Nandamuri Mokshagna: ఇదెక్కడి మాస్ రా మావా..!! నందమూరి మోక్షజ్ఞకు జోడీగా కుర్రాళ్ళ ఫెవరెట్ హీరోయిన్

0
28
నందమూరి మోక్షజ్ఞకు జోడీగా కుర్రాళ్ళ ఫెవరెట్ హీరోయిన్..

నందమూరి నటసింహం బాలకృష్ణ వారసుడు వచ్చేస్తున్నాడు. నందమూరి మోక్షజ్ఞ హీరోగా ఎప్పుడెప్పుడు ఎంట్రీ ఇస్తాడా అని ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఇక టైం వచ్చింది.. మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధం అవుతుంది. ఇప్పటికే మోక్షజ్ఞా లుక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. స్టార్ హీరోలను బీట్ చేసే స్టన్నింగ్ లుక్ లో మోక్షజ్ఞ కనిపిస్తున్నాడు. మొన్నామధ్య అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటించిన భగవంత్ కేసరి సినిమా షూటింగ్ సమయంలో సెట్ కు వెళ్లిన మోక్షజ్ఞ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. కత్తిలా ఉన్నాడు అంటూ ఫ్యాన్స్ తెగ సంతోషపడుతున్నారు. ఇక ఇప్పుడు మోక్షజ్ఞ ఎంట్రీకి లైన్ క్లియర్ అయ్యిందని టాలీవుడ్ సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి.

మోక్షజ్ఞ డెబ్యూ మూవీ కోసం బాలకృష్ణ చాలా ప్లాన్ చేస్తున్నారు. గతంలో బాలకృష్ణ మాట్లాడుతూ.. మా అబ్బాయ్ కూడా హీరోగా రాబోతున్నాడు.. యంగ్ హీరోల సలహాలు అతనికి కావలి అని ఓ స్టేజ్ పై అన్నారు. అలాగే మోక్షజ్ఞ డెబ్యూ మూవీ సీనియర్ దర్శకుడు తేజ డైరెక్షన్ లో ఉంటుందని కూడా వార్తలు పుట్టుకొచ్చాయి. కానీ ఇప్పుడు దర్శకుడు మారాడు. టాలీవుడ్ సక్సెస్ ఫుల్ దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని తెలుస్తోంది.

అన్ స్టాపబుల్ ప్రమోలు డైరెక్ట్ చేసింది ప్రశాంత్ వర్మ. ఆ సమయంలోప్రశాంత్ వర్కింగ్ స్టైల్ నచ్చి కొడుకు బాధ్యత అతని చేతిలో పెట్టాడట బాలయ్య. దాంతో ఇప్పుడు ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞ  కాగా మోక్షజ్ఞ పక్కన నటించే హీరోయిన్ గా లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీలను ఎంపిక చేశారని కూడా మాట్లాడుకుంటున్నారు. భగవంత్ కేసరి సినిమాలో బాలయ్యతో కలిసి నటించింది శ్రీలీల. ఈ అమ్మడు అయితే మోక్షజ్ఞ పక్కన కరెక్ట్ గా సెట్ అవుతుందని.. పైగా క్రేజ్ ఉన్న బ్యూటీ కావడంతో సినిమాకు ప్లస్ అవుతుందని భావిస్తున్నారట. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here