా. తను ఏది అడిగితే అది చేసిపెట్టాలని నా కోరిక. రాజ్మా రైస్‌ అంటే నాకు చాలా చాలా ఇష్టం. దాన్ని నేనే స్పెషల్‌గా వండి నా చేత్తో హీరో ప్రభాస్‌కు తినిపించాలని ఉంది. అలాంటి ఛాన్స్‌ వస్తే మాత్రం అస్సలు వదులుకోను’ అని మనసులోని మాటను బయట పెట్టింది పాయల్ రాజ్ పుత్.

త్వరలోనే ఓటీటీలోకి పాయల్ రాజ్ పుత్ రక్షణ

మంగళవారం లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత పాయల్ రాజ్ పుత్ నటించిన చిత్రం రక్షణ. ఇప్పటివరకు ప్రేమ కథలు, లవ స్టోరీస్, నెగిటివ్ రోల్స్ సినిమాల్లో నటించి మెప్పించిన పాయల్ మొదటి సారిగా ఇందులో పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో కనిపించింది. జూన్ 7 న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది. అయితే ఇప్పుడీ సినిమా ఓటీటీలోకి రానుంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా రక్షణ సినిమా స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జులై 12 న లేదా 19 తేదీల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ కు రావచ్చని సమాచారం. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రణదీప్ ఠాకూర్ తెరకెక్కించిన రక్షణ సినిమాలో బ్రహ్మముడి మానస్ విలన్ రోల్ లో మెప్పించడం గమనార్హం.

ఇవి కూడా చదవండి

పాయల్ రాజ్ పుత్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Ram Charan: గేమ్ ఛేంజర్ నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్.. రామ్ చరణ్ పాత్ర పేరు అదే..

0

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తోన్న లేటేస్ట్ సినిమా గేమ్ ఛేంజర్. ఆర్ఆర్ఆర్ సక్సెస్ తర్వాత ఎంతో హడావిడిగా మొదలైన ఈ మూవీ.. ఇప్పటికీ షూటింగ్ జరుగుతూనే ఉంది. డైరెక్టర్ శంకర్ రూపొందిస్తున్న ఈ సినిమాపై అభిమానులు ఎంతో నిరాశగా ఉన్నారు. సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి ఇప్పటివరకు కేవలం టైటిల్ పోస్టర్ మాత్రమే రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యి మూడేళ్లు అవుతున్నా సినిమా రిలీజ్ కాదు కదా.. కనీసం ఒక్క అప్డేట్ కూడా లేదు. టైటిల్ పోస్టర్.. ఇటీవల జరగండి సాంగ్ మినహా గేమ్ ఛేంజర్ సినిమా గురించి అసలే అప్డేట్ రాలేదు. అలాగే ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనే విషయంపై కూడా క్లారిటీ లేదు. దీంతో గేమ్ ఛేంజర్ అప్డేట్స్ కావాలంటూ మెగా ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో గేమ్ ఛేంజర్ సినిమాకు సంబంధించి కొన్ని పోస్టర్స్, వీడియోస్ లీకైన సంగతి తెలిసిందే.

తాజాగా ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వినిపిస్తుంది. ఇప్పటికే ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్ర షూటింగ్ కంప్లీట్ అయిందని తెలుస్తోంది. ఇంకో వారం రోజులు షూట్ చేస్తే మూవీ కూడా అయిపోతుందని అంటున్నారు. అలాగే ఈ మూవీ చరణ్ రాజకీయ నాయకుడిగా.. అలాగే ఐఏఎస్ అధికారిగా కనిపించనున్నట్లు ముందు నుంచి వినిపిస్తున్న సమాచారం. తాజాగా ఇందులో చరణ్ ఐఏఎస్ ఆఫీసర్ గా చేస్తున్న రోల్ పేరు బయటకు వచ్చింది. ఇందులో చరణ్ పేరు రామ్ నందన్ అని సమాచారం. దీంతో IAS ఆఫీసర్ పాత్రకు బాగా సూట్ అయ్యిందని.. ఇప్పటివరకు లీకైన చరణ్ లుక్స్ కు తగ్గట్టే పేరు కూడా ఉందని అంటున్నారు అభిమానులు.

