Home Blog Page 496

OTT Movies: ఈ వారం ఓటీటీలో సూపర్ హిట్ సినిమాలు, సిరీస్‌లు.. మొత్తం స్ట్రీమింగ్ లిస్ట్ ఇదిగో

0

ప్రస్తుతం థియేటర్ల దగ్గరా ఇంకా కల్కి హవా కొనసాగుతోంది. వెయ్యి కోట్ల వైపు వేగంగా అడుగులు వేస్తోందీ మూవీ. ఈ నేపథ్యంలో ఈ వారం భారతీయుడు 2 సినిమా థియేటర్లలో అడుగుపెట్టనుంది. ఈ శుక్రవారం రిలీజయ్యే సినిమాల్లో ఇదే పెద్ద సినిమా. అయితే ఓటీటీలో మాత్రం పలు సూపర్ హిట్ సినిమాలు, ఆసక్తికర వెబ్ సిరీస్ లు ఆడియెన్స్ ముందుకు రానున్నాయి. అలా ఈ వారం అందరి దృష్టిని ఆకర్షిస్తోన్న సినిమా విజయ్ సేతుపతి నటించిన మహారాజ. గత నెలలో థియేటర్లలో రిలీజైన ఈ మూవీ ఏకంగా రూ. 100 కోట్లకు పైగానే కలెక్షన్లు సాధించింది. అలాగే ఫాహద్ ఫాజిల్ ధూమం సినిమా కూడా ఈ వారమే స్ట్రీమింగ్ కు రానుంది. వీటితో పాటు ఇంగ్లిష్, హిందీ భాషల్లో పలు సినిమాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ కు రానున్నాయి. మరి జులై రెండో వారంలో వివిధ ఓటీటీల్లో స్ట్రీమింగ్ కు రానున్న సినిమాలేంటో తెలుసుకుందాం రండి.

ఆహా

  • హిట్‌ లిస్ట్‌ (తెలుగు డబ్బింగ్ సినిమా) – జూలై 9
  • ధూమం (తెలుగు డబ్బింగ్ సినిమా) – జూలై 11

నెట్‌ ఫ్లిక్స్

  • ద బాయ్‌ఫ్రెండ్‌ (వెబ్ సిరీస్‌) – జూలై 9
  • రిసీవర్‌ (డాక్యుమెంటరీ సిరీస్‌) – జూలై 10
  • ఎవ లాస్టింగ్‌ (వెబ్‌ సిరీస్‌, రెండో సీజన్‌) – జూలై 10
  • వైల్డ్‌ వైల్డ్‌ పంజాబ్‌ (హిందీ సినిమా) – జూలై 10
  • షుగర్‌ రష్‌: ద బేకింగ్‌ పాయింట్‌ (రెండో సీజన్‌) – జూలై 10
  • అనదర్‌ సెల్ఫ్‌ (రెండో సీజన్‌) – జూలై 11
  • వానిష్‌డ్‌ ఇంటు ద నైట్‌ (మూవీ)- జూలై 11
  • వికింగ్స్‌: వాల్హల్ల 3 (వెబ్‌ సిరీస్‌) – జూలై 11
  • మహారాజ (మూవీ) – జూలై 12
  • బ్లేమ్‌ ద గేమ్‌ (సినిమా) – జూలై 12
  • ఎక్స్‌ప్లోడింగ్‌ కిట్టెన్స్‌ (కార్టూన్‌ వెబ్ సిరీస్‌) – జూలై 12

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో

  • సాసేజ్‌ పార్టీ: ఫుడ్‌టోపియా (కార్టూన్‌)- జూలై 11

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌

  • కమాండర్‌ కరణ్‌ సక్సేనా (వెబ్‌ సిరీస్‌) – జూలై 8
  • మాస్టర్‌ మైండ్‌ (వెబ్‌ సిరీస్‌) – జూలై 10
  • అగ్నిసాక్షి (తెలుగు సిరీస్‌) – జూలై 12
  • షో టైమ్‌ (వెబ్‌ సిరీస్‌) – జూలై 12

జియో సినిమా

  • పిల్‌ (హిందీ సినిమా) – జూలై 12

సోనీలివ్‌

  • 36 డేస్‌ (హిందీ వెబ్‌ సిరీస్‌) – జూలై 12

ఇవి కూడా చదవండి

లయన్స్‌ గేట్‌ ప్లే

  • డాక్టర్‌ డెత్‌: సీజన్‌ 2 (వెబ్‌ సిరీస్‌) – జూలై 12

మనోరమ మ్యాక్స్‌

  • మందాకిని (మలయాళ సినిమా)- జూలై 12

Note: ఇవి కాక వారం మధ్యలో కొన్ని ఓటీటీ సంస్థలు అప్పటికప్పుడు కొత్త సినిమాలు, సిరీస్‌ లను స్ట్రీమింగ్ కు తీసుకువచ్చే అవకాశముంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Genelia: ‘మీరే కాదు.. మీ ఆలోచన అందమైనదే’.. అవయవదానం చేసిన జెనీలియా- రితేశ్ దంపతులు.. సర్వత్రా ప్రశంసలు

0

బాలీవుడ్ క్యూట్ కపుల్స్ లో జెనీలియా డిసౌజా- రితేశ్ దేశ్‌ముఖ్ జోడీ కూడా ఒకటి. వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. తమ ప్రేమ బంధానికి ప్రతీకగా ఇద్దరు పిల్లలను కూడా తమ జీవితంలోకి ఆహ్వానించారు. అటు ప్రొఫెషనల్ లైఫ్ లోనూ, ఇటు పర్సనల్ లైఫ్ పరంగానూ ఎంతో హ్యాపీగా ఉంటున్నారీ లవ్లీ కపుల్. ఇప్పుడీ సెలబ్రిటీ జంట అవయవ దానం ప్రకటించారు. ఇందుకు గాను ఆ దంపతులకు నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆర్గనైజేషన్ కృతజ్ఞతలు తెలిపింది. దీనికి సంబంధించిన వీడియోను రితేశ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. కాగా అవయవ దానానికి బతికి ఉన్నప్పుడే అంగీకార సంతకం చేయాలి. ఈ విధంగా సంతకం చేసిన వ్యక్తి మరణించిన తర్వాత కళ్లు వంటి అవయవాలు లభిస్తాయి. ఇవి అవసరమైన వ్యక్తులకు ఇవ్వచ్చు. రితేష్, జెనీలియా దంపతులు కూడా ఇప్పుడు ఇదే నిర్ణయం తీసుకున్నారు.

కాగా గతంలోనే అవయవ దానం చేస్తామని జెనీలియా, రితేశ్ దంపతులు ప్రకటించారు. ఇప్పుడు దంపతూలిద్దరూ మరోసారి అవయవదానంపై ప్రతిజ్ఞ చేశారు. కాగా జెనీలియా, రితేశ్ లకు సంబంధించిన వీడియోను నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆర్గనైజేషన్ షేర్ చేసింది. ‘రితేష్‌, జెనీలియాకు ధన్యవాదాలు . అవయవాలు దానం చేస్తానని ప్రమాణం చేశారు. వీరి నిర్ణయం ఎందరికో స్ఫూర్తిగా నిలవాలి’ అని బాలీవుడ్ లవ్లీ కపుల్ పై ప్రశంసల వర్షం కురిపించింది.

ఇవి కూడా చదవండి

ఇక సినిమాల విషయానికి వస్తే.. సోనాక్షి సిన్హా, షకీబ్ సలీమ్‌లతో కలిసి రితేష్ ‘కాకుడ’ చిత్రంలో నటిస్తున్నారు. ఆదిత్య సర్పోథర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. జూలై 12న సినిమా విడుదల కానుంది. మరోవైపు గతంలో తెలుగులో పలు సూపర్ హిట్ సినిమాల్లో స్టార్ హీరోలతో ఆడి పాడిన జెనీలియా కూడా రీ ఎంట్రీకి సిద్ధమైంది. త్వరలోనే ఓ తెలుగు సినిమాలో ఆమె నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Rashmika Mandanna: శ్రీవల్లి హై స్పీడ్.. భాషతో పని లేదు.. స్కోప్‌ ఉన్న పాత్రలకు ఎస్.

0

గుడ్‌ బైతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ, ఆ తరువాత మిషన్ మజ్ను, యానిమల్‌ సినిమాల్లోనే నటిగా మంచి పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో ఉన్న లైనప్‌ కూడా ఇంట్రస్టింగ్‌గా ఉంది.

Brahmamudi, July 8th Episode: జైలుకి అనామిక.. కళ్యాణ్, అప్పూలు కలవడానికి వీలు లేదు!

0

Brahmamudi, July 8th Episode: జైలుకి అనామిక.. కళ్యాణ్, అప్పూలు కలవడానికి వీలు లేదు!

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. సాక్ష్యం చెప్పడానికి కావ్యని లాయర్ పిలుస్తాడు దీంతో కావ్య బోనులో నిల్చుని ఉంటుంది. ఇప్పుడు తప్పని పరిస్థితుల్లోనే ఆ సాక్ష్యం బయటకు చూపించమని లాయర్ గారికి చెప్పాను అని కావ్య అంటుంది. ఇక లాయర్ ఇచ్చిన వీడియోను కనెక్ట్ చేస్తారు. ఆ వీడియో కోర్టలో అందరూ చూస్తారు. అందులో కావ్యతో అనామిక మాట్లాడినదంతా వస్తుంది. చట్టాలన్నీ అనుకూలంగా ఉన్నాయని కొంత మంది ఆడవాళ్లు.. భర్త మీద అనవసరంగా కోర్టుకు లాగుతున్నారు. ఈ కేసు చివరికి ఎలాంటి మలుపు తిరుగుతుందో అందరికీ అర్థమైంది. స్నేహితురాలిగా ఉన్న అప్పూపై కేసు పెట్టింది ఈ అనామిక. దుగ్గిరాల కుటుంబం పరువు అంతా మర్చిపోయి.. సమాజం ముందు దోషులుగా నిలబెట్టింది. కాబట్టి చట్టాన్ని, న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించినందుకు ఈ అనామికకు కఠినమైన శిక్ష వేయాలి.

అనామిక జైలుకి.. అప్పూకి నష్ట పరిహారం..

ఒక ఆడపిల్ల మీద చెరగని మచ్చ వేసినందుకు.. పరువు నష్టం కింద జరిమానా విధించాలి. అలాగే దుగ్గిరాల కుటుంబానికి కూడా పరువు నష్టం కింద జరిమానా విధించాలని కోరుతున్నా. అలాగే విడాకులు కూడా ఇప్పించాలని కళ్యాణ్ తరపు లాయర్ కోరతాడు. సాక్ష్యాలను, ఆధారాలను పరిశీలించిన మీదట.. ఇది ఉద్దేశ పూర్వంగానే.. అనామిక పెట్టిన కేసు అని నిర్థారించడం జరిగింది. ముద్దాయి కళ్యాణ్ ని మానసికంగా వేధించినందుకు అనామికను కోర్టు తీవ్రంగా మందలిస్తుంది. అలాగే అప్పూ కుటుంబానికి పరువు నష్ట పరిహారంగా లక్ష రూపాయలు చెల్లించాలి. అలాగే కళ్యాణ్ కుటుంబానికి కూడా రూ.2 లక్షల నష్ట పరిహారాన్ని చెల్లించాలని, విడాకులను కూడా ఇప్పించాలని కోర్టు ఆదేశిస్తుంది. చట్టాన్ని తప్పుదోవ పట్టించినందుకు అనామికకు 15 రోజుల కఠిన శిక్ష విధించాలని కోర్టు ఆదేశించిందని జడ్జి తీర్పు ఇస్తుంది. దీంతో అనామిక, ఆమె పేరెంట్స్ షాక్ అవుతారు. కావ్య, రాజ్ ఫ్యామిలీ వాళ్లు సంతోషిస్తారు.

మమ్మల్ని కలవద్దు బాబు.. ఇక నుంచి దూరంగా ఉండు..

అనామికను పోలీసులు తీసుకెళ్తారు. అనామికా.. నేను చెప్తూనే ఉన్నాను. నువ్వు తప్పు చేస్తున్నావ్. ఇది సరైన పద్దతి కాదని. కానీ నువ్వు తప్పుడు దారిలో వెళ్లావు. అహంకారంతో కళ్లు నెత్తికెక్కి నీ కాపురాన్ని నువ్వే సర్వ నాశనం చేసుకున్నావు. కనీసం ఇప్పుడైనా మంచిగా ఉండటానికి ప్రయత్నించు అని కావ్య అంటుంది. ఛీ అసలు నువ్వు ఆడదానివేనా.. నీ వల్ల ఒక మంచి ఫ్యామిలీ మీద నిందలు వేశాం. మీ లాంటి ఆడవాళ్ల వల్ల.. అన్యాయం జరిగిన ఆడవాళ్లను న్యాయం చేయలేక పోతున్నామని మహిళా సంఘ అధ్యక్షురాలు ఝాన్సీ అంటుంది. అప్పూ మా ఫ్యామిలీ గొడవల్లోకి నిన్ను లాగి.. చాలా ఇబ్బంది పెట్టాం సారీ అని కళ్యాణ్ అంటే.. ఇక ఇప్పటి వరకూ జరిగింది చాలు బాబు. ఇకనైనా మమ్మల్ని వదిలేయ్. దయచేసి మిమ్మల్ని ఎప్పుడూ కలవడానికి రావద్దు అని కనకం చెప్పి వెళ్లి పోతుంది.

కడిగి పారేసిన కనకం..

ఇక ఆ తర్వాత కనకం ఫ్యామిలీ ఇంటికి వస్తారు. అప్పుడే పక్కనున్న అమ్మలక్కలు వచ్చి.. ఏంటి కనకం ఏమైంది? అని అడుగుతారు. కనకం నిజం చెప్పే లోగానే.. ఏది పడితే అది వాగుతూ ఉంటారు. ఇంత పెద్ద నింద పడ్డాక అప్పూ పెళ్లి జరుగుతుందా? అని ఎగతాళి చేస్తారు. దీంతో కనకం తన స్టైల్‌లో వార్నింగ్ ఇస్తుంది. అన్ని నిజాలూ బయటకు వచ్చాయి. నా కూతురు నిప్పు అని కోర్టులోని అందరి ముందూ తీర్పు ఇచ్చారు. ఆ అనామికకు శిక్ష కూడా వేశారని అంటుంది. వాళ్లను పట్టుకుని ఎడాపెడా వాయిం చేస్తుంది.

కావ్య, రాజ్‌ల రొమాన్స్..

ఈ సీన్ కట్ చేస్తే.. కావ్య గదిలో ఉంటుంది. కావ్యని చూసిన రాజ్.. ఒక్కసారిగా వెళ్లి ఎత్తుకుని గిరా గిరా తిప్పుతూ ఐలవ్ యూ అని చెప్తాడు. కానీ అది కల. ఈ లోపు వెనుక నుంచి ఇందిరా దేవి వస్తుంది. ఏంట్రా సంగతి నీలో నువ్వే నవ్వుకుంటున్నావ్? అని అడుగుతుంది. నీ పెళ్లాన్ని నీ ఊహల్లో పెళ్లాన్ని బుగ్గ గిల్లావా? ముద్దు పెట్టుకున్నావా? అని అడుగుతుంది. దీంతో రాజ్ కంగారు పడుతూ ఉంటాడు. కళావతి వస్తుంది వెళ్లు అని అంటాడు. నేను వెళ్లను అని ఇందిరా దేవి అంటే.. నోటి మీద వేలు వేసుకో అని చెప్తాడు రాజ్. కావ్య వచ్చి.. అందేంటి? అమ్మమ్మ గారూ నోటి మీద నుంచి వేలు తీయడం లేదని అడుగుతుంది. ఈలోపు రాజ్ కంగారు పడుతూ.. కావ్యని మ్యానేజ్ చేయడానికి ట్రై చేస్తాడు. నేను అబద్దాలు చెప్పను అనేసి ఇందిరా దేవి వెళ్తుంది. ఈ సీన్ అంతా నవ్వు తెప్పిస్తుంది. ఇక కళ్యాణ్ అనామిక అన్న మాటలు తలుచుకుంటూ బాధ పడతాడు. ఇక ఇవాళ్టితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

Maharaja OTT: అఫీషియల్.. ఓటీటీలో విజయ్ సేతుపతి 100 కోట్ల సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?

0

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నటించిన తాజా చిత్రం మహారాజ. ఎలాంటి అంచనాలు లేకుండా జూన్ 14న తమిళంతో పాటు తెలుగులోనూ విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. కేవలం మౌత్ టాక్ తోనే ఏకంగా రూ. 100 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. కేవలం తమిళ్ లోనే కాదు తెలుగు నాట మహారాజ సినిమాకు కలెక్షన్ల వర్షం కురిసింది. ఇప్పటికీ చాలా చోట్ల థియేటర్లలో సందడి చేస్తోన్న మహారాజ మూవీ ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ పామ్ నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో స్ట్రీమింగ్ డేట్ కు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడింది. జులై 12 నుంచి మహారాజ సినిమా ఓటీటీలోకి రానుంది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లోనూ అదే రోజు స్ట్రీమింగ్ కు అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది నెట్ ఫ్లిక్స్.

కాగా మహారాజ సినిమా విజయ్ సేతుపతి కెరీర్ లో 50వ సినిమా. నితిల‌న్ సామినాథ‌న్ తెరకెక్కించిన ఈ రివేంజ్ క్రైమ్ థ్రిల్లర్ లో బాలీవుడ్ నటుడు, డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ ప్రతినాయకుడిగా నటించాడు. మమతా మోహన్ దాస్, అభిరామి, భారతి రాజా ఈ సినిమాలో ప్రధాన పాత్రలలో నటించారు. విరూపాక్ష, కాంతార, మంగళవారం వంటి సినిమాలకు సంగీతం అందించిన అజనీష్ లోక్ నాథ్ మహారాజ సినిమాకు స్వరాలు సమకూర్చడం విశేసం. మరి థియేటర్లలో విజయ్ సేతుపతి సినిమాను మిస్ అయ్యారా? అయితే ఎంచెక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.

ఇవి కూడా చదవండి

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Actress Hema: బిగ్ ట్విస్ట్.. హేమ డ్రగ్స్ టెస్ట్‌లో షాకింగ్ రిజల్ట్.. ‘మా’కు సంచలన లేఖ

0

రెండు నెలల క్రితం బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో ప్రముఖ టాలీవుడ్ నటి హేమ పట్టుబడినట్లు అక్కడి పోలీసులు ప్రకటించడం టాలీవుడ్ లో తీవ్ర కలకలం రేపింది. ఆమె డ్రగ్స్ సేవించిందని, టెస్ట్ రిపోర్ట్ లో కూడా పాజిటివ్ గా వచ్చిందంటూ పోలీసులు నోటీసులు కూడా జారీ చేశారు. ఆ తర్వాత విచారణకు వచ్చిన నటిని బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మధ్యనే ఆమె బెయిల్ పై జైలు నుంచి బయటకు వచ్చింది. అయితే పోలీసులు హేమని అరెస్టు చేసిన తరువాత, ఆమెపై వచ్చిన ఆరోపణలు చూసి మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ (మా) హేమ ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేసింది. అయితే ఈ విషయంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. నటి హేమ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు సంచలన లేఖ రాసింది. అంతేకాదు మా అధ్యక్షుడు మంచు విష్ణును కలిసి స్వయంగా ఆ లెటర్ అందజేసింది. దీంతో పాటు డ్రగ్స్ టెస్ట్ కు సంబంధించి తన రిపోర్టును కూడా మంచు విష్ణుకు అందజేసింది హేమ.

‘నేను సుమారు దశాబ్ద కాలంగా మా అసోసియేషన్ లో సభ్యురాలిగా ఉన్నాను. అలాంటిది తనకు ఎటువంటి షోకాజ్ నోటీసులు జారీ చేయకుండా, కనీసం వివరణ అడగకుంగా మా సభ్యత్వం నుంచి తొలగించడం అన్యాయం. బెంగళూరు రేవ్ పార్టీ ఉదంతంలో నాపై దుష్ప్రచారం జరిగింది. ఈ విషయంలో మా కూడా ఏకపక్షంగా వ్యవహరించింది. మా బైలాస్ ప్రకారం నాకు ముందుగా షోకాజ్ నోటీసు జారీ చేయాలి. కానీ అటువంటిదేమీ జరగలేదు. షోకాజ్ నోటీసుకు ఇచ్చిన వివరణ సరైనది కానప్పుడు ఏదైనా యాక్షన్ తీసుకోవాలి. కానీ ఎలాంటి షోకాజ్ నోటీసు ఇవ్వకుండా మా నుంచి నన్ను తీసెయ్యడం చాలా పెద్ద తప్పు. ఇటీవలె నేను డ్రగ్స్ టెస్ట్ చేయించుకున్నాను. అందులో నాకు నెగిటివ్ వచ్చింది. త్వరలోనే‌ పోలీసులు జరిపిన పరీక్షల వివరాలు బయటకు వస్తాయి. అందుకని మళ్లీ ‘మా’లో నా సభ్యత్వాన్ని కొనసాగించాలి. ఎందుకంటే డ్రగ్స్ కేసు విషయంలో నాకు ‘మా’ సపోర్ట్ కావాలి’ అని లేఖలో పేర్కొంది హే.

కాగా హేమ‌ లేఖను తీసుకున్న మంచు విష్ణు దాననిఇ అడ్వైజరీ కమిటీకి పంపిస్తామని, తరువాత మా కమిటీ లో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని హేమకు హామీ ఇచ్చిన్నట్టు తెలిసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Tollywood: ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? ఒకప్పటి క్రేజీ హీరోయిన్.. క్లాసికల్ డ్యాన్సర్ కూడా

0

పై ఫొటోలోని అమ్మాయిని గుర్తు పట్టారా? ఈమె ఒకప్పటి సౌతిండియన్ హీరోయిన్. తెలుగులోనూ పలు సినిమాలు చేసింది. సహజ నటిగా అందరి మన్ననలు అందుకుంది. తన కెరీర్ లో ఎక్కువగా హోమ్లీ పాత్రల్లోనే కనిపించిందీ అందాల తార. అదే సమయంలో గ్లామర్ రోల్స్ కాకుండా నటనకు ప్రాధాన్యమున్న పాత్రలే చేసింది. చిన్నప్పటి నుంచి భరత నాట్యంలో శిక్షణ పొందిన ఈ నటి క్లాసికల్ డ్యాన్సర్ కూడా. స్కూల్ లో చదువుకుంటున్న రోజుల్లోనే ఒక ర్యాంప్ వాక్ లో పాల్గొన్న ఫొటోలు ఒక ప్రముఖ దర్శకుడి కంట పడడంతో ఈ నటి సినిమా కెరీర్ ప్రారంభమైంది. ఆ తర్వాత దక్షిణాదితో పాటు హిందీ సినిమాల్లోనూ నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. మరి పోలీకలు చూసి ఈ అమ్మాయి ఎవరో గుర్తు పట్టచ్చు. ఈమె మరెవరో కాదు ఒకప్పటి అందాల నటి.. ఇప్పటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ రేవతి. సోమవారం (జులై 08) ఆమె పుట్టిన రోజు. పలువురు ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఈ సీనియర్ నటికి బర్త్ డే విషెస్ చెబుతున్నారు. ఇదే సందర్భంగా రేవతికి సంబంధించిన చిన్ననాటి, అరుదైన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

డైరెక్టర్ రేలంగి నరసింహరావు తెరకెక్కించిన ‘మానసవీణ’ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది రేవతి. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసింది. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన సూపర్ హిట్ చిత్రం ‘గాయం’లో నటించి మెప్పించింది. అలాగే వెంకటేశ్ సరసన నటించిన ప్రేమ సినిమా అప్పట్లో యువతను బాగా అలరించింది. నార్త్ టు సౌత్ పలు హిట్ సినిమాల్లో నటించిన రేవతి 1986లో సురేష్ చంద్ర మీనన్ తో పెళ్లిపీటలెక్కింది. అయితే 2013లో వీరిద్దరూ విడిపోయారు. ఇక ఇప్పుడు తన సెకండ్ ఇన్నింగ్స్ లో తల్లి క్యారెక్టర్లు చేస్తూ.. బిజీగా ఉంటుందామె. లోఫర్, సైజ్ జీరో, మేజర్ లాంటి ఎన్నో హిట్ చిత్రాల్లో కీలక పాత్రలు పోషించింది రేవతి. ఇక దర్శకురాలిగా కూడా తనదైన ముద్రవేసుకుంది

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Lady Producer: టాలీవుడ్‌లో దారుణం.. కుళ్లిన స్థితిలో లేడీ ప్రొడ్యూసర్ శవం.!

0

ఓ లేడీ… ఫిల్మ్ ఇండస్ట్రీకొచ్చి రాణిస్తున్నారంటేనే.. ఆమె ధైర్యవంతురాలయ్యే ఉంటుంది. మరి ఇప్పుడా ధైర్యమే పోయిందో.. లేక ఎవరికీ చెప్పుకోని కష్టమే వచ్చిందో.. లేక మరేదైనా కారణమే ఉందో.. తెలీదు కానీ.. టాలీవుడ్‌లో ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌గా రాణిస్తున్న స్వప్న వర్మ.. సూసైడ్ చేసుకొన్నారు. కుళ్లిన స్థితిలో తన ఇంట్లోనే శవమై కనిపించి.. ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యారు. ఇక ప్రొడ్యూసర్‌గా.. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా మగాళ్లు మాత్రమే రాణిస్తున్న ఇండస్ట్రీలో.. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నా స్వప్న వర్మ. సొంతూరు రాజమండ్రి నుంచి హైద్రాబాద్‌కు వచ్చి.. దాదాపు మూడు సంవత్సరాలుగా ఇండస్ట్రీలో పని చేస్తున్నారు. 6 నెలలుగా ఏ ప్రాజెక్ట్ లేకపోవడంతో.. ఇంట్లోనే ఉంటున్నారు. ఇక ఈ క్రమంలోనే మాదాపూర్ కావూరి హిల్స్‌లో ఉన్న తన ఇంట్లో విగతజీవిగా కనిపించారు.

స్వప్న వర్మ ఇంట్లో నుంచి చెడు వాసన వస్తుండడంతో.. ఆమె ఇంటి పక్కనే ఉన్న వారు.. డోర్ తెరచి చూసి షాకయ్యారు. తన బెడ్‌రూమ్లో ఫ్యాన్‌కు వేలాడుతున్న ఆమె డెడ్ బాడీని చూసి భయపడ్డారు. పోలీసులకు ఇన్ఫర్మేషన్‌ ఇచ్చారు. ఇక రంగంలోకి దిగిన పోలీసులు ఆమె డెడ్‌ బాడీని ప్రిల్మినరీ ఎగ్జాజ్ చేసి.. రెండు రోజుల క్రితం సూసైడ్ చేసుకుని ఉండొచ్చంటూ అంచనా వేశారు. ఆమె డెడ్ బాడీని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు దర్యాపు చేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Varalaxmi Sarathkumar: నటి వరలక్ష్మి పెళ్లికి ఏకంగా రూ. 200 కోట్ల ఖర్చు.. తండ్రి శరత్ కుమార్ ఏమన్నారంటే?

0

ప్రముఖ నటి వరలక్ష్మి శరత్ కుమార్ మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టింది. ముంబైకు చెందిన ఆర్ట్ గ్యాలరిస్ట్ నికోలాయ్ సచ్‌దేవ్ తో కలిసి ఆమె ఏడడుగులు నడిచింది. థాయ్‌లాండ్‌ వేదికగా జులై 2న వీరి వివాహం ఘనంగా జరిగింది. టాలీవుడ్, కోలీవుడ్ కు చెందిన పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు వరలక్ష్మి వివాహ వేడుకలో పాల్గొన్నారు. నూతన దంపతులను ఆశీర్వదించారు. ఇక పెళ్లికి రాని వారి కోసం చెన్నైలోని తాజ్ హోటల్ లో ఘనంగా రిసెప్షన్‌ కార్యక్రమాన్ని జరిపించారు. ఈ వేడుకకు తమిళనాడు సీఎం స్టాలిన్ తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. వీరి పెళ్లి వేడుకకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. అదే సమయంలో వరలక్ష్మి పెళ్లి ఖర్చు గురించి తమిళనాట పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అదేంటంటే.. వరలక్ష్మ పెళ్లి కోసం రూ. 200 కోట్లకు పైగానే శరత్ కుమార్ ఖర్చు చేశారట. దీనికి సంబంధించిన రూమర్లు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతున్నాయి.

ఈ రూమర్లపై వరలక్ష్మి తండ్రి శరత్ కుమార్ స్పందించారు. ‘అంత డబ్బు ఎక్కడుందో నాకు తెలియదు. అలాంటి వార్తలు పూర్తిగా అవాస్తవం. ఏమీ తెలియక తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్నారు. పెళ్లి కోసం అంత ఖర్చు చేయడం ఏంటి..? చాలా సింపుల్ గానే నా బిడ్డ పెళ్లి చేశాను. నిజాలు ఏంటో తెలియకుండానే ఊహించుకొని తప్పుడు వార్తలు ప్రచారం చేయకండి’ అని శరత్ కుమార్ సమాధానమిచ్చారు.

ఇవి కూడా చదవండి

కాగా ముంబైలోని అత్యంత సంపన్నుల్లో వరలక్ష్మి భర్త నికోలాయ్ సచ్ దేవ్ కూడా ఒకరు. అక్కడ ఆయనకు సొంత ఆర్ట్ గ్యాలరీ ఉంది. నికోలాయ్ కు సుమారు రూ. 900 కోట్ల ఆస్తులున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇక ఆయనకు ఇది వరకే వివాహమైంది. 15 ఏళ్ల కుమార్తె కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే వరలక్ష్మి ని రెండో వివాహం చేసుకున్నారు సచ్ దేవ్. వివాహ వేడుక సందర్భంగా నికోలాయ్ తన భార్యకు బంగారు చెప్పులు, డైమండ్ చీరను బహుమతిగా ఇచ్చాడని టాక్. వీటి విలువే సుమారు రూ.200 కోట్లకు పైగానే ఉంటుందని సమాచారం.

రాధిక, శరత్ కుమార్ ల డ్యాన్స్ ఇదిగో.. వీడియో

వరలక్ష్మి ప్రీ వెడ్డింగ్ వేడుకలు.. ఫొటోస్ ఇదిగో..

మెహెందీ వేడుకల్లో కాబోయే పెళ్లి కూతురు వరలక్ష్మి.. ఫొటోస్ ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Nag Ashwin: కల్కిలో కృష్ణుడిగా మహేష్ బాబు.! షాకింగ్ ఆన్సర్ ఇచ్చిన నాగి..

0

ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతుంది కల్కి 2898 ఏడి. జూన్ 27న విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకు 700 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. దాదాపు అన్ని ఏరియాల్లోనూ బ్రేక్ ఈవెన్ ను టచ్‌ చేసింది. పాన్ ఇండియా బాక్సాఫీస్ దగ్గర జోరుగా దూసుకుపోతోంది. త్వరలోనే 1000 కోట్ల క్లబ్‏లో చేరేలానే ఉంది. అయితే సినిమా ఇంతటి ఘన విజయం సాధించడంతో.. తాజాగా మీడియా ముందుకు వచ్చాడు డైరెక్టర్ నాగి. రావడమేకాదు.. కృష్ణ రోల్‌ మహేష్‌ బాబు చేస్తే ఎలా ఉండేది అంటూ.. తనను ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు షాకింగ్ ఆన్సర్ ఇచ్చాడు. తన ఆన్సర్స్‌తో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాడు.

ఇక ఆఫ్టర్ కల్కి రిలీజ్… ఈ సినిమాలోని కృష్ణుడి క్యామియోను మహేష్ బాబు చేస్తే బాగుండేదని.. అందరూ అభిప్రాయపడ్డారు. సోషల్ మీడియాలో దీన్నో చర్చగా మార్చారు. అందులో కొందరు పార్ట్‌లో 2 శ్రీకృష్ణుడిగా మహేషే కనిపించబోతున్నాడంటూ.. పోస్టులు పెట్టారు. దీంతో రీసెంట్గా మీడియా ముందుకు వచ్చిన డైరెక్టర్ నాగిని ఈ విషయంపైనే ప్రశ్నించారు రిపోర్టర్లు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.