NTR : మీ తాత గుద్దిన గుద్దుడికి జ్వరం వచ్చిందన్న హీరోయిన్ .. తారక్ రియాక్షన్ ఏంటంటే..

0
21
మీ తాత గుద్దిన గుద్దుడికి జ్వరం వచ్చిందన్న హీరోయిన్..

నందమూరి  తారక రామారావు గురించి తెలియని తెలుగు వాడు ఉంటాడు. నటుడిగా తెలుగు సినిమా చరిత్ర పై చెరగని ముద్ర వేశారు అన్న ఎన్టీఆర్. కృష్ణుడు, కర్ణుడు, దుర్యోధనుడు ఎలా ఉంటారు అంటే టక్కున చెప్పే పేరు ఎన్టీఆర్.. అంతలా ఆపాత్రలకు ప్రాణం పోశారు ఆ  యుగపురుషుడు. అలాగే ఆయనతో ఎంతోమంది హీరోయిన్స్ నటించి మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. జయసుధ, వాణిశ్రీ, జయప్రద, శ్రీదేవి ఇలా చాలా మంది ఎన్టీఆర్ సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన నటిస్తుంటే అలా చూస్తూ ఉండిపోయేవాళ్ళం అని చాలా మంది హీరోయిన్ పలు సందర్భాల్లో చెప్పారు. ఎన్టీఆర్ తో షూటింగ్ అంటే చాలా మెమొరీస్ ఉండేవి అని ఆనాటి రోజులను గుర్తు చేసుకుంటారు హీరోయిన్స్.. ఆయన సినిమా సెట్ లో చాలా గమ్మతైన విషయాలు కూడా జరుగుతుంటాయి అని చెప్తుంటారు అలనాటి భామలు.

అలాగే సీనియర్ నటి జయప్రద కూడా ఎన్టీఆర్ తో పలు సినిమాల్లో నటించారు. ఈ ఇద్దరిది సూపర్ హిట్ కాంబినేషన్. యమగోల, అడవిరాముడులాంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో ఎన్టీఆర్ జయప్రద కలిసి నటించారు. ఇదిలా ఉంటే జయప్రద గతంలో ఓ టాక్ షోకు హోస్ట్ గా వ్యవహరించారు. ఆ టాక్ షోకి ఓసారి జూనియర్ ఎన్టీఆర్ గెస్ట్ గా హాజరయ్యారు. ఎన్టీఆర్ తో జయప్రద చాలా సరదా ముచ్చట్లు మాట్లాడారు. అలాగే సీనియర్ ఎన్టీఆర్ తో షూటింగ్ సమయంలో జరిగిన కొన్ని ఫన్నీ సందర్భాలను గుర్తు చేసుకున్నారు.

జయప్రద మాట్లాడుతూ.. మీ తాత గుద్దిన గుద్దుడుకి నాకు జ్వరం వచ్చింది అని అన్నారు. యమాగోల సినిమాలో ఓలమ్మీ తిక్కరేగిందా సాంగ్ అప్పట్లో పెద్ద సెన్సేషన్.. ఓ ఊపుఊపేసింది ఆ సాంగ్. ఈ సాంగ్ లో ఎన్టీఆర్ జయప్రద కలిసి నటించారు. అయితే ఈ సాంగ్ షూటింగ్ తర్వాత నాకు మూడు రోజులు జ్వరం వచ్చింది. హై టెంపరేచర్‌తో ఒళ్లు నొప్పులు వచ్చాయి. మీ తాత అంతలా నన్ను గుద్దుతూ డాన్స్ చేశారు అని నవ్వుతూ చెప్పారు జయప్రద. మీ తాతగారితో కలసి నటించడం నా అదృష్టం అని జయప్రద అన్నారు. దానికి జూనియర్ ఎన్టీఆర్ పడిపడి నవ్వారు. అలాగే యమదొంగ సినిమాలో ఇదే పాటను రీమేక్ చేశాడు తారక్.. దీని గురించి చెప్తూ.. నేను యమదొంగ సినిమాకు సన్నగా అయ్యాను.. అదే లావుగా ఉండి ఉంటే మమతామోహన్ దాస్ పరిస్థితి కూడా మీలాగే అయ్యేది అని నవ్వుతూ చెప్పారు తారక్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here