ప్రస్తుతం మర్డర్ ఇన్వెస్టిగేషన్, సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు చూసేందుకు నెటిజన్స్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అలాగే ఇటీవలి కాలంలో మంచి మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రాలు కూడా ఓటీటీలో సందడి చేస్తున్నాయి. ప్రస్తుతం సమాజంలో యువతుల మాదిరిగానే యువకులు కూడా అనేక సమస్యలలో చిక్కుకుంటున్నారు. ప్రేమ, బ్రేకప్, డేటింగ్ అంటూ ఎంతో మంది కుర్రాళ్ల జీవితాలు నరకంగా మారుతున్నాయి. తమ జీవితంలో ఎదురైన పరిస్థితులు, కష్టాలను ఎవరికి చెప్పుకోలేక చివరకు మృత్యు ఒడిలోకి చేరుకుంటున్నారు. అలాంటి సంఘటనలను ఆధారంగా చేసుకుని తెరకెక్కించిన సినిమానే B.A.Pass. ఒక పంజాబీ కుటుంబంలో జరిగిన సంఘటనలనే ఈ సినిమాగా తెరకెక్కించారు. అనుకోని ప్రమాదంలో ఆ ఫ్యామిలీలోని ఇద్దరు భార్యాభర్తలు చనిపోవడంతో కుమారుడు ముఖేష్ , ఇద్దరు కుమార్తెలు అనాథలుగా మారతారు.
దీంతో ఆ ముగ్గురు తమ తాతయ్య, అత్తయ్య ఇంట్లో ఉంటారు. అమ్మాయిల బాధ్యత తాతయ్య తీసుకుంటే అబ్బాయి బాధ్యత అత్తకు వస్తుంది. దీంతో ఆ కుర్రాడిని చిన్న చూపు చూస్తు ఇంట్లో పనులు చేయిస్తుంది. అదే సమయంలో ఆ ఇంటికి వచ్చిన ఆ అత్త స్నేహితురాలు రేవతి ముఖేష్ పై కన్నేసి.. అతడిని శారీరంగా వేధిస్తుంటుంది. దీంతో ముఖేష్ తన బాధను ఎవరికీ చెప్పుకోలేక మానసిక సంఘర్షణకు గురవుతుంటాడు. ప్రశాంతత కోసం స్మశానానికి వెళ్లగా.. అక్కడ ముఖేష్ కు ఓ వ్యక్తి పరిచయం కావడం.. ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడుతుంది. మరోవైపు తాతయ్య మరణించడంతో చెల్లెళ్ల బాధ్యత ముఖేష్ పై పడుతుంది. దీంతో వారిని చూసుకోవడానికి డబ్బుల కోసం రేవతి ఆంటీతో ప్రేమాయణం నడిపిస్తాడు. ఆ తర్వాత ముఖేష్ ను మరికొంత మంది అమ్మాయిల వద్దకు పంపుతూ డబ్బులు సంపాదిస్తుంది.
ముఖేష్ తన చెల్లెళ్లను హాస్టల్లో చేర్పించగా.. అక్కడి ఓనర్ అమ్మాయిలను విక్రయిస్తుంటుంది. దీంతో తన చెల్లెళ్లను కాపాడుకోవడానికి ఆ హాస్టల్ ఓనర్ కు పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లిస్తాడు. అక్కడే ముఖేష్ కు కొందరు అమ్మాయిలతో పరిచయం ఏర్పడడంతో.. ఆ తర్వాత అతడి జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి.. ? అనేది తెలియాలంటే ఈ సినిమాను చూడాలి. ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. అలాగే యూట్యూబ్‌లో అందుబాటులో ఉంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.