Nandamuri Mokshagna:బాలయ్య కుమారుడి సినిమాకు డైరెక్టర్ ఫిక్స్.. స్వయంగా ట్వీట్ చేసిన మోక్షు.. ఫ్యాన్స్ కు పండగే

0
25
బాలయ్య కుమారుడి సినిమాకు డైరెక్టర్ ఫిక్స్.. ట్వీట్ చేసిన మోక్షజ్ఞ

నందమూరి అభిమానులకు పండగ లాంటి వార్త. నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ తేజ సినిమా ఎంట్రీకి రంగం సిద్ధమైంది. ఇందుకోసం ఇప్పటికే స్లిమ్ గా, స్టైలిష్ గా తయారయ్యాడు మోక్షు. అంతేకాదు తన డెబ్యూపై సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అప్ డేట్స్ ఇస్తూనే ఉన్నాడు. ఇటీవల తన స్టైలిష్ లుక్ కు సంబంధించిన ఫొటోలు షేర్ చేసిన మోక్షు.. ‘వస్తున్నా.. మీ అందరి ఆశీస్సులు కావాలి’ ఒక పోస్టు చేశాడు. ఇప్పుడు వరుసగా మరో రెండు పోస్టులు షేర్ చేశాడు. ‘ఊహించనిది ఊహించండి.. ప్రశాంత్‌ వర్మతో’ అని ఒక ట్వీట్‌ చేశాడు. అలాగే మరో పోస్ట్ లో.. ‘ఈ సంవత్సరం బాలకృష్ణ ఎన్‌బీకే 109, ఎన్టీఆర్‌ దేవర, మోక్షు అరంగేట్రం. నందమూరి నామ సంవత్సరం’ అంటూ అభివర్ణించాడు. సో.. మొత్తానికి మోక్షజ్ఞ ఎంట్రీ ఫిక్స్ అయ్యిందన్న మాట. అది కూడా హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా రేంజ్‌ లో ఫేమస్ అయి పోయిన ప్రశాంత్ వర్మతో. ప్రస్తుతం ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ గా మారింది. దీనిని చూసిన నందమూరి అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. హనుమాన్ సినిమాతో తేజ సజ్జాను పాన్ ఇండియా హీరోగా మార్చిన ప్రశాంత్ వర్మ బాలయ్య వారసుడిని ఏ విధంగా చూపిస్తాడోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

కాగా బాలకృష్ణ- ప్రశాంత్ వర్మల మధ్య మంచి అనుబంధం ఉంది. బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరించిన ఆహా అన్ స్టాపబుల్ షోకు ప్రశాంత్ వర్మనే డైరెక్టర్ గా వ్యవహరించారు. అప్పటి నుంచే వీరిద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. ఈ ర్యాపో కారణంగానే తన ‘హనుమాన్’ సినిమా విడుదలయిన తర్వాత బాలయ్య కోసం ఒక స్పెషల్ స్క్రీనింగ్‌ను ఏర్పాటు చేశారు ప్రశాంత్ వర్మ. దీనిని చూసిన బాలయ్య కుర్ర డైరెక్టర్ ట్యాలెంట్ పై ప్రశంసల వర్షం కురిపించారు. అందుకే మోక్షజ్ఞ ఎంట్రీ బాధ్యతలను కూడా ప్రశాంత్ వర్మ చేతుల్లోనే పెట్టాడని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మోక్షు చెప్పినట్లు ఈ ఏడాది నందమూరి నామ సంవత్సరమే అని చెప్పుకోవచ్చు. నందమూరి బాలయ్య- బాబీ డైరెక్షన్ లో వస్తోన్న ఎన్‌బీకే 109, ఎన్టీఆర్ దేవర సినిమాలు కూడా ఈ ఏడాదే రిలీజవుతున్నాయి. మొత్తానికి ఈ ఏడాది నందమూరి ఫ్యాన్స్ కు పండగే.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here