Orry: ద్యావుడా.. రూ.4.3 కోట్ల విలువైన డైమండ్ నెక్లెస్ ధరించిన ఓరీ.. నెటిజన్స్ రియాక్షన్ చూస్తే షాకే..

0
62
రూ.4.3 కోట్ల విలువైన డైమండ్ నెక్లెస్ ధరించిన ఓరీ.

సోషల్ మీడియా సెన్సెషన్ ఓరీ.. అలియాస్ ఓర్హాన్ అవత్రమణి. బాలీవుడ్ తారలతో క్రేజీగా ఫోటోలకు ఫోజులిచ్చి నెట్టింట చాలా ఫేమస్ అయ్యాడు. తక్కువ సమయంలోనే భారతదేశంలోని ప్రముఖ ఇంటర్నెట్ వ్యక్తులలో ఒకరిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. బీటౌన్ బీఎఫ్ఎఫ్ గా పిలువబడే ఓరీ విలక్షణమైన శైలి, స్టార్ స్టడెడ్ ఈవెంట్లో తరచుగా హాజరవుతూ నెటిజన్స్ దృష్టిని ఆకర్షించారు. జాన్వీ కపూర్, అనన్య పాండే, దీపికా పదుకొణే, అనంత్ అంబానీ, నీతూ అంబానీ వంటి సెలబ్రెటీలతో క్లోజ్ గా ఫోటోలకు ఫోజులిస్తుంటాడు. అలాగే ఓరీ స్టైల్, యాటిట్యూడ్, మేనరిజం నెటిజన్స్ దృష్టిని ఆకర్షిస్తాయి. ఇటీవల జరిగిన అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ పెళ్లి వేడుకలలోనూ ఓరీ సందడి చేసిన సంగతి తెలిసిందే.

తాజాగా ఓరీ ఖరీదైన సర్పెంటి డైమండ్ నెక్లెస్‌ ధరించిన కొత్త ఫోటోను ఇన్ స్టాలో షేర్ చేయడంతో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఓరీ ధరించిన ఆ నెక్లెస్ ధర రూ.4.35 కోట్లు అని తెలుస్తోంది. ఓరీ సర్పెంటి డైమండ్ నెక్లెస్‌ను ధరించి ప్రత్యేకమైన ఫ్యాషన్ నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. ఓర్రీ అనంత్ అంబానీ పెళ్లి వేడుకలలోనూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ఈ హై-ప్రొఫైల్ ఈవెంట్‌లో అతని ఉనికి ఫ్యాషన్ ఐకాన్‌గా .. భారతదేశంలోని ఉన్నత సామాజిక వర్గాల్లో కోరుకునే అతిథిగా అతని స్థితిని మరింత పటిష్టం చేసింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here