Nagendran’s Honeymoon OTT: ఐదుగురు భార్యలతో హానీమూన్.. తెలుగులో స్ట్రీమింగ్ కానున్న మలయాళీ వెబ్ సిరీస్..

0
22
Nagendran’s Honeymoon OTT: ఐదుగురు భార్యలతో హానీమూన్.. తెలుగులో స్ట్రీమింగ్ కానున్న మలయాళీ వెబ్ సిరీస్..

Nagendran’s Honeymoon OTT: ఐదుగురు భార్యలతో హానీమూన్.. తెలుగులో స్ట్రీమింగ్ కానున్న మలయాళీ వెబ్ సిరీస్..

ఇటీవల బాక్సాఫీస్ వద్ద మలయాళీ చిత్రాలు సూపర్ హిట్ అవుతున్నాయి. స్టార్ హీరోహీరోయిన్స్, భారీ బడ్జెట్ సినిమాలు కాకుండా విభిన్నమైన కంటెంట్ కథలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అతి తక్కువ బడ్జెట్ తో నిర్మించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్నాయి. ప్రేమలు, మంజుమ్మల్ బాయ్స్, భ్రమయుగం, ఆవేశం, ఆడు జీవితం వంటి చిత్రాలు సౌత్ ఇండియాలో అత్యధిక వసూళ్లు రాబట్టాయి. ఈ చిత్రాలన్నింటిని తిరిగి తెలుగు, తమిళం, కన్నడ భాషలలోనూ విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ అడియన్స్ ముందుకు రాబోతుంది. డిఫరెంట్ పాయింట్ తీసుకుని ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా రూపొందించి సక్సెస్ అవుతున్నారు డైరెక్టర్. అందులో నాగేంద్రన్స్ హానీమూన్ ఒకటి.

నేషనల్ అవార్డ్ విన్నర్ సూరజ్ వెంజరమూడ్ ప్రధాన పాత్రలో నటించిన మలయాళీ వెబ్ సిరీస్ నాగేంద్రన్స్ హానీమూన్. ఒక జీవితం ఐదుగురు భార్యలు అనేది ఉపశీర్షిక. ఇప్పటికే విడుదలైన టైటిల్