Saturday, November 23, 2024
Google search engine
Home Blog Page 492

Prabhas – Kalki 2898 AD: కల్కి 2898 ఏడీ హవా.. కల్కి జోరు మరింత పెరుగుతుందా.?

0

ఈ సారి గ్రాఫిక్స్ వర్క్ మరింత భారీగా ఉండబోతుందని, అందుకే పార్ట్ 2 పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌కు ఎక్కవు టైమ్ పడుతుందని చెప్పారు.

Director Nag Ashwin: కల్కిలో కృష్ణుడిగా మహేష్ బాబు.. అసలు విషయం చెప్పేసిన నాగ్ అశ్విన్..

0

ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది కల్కి 2898 ఏడి. జూన్ 27న విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకు రూ.700 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. దాదాపు అన్ని ఏరియాల్లోనూ బ్రేక్ ఈవెన్ అయిందని తెలుస్తోంది. భారీ అంజనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పటికీ పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద జోరు కొనసాగిస్తుంది. మొదటి రోజు నుంచే కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న ఈ చిత్రానికి రెండో వారంలోనూ మరిన్ని వసూళ్లు రావడం ఖాయమని.. త్వరలోనే రూ.1000 కోట్ల క్లబ్‏లో చేరనుందని అంటున్నారు. ప్రభాస్, అమితాబ్, కమల్ హాసన్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ మూవీలో టాలీవుడ్, కోలీవుడ్ సినీ తారలు గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా సెకండ్ పార్ట్ పై ఇప్పటికే చాలా క్యూరియాసిటీ నెలకొంది. ఈ క్రమంలో శుక్రవారం మీడియాతో ముచ్చటించిన డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.

ఈసినిమాలో అర్జునుడిగా విజయ్ దేవరకొండ నటించగా.. కర్ణుడిగా ప్రభాస్ కనిపించారు. వీరిద్దరి మధ్య వచ్చే సీన్స్ కు థియేటర్లు దద్దరిల్లాయి. అయితే ఈ మూవీ తర్వాత అర్జునుడు, కర్ణుడి గురించి చర్చలు జరిగాయి. అలా చర్చ జరగడం మంచిదే అని.. మహా భారతం గురించి అందరూ తెలుసుకుంటారు. అది మంచిదేగా అని అన్నారు. అలాగే నాని, నవీన్ పొలిశెట్టి లను కూడా రెండు పార్టులో ఎక్కడ వీలైతే అక్కడ ఇరికించేస్తా అని నవ్వుతూ ఆన్సర్ ఇచ్చారు. అలాగే కల్కి సినిమాలో భైరవ పాత్రను సీరియస్ గా కాకుండా సరదాగా ఉండాలనే ఉద్దేశంతో అలా క్రియేట్ చేశానని అన్నారు.

ఇక శ్రీకృష్ణుడిగా మహేష్ బాబు నటిస్తే బాగుంటుందనే చర్చలు సోషల్ మీడియాలో జరిగాయి. నిజంగానే తీసుకుంటారా ? అని అడగ్గా.. కృష్ణుడిగా మహేష్ బాబు బాగుంటాడు. కానీ ఈ సినిమాలో కాకుండా వేరే సినిమాలో చేస్తే బాగుంటుంది అని అన్నారు. అలాగే కల్కి 2లో కమల్ హాసన్ పాత్రను పూర్తిగా చూపిస్తామని అన్నారు. బుజ్జిని డిజైన్ చేసేందుకు టీం చాలా కష్టపడిందని.. బుజ్జి కోసం సపరేట్ లైసెన్స్ కూడా ఇచ్చారని అన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Ranveer Singh: బాలీవుడ్‌ని దున్నేస్తాడని కబుర్లు చెప్పి.. ఇప్పుటికి అవకాశాలకోసం చూపులు.

0

Pawan Kalyan: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఆగిపోనుందా? నెటిజన్‌కు గట్టిగా ఇచ్చిపడేసిన డైరెక్టర్ హరీశ్‌ శంకర్

0

పవర్ స్టార్ పవన్ కల్యాణ్- హరీశ్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దీంతో ఉస్తాద్ భగత్ సింగ్ పై అభిమానుల అంచనాలు భారీగానే ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే ఈ మూవీ నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్స్, గ్లింప్స్ ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అయితే పవన్ కల్యాణ్ ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా బిజీబిజీగా ఉంటున్నారు. దీంతో ఎప్పటిలాగానే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాపై రూమర్లు వస్తున్నాయి. గతంలో పలు సార్లు ఈ సినిమా ఆగిపోయినట్లు పుకార్లు షికార్లు చేశాయి. అయితే డైరెక్టర్ హరీశ్ శంకర్ మాత్రం వీటికి స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తున్నాడు. తన సినిమా అప్ డేట్స్ ను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నాడు. తాజాగా ఒక నెటిజన్ ‘ఉస్తాద్ భగత్‌ సింగ్‌’ ఆగిపోనుందంటూ ట్వీట్ చేశాడు. దీనికి స్పందించిన హరీశ్ శంకర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. ‘సినిమా మొదలేకాదు అని రూమర్స్‌ వచ్చినప్పుడే పట్టించుకోలేదు. ఇప్పుడు ఇలాంటి వాటి గురించి చదివే సమయం కూడా లేదు’ అని తనదైన శైలిలో రిప్లై ఇచ్చాడీ స్టార్ డైరెక్టర్.

ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో పవన్ కల్యాణ్ సరసన క్రేజీ హీరోయిన్ శ్రీలీల నటిస్తోంది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు. అశుతోష్ రాణా, నవాబ్ షా, చమ్మక్ చంద్ర, గిరి, గౌతమి తదితరులు ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

హరీశ్ శంకర్ ట్వీట్..

ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో పవన్ కల్యాణ్..

డైరెక్టర్ హరీశ్ శంకర్ ,పవన్ కల్యాణ్ లతో శ్రీలీల..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Tollywood: పవన్ కళ్యాణ్ సినిమాలో నటించిన ఈ అమ్మాయిని గుర్తుపట్టారా..? ఇప్పుడేం చేస్తుందంటే..

0

పైన ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా..? తెలుగులో ఒకే ఒక్క సినిమాలో నటించింది. అది కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటేస్ట్ మూవీ. బాక్సాఫీస్ వద్ద మంచి రివ్యూస్ అందుకున్న సినిమాలో కనిపించింది. కానీ ఈ బ్యూటీకి అదృష్టం మాత్రం కలిసిరాలేదు. తెలుగులో చేసిన ఒక్క సినిమాకు నటనతో ఫిదా చేసింది. కానీ ఆ తర్వాత మరో అవకాశం అందుకోలేదు. నిజానికి ఈ అమ్మాయి కోలీవుడ్ ఇండస్ట్రీలో చాలా ఫేమస్. అక్కడే వరుస సినిమాలు చేసింది. అందం, అభినయం ఎంత ఉన్నా ఇప్పటివరకు హీరోయిన్ అవకాశాలు మాత్రం రాలేదు. చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు చిత్రాల్లో అలరించింది. హీరోయిన్ అమాలపాల్ కూతురిగానూ కనిపించింది. ఇప్పుడు ఈ బ్యూటీ లేటేస్ట్ ఫోటోస్ నెట్టింట ఆకట్టుకుంటున్నాయి. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా.. ? తన పేరు యువలక్ష్మి.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , హీరో సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన బ్రో మూవీలో నటించింది ఈ అమ్మాయి.. ఇందులో సాయి ధరమ్ తేజ్ రెండవ చెల్లిగా కనిపించింది. మొదటి సిస్టర్ ప్రియా ప్రకాష్ వారియర్ కాగా.. మరో చెల్లెలు యువలక్ష్మి. బ్రో సినిమాలో ఆమె పాత్రకు ఎక్కువ స్కోప్ ఉంది. అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. కానీ ఈ సినిమా తర్వాత తెలుగులో మరో సినిమా చేయలేదు. ఈ బ్యూటీకి టాలీవుడ్ లో ఆఫర్స్ కూడా రాలేదు. ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం ఇప్పడిప్పుడే తమిళంలో హీరోయిన్ ఆఫర్స్ అందుకుంటుంది యువలక్ష్మి. కోలీవుడ్ లో మానవన్ సినిమాలో నటిస్తుంది.

బాలనటిగా కెరీర్ స్టార్ట్ చేసింది యువలక్ష్మి. తమిళంలో సముద్రఖని, అమలా పాల్ కలిసి నటించిన అమ్మ కనక్కు సినిమాలో నటించింది. ఇందులో అమలా పాల్ కూతురిగా కనిపించింది. ఆ తర్వాత కాంజన 3, వినోదయ సీతమ్ చిత్రాల్లో నటించింది. యువలక్ష్మి నటించిన చిత్రాలన్ని సూపర్ హిట్ అయ్యాయి. కానీ అంతగా అవకాశాలు మాత్రం రాలేదు. ప్రస్తుతం యువలక్ష్మి లేటేస్ట్ ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Tollywood: ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వాల్సింది.. అంతలోనే వివాదాలతో వార్తల్లో..

0

పై ఫోటోలో చాలా క్యూట్ గా కనిపిస్తున్న ఈ అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా? హిమాచల్ ప్రదేశ్ కు చెందిన ఈ అమ్మాయి త్వరలోనే టాలీవుడ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వాల్సి ఉంది. అది కూడా ఓ యంగ్ హీరోతో. పైగా ఇందులో తన క్యారెక్టర్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఈ సినిమాలో ఆమె బాలకృష్ణ అభిమానిగా కనిపించనుంది. అంతేకాదు మొదటి సినిమాలోనే యంగ్ హీరోతో కలిసి ముద్దులు, బెడ్ రూమ్ సీన్స్ లో ఓ రేంజ్లో రెచ్చిపోయి నటించింది. లుక్స్ కూడా చాలా బాగున్నాయి. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ఈ అమ్మడు కూడా టాలీవుడ్ లో బిజీ అవుతుందని చాలా మంది భావించారు. అయితే అంతకన్నా ముందే ఈ బ్యూటీ పేరు వార్తల్లో నానుతోంది. ప్రముఖ హీరో రాజ్ తరుణ్, లావణ్య వివాదంలో ఈ అందాల తార పేరు కూడా వినిపిస్తుండటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ పాటికే అర్థమై ఉంటుంది మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో? యస్ ఈ అమ్మాయి మరెవరో కాదు ‘తిరగబడరాసామీ’ మూవీ హీరోయిన్ మాల్వి మల్హోత్రా. ఇది ఆమె కాలేజ్ డేస్ నాటి ఫొటో. పక్కన ఉన్నది నటి తల్లిదండ్రులు. రాజ్ తరుణ్, లావణ్య వ్యవహారంలో ఈ హీరోయిన్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తుండడంతో ప్రస్తుతం మాల్వి ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.

కాగా లావణ్య అనే యువతి హీరో రాజ్ తరుణ్ పై చీటింగ్ కేసు పెట్టింది. తనను ప్రేమ పేరుతో మోసం చేశాడంటూ నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఈ కంప్లైంట్ లో మాల్వీ పేరు కూడా బాగా వినిపించింది. రాజ్ తరుణ్ మాల్వీతో ప్రేమాయణం కొనసాగిస్తున్నాడంటూ లావణ్య సంచలన ఆరోపణలు చేసింది. ఇదే విజయంపై రాజ్ తరుణ్ కూడా ఘాటుగా రియాక్ట్ అయ్యాడు. లావణ్య చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నాడు. ‘మాల్వి మల్హోత్రా నాకు మంచి ఫ్రెండ్ మాత్రమే. మాల్వి మల్హోత్రా నేను క‌లిసి తిర‌గ‌బ‌డ‌రా సామీ అనే సినిమాలో న‌టించాం. ఆ సినిమా వ‌ర‌కే మా రిలేష‌న్. లావ‌ణ్య కావాల‌ని మా ఇద్దరిపై త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేస్తుంది’ అని క్లారిటీ ఇచ్చాడు.

ఇవి కూడా చదవండి

రాజ్ తరుణ్ తో మాల్వి మల్హోత్రా

హిమాచల్ ప్రదేశ్ కి మాల్వీ ముంబైలో చదువుకుంది. హిందీలో పలు సీరియల్స్, షార్ట్ ఫిలిమ్స్, ఓటీటీ సినిమాల్లో నటించింది. ఆ తర్వాత మలయాళం, తమిళ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. త్వరలోనే తిరగబరాసామీ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Sathyaraj : కట్టప్ప కొడుకును ఎప్పుడైనా చూశారా..? సత్యరాజ్ తనయుడు అక్కడ స్టార్ హీరో..

0

దక్షిణాది సినీ ప్రియులకు నటుడు సత్యరాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తమిళ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో. ఆ తర్వాత సహయ పాత్రలు పోషించడం మొదలు పెట్టాడు. తన వయసుకు తగ్గ పాత్రలు చేస్తూ నటనతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. తెలుగు, తమిళం భాషలలో అనేక చిత్రాల్లో ఎన్నో పాత్రలలో కనిపించి మెప్పించారు. కానీ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాతో పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. బాహుబలి సినిమాలో కట్టప్ప పాత్రలో అద్భుతమైన నటనతో ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులకు దగ్గరయ్యారు. శంఖం, మిర్చి, ప్రతిరోజు పండగే వంటి చిత్రాల్లో కీలకపాత్రలలో కనిపించారు. స్టార్ హీరోలకు తండ్రిగా, తాతయ్యగా నటిస్తూ అడియన్స్ కు చేరువయ్యారు. కానీ ఇప్పటికీ ఆయనను జనాలు కట్టప్పగానే గుర్తు పెట్టుకున్నారు. అంతగా ఆ పాత్రతో ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. సౌత్ ఇండస్ట్రీలో స్టార్ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ సత్యరాజ్ కుటుంబానికి సంబంధించిన విషయాలు ఎవరికీ తెలియవు.

ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్న సత్యరాజ్.. మీడియాకు దూరంగా ఉంటారు. ముఖ్యంగా తన వ్యక్తిగత జీవితాన్ని చాలా గోప్యంగా ఉంచుతారు. అందుకే సత్యరాజ్ ఫ్యామిలీ గురించి ఎవరికి అంతగా తెలియదు. సత్యరాజ్ భార్య పేరు మహేశ్వరి. ఆయనకు కూతురు దివ్య సత్యరాజ్, కోడుకు సిబిరాజ్. కూతురు న్యూట్రిషియన్‌గా కెరీర్‌ కొనసాగిస్తుండగా.. కొడుకు మాత్రం సినిమాల్లో రాణిస్తున్నాడు. సిబి సత్యరాజ్ కోలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు. అతడిని సిబిరాజ్ అని కూడా పిలుస్తారు. చెన్నైలోని లయోలా కాలేజీలో గ్రాడ్యూయేషన్ పూర్తిచేసిన సిబిరాజ్.. ఆ తర్వాత తండ్రి బాటలోనే నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు.

2003లో స్టూడెంట్ నెంబర్ 1 సినిమాతో హీరోగా తన సినీ ప్రయాణాన్ని ప్రారంభఇంచాడు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. ఆ తర్వాత జోర్, మన్నిన్ మైందన్, వెట్రివేల్ శక్తివేల్, కోవై బ్రదర్స్ వంటి చిత్రాల్లో నటించి మెప్పించాడు. తమిళ్ సినీ పరిశ్రమలో హీరోయిజం చిత్రాలు కాకుండా వైవిధ్యమైన కంటెంట్ చిత్రాలను ఎంచుకుంటూ నటుడిగా ప్రశంసలు అందుకుంటున్నాడు. చెన్నైలోని ఓ ఐటీ కంపెనీలో పనిచేస్తున్న సాఫ్ట్ వేర్ ఇంజనీర్ రేవతిని 2008లో వివాహం చేసుకున్నాడు సిబిరాజ్. వీరికి బాబు, పాప ఉన్నారు. ప్రస్తుతం సిబిరాజ్ ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Kalki 2898 AD: మహేష్‌ ఇలాకాలో.. ప్రభాస్‌ దిమ్మతిరిగే రికార్డ్.! అదిరిపోయింది గా.!

0

డైరెక్టర్ నాగ్ అశ్విన్ రూపొందించిన కల్కి 2898 ఏడి సరికొత్త రికార్డులు సృష్టిస్తుంది. జూన్ 27న విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లను సాధిస్తోంది. దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ కలెక్షన్స్ కొళ్లగొడుతోంది. ఇప్పటికే వరల్డ్ వైడ్ 700 క్రోర్ గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి అనేక చోట్ల పలు రికార్డ్స్ బ్రేక్ చేసిన కల్కి మూవీ.. తాజాగా మహేష్ ఇలాకాలో నయా రికార్డును క్రియేట్ చేసింది. ఎవరికీ సాధ్యం కానీ రికార్డును నెలకొల్పింది. ఎస్ ! హైద్రాబాద్లో ఉన్న ది బెస్ట్ మల్టిప్లెక్స్‌లలో.. మహేష్‌స్‌ AMB మల్టిప్లెక్స్‌ కూడా ఒకటి. ఈ మల్టిప్లెక్స్‌లో ఉన్న 7 స్క్రీన్స్‌లలో డే1 కల్కి మూవీ మాత్రమే స్క్రీనింగ్ అయింది. అంటే ఆ ఒక్క రోజే AMB మల్టిప్లెక్స్‌లో మొత్తం 40 కల్కి షోలు పడ్డాయి. ఆ రోజు నుంచి సగం స్క్రీన్స్‌లో కల్కి మూవీనే ఇంకా స్క్రీనింగ్ కూడా అవుతోంది. దీంతో ఒక్క AMBలోనే కలెక్షన్స్‌లో నయా రికార్డును క్రియేట్ చేసింది ప్రభాస్ కల్కి మూవీ.

ఒక్క AMB థియేటర్లోనే కల్కి మూవీ దాదాపు వన్ క్రోర్ గ్రాస్‌ను వచ్చేలా చేసుకుంది. అది కూడా చాలా ఫాస్ట్గా ఈ మొత్తాన్ని వసూలు చేసి.. AMBలోనే నెంబర్ వన్ మూవీగా హిస్టరీకెక్కింది. ఇక ఇదే విషయాన్ని AMB మేనేజ్‌మెంట్ తమ ట్విట్టర్ ఎక్స్ హ్యాండిల్లో పోస్ట్ చేసింది. కల్కి మూవీని ఇంకా చూడని వాళ్లు.. తమ మల్టిప్లెక్స్‌లో టికెట్ బుక్ చేసుకోండంటూ.. తమ ట్వీట్లో కోట్ చేసింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Tollywood Heroines: టాలీవుడ్‌లో హీరోయిన్ల మధ్య ఆసక్తికర పోరు

0

Kalki 2898 AD: కల్కి సినిమాలో కృష్ణుడి ముఖం చూపించకపోవడానికి కారణమిదే.. అసలు విషయం చెప్పేసిన డైరెక్టర్

0

పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 AD’ చిత్రం గత వారం విడుదలై మంచి వసూళ్లను రాబడుతోంది. ఇప్పటికే రూ. 500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ మూవీ మరి కొద్ది రోజుల్లో 1000 కోట్ల క్లబ్‌లో చేరనుంది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం కురుక్షేత్ర యుద్ధం ముగింపుతో మొదలై కలియుగం ముగింపుతో ముగుస్తుంది. మహాభారతంలోని కొన్ని పాత్రలను కూడా ఈ సినిమాలో చూపించాడు . అర్జునుడు, కర్ణుడు, అశ్వత్థామ, కృష్ణుడి పాత్రలు హైలెట్ గా నిలిచాయి. అయితే కల్కి సినిమాలో కృష్ణుడి ముఖం చూపించలేదు. ‘కల్కి 2898 AD’ సినిమా ప్రారంభంలోనే కృష్ణుడిని చూపించారు. కానీ ఇక్కడ కృష్ణుడి ముఖం మాత్రం కనిపించదు. ఆ తర్వాత మరో రెండు సన్నివేశాల్లో కృష్ణుడి పాత్ర వస్తుంది. అయితే అప్పుడు కూడా కృష్ణుడి ముఖం కనిపిందు. కృష్ణుడి ముఖం ప్రేక్షకులకు ఎదురుగా ఉన్నా.. వెనుక నుండి వచ్చిన కాంతి అతని ముఖం కనిపించకుండా చేసింది. అయితే కల్కి సినిమాలో కృష్ణుడి పాత్ర కు మంచి పేరొచ్చింది. ముఖ్యంగా ఈ సీన్స్ కు ఇచ్చిన వాయిస్ ఓవర్ ఆడియెన్స్ ను కట్టిపడేసింది.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే దర్శకుడు నాగ్ అశ్విన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కృష్ణ ముఖాన్ని ఎందుకు చూపించలేదనే విషయంపై మాట్లాడారు. ‘మొదటి నుంచి కృష్ణుడి ముఖం చూపకుండా షాడో మోడల్ లేదా ఇమేజ్ మోడల్‌ను మాత్రమే చూపించాలనే ఆలోచన మాకు ఉంది. అలా కాకుండా ఆ పాత్ర (కృష్ణుడు) ఒక వ్యక్తి లేదా యాక్టర్‌లానే ఉండిపోతుంది. కృష్ణుడిని ముదురు రంగులో చీకటి రూపులో (ఆకారం)చూపించాలని ఉండేది. కృష్ణుని ముఖాన్ని చూపించడానికి ఎలాంటి ప్లాన్ లేదని, ఆయనను అలానే చూపించడం కొనసాగిస్తాం. మనం కృష్ణుడిని ఒక అసాధారణమైన వ్యక్తిగా మనసులో పూజిస్తున్నాం. ‘ అని నాగ్ అశ్విన్ అన్నారు.

భీమవరంలో బుజ్జి..

‘కల్కి 2898 AD’ సినిమా రెండో భాగంలో కూడా కృష్ణుడి పాత్ర ఉంటుందని, ఆ పార్ట్ లో కూడా కృష్ణుడి ముఖం కనిపించదని నాగ్ అశ్విన్ తెలిపాడు. తమిళ నటుడు కృష్ణ కుమార్ కృష్ణ పాత్రలో మెరిశారు. ‘సురారై పోట్రు’తో పాటు మరికొన్ని తమిళ సినిమాల్లో కృష్ణ కుమార్ సైగా నటించారు. ఈ పాత్రలో అతని ముఖం కనిపించకపోయినా, అతని నడవడిక, కదలికలు అందరి దృష్టిని ఆకర్షించాయి. ఈ పాత్రకు ప్రముఖ కోలీవుడ్ హీరో ఆర్టిస్ట్ అర్జున్ దాస్ వాయిస్ ఓవర్ ఇచ్చారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.