ఈ చిత్రాన్ని డైరెక్టర్ శంకర్ రాజకీయ నేపథ్యంలో రూపొందిస్తున్నట్లు సమాచారం. ఇందులో రామ్ చరణ్ తండ్రికొడుకులుగా ద్విపాత్రాభినయం చేయనున్నారు. అటు రాజకీయ నాయకుడిగా, ఐఏఎస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ, అంజలి, శ్రీకాంత్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ తర్వాత డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేయనున్నాడు చరణ్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Rambha Daughter: నెట్టింట రంభ కూతురు వీడియో వైరల్.. మరో హీరోయిన్ దొరికినట్టేగా.!

0

దక్షిణాది సినీ పరిశ్రమలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్‏గా ఓ వెలుగు వెలిగిన వారిలో రంభ ఒకరు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించారు. విజయవాడకు చెందిన రంభ.. విలక్షణ నటుడు రాజేంద్రప్రసాద్ నటించిన ఆ ఒక్కటీ అడక్కు సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత అనేక చిత్రాల్లో నటించారు. అందంతోపాటు అద్భుతమైన నటనతో మెప్పించి అప్పట్లో కుర్రాళ్ల ఫేవరేట్ హీరోయిన్ గా మారారు. తెలుగు, తమిళం, హిందీ సినిమాల్లో నటించి అలరించారు. ఎట్ ప్రజెంట్ సినిమాలు మానేసి.. తన మ్యారీడ్ లైఫ్ ను ఎంజాయ్‌ చేస్తున్నారు. ఎదిగిన తన పిల్లలను చూసుకుంటూ.. అప్పుడప్పుడూ సోషల్ మీడియాలో రీల్స్‌ చేస్తూ నెట్టింట వైరల్ అవుతుంటారు. ఈక్రమంలోనే తన భర్త ఇంద్ర, ముగ్గురు పిల్లలు, కొరియోగ్రాఫర్ కళా మాస్టర్తో కలిసి గురువాయూర్ ఆలయాన్ని దర్శించుకున్నారు. అయితే ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతుండగా.. అందులో రంభ కూతురు సెంట్రాఫ్ అట్రాక్షన్ గా మారింది.

ఇక ఆ వీడియోలో రంభ కూతురు పింక్ చుడీదార్ లో ఎంతో సింపుల్ గా కనిపించింది. తల్లి కంటే మరింత అందంగా.. న్యాచురల్ బ్యూటీగా ఉందనే కామెంట్ నెట్టింట వచ్చేలా చేసుకుంటోంది. ప్రస్తుతం రంభ ఫ్యామిలీ విజువల్స్ సోషల్ మీడియాలో వైరలవుతుండగా..రంభ కూతురిని చూసి ఫిదా అవుతున్నారు నెటిజన్స్. అందంలో అమ్మను మించి పోయిందని.. సింపుల్ గా ఎంతో చక్కగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Charmme Kaur: వామ్మో.. ఛార్మీ పెంపుడు కుక్క ఎంత పెద్దగా ఉందో.. ఆ బ్రీడ్ గురించి తెలుసా..?

0

సాధారణంగా ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో పెంపుడు కుక్కలు ఉంటున్నాయి. తమ ఇంటి సభ్యుల మాదిరిగానే పెట్స్ ను చూసుకుంటున్నారు. ఒక్కొక్కరి దగ్గర ఒక్క బ్రీడ్ పెంపుడు కుక్కలు ఉంటున్న సంగతి తెలిసిందే. ఇక సినీ స్టార్స్ విషయానికి వస్తే.. కచ్చితంగా అందరి దగ్గర పెంపుడు కుక్కలు, పిల్లులు కనిపిస్తుంటాయి. తమ పెట్స్ ఫోటోస్.. వాటితో సంతోషంగా గడిపిన క్షణాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. రామ్ చరణ్ దగ్గర రైమ్ అనే పెట్ ఉన్న సంగతి తెలిసిందే. ఇక సమంత, విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వద్ద ఉన్న పెట్స్ చాలా పాపులర్ అయ్యాయి. సోషల్ మీడియాలో వాటికి ప్రత్యేక ఫ్యాన్ పేజీలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు హీరోయిన్ ఛార్మీ వద్ద ఉన్న పెంపుడు కుక్క ఫోటోస్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి. తమ పెట్ తో ఛార్మీ ఎంతో సంతోషంగా ఉన్న ఫోటోస్ చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్. ఎందుకంటే ఛార్మీ పెంపుడు కుక్క చాలా పెద్దగా ఉంది మరీ.

