Home Blog Page 498

Tollywood: వృద్ధాప్యాన్ని చూడలేను.. మరణాన్ని ముందే ఊహించిన స్టార్ హీరో..

0

సినీపరిశ్రమలో ఒకప్పుడు స్టార్ హీరో. అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. కానీ కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడే గుండెపోటుతో 47 ఏళ్ల వయసులోనే ఈ లోకాన్ని విడిచివెళ్లిపోయాడు. నిజానికి ఆ హీరో కుటుంబంలో 50 ఏళ్లకు మించి ఎవరూ బతకలేదు. ఆ హీరో సంజీవ్ కుమార్. 70, 80’s కాలంలో ఇండస్ట్రీని ఏలేసిన స్టార్ హీరో. ‘మౌసమ్’, ‘నౌకర్’, ‘నయా దిన్ నై రాత్’, ‘పతి-పత్నీ ఔర్ వో’, ‘అంగూర్’ ‘షోలే’ వంటి ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి మెప్పించారు. అప్పట్లో తనదైన నటనతో అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించుకున్నాడు. రాజేష్ ఖన్నా, ధర్మేంద్ర, అమితాబ్ బచ్చన్, ఇతరులు వంటి సూపర్ స్టార్లు ఆధిపత్యం చెలాయించిన కాలంలో, సంజీవ్ కుమార్ తన వయస్సును ధిక్కరించే పాత్రలను పోషించడం ద్వారా ప్రత్యేకంగా నిలిచాడు. కానీ చిన్న వయసులోనే ఈ లోకాన్ని విడిచివెళ్లిపోయాడు. ఇప్పటికీ అతడు పోషించిన పాత్రలను సినీ ప్రియులు మర్చిపోలేరు. తన అద్భుతమైన నటనతో అడియన్స్ హృదయాలలో గుర్తుండిపోయారు.

అంతేకాదు.. అప్పట్లో అత్యధిక పారితోషికం పొందిన నటుడు కూడా సంజీవ్ కుమార్ కావడం గమనార్హం. గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సంజీవ్ కుమార్‏ను ఉద్దేశిస్తూ.. చాలా సినిమాల్లో మీ వయసుకు మించిన పెద్ద పాత్రలు పోషిస్తున్నారు..ఎందుకు ? అని అడగ్గా.. ఈ ప్రశ్నకు సంజీవ్ కుమార్ చెప్పిన ఆన్సర్ అక్కడుకున్నవారిని ఆశ్చర్యపరిచింది. సంజీవ్ కుమార్ మాట్లాడుతూ, ‘ఎందుకంటే నా వృద్ధాప్యాన్ని నేను ఎప్పటికీ చూడలేను. అందుకే వృద్ధాప్య వయసును తెరపై ప్లే చేస్తూ అనుభవిస్తున్నాను’ అని అన్నారు. నిజానికి సంజీవ్ కుమార్ ఇంట్లో ఏ వ్యక్తి కూడా 50 ఏళ్లు దాటి జీవించలేదు. ఇక సంజీవ్ కుమార్ కూడా 50 ఏళ్లలోపే తాను ఈ లోకాన్ని విడిచిపెడతానని గ్రహించాడు. ఇక ఈ మాట ప్రకారమే 47 ఏళ్ల వయసులోనే గుండెపోటుతో మరణించాడు.

గుండెపోటు వచ్చిన తర్వాత సంజీవ్ కుమార్ కు గుండె శస్త్ర చికిత్స జరిగింది. ఆ తర్వాత కొన్ని రోజులకే 1985 నవంబర్ 6న సంజీవ్ కుమార్ మరణించాడు. మరణానికి ముందు తాను వృద్ధాప్యాన్ని చూడలేను అని సంజీవ్ కుమార్ చెప్పిన మాటలు నిజమయ్యాయి. సంజీవ్ కుమార్ తాత, తండ్రి, తమ్ముడు నికుల్ తో సహా అతడి కుటుంబంలోని పురుషులందరూ 50 ఏళ్లు నిండకముందే మరణించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Navya Naveli Nanda: వామ్మో.. ఏం పిల్ల రా బాబు.. హీరోయిన్లకు ధీటుగా అమితాబ్ మనవరాలు..

0

ముకేశ్ అంబానీ, నీతా అంబానీ దంపతుల కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ పెళ్లి వేడుకలు ఘనంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. జూలై 12న గ్రాండ్ గా వీరిద్దరి పెళ్లి జరగనుంది. తాజాగా జరిగిన సంగీత్ వేడుకలో అందరి దృష్టిని ఆకర్షించింది నవ్వ నవేళి నందా.

Samantha: తనను జైళ్లో పెట్టాలన్న డాక్టర్‌కు స్ట్రాంగ్‌ కౌంటర్ ఇచ్చిన సమంత.!

0

సోషల్ మీడియాలో మరో సారి సమంత హాట్ టాపిక్ అవుతోంది. హైడ్రోజన్ పెరాక్సైడ్‌తో చేసే నెబ్యులైజేషన్ గురించి తాజాగా తన పాడ్‌క్యాస్ట్‌లో ప్రస్తావించడంతో.. ఓ చిన్న పాటి డిబెట్‌ను ఆమె షురూ చేసినట్టు అయింది. సమంత చెప్పిన హైడ్రోజన్ పెరాక్సైడ్‌తో చేసే నెబ్యులైజేషన్ ప్రక్రియ చాలా డేంజర్‌ అని.. అది ప్రయత్నిస్తే ప్రాణాలు పోయే అవకాశం ఉందని కొందరు డాక్టర్లు సమంతపై నేరుగా విమర్శలు చేసే వరకు వచ్చింది. అయితే అందులో డాక్టర్‌ అభయ్ ఫిలిప్‌ .. తనపై చేసిన విమర్శలు కాస్త అతిగా.. అభ్యంతరకరంగా అనిపించడంతో.. ఈ కామెంట్స్‌ పై తాజాగా రియాక్టయ్యారు సమంత. రియాక్టవ్వడమే కాదు.. చాలా కూల్‌గా ఈ డాక్టర్‌కు కౌంటర్‌ ఇచ్చేశారు. ఒక పెద్దమనిషి తన పోస్ట్‌ను, సలహాలను ఉద్దేశపూర్వకంగా బలమైన పదాలతో దూషించారని ఆ డాక్టర్‌ను ఉద్దేశించి సమంత రాసుకొచ్చారు.

ఆయన కూడా డాక్టరే.. తన కంటే ఎన్నో విషయాలపై అవగాహన ఉంటుందనడంలో సందేహం లేదు.. కానీ.. తనను నిందించడం కంటే తనకు చికిత్స చేసిన డాక్టర్‌తో ఆయన ముఖాముఖిలో పాల్గొని ఉంటే బాగుండేదని హితవు పలికారు. అంతేకాదు.. తనను జైల్లో పెట్టాలని విమర్శించినందుకు బాధలేదని.. పదజాలం కరెక్ట్‌గా ఉంటే గౌరవించేదానిని అన్నారు సమంత. అయితే.. ఒక సెలబ్రిటీని కాబట్టి అంత సులువుగా ఆ డాక్టర్ తనను నిందించారని.. అనుకున్నా అన్నారు సమంత. కానీ.. తాను ఒక సెలబ్రిటీగా ఆ హెల్త్‌ టిప్‌ చెప్పలేదని… ఒక సామాన్య వ్యక్తిగానే ఆ పోస్ట్‌ను తన ఇన్టస్టాలో పోస్ట్ చేశానని చెప్పారు. మొత్తంగా.. ఇన్‌స్టాలో ఒక పోస్టు.. డాక్టర్‌ రిప్లై.. సమంత కౌంటర్‌తో.. సోషల్‌ మీడియాలో ఆమె మరోసారి హాట్‌టాపిక్‌ అయింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Pawan Kalyan: సినిమాలు లైన్లో పెడుతున్న పవన్‌ కల్యాణ్.. ముందు ఒకటైన ఫినిష్ చెయ్యాలని..

0

Nabha Natesh: కెరీర్ పీక్స్‏లో ఉన్నప్పుడే యాక్సిడెంట్.. ఓ రకమైన మైండ్‏సెట్‏లోకి వెళ్లిపోయాను.. నభా నటేశ్..

0

Raj Tarun: అడిగితే సాయం చేస్తా.. ఇక అతకడం మాత్రం ఉండదంటున్న రాజ్ తరుణ్

0

11 ఏళ్ల  లివ్‌ ఇన్‌ రిలేషన్‌ బీటలు వారి మ్యాటర్‌ నార్సింగ్‌ ఠానాకు చేరింది. అయితేనేం ఆమె పట్ల అతనికి గ్రాటిట్యూడ్‌ తగ్గలేదు..ఇక ఆమెకు అతనిపై ప్రేమ చెక్కు చెదరలేదు.. మ్యాటర్‌ చిరిగి చాటై పీక్స్‌కు చేరిన తరుణంలోనూ ఆ ఇద్దరి మన్‌ కీ బాత్‌ చూస్తే .. కొత్త కన్‌ఫ్యూజన్ క్రియేట్ అవుతోంది.

డ్రగ్స్‌..మస్తాన్‌ స్థాయితో  రిలేషన్‌ షిప్‌.. ఆపై టార్చర్‌..అవన్నీ భరించలేక  లావణ్య నుంచి తను దూరం జరగినాననేది రాజ్‌ తరుణ్‌ వెర్షన్‌. 11 ఏళ్ల  తమ సహజీవనానికి రాజ్‌ తరుణ్‌ కటీఫ్‌ చెప్పడానికి కారణం మాల్వీ మల్హోత్ర అనేది లావణ్య ఆరోపణ. ఇన్నాళ్లు లివ్‌ ఇన్‌ రిలేషన్‌ షిప్‌లో ఉండి  ఇప్పుడు మోసం చేశాడని నార్సింగ్‌ పీఎస్‌లో కంప్లేంట్‌ ఇచ్చారామె. మాల్వీ మల్హోత్ర  ఆమె ప్యామిలీ నుంచి థ్రెట్‌ వుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆరోపణలు సరే ఆధారాలేవని నోటీసులు ఇవ్వడంతో  నార్సింగ్‌ ఠాణాకు వచ్చారామె. లివ్‌ ఇన్‌ రిలేషన్‌ షిప్‌ మాత్రమే కాదు తమకు పెళ్లయిందన్నారు.

జస్ట్‌ రిలేషన్‌ షిప్‌..అది కూడా కట్‌ అయి ఏడేళ్లయిందన్నారు రాజ్‌ తరుణ్‌. కానీ లేటెస్ట్‌గా ఫ్రేమ్‌లోకి వచ్చిన లావణ్య మాత్రం..ఔను మేమిద్దం పెళ్లి చేసుకున్నామన్నారు. సహజీవనం నిజమే కానీ ఆమెతో వేగలేక తన ఇంట్లోకి తానే వెళ్లిపోయాననన్నారు రాజ్‌ తరుణ్‌. మాల్వీ మల్హోత్ర తాను రిలేషన్‌షిప్లో ఉన్నామన్న లావణ్య ఆరోపణలు అవాస్తమన్నారాయన. కానీ తమ మధ్య గొడవలకు మాల్వీనే కారణమన్నారు లావణ్య.  ఐతే తనపై నిరాధార ఆరోపణలు చేసిన లావణ్యపై మాల్వీ మల్లోత్ర పోలీసులకు కంప్లేంట్‌ ఇవ్వడం మరో ట్విస్ట్‌.

రాజ్‌కు తనకు మధ్య గ్యాప్‌ రావడానికి  పెరగడానికి కారణం మాల్వీనే అన్నారు లావణ్య. వాళ్లిద్దరి మధ్య ఎఫైర్‌ ఉందన్నారు.  లావణ్య ఆరోపిస్తున్నట్టుగా  ఆ ఇద్దరి మధ్య కుచ్‌ కుచ్‌  రిలేషన్‌ షిప్‌ కత వుందా?  మాల్వీ సైడ్‌ తీసుకున్న రాజ్‌ తరుణ్‌.. తనకు వార్నింగ్‌ ఇచ్చారని మరో సంచలనాన్ని తెరపైకి తెచ్చారు లావణ్య. మాన్వీతోనే కాదు మరికొందరితోనూ రాజ్‌ కు ఎఫైర్స్‌ ఉన్నాయన్నారు  లావణ్య. తమకు పెళ్లయిందనే విషయం వాళ్లలో కొందరికి తెలియదని.. తాను చెప్పాక వాళ్లు సైడయ్యారన్నారు. కానీ ఎంత చెప్పినా మాన్వీ కన్విన్స్‌ కాకపోగా తనను చంపేస్తానని బెదిరించిందన్నారు.

రాజ్‌ తరుణ్‌ పేరెంట్స్‌ సహా రాజారవీంద్రకు తమ విషయాలన్నీ తెలుసన్నారు లావణ్య.  ఇప్పటికీ తన మనసంతా రాజ్‌ తరుణే అన్నారామె. కథ ఇందాక వచ్చాక ఇక కన్వీన్స్‌ అయ్యే ఛాన్సే లేదని క్లియర్‌ కట్‌గా చెప్పారు రాజ్‌ తరుణ్‌..  లీగల్‌గా ఫైట్‌  చేస్తానన్నారు. అడిగితే సాయం చేస్తేనే తప్ప ఇక అతకడం మాత్రం ఉండదన్నారు.

ఇటు లావణ్య అటు మాల్వీ ఆ ఇద్దరి కంప్లేంట్స్‌ దాఖలు చేయపడినివి. ఇక నెక్ట్స్ రాజ్‌ తరుణ్‌ ఫిర్యాదు ఆన్‌ ది వే.  ట్విస్ట్‌ భరితంగా సాగుతోన్న సహజీవన వివాద కథా చిత్రమ్‌లో ఇంకెన్ని మలుపులో.. మెరుపులో వేచి చూడాల్సిందే.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Shruti Haasan: అలాంటి తేడాలు చూడనంటున్న శ్రుతిహాసన్.! ఆయనతో ఫస్ట్ టైం..

0

Tollywood: పెళ్లైన వెంటనే హనీమూన్‌కు చెక్కేసిన కొత్త జంట.. అందమైన లోకేషన్లలో విహరిస్తూ.. గుర్తు పట్టారా?

0

పై ఫొటోలో అల్లుకుపోయిన కొత్త జంటను గుర్తు పట్టారా? వీరికి ఇటీవలే వివాహమైంది. హల్దీ, మెహీందీ, ఫ్రీ వెడ్డింగ్‌ పార్టీ, పెళ్లి, రిసెప్షన్‌, వివాహానరంతరం జరిగే కార్యక్రమాలతో బిజీబిజీగా గడిపారు. అంతుకు ముందు టాలీవుడ్, కోలీవుడ్ ప్రముఖులను వివాహ ఆహ్వాన పత్రికలు పంచుతూ దేశమంతా చుట్టేశారు. ఇలా గత కొన్ని రోజులుగా ఊపిరాడనంత బిజీ బిజీగా గడిపిన ఈ కొత్త జంట ఇప్పుడు హనీమూన్ కు వెళ్లిపోయారు. అందమైన లోకేషన్లలో విహరిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. మరి ఈ కొత్త జంట ఎవరో ఈ పాటికే అర్థమై ఉంటుంది. యస్. వీరు ఎవరో కాదు టాలీవుడ్ ప్రముఖ నటి వరలక్ష్మి శరత్ కుమార్, ఆమె భర్త నికోలయ్‌ సచ్‌దేవ్‌. గత కొన్నేళ్లుగా ప్రేమలో మునిగి తేలిన ఈ ప్రేమ పక్షులు ఇటీవలే మూడు ముళ్ల బంధంలోకి అడుగు పెట్టారు. థాయ్‌లాండ్‌ వేదికగా జులై 2న వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. త్రిషతో సహా పలువురు కోలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులు వరలక్ష్మి వివాహ వేడుకలో సందడి చేశారు.

ఇవి కూడా చదవండి

ఇక ఇటీవలే చెన్నైలో గ్రాండ్ గా రిసెప్షన్ కూడా నిర్వహించారు. తమిళనాడు సీఎం స్టాలిన్‌, బాలకృష్ణతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ వెడ్డింగ్ రిసెప్షన్ లో సందడి చేశారు. కొత్త జంటను ఆశీర్వదించి అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. వరలక్ష్మి పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.

వరలక్ష్మి పెళ్లి వేడుకలో సూపర్ స్టార్ రజనీకాంత్..

కాగా పెళ్లైన వెంటనే హనీమూన్‌కు వెళ్లిపోయారు వరలక్ష్మి, నికోలయ్ సచ్ దేవ్. అందమైన ప్రదేశాల్లో విహరిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అంతేకాదు తమ హనీమూన్ ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర చేస్తున్నారు. ‘తుపాన్‌ తరువాత ప్రశాంతత’ అంటూ వరలక్ష్మి షేర్ చేసిన ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి. కాగా థాయ్ లాండ్ లో ఏడడుగులు నడిచిన ఈ ప్రేమ జంట హనీమూన్ కు ఎక్కడ వెళ్లారో మాత్రం చెప్పడం లేదు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Ram Charan: దటీజ్ రామ్ చరణ్, ఉపాసన.. 500కుపైగా కుటుంబాలకు సాయం చేసేందుకు ముందుకొచ్చిన మెగా కపుల్

0

కష్టాల్లో ఉన్న వారిని ఆదుకునేందుకు మెగా హీరోలు ఒక్క అడుగు ముందే ఉంటారు. చిరంజీవి, పవన్ కల్యాణ్, నాగబాబు.. ఇలా మెగా హీరోలు గతంలో చాలామందికి ఆపన్న హస్తం అందించారు. ఆ తర్వాతి తరంలో వచ్చిన రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, అల్లు శిరిష్ కూడా ఇబ్బందుల్లో ఉన్న అభిమానులకు ఆపన్న హస్తం అందించిన రోజులు ఉన్నాయి. తాజాగా చిరంజీవి తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరోసారి తన విశాల హృదయాన్ని చాటుకున్నాడు. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 500 కుటుంబాలకు సహాయం అందించాడు. ప్రముఖ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ ఇటీవలే ఈ విషయాన్ని బయట పెట్టాడు. ఇటీవల తన పుట్టిన రోజు సందర్భంగా చిరంజీవితో పాటు రామ్ చరణ్, ఉపాసనలను ప్రత్యేకంగా కలిశాడు జానీ మాస్టర్. ఈ సందర్భంగానే డ్యాన్సర్స్‌ యూనియన్‌లోని 500 కుటుంబాలకు హెల్త్‌ ఇన్సూరెన్స్‌ విషయంలో సాయం చేస్తామని జానీ మాస్టర్ కు మాటిచ్చారు రామ్ చరణ్. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు జానీ మాస్టర్.

‘సరైన సమయంలో సహాయం చేసేవాడు దేవుడు. నా పుట్టినరోజు సందర్భంగా రామ్ చరణ్ అన్న ఇంటికి పిలిచినపుడు వారికి నా మీదున్న ప్రేమకి చాలా సంతోషపడ్డాను. అక్కడికి వెళ్లాక మెగాస్టార్ చిరజీవి గారి ఆశీర్వాదం తో పాటు చరణ్ అన్న ఉపాసన కొణిదెల వదిన నాకు ఇచ్చిన మాటకి నా సంతోషం 1000 రెట్లు పెరిగింది. నేను ఇదివరకు అడిగిన సహాయాన్ని గుర్తుంచుకుని మా డ్యాన్సర్స్ యునియన్ టీ.ఎఫ్.టి.టి.డి.ఎ లో 500+ కుటుంబాలకి హెల్త్ ఇన్స్యూరెన్స్ అందేలా వారు అండగా నిలబడతామన్నారు. అడిగిన సహాయాన్ని గుర్తుంచుకుని, ఇచ్చిన మాటకి విలువనిస్తూ, అన్ని కుటుంబాలని చేరదీయడం మామూలు విషయం కాదు. మా అందరి మనసులో కృతజ్ఞత భావం ఎల్లకాలం ఉంటుంది. మా అందరి తరపు నుండి అన్న, వదినలకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీలాంటి వారితో కలిసి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాను’ అని రాసుకొచ్చాడు జానీ మాస్టర్.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతోంది. రామ్ చరణ్ దంపతులు నిర్ణయంపై అభిమానులు, నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Jon Landau: సినీ పరిశ్రమలో విషాదం.. ‘టైటానిక్’, ‘అవతార్’ నిర్మాత క‌న్నుమూత! సినీ దిగ్గజాల సంతాపం

0

హాలీవుడ్‌లో చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ హాలీవుడ్ ప్రోడ్యూస‌ర్ జాన్ లాండౌ (63) మృతి చెందారు. డిస్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌ కో చైర్‌ అయిన అలాన్‌ బెర్గ్‌మాన్‌ శనివారంఈ విష‌యాన్ని ప్రకటించారు. అయితే ఆయన మరణానికి గల కారణం ఇంకా తెలియరాలేదు. ఆస్కార్‌ అవార్డులను కైవసం చేసుకున్న ‘టైటానిక్’, ‘అవతార్’ వంటి ఎన్నో చిత్రాల నిర్మాత‌గా హాలీవుడ్‌లో ఓ వెలుగు వెలిగిన లాండౌ మృతిప‌ట్ల దిగ్గజ‌ ద‌ర్శకుడు జేమ్స్ కామెరాన్, సామ్ వ‌ర్తింగ్స్‌ట‌న్ వంటి త‌దిత‌రులు సోషల్‌ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

జోన్ లాండౌ నిర్మాణంలో 1997లో తెరకెక్కిన ‘టైటానిక్‌’తో పెను సంచలనం సృష్టించాడు. అప్పట్లోనే 200 మిలియన్‌ డాలర్ల బడ్జెట్‌తో ఈ మువీని తెరకెక్కించాడు. ఈ మువీ ప్రపంచ బాక్సాఫీస్‌ వద్ద ఏకంగా బిలియన్‌ డాలర్లు వసూలు చేసింది. ఇంత భారీ మొత్తం వసూలు చేసిన ఏకైక చిత్రంగా అప్పట్లో టైటానిక్‌ మువీ పేరు మారుమోగిపోయింది. ఇక ఆస్కార్ వేదికపై ఏకంగా 11 అవార్డులు కైవసం చేసుకుంది. ఇప్పటివ‌ర‌కు అత్యధిక ఆస్కార్ అవార్డులు అందుకున్న చిత్రాల‌లో టైటానిక్ రెండో స్థానంలో నిలిచింది. 1980లో ప్రొడక్షన్ మేనేజర్‌గా కెరీర్ ప్రారంభించిన జాన్ లాండౌ.. అంచెలంచెలుగా ఎదిగాడు.

ఇక లాండౌ నిర్మతగా 2009లో ‘అవతార్’, 2022లో వచ్చిన ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్‌’తో ఆ రికార్డును రెండుసార్లు అగ్రస్థానంలో ఉంచాడు. అద్భుత 3డీ సాంకేతికతతో చిత్రీకరించబడిన ఈ రెండు మువీలు థియేటర్లలో ప్రదర్శించబడిన ఓ సైన్స్ ఫిక్షన్ ఇతిహాసంగా నిలిచిపోయాయి. అవతార్, టైటానిక్ మువీలు బాక్స్-ఆఫీస్ వద్ద కురిపించిన కాసుల వర్షం ఆల్ టైమ్ రికార్డుగా నిలిచాయి. సినీ పరిశ్రమలో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రాలుగా మిగిలిపోయింది. లిండౌ.. మువీ నిర్మాతలు ఎలీ, ఈడీ లాండౌ దంపతుల కుమారుడు. 23 జూలై 1960న న్యూయార్క్‌లో జన్మించాడు. ఎలీ లాండౌ 1993లో, ఎడీ లాండౌ 2022లో మరణించారు. జోన్ లాండౌకు భార్య జూలీ లాండౌ, ఇద్దరు కుమారులు జామీ లాండౌ, జోడీ లాండౌ ఉన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి.