OTT: ఓటీటీలోకి వచ్చేసిన హాలీవుడ్ యాక్ష‌న్ అడ్వెంచర్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?

0
28
ఓటీటీలోకి వచ్చేసిన హాలీవుడ్ యాక్ష‌న్ అడ్వెంచర్ థ్రిల్లర్

హాలీవుడ్ సినిమాలు చూసే వారికి సూపర్‌ హిట్‌ ఫ్రాంచైజీ ‘మ్యాడ్‌ మ్యాక్స్‌’ గురించి తెలిసే ఉంటుంది. యాక్షన్, అడ్వెంచర్ అండ్ సర్వైవల్ జానర్ లో వచ్చిన ఈ సినిమాలు సినీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. 1979లో ‘మ్యాడ్‌ మ్యాక్స్‌’ పేరుతో మొదటి సినిమా వచ్చింది. ఆ తర్వాత 1981లో మ్యాడ్ మ్యాక్స్ 2 (ది రోడ్ వారియర్). 1985లో మ్యాడ్ మ్యాక్స్ 3 (బియాండ్‌ థండర్‌ డోమ్‌), 2015లో మ్యాడ్ మ్యాక్స్ (ఫ్యూరీ రోడ్).. ఇలా మొత్తం నాలుగు సినిమాలు ఈ ఫ్రాంఛైజీలో వచ్చాయి. అన్ని సినిమాలు ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులను విశేషంగా అలరించాయి. ఈ సూపర్ హిట్ ఫ్రాంఛైజీ నుంచి వచ్చిన మరో సినిమానే ఫ్యూరియోసా: ఏ మ్యాడ్‌ మ్యాక్స్‌ సాగా. 2015 లో వ‌చ్చిన మ్యాడ్ మ్యాక్స్ (ఫ్యూరీ రోడ్) సినిమాకు ప్రీక్వెల్‌గా ఈ మూవీ తెరకెక్కింది. ఈ ఫ్రాంఛైజీ మొదటి మూడు భాగాలలో మెల్‌ గిబ్సన్‌ హీరోగా నటించగా నాలుగో చిత్రం ‘మ్యాడ్‌ మ్యాక్స్‌: ఫ్యూరీ రోడ్‌ నుంచి టామ్‌ హార్డీ హీరోగా నటించారు. మే 23న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఫ్యూరియోసా: ఏ మ్యాడ్‌ మ్యాక్స్‌ సాగా సూపర్ హిట్ గా నిలిచింది. హాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లనే రాబట్టింది. ఇప్పుడీ సూపర్ హిట్ సినిమా సైలెట్ గా ఓటీటీలోకి వచ్చేసింది. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం (జులై 05) అర్ధరాత్రి నుంచే ఫ్యూరియోసా సినిమాను స్ట్రీమింగ్ కు అందుబాటులోకి తీసుకొచ్చింది.

అయితే ప్రస్తుతం ఈ సినిమా కేవలం రెంటల్ బేసిస్ లో మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలోనే అమెజాన్ ప్రైమ్ యూజర్లకు ఉచితంగా చూసే అవకాశం రానుంది. మొదటి నాలుగు సినిమాలను తెరకెక్కించిన అస్ట్రేలియన్ డైరెక్ట‌ర్ జార్జ్ మిల్లర్ ఫ్యూరియోసా: ఏ మ్యాడ్‌ మ్యాక్స్‌ సాగా కు కూడా దర్శకత్వం వహించారు. ఇందులో థోర్ ఫేమ్ క్రిస్ హెమ్స్ వర్త్ హీరోగా నటించాడు. ది మెన్ మూవీ ఫేమ్ అన్యా టేలర్, చార్లస్ థెరన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ ఫ్రాంఛైజీలో ఐదో భాగం మ్యాడ్ మ్యాక్స్ (ది వేస్ట్ ల్యాండ్) షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here