ఇదేంటీ ఇంత పెద్దగా ఉంది.. ఇది కుక్కా లేదా సింహమా..? మనిషి కంటే హైట్ ఎక్కువగానే ఉంది.. అసలు ఆ కుక్క ఏ బ్రీడ్.. ? ఎందుకు అంత పెద్దగా ఉంది ? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఛార్మీ దగ్గరున్న కుక్క అలస్కాన్ మలమ్యూట్ (Alaskan Malamute) అనే బ్రీడ్ కు చెందినది. ఈ బ్రీడ్ డాగ్స్ చిన్నప్పటి నుంచి చాలా పెద్దగా ఉంటాయి. ఇక పెరిగే కొద్ది మరింత పెద్దగా అవుతాయి. ఈ కుక్క దాదాపు నాలుగేళ్లుగా ఛార్మీ దగ్గరే ఉంది. ప్రస్తుతం ఛార్మీ పెంపుడు కుక్క ఫోటోస్ వైరలవుతున్నాయి.

ఇదిలా ఉంటే.. ఒక్కప్పుడు తెలుగులో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది ఛార్మీ. నితిన్ సరసన శ్రీ ఆంజనేయం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఛార్మీ, ప్రభాస్, ఎన్టీఆర్, వెంకటేశ్ వంటి స్టార్ హీరోస్ సరసన కనిపించింది. అలాగే లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లోనూ మెప్పించింది. ఆ తర్వాత అవకాశాలు తగ్గడంతో నిర్మాతగా మారింది. ప్రస్తుతం డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో కలిసి పూరి కనెక్ట్స్ బ్యానర్ పై సినిమాలు నిర్మిస్తుంది. ఇప్పుడు రామ్ పోతినేని, పూరి జగన్నాథ్ కాంబోలో వస్తున్న డబుల్ ఇస్మార్ట్ మూవీని నిర్మిస్తుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Blockbuster Director Nag Ashwin Unveils Prince and Naresh Agastya’s “Kali” Teaser

0

The teaser for the movie “Kali,” starring young heroes Prince and Naresh Agastya, has been released by blockbuster director Nag Ashwin. Produced by Rudra Creations under the guidance of renowned story writer K. Raghavendra Reddy and directed by Siva Seshu, “Kali” is a psychological thriller whose shooting has been completed. The film is currently undergoing post-production and is set for a grand theatrical release soon.

In the “Kali” teaser, Shivaram (played by Prince) contemplates suicide due to disillusionment with the selfish world. However, just as he prepares to hang himself, a stranger (Naresh Agastya) arrives at his doorstep and reveals intimate details about Shivaram’s life. Shivaram is left puzzled about how the stranger knows so much about him, especially concerning incidents only known to him and his wife. The teaser concludes with intriguing questions: Why did Shivaram, previously happily married, contemplate suicide? Who is this stranger, and how does he seem to know everything about Shivaram? Moreover, why does he appear to have a dead body that resembles Shivaram?

Tollywood: 12 మందితో డేటింగ్.. ప్రేమలో మోసం.. 53 ఏళ్ల వయసులో బాయ్ ఫ్రెండ్ కావాలంటోన్న హీరోయిన్..

0

Tollywood: 12 మందితో డేటింగ్.. ప్రేమలో మోసం.. 53 ఏళ్ల వయసులో బాయ్ ఫ్రెండ్ కావాలంటోన్న హీరోయిన్..

