Okkadu : ఒక్కడు సినిమాకు ముందుగా అనుకున్న టైటిల్ ఏదో తెలుసా..? ఆ పేరు పెట్టుంటే..

0
39
ఒక్కడు సినిమాకు ముందుగా అనుకున్న టైటిల్ ఏదో తెలుసా..?

సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో బిగెస్ట్ హిట్ గా నిలిచిన సినిమాల్లో ఒక్కడు సినిమా.. ఈ సినిమా ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ అయ్యింది. అద్భుతమైన కథతో పాటు మహేష్ బాబు నటన సినిమాకు హైలైట్ అనే చెప్పాలి. కేవలం మహేష్ బాబు మాత్రమే కాదు ఈ సినిమాలో నటించిన అందరూ అద్భుతంగా నటించారు.హీరోయిన్ గా భూమిక చావ్లా, విలన్ గా ప్రకాష్ రాజ్ తమ నటనలతో ఆకట్టుకున్నారు. అలాగే మణిశర్మ అందించిన సంగీతం కూడా సినిమాకు హైలైట్ గా నిలిచింది. మహేష్ బాబు రాజకుమారుడు సినిమాతో హీరోగా పరిచయమైన విషయం తెలిసిందే.. ఆతర్వాత యువరాజు, బాబీలాంటి సినిమాలు చేశాడు. అదే సమయంలో కృష్ణవంశీ దర్శకత్వం వహించిన మురారి సినిమా వచ్చి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఫ్యామిలీ ఆడియన్స్ ను ఈ సినిమా విపరీతంగా ఆకట్టుకుంది.

అలాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ తర్వాత వచ్చిన యాక్షన్ డ్రామాగా ఒక్కడు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అప్పటి యూత్ ను ఈ సినిమా ఓ రేంజ్ లో ఆకట్టుకుంది. మహేష్ బాబు క్రేజ్ ను రెండింతలు పెంచింది ఈ సినిమా.. మరో వైపు మృగరాజు సినిమాతో ఫ్లాప్ అందుకున్న గుణశేఖర్ కూడా ఓ భారీ హిట్ కొట్టి తన సత్తా ఏంటో చూపించాలని కసి మీద ఉన్నాడు. ఆ కసితో చేసిన ఒక్కడు ఇండస్ట్రీ హిట్ అయ్యింది. ఈ సినిమాలో ప్రతి సీన్ ఆకట్టుకునేలా డైరెక్ట్ చేశారు గుణశేఖర్. ఇక పోతే ఈ సినిమాకు ముందుగా ఒక్కడు అనే టైటిల్ ను అనుకోలేదట.

ఒకరోజు పుల్లెల గోపిచంద్ గురించి పేపర్ లో వచ్చిందట.. తన తండ్రికి స్పోర్ట్స్ అంటే ఇష్టం ఉండదు .. అయినా కూడా ఎంతో కష్టపడి బ్యాట్మెంటన్ ఛాంపియన్ గా ఎదిగాడు గోపీచంద్ .. ఇదే కథతో ఒక్కడు సినిమా స్టోరీని రాసుకున్నాడట గుణశేఖర్. ఇదే కథను మహేష్ బాబుకు, నిర్మాత ఎంఎస్ రాజుకు చెప్పి ఒప్పించాడట గుణశేఖర్. ఇక ఈ సినిమాకు ముందుగా అతడే ఆమె సైన్యం అనే టైటిల్ ను అనుకున్నారట. అయితే అప్పటికే ఆ టైటిల్ ఎవరో రిజిస్టర్ చేసుకోవడంతో.. ఎంత బ్రతిమిలాడినా ఆ టైటిల్ ఇవ్వలేదట.. ఆతర్వాత కబడ్డీ అని పెడదామని అనుకున్నారట.. చివరకు ఒక్కడు అనే టైటిల్ ను ఖరారు చేశారు. రూ. 9 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా రూ. 39కోట్లు వసూల్ చేసి అప్పటి రికార్డ్స్ అన్ని తిరగరాసింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here