Home Blog Page 497

Balakrishna: ‘మా బాలయ్య బాబు గోల్డ్ ఎహే’.. ప్రశంసలు కురిపిస్తోన్న అభిమానులు.. ఏం జరిగిందంటే?

0

నందమూరి బాలకృష్ణ.. పైకి కొంచెం కఠినంగా కనిపించినా ఈయన మనసు వెన్న లాంటిది. ఒకటి, రెండు సందర్భాల్లో అభిమానులపై చేయి చేసుకుని విమర్శల పాలైనా, పలు సందర్భాల్లో తన గొప్ప మనసును చాటుకున్నారాయన. అలా తాజాగా మరోసారి తన సింప్లిసిటీని చాటుకున్నారు బాలయ్య. వివరాల్లోకి వెళితే.. ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ముచ్చటగా మూడోసారిగా హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు నందమూరి హీరో. బాలయ్య హ్యాట్రిక్ సాధించడంతో నందమూరి అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ప్రస్తుతం సినిమాలు చేస్తూనే, ఎమ్మెల్యేగా హిందూ పురం అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తున్నారాయన. అలా తాజాగా తన నియోజకవర్గంలో పర్యటించారు బాలయ్య . పార్టీ కార్యకర్తలు, అభిమానులతో నియోజకవర్గం అభివృద్ధి పనులపై చర్చించారు. అలా తాజాగా స్థానిక ప్రజలతో కలిసి భోజనం కూడా చేశారు. ఈ సందర్భంగా ఒక వృద్ధురాలి భుజంపై ఆప్యాయంగా చేయి వేసి పలకరించారు బాలయ్య. ఆమె యోగక్షేమాల గురించి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఈ ఫొటో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ గా మారింది.

సాధారణంగా సెలబ్రిటీ అయినా, ఎమ్మెల్యే అయినా సాధారణ జనాలను కలవడం చాలా అరుదుగా చూస్తుంటాం. కానీ మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బాలయ్య మాత్రం ఎలాంటి గర్వం ప్రదర్శించకుండా, చిన్న పిల్లాడి మాదిరిగా తన పక్కన వారితో జోకులేస్తూ భోజనం చేశారు.దీనిని చూసిన అభిమానులు తెగ మురిసిపోతున్నారు. ‘మా బాలయ్య బాబు గోల్డ్ ఎహే’ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అలాగే ఈ ఫొటోను సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు బాలయ్య. NBK 109 (వర్కింగ్ టైటిల్) పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో పాటు బోయ పాటి శీను డైరెక్షన్ లోనూ మరోసారి బాలయ్య నటించనున్నారని టాక్.

ఇవి కూడా చదవండి

వృద్ధురాలితో బాలయ్య ముచ్చట్లు..

త్వరలోనే మోక్షజ్ఞ ఎంట్రీ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Ranveer Singh: అమ్మాయి కావాలా? అబ్బాయి కావాలా? దీపిక భర్త రణ్ వీర్ ఏం చెప్పాడో తెలిస్తే చప్పట్లు కొడతారు