ప్రేమ, పెళ్లి, విడాకులు.. ఇప్పుడు సినీ పరిశ్రమలో సర్వసాధారణమయ్యాయి. సంవత్సరాల లవ్ స్టోరీస్.. క్షణకాలంలో విడిపోతున్నాయి.. ఇక పాతికేళ్ల వైవాహిక బంధాలకు కూడా గ్యారెంటీ లేకుండా పోయింది. ఎప్పుడూ ఎవరు డివోర్స్ కూడా ప్రకటిస్తారో అనేది తెలియడం లేదు. అయితే ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా సత్తా చాటిన నటి.. పాన్ ఇండియాలోనే అగ్రస్థానంలో కొనసాగిన కథానాయిక జీవితం మాత్రం చాలా విభిన్నం. ఇప్పటివరకు మొత్తం 12 మందిని ప్రేమాయణం నడిపింది. కానీ అవేవి ఎక్కువ కాలం నిలవలేదు. ప్రేమ మాత్రమే కాదు.. పెళ్లి కూడా కొనసాగలేదు. పెళ్లి చేసుకున్న కొన్నాళ్లకే భర్తతో విడిపోయింది. తెలుగు, తమిళం, హిందీ భాషలలో అగ్ర హీరోల సరసన ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. కానీ జీవితంలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంది. ప్రస్తుతం ఆమె వయసు 53 సంవత్సరాలు. ఇప్పటికీ తనకు సరైన వ్యక్తిని జీవితంలోకి ఆహ్వానించేందుకు రెడీగా ఉన్నానని అంటోంది. ఆమె ఎవరో తెలుసా.. ? అలనాటి హీరోయిన్ మనీషా కోయిరాలా.

90వ దశకంలో సినీ పరిశ్రమలో తనదైన గుర్తింపు వేసింది. సినీరంగుల ప్రపంచంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో అగ్రకథానాయికగా ఓ వెలుగు వెలిగింది. బాబా, ముంబయి, డియర్ మాయ, లస్ట్ స్టోరీ, సంజు, ప్రస్థానం, షెహజాదా వంటి హిట్ చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత వయసు పెరుగుతున్నకొద్ది అవకాశాలు తగ్గిపోయాయి. సినిమాలకు దూరమైన సమయంలోనే క్యాన్సర్ భారిన పడింది. ఈ సమస్యకు చికిత్స తీసుకున్న మనీషా.. క్యాన్సర్ నుంచి కోలుకుని తిరిగి సినిమాలపై దృష్టి పెట్టింది. ఇటీవలే డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన హీరామండి వెబ్ సిరీస్ ద్వారా ఓటీటీ సినీ ప్రియుల ముందుకు వచ్చింది. ఇదిలా ఉంటే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మనీషా.. తన లైఫ్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది.

ఫిలింఫేర్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మనీషా మాట్లాడుతూ.. “నేను తప్పుడు పురుషులను మాత్రమే ప్రేమించాను. ఒక్కసారి కాదు. మళ్లీ మళ్లీ అదే తప్పు చేశాను. నేను ఎందుకు ఇలా చేశాను అని ఆలోచించాను. తప్పులు చేసిన వ్యక్తులను మాత్రమే నేను ప్రేమించాను. ఆ తర్వాత నా తప్పును గ్రహించాను. ఇకపై అలాంటి మిస్టేక్ చేయకూడదని అనుకున్నాను. నేను గత ఆరేళ్లుగా ఒంటరిగా ఉంటున్నాను. ప్రస్తుతం మరొకరిని ప్రేమించడం.. లేదా ఎవరితోనా బంధాన్ని కలుపుకునే మానసిక స్థితిలో మాత్రం లేను. చెడు సంబంధాలలో ఉన్నప్పటికీ నేనెప్పుడు ప్రేమపై నమ్మకం కోల్పోలేదు. నన్ను అర్థం చేసుకునే.. నాతో నిజాయితీగా ఉండే భాగస్వామిని ఇప్పటికీ నేను కనుగొంటాను. నేను చాలా ఎమోషనల్ పర్సన్. కలలు, ఆశయాలు, అభిరుచి ఉన్నవారితో కలిసి ఉండాలనుకుంటున్నాను” అంటూ చెప్పుకొచ్చింది.

 

View this post on Instagram

 

A post shared by Manisha Koirala (@m_koirala)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Alia Bhatt: స్పై యూనివర్స్‌లో కొత్త ట్విస్ట్‌.! బీ టౌన్ బడా హీరోస్ తో పాటు అలియా..

0

అయితే ఇప్పటి వరకు టైగర్ క్యారెక్టర్‌లో సల్మాన్‌ ఖాన్‌, పఠాన్‌గా షారూఖ్ ఖాన్‌, కబీర్ క్యారెక్టర్‌లో హృతిక్ లీడ్ రోల్స్ ప్లే చేశారు. ఈ సినిమాల్లో దీపికా, కత్రినా కూడా స్పైలుగానే కనిపించినా.. లీడ్ క్యారెక్టర్‌ అన్న ట్యాగ్ అయితే రాలేదు.

Raj Tarun: మేమిద్దరం గుడిలో పెళ్లి చేసుకున్నాం.. రాజ్ తరుణ్‏కు చాలా మందితో ఎఫైర్స్.. లావణ్య షాకింగ్ కామెంట్స్..

0

సినిమా రేంజ్‌ ట్విస్టులతో రాజ్‌ తరుణ్ కేసు ఇంట్రెస్టింగ్‌గా మారింది. తనను ప్రేమించి మోసం చేశాడని, ఇప్పుడు మాల్వీ అనే మరో హీరోయిన్‌తో రిలేషన్‌లో ఉన్నాడంటూ రాజ్‌తరుణ్‌పై కేసు పెట్టిన లావణ్యకే షాకిచ్చారు పోలీసులు. సరైన ఆధారాలు సమర్పించాలంటూ CRPC కింద నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే నిన్నటి నుంచి లావణ్య అందుబాటులో లేనట్లు టాక్ నడిచింది. మరోవైపు హీరోయిన్ మాల్వీ మల్హో్త్రా మీడియా ముందుకొచ్చారు. తనకు రాజ్‌ తరణ్‌కు ఎలాంటి సంబంధం లేదన్నారు. రాజ్‌తరుణ్‌ తనకు సహనటుడు మాత్రమే అని.. లావణ్య చెప్పేవన్నీ అబద్దాలే అన్నారు మాల్వీ మల్హాత్రా. రాజ్‌తో నటించిన ప్రతి హీరోయిన్‌ని లావణ్య అనుమానిస్తుందని.. అందరిని ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు. తాజాగా మరోసారి మీడియా ముందుకు వచ్చిన లావణ్య రాజ్ తరుణ్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది.

“నాకు రాజ్ తరుణ్ కు 14 ఏళ్లుగా పరిచయం ఉంది. దాదాపు 11 ఏళ్లుగా లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్నాం. మాల్వీ మల్హోత్రా వచ్చాక నన్ను దూరం పెడుతున్నాడు. ఆమె నన్ను చంపేస్తానని బెదిరించింది. వాళ్లిద్దరు కలిసి చెన్నైలో హోటల్లో ఉంటున్నారు. అన్ని ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. నేను రాజ్ తరుణ్ గుడిలో పెళ్లి చేసుకున్నాం. ఇప్పుడు నన్ను వదిలించుకోవాలని చూస్తున్నాడు. మస్తాన్ సాయికి, నాకు గొడవైంది. అందుకే అతనిపై ఫిర్యాదు చేశాను. నాతో మైండ్ గేమ్ ఆడారు. ఆ ఆటలో మాస్తాన్ సాయి, నేను ఇద్దరం బాధితులమే. డ్రగ్స్ కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదు. రాజ్ లేకుండా నేను బతకలేను ” అని అన్నారు.

“నేను, మస్తాన్ సాయి ఎప్పుడు జంటగా కనిపించలేదు. ఒక పెళ్లికి గుంటూరు వెళ్లాం. అతడు కేవలం మ్యూచువల్ ఫ్రెండ్. నాతో ఎవరు మాట్లాడినా అతడితో రిలేషన్ లో ఉన్నట్లేనా.. ? నాకు అన్యాయం జరిగింది. అందుకే పోలీసులకు ఫిర్యాదు చేశాను. నా దగ్గర రాజ్ తరుణ్ కాల్ రికార్డింగ్స్ ఉన్నాయి. లవర్ సినిమా నుంచి మాకు గొడవలు స్టార్ట్ అయ్యాయి. డబ్బులు కోసం నేను బెదిరించాల్సిన అవసరం లేదు. చాలా భరించాను.. అతడికి చాలా మంది అమ్మాయిలతో రిలేషన్స్ ఉన్నాయి” అంటూ చెప్పుకొచ్చింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.