కొరియన్ సినిమాలు, వెబ్ సిరీస్‍లకు వరల్డ్ వైడ్ గా క్రేజ్ ఉంది. ఓటీటీల్లో కూడా కొరియన్ కంటెంట్ కు బాగా ఆదరణ ఉంటోంది. అందుకు తగ్గట్టుగానే పలు ఓటీటీ సంస్థలు ఎప్పటికప్పుడు కొరియన్ సినిమాలను, వెబ్ సిరీస్ లను స్ట్రీమింగ్ కు తీసుకొస్తుంటాయి. ఆయా భాషల వారికి సులభంగా అర్థమయ్యేలా డబ్ చేసి మరీ అందుబాటులోకి తీసుకొస్తుంటాయి. అలా కొరియన్ సినిమాలను ఇష్టపడే వారి కోసం మరో సూపర్ హిట్ సినిమా స్ట్రీమింగ్ కు వచ్చేసింది. అదే హౌస్ ఆఫ్ ది డిస్సపియర్డ్. సుమారు ఏడేళ్ల క్రితం కొరియన్ థియేటర్లలో రిలీజైన ఈ సైకలాజికల్ థ్రిల్లర్ సూపర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ఇప్పుడీ సినిమా ఇండియాలో డైరెక్టుగా ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో హౌస్ ఆఫ్ ది డిస్సపియర్డ్ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. కొరియన్ లాంగ్వేజ్ తో పాటు తెలుగు, హిందీ, తమిళం భాషల్లోనూ ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.
భర్త, కుమారుడు ఎలా చనిపోయారు?
హౌస్ ఆఫ్ ది డిస్సపియర్డ్ సినిమాకు లిమ్ డీ వూంగ్ దర్శకత్వం వహించారు. ఇందులో యుంజిన్ కిన్, కే పాప్ స్టార్ ఓకే టయిక్ ఇయాన్, జా జయీ యూన్, పార్క్ సంగ్ హూన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. రిత్మికల్ గ్రీన్, జియాన్ ఎంటర్‌టైన్‍మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ థ్రిల్లర్ సినిమాకు కిమ్ వూ గెయిన్ సంగీతం అందించారు. ఇక సినిమా స్టోరీ లైన్ విషయానికి వస్తే.. భర్త, కొడుకును హత్య చేశారనే తప్పుడు ఆరోపణలతో హీ (యుంజిన్ కిమ్) 25 ఏళ్లు జైలు శిక్ష అనుభవిస్తుంది. ఆ తర్వాత బయటికి వచ్చి తన ఇంటికి తిరిగి వెళుతుంది. తన భర్త, కొడుకు చావుకు కారణాలేంటో కనుక్కునే ప్రయత్నం చేస్తుంది. మరి ఆమె ప్రయత్నం సక్సెస్ అయిందా లేదా తెలుసుకోవాలంటే హౌస్ ఆఫ్ ది డిస్సపియర్డ్ మూవీ చూడాల్సిందే. కొరియన్ సినిమాలు అందులోనూ థ్రిల్లర్ సినిమాలు చూసేవారికి ఇది మంచి ఛాయిస్ అని చెప్పుకోవచ్చు.
ఇవి కూడా చదవండి
House Of The Disappeared on OTT – Here’s where you can watch the Korean film on streaminghttps://t.co/DwlalzAMRt
— OTTplay (@ottplayapp) June 30, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.