0

బాలీవుడ్ క్యూట్ కపుల్ రణవీర్ సింగ్, దీపికా పదుకొణె త్వరలోనే అమ్మానాన్నలుగా ప్రమోషన్ పొందనున్నారు. ప్రస్తుతం గర్భంతో ఉన్న దీపికా పదుకొణె సెప్టెంబర్ పండంటి బిడ్డకు జన్మనివ్వనుంది. దీంతో దీపికకు పుట్టబోయేది ఆడబిడ్డ? మగబిడ్డా? అంటూ అప్పుడే సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది. కొందరు జ్యోతిష్యులు, స్వామీజీలు కూడా దీపికకు పుట్టబోయే బిడ్డపై జోస్యం చెబుతున్నారు. ఇదే విషయంపై గతంలో రణవీర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్‌గా మారాయి. ఇందులో తనకు అబ్బాయి కావాలా.. అమ్మాయి కావాలా అనే ప్రశ్నకు రణ్‌వీర్ చాలా మంచి సమాధానమిచ్చాడు. రణ్‌వీర్ సింగ్ చివరిగా ‘జయేష్‌భాయ్ జోర్దార్’ సినిమాలో నటించాడు. ఈ సినిమా ప్రమోషన్ సమయంలో ‘అబ్బాయి కావాలా.. అమ్మాయి కావాలా’ అన్న ప్రశ్న ఎదురైంది. ఈ సందర్భంగా రణవీర్ సింగ్ మాట్లాడుతూ ‘అది నా చేతుల్లో లేదు’ అని ఆన్సర్ ఇచ్చారు. అలాగే మరో ఇంటర్వ్యూలో ‘నాకు ఆడపిల్ల కావాలి. దీపిక లాంటి కూతురు కావాలి’ అని రణ్‌వీర్‌ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి. దీపికపై రణ్‌ బీర్ కు ఉన్న ప్రేమకు ఇది నిదర్శనమంటూ అభిమానులు, కామెంట్లు కురిపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

కాగా దీపికా పదుకొణె, రణవీర్ సింగ్ ఒకరినొకరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ జంట నవంబర్ 2018 లో ఇటలీలో వివాహం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో పెళ్లైన సుమారు ఆరేళ్లకు దీపిక గర్భం దాల్చడంతో రణ్ వీర్ ఆనందానికి అవధుల్లేవు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ‘కల్కి 2898 AD’ సినిమా విజయంతో దీపికా పదుకొణె ఆనందంగా ఉంది. ఇది కాకుండా ఆమె రోహిత్ శెట్టి తెరకెక్కిస్తోన్న సింగం ఎగైన్‌లో నటిస్తోంది. ఈ సినిమాలో రణవీర్ సింగ్ కూడా నటిస్తున్నాడు. ఇక రణవీర్ సింగ్ సినిమాల విషయానికి వస్తే.. ‘డాన్ 3’లో హీరోగా నటిస్తున్నాడు. గతంలో షారుక్ ఖాన్ ‘డాన్’ సిరీస్‌లో కనిపించాడు. ఇప్పుడు ఆ స్థానాన్ని రణవీర్ భర్తీ చేస్తున్నాడు. దీంతో పాటు ‘శక్తిమాన్’ సినిమా కూడా రణ్ వీర్ చేతిలోనే ఉంది.

కల్కి సినిమా ప్రమోషన్లలో దీపికా పదుకొణె..

దీపిక పదుకొణె లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ ఫొటోలు..

కల్కి సినిమాలో దీపికా పదుకొణె..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Raj Tarun: ‘మనసంతా నువ్వే’.. లొల్లి నిజం.. మరి పెళ్లి..? ట్రయాంగిల్‌ రిలేషన్ కథా చిత్రమ్‌‌లో మరో ట్విస్ట్..

0

హీరో రాజ్‌ తరుణ్‌ తనను మోసం చేశాడని నార్సింగ్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేసిన లావణ్య.. ఆ తరువాత కన్పించకపోవడం సంచలనం రేపింది. ఆరోపణలకు తగిన ఆధారాలు చూపాలని పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈక్రమంలో ఆమె తెర ముందుకు వచ్చారు. లావణ్యతో రిలేషన్‌ షిప్‌ నిజమే కానీ ఏడేళ్లుగా తమ మధ్య ఎలాంటి సంబంధంలేదన్నారు రాజ్‌ తరుణ్‌. డ్రగ్స్‌ వాడుతూ తనను టార్చర్‌ చేసేదన్నారు. మాల్వీ మల్హోత్రతో తనకు ఎఫైర్‌ వుందన్న లావణ్య ఆరోపణలు నిజం కాదన్నారు. అసలు తనకు పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదన్నారు.

అయితే.. రాజ్‌ తరుణ్‌ వ్యాఖ్యలకు లేటెస్ట్‌గా కౌంటర్‌ ఇచ్చారు లావణ్య. తామిద్దరం గుళ్లో పెళ్లి చేసుకున్నామన్నారు. ఇప్పటికీ తాను రాజ్‌ తరుణ్‌తో కలిసి బతకాలని కోరుకుంటునన్నారు. ఇంత రాద్ధాంతం జరగడానికి మాల్వీనే కారణమన్నారు. మాల్వీతో రాజ్‌కు ఎఫైర్‌ ఉందన్నారు లావణ్య . మాల్వీ వల్లే రాజ్‌కు తనకు మధ్య విభేదాలు వచ్చాయన్నారు. మాల్వీ ఆమె సోదరుడు తనను చంపేస్తానని బెదరించారన్నారు. వీటిన్నంటికి సంబంధించిన ఆధారాలను పోలీసులకు ఇచ్చానన్నారు.

మాల్వీతోనే కాదు మరికొందరితోనూ రాజ్‌ కు ఎఫైర్స్‌ ఉన్నాయన్నారు లావణ్య. తమకు పెళ్లయిందనే విషయం వాళ్లలో కొందరికి తెలియదని.. తాను చెప్పాక వాళ్లు సైడయ్యారన్నారు. కానీ ఎంత చెప్పినా మాల్వీ కన్విన్స్‌ కాకపోగా తనను చంపేస్తానని బెదిరించిందన్నారు. రాజ్‌ తరుణ్‌ పేరెంట్స్‌ సహా రాజారవీంద్రకు తమ విషయాలన్నీ తెలుసన్నారు లావణ్య. ఇప్పటికీ తన మనసంతా రాజ్‌ తరుణే అంటూ పేర్కొన్నారు.

కథ ఇందాక వచ్చాక ఇక కన్వీన్స్‌ అయ్యే ఛాన్సే లేదని క్లియర్‌ కట్‌గా చెప్పారు రాజ్‌ తరుణ్‌.. లీగల్‌గా ఫైట్‌ చేస్తానన్నారు. అడిగితే సాయం చేస్తేనే తప్ప ఇక అతకడం మాత్రం ఉండదంటూ స్పష్టంచేశారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Sai Pallavi: ఇక డాక్టర్ సాయి పల్లవి.. ఎంబీబీఎస్ పట్టా అందుకున్న లేడీ పవర్ స్టార్.. వీడియో ఇదిగో

0

సినిమా ఇండస్ట్రీలో డాక్టర్ అవుదామని యాక్టర్ గా స్థిర పడిన వాళ్లు చాలా మంది ఉన్నారు. అందులో న్యాచురల్ బ్యూటీ సాయిపల్లవి ఒకరు. తన అందం, అభినయంతో పాటు వ్యక్తిత్వంతో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆమె మెడిసిన్ చదివింది. ఈ విషయాన్ని ఆమె పలు సందర్భాల్లో చెప్పుకొచ్చింది. హీరోయిన్  గా రిటైరయ్యాక డాక్టర్ గా స్థిర పడతానంటూ ఫ్యూచర్ ప్లాన్స్ కూడా వేసుకుందామె . గతంలో ఆమె సినిమాల నుంచి గ్యాప్ తీసుకున్నప్పుడు కూడా సొంతూరులో క్లినిక్ స్టార్ట్ చేసిందంటూ పుకార్లు షికార్లు చేశాయి. అయితే అవేవీ నిజం కాలేదు. మళ్లీ హీరోయిన్ గా బిజీ అయిపోయిందీ అందాల తార. ప్రస్తుతం బాలీవుడ్ లో రామయాణం ఆధారంగా తెరకెక్కుతోన్న పాన్ ఇండియా మూవీలో సీతగా నటిస్తోందీ ముద్దుగుమ్మ. ఈ మూవీ నుంచి రిలీజైన ఫొటోలు కూడా సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలయ్యాయి. ముఖ్యంగా సీతమ్మ గెటప్ లో సాయి పల్లవి లుక్ సూపర్బ్ గా ఉందంటూ ప్రశంసలు వస్తున్నాయి. సినిమాల సంగతి పక్కన పెడితే సాయి పల్లవికి సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతోంది. అదేంటంటే.. తాజాగా జార్జియాలోని తాను మెడిసిన్ చదువుకున్న టీబీలీసీ స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్‌ డేకు సాయిపల్లవి హాజరైంది. తనతో పాటు చదువుకున్న స్నేహితులను, అధ్యాపకులను ఆమె పలకరించింది.

ఈ సందర్భంగా వేదికపై డాక్టర్ పట్టాను అందుకున్న సాయి పల్లవి ఫొటోలకు ఫోజులిచ్చింది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ‘సాయి పల్లవి ఇకపై డాక్టర్ సాయి పల్లవి’ అంటూ అభిమానులు, నెటిజన్లు క్రేజీగా కామెంట్లు చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం అక్కినేని నాగ చైతన్య సరసన తండేల్ అనే సినిమాలో నటిస్తోంది సాయి పల్లవి. చందూ మోండేటీ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే చాలా భాగం పూర్తయ్యింది. ఈ ఏడాది డిసెంబర్ 20న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఇందులో సత్య పాత్రలో కనిపించనుంది సాయి పల్లవి. దీంతో పాటు రామాయణ్ మూవీలోనూ నటిస్తోంది. ఇందులో రాముడిగా బాలీవుడ్ చాక్లెట్ బాయ్ రణ్ బీర్ కపూర్ రాముడిగా నటిస్తున్నాడు.

ఇవి కూడా చదవండి

డాక్టర్ పట్టా అందుకుంటోన్న సాయి పల్లవి.. వీడియో

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Manchu Manoj: ‘హనుమంతు.. అమ్మతోడు.. నిన్ను వదిలిపెట్టను’.. మంచు మనోజ్ స్ట్రాంగ్ వార్నింగ్

0

గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఒక వీడియో బాగా వైరలవుతోంది. అందులో కొంత మంది ఆకతాయిలు ఇన్ స్టాగ్రాం వీడియో కాల్‌లో మీట్ అయి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుకుంటున్నారు. అడ్డదిడ్డంగా కామెంట్స్ చేస్తూ రాక్షసానందం పొందుతున్నారు. చిన్న పిల్లలు, తండ్రీ కూతుళ్లు అనే వావివరసలు మర్చిపోయి నీచమైన కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియో ఇప్పుడు చాలా ట్రెండ్ అవ్వడంతో సెలబ్రిటీలు స్పందిస్తున్నారు. ముందుగా మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఈ వీడియోపై స్పందించాడు. సోషల్‌ మీడియాలో పిల్లల ఫొటోలు, వీడియోలు పోస్ట్‌ చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలని సాయి ధరమ్‌ తేజ్‌ చేసిన ట్వీట్‌ చేశాడు. ప్రస్తుత రోజుల్లో సామాజిక మాధ్యమాలు చాలా భయానకంగా మరాయని తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఈ ట్వీట్ కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్ర మార్క సైతం స్పందించారు. పసి పిల్లల విషయంలో అసభ్యంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తాజాగా చిన్న పిల్లల భద్రతపై మరో టాలీవుడ్ హీరో మంచు మనోజ్ ఘాటుగా స్పందించారు.

‘చిన్న పిల్లల విషయంలో అసభ్యంగా ప్రవర్తిస్తూ ఇలా నీచంగా వీడియోలు చేసే వారి ప్రవర్తన సహించరానిది. ఫన్, వినోదం ముసుగులో జరుగుతున్న ఇలాంటి దారుణాలు చాలా ప్రమాదకరం. సుమారు ఏడాది క్రితం ఏపీ, తెలంగాణలో చిన్న పిల్లలు, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను అడ్డుకునేందుకు ఇన్ స్టా గ్రామ్ ద్వారా హనుమంతు అనే వ్యక్తిని సంప్రదించాను. కానీ అతని నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఈ రోజు చూస్తే అతను పసిపిల్లలపై నీచమైన కామెంట్స్ చేస్తున్నాడు. మన పిల్లలు, మహిళల రక్షణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. దయచేసి ఇలాంటి వారిని అసలు ఉపేక్షించవద్దని తెలుగు రాష్ట్రాల పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే తెలుగు రాష్ట్రాల సీఎంలు, అమెరికాలోని ఇండియన్ ఎంబసీ అధికారులు ఈ మృగాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. పి హనుమంతు.. అమ్మ తోడు.. నిన్ను వదిలిపెట్టను’ అంటూ ట్విట్టర్ వేదికగా మంచు మనోజ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు.

ఇవి కూడా చదవండి

మంచు మనోజ్ ట్వీట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Actress Lahari: ఖరీదైన లగ్జరీ కారు కొన్న నటి లహరి.. ధరెంతో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే

0

లహరి.. బుల్లితెర ప్రేక్షకులకు ఈ పేరు గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. మొగలి రేకులు సీరియల్‌తో తెలుగు రాష్ట్రాల్లో బాగా గుర్తింపు తెచ్చుకుందీ అందాల తార. అలాగే గృహలక్ష్మీ ధారావాహికలోనూ నటించి తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువైంది. అప్పుడప్పుడు వెండి తెరపై చిన్న చిన్న పాత్రల్లోనూ మెరిసింది. అయితే ఈ మధ్యన లహరి స్క్రీన్ పై పెద్దగా కనిపించడం లేదు. గతేడాది నుంచి ఆమె షూటింగ్ లకు బ్రేక్ ఇచ్చింది. ఇటీవల లహరి పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఇప్పుడు తన బిడ్డను చూసుకునే పనిలోనే బిజీ బిజీగా ఉంటుందామె. అందుకే ఎలాంటి సినిమాలు, సీరియల్స్ లో నటించడం లేదు. అయితే సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటోంది లహరి. గ్లామరస్ ఫొటోలు, వీడియోలు, ఫన్నీ రీల్స్, డ్యాన్స్ వీడియోలతో తన ఫ్యాన్స్‌ను ఎంటర్ టైన్ చేస్తూ ఉంటుంది. అలాగే యూట్యూబ్ ఛానెల్‌లోనూ వీడియోస్ చేస్తూ బాగానే సంపాదిస్తుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఖరీదైన బెంజ్ ఈ-క్లాస్ కారు కొనుగోలు చేసింది లహరి. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తన ఫ్యాన్స్ తో పంచుకుందామె.

ఇవి కూడా చదవండి

ఇందులో తన భర్త, బిడ్డ, ఫ్యామిలీతో కలిసి కొత్త కారుతో పోజులు ఇచ్చింది లహరి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి. పలువురు అభిమానులు, నెటిజన్లు లహరి ఫొటోలు, వీడియోలపై స్పందిస్తున్నారు. కొత్త కారు కొన్నందుకు కంగ్రాట్స్ చెబుతున్నారు. ఇదిలా ఉంటే లహరి కొన్న కారు ధర మార్కెట్ లో సుమారు రూ. 90 లక్షలకు పైగానే ఉంది. మిగతా ఖర్చులతో కలిసి అటూ ఇటూ సుమారు రూ. కోటికి పైగానే అయి ఉండొచ్చు. కాగా ఇటీవల సినిమా నటులతో పోలిస్తే సీరియల్ యాక్టర్స్ బాగానే సంపాదిస్తున్నారు. ఓ వైపు సీరియల్స్ చేస్తూనే, మరోవైపు యూట్యూబ్, షోస్ చేస్తూ రెండు చేతులా ఆదాయం ఆర్జిస్తున్నారు. ఈ క్రమంలోనే కొత్త ఇల్లు, కార్లు కొనేస్తున్నారు. ఇప్పుడీ లిస్టులో ప్రముఖ నటి లహరి కూడా చేరింది.

కొత్త కారుతో లహరి ఫ్యామిలీ.. వీడియో ఇదిగో..

సుమారు రూ. కోటి రూపాయలు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Director Manirathnam: మణిరత్నం దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‏గా పనిచేస్తోన్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా..? ఒకప్పటి స్టార్ హీరో కూతురు..

0

లోకనాయకుడు కమల్ హాసన్ ప్రస్తుతం ఇండియన్ 2 సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని త్వరలోనే రిలీజ్ చేయనున్నారు. ఈ మూవీతోపాటు కమల్ హాసన్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వం మరో సినిమా చేస్తున్నాడు. నాయకుడు సినిమా తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తోన్న సినిమా థగ్ లైఫ్. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ ఆసక్తిని కలిగించాయి. ఈ చిత్రంలో శింబు, త్రిష, అభిరామి, వాయపురి కీలకపాత్రలు పోషిస్తున్నారు. అయితే ఈ సినిమాలో జయం రవి, దుల్కర్ సల్మాన్ నటిస్తున్నట్లు టాక్ వినిపించింది. కానీ వారిద్దరు కాకుండా బాలీవుడ్ నటులు అలీ ఫజల్, రోహిత్ సరాఫ్, పంకజ్ త్రిపాఠిలను తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇదంతా పక్కన పెడితే మణిరత్నం వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న అమ్మాయి ఎవరో తెలుసా..? ప్రస్తుతం ఆమెకు సంబంధించిన ఫోటో నెట్టింట వైరలవుతుంది.

మణిరత్నం వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న అమ్మాయి అలీషా రహమాన్. ఈ అమ్మాయి మరెవరో కాదు.. ఒకప్పటి హీరో, టాలీవుడ్ నటుడు రహమాన్. తండ్రిలాగే తనకు కూడా సినిమాలంటే ఆసక్తి. దర్శకత్వం పై ఇష్టమున్న తన కూతురిని సినిమా గురించి తెలుసుకోవడానికి.. డైరెక్షన్ నేర్చుకునేందుకు మణిరత్నం దగ్గర అసిస్టెంట్‌గా పంపించాడు. ప్రస్తుతం అలీషా థగ్ లైఫ్ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తుంది. ఈ మూవీ తర్వాత అలిషా దర్శకురాలిగా మారే ఛాన్స్ ఉందని అంటున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Jr.NTR: ఎన్టీఆర్ చేతిలో ఉన్న ఆ చిన్నారి ఎవరో తెలుసా..? క్లారిటీ ఇచ్చిన బుల్లితెర కమెడియన్..

0

గత రెండ్రోజులుగా సోషల్ మీడియాలో ఎన్టీఆర్‏కు సంబంధించిన ఫోటో తెగ వైరలవుతుంది. అందుకు కారణం లేకపోలేదు. నెట్టింట చక్కర్లు కొడుతున్న ఆ ఫోటోలో ఓ చిన్నారిని తారక్ ప్రేమగా దగ్గరకు తీసుకుని ఒడిలో కూర్చోపెట్టుకున్నారు. దీంతో ఆ చిన్నారి ఎవరు ?.. అనే విషయంపై నెట్టింట డిస్కషన్స్ జరుగుతున్నాయి. నందమూరి ఫ్యాన్స్ ఆ ఫోటోను తెగ షేర్ చేస్తూ తారక్ ఒడిలో ఉన్న అమ్మారు ఎవరంటూ సెర్చింగ్ స్టార్ట్ చేశారు. ఈ క్రమంలోనే తాజాగా ఆ ఫోటో పై క్లారిటీ ఇచ్చారు జబర్ధస్త్ కమెడియన్ ఆటో రామ్ ప్రసాద్. తారక్ ఫోటోను తన ట్విట్టర్ వేదికగా షేర్ చేస్తూ అసలు విషయం చెప్పేశారు. ఎన్టీఆర్ ఒడిలో ఉన్న అమ్మాయి తన మేనకోడలు అంటూ ఇద్దరిపై ప్రేమ కురిపించారు. దీంతో ఆ ఫోటోపై కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.

ఇక తారక్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం దేవర చిత్రీకరణలో బిజీగా ఉన్నారు ఎన్టీఆర్. డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. జనతా గ్యారెజీ తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న సినిమా కావడంతో దేవర సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మాస్, యాక్షన్ నేపథ్యంలో వస్తోన్న ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తోంది. ఇందులో మత్య్సకారుల అమ్మాయిగా డీగ్లామర్ లుక్ లో కనిపించనుంది. అలాగే బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కీలకపాత్ర పోషిస్తున్నారు.

కొద్దిరోజులుగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ మూవీపై ఓ రెంజ్ హైప్ క్రియేట్ చేశాయి. వచ్చే ఏడాది వేసవిలో ఈ మూవీని రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ సినిమా తర్వాత తారక్.. అటు హిందీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తోన్న వార్ 2 లో భాగమవనున్నారు. ఇందులో హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ తన పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేశారు తారక్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Urfi Javed: ఫుల్లుగా తాగి ఊగిపోయిన ఉర్ఫీ జావేద్.. నడవలేని స్థితిలో బాలీవుడ్ బ్యూటీ.. వీడియో వైరల్..

0

నటి ఉర్ఫీ జావేద్ ఏదో ఒక కారణంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. చాలా సందర్భాలలో ఆమె ధరించే బట్టల కారణంగా నిత్యం నెట్టింట హైలైట్ అవుతుంది. విచిత్రమైన వేషధారణతో చాలా ఫేమస్ అయ్యింది.. అయితే కొద్దిరోజులుగా వేరే కారణాలతో ఉర్ఫీ వార్తలలో నిలుస్తుంది. ఇటీవల ఆమె ఎక్కువగా తాగి కనిపిస్తుంది. వారాంతంలో సండే వీకెండ్ కావడంతో స్నేహితులతో కలిసి ఓ పార్టీలో పాల్గొంది. అయితే పార్టీ ముగించుకుని ఉర్పీ బయటకు వచ్చిన తీరు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే ఉర్ఫీ జావేద్‌కి నడవడానికి కూడా ఇబ్బంది పడుతుంది. అలాగే ఎవరైనా సాయంగా పట్టుకోకపోతే కిందపడిపోయే విధంగా కనిపిస్తుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఓ పార్టీ నుంచి బయటకు వచ్చిన ఉర్ఫీ జావేద్‌ను ఆమె స్నేహితురాళ్లు నడిపించారు. తన స్నేహితుల సాయంతో ఉర్ఫీ జావేద్ మెల్లిగా ముందుకు నడించింది. అలాగే వారి వదిలేస్తే కింద పడిపోయేలా కనిపించింది. మద్యం మత్తులో ఉన్న ఉర్ఫీ జావేద్‌ను ఆమె స్నేహితులు సురక్షితంగా తీసుకొచ్చి కారులో కూర్చొపెట్టారు. ఈ వీడియో చూసిన చాలా మంది రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోపై కొందరికి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉర్ఫీ జావేద్ నిజంగా తాగిందా? తాగినట్లు నటిస్తుందా ? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఆమె కళ్లను చూస్తే మద్యం తాగినట్లు కనిపించడం లేదని..కేవలం పబ్లిసిటీ కోసమే ఇలా చేస్తుందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోను నిశితంగా పరిశీలిస్తే మరో విషయం తెలుస్తుంది. ఉర్ఫీ జావేద్ పార్టీ నుండి బయటకు వచ్చినప్పుడు మొదటి నాలుగు అడుగులు సరిగ్గానే వేసింది. కానీ ఆ తర్వాత ఫోటోగ్రాఫర్స్ ఉన్నారని గ్రహించిన తర్వాత ఆమె తూలుతున్నట్లు నటించింది. ఇదంతా కేవలం పబ్లిసిటీ కోసమే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Bigg Boss: నా భార్య గురించి మాట్లాడతావా.. కంటెస్టెంట్ చెంప పగులగొట్టిన మరో కంటెస్టెంట్..

0

హిందీలో బిగ్‏బాస్ రియాల్టీ షోకు మంచి రేటింగ్ ఉంటుంది. నార్త్ లో ఈ షోను ఆదరించేవారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. ఇప్పటివరకు టీవీలో మొత్తం 17 సీజన్స్ కంప్లీట్ చేసుకుంది. అలాగే అటు ఓటీటీలోనూ ఈ షోకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ప్రస్తుతం హిందీలో బిగ్‏బాస్ ఓటీటీ సీజన్ 3 నడుస్తోంది. అయితే ఈసారి హౌస్ లోకి ఇద్దరు భార్యలతో అడుగుపెట్టి అందరిని ఆశ్చర్యపరిచాడు అర్మాన్ మాలిక్. అయితే మొదట్లో ఈవిషయంపై బిగ్‏బాస్ నిర్వాహకులపై అడియన్స్ మండిపడ్డారు. సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇద్దామని ఇద్దరు భార్యలు ఉన్న వ్యక్తిని తీసుకువస్తున్నారంటూ సోషల్ మీడియా వేదికగా కడిగిపారేశారు. ఇదంతా పక్కన పెడితే ఇటీవలే ఈ షో నుంచి అర్మాన్ మాలిక్ మొదటి భార్య పాయల్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యింది. కానీ ఆమెను మళ్లీ వీకెండ్ కా వార్ ఎపిసోడ్ లో సర్ ప్రైజ్ ఎంట్రీ ఇచ్చారు.

ఇక వచ్చిరావడంతోనే లోపల ఉన్న కంటెస్టెంట్స్ పై విరుచుకుపడింది. ముఖ్యంగా యూట్యూబర్ విశాల్ తీరుపై మండిపడింది. అర్మాన్ రెండో భార్య కృతిక వదిన చాలా బాగుందని.. ఆమె అంటే చాలా ఇష్టమని మరో కంటెస్టెంట్ చెవిలో మాట్లాడాడు విశాల్. ఇక ఇది బయటి నుంచి చూసిన పాయల్ ఇంట్లోకి వెళ్లాక అతడిపై సీరియస్ అయ్యింది. నువ్వు ఒక తల్లి గురించి.. ఒకరి భార్య గురించి మాట్లాడుతున్నావు. ఆ విషయం తెలుసుకుని కాస్త మర్యాదగా మాట్లాడు.. కృతిక గురించి అలా అనడం తప్పు అంటూ సీరియస్ అయ్యింది. అయితే ఈ విషయంపై విశాల్ మాట్లాడుతూ.. తనకు ఎలాంటి తప్పుడు అభిప్రాయం లేదని.. కేవలం సరదాగానే చెప్పానని వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశాడు. తప్పుడు ఉద్దేశ్యం లేకపోతే నేరుగా వెళ్లి తనకే చెప్పొచ్చు కదా అంటూ పాయల్ ప్రశ్నించింది. ఇక ఇదంతా విన్న పాయల్ భర్త అర్మాన్ కోపంగా విశాల్ మీదకు వచ్చాడు.

ఇద్దరి మధ్య మాట మాట పెరిగి కొట్టుకునేంత వరకు వెళ్లింది. ఈ క్రమంలోనే విశాల్ చెంప పగులగొట్టాడు అర్మాన్. దీంతో మిగతా కంటెస్టెంట్ ఇద్దరిని చెరో పక్కు తీసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరలవుతుండగా.. విశాల్ కు మద్దతు తెలుపుతున్నారు నెటిజన్స్. అందంగా ఉందని చెప్పడం కూడా తప్పేనా ? అయినా వదినా అని అన్నాడు కదా.. అందులో తప్పేంటీ ? అంటూ మండిపడుతున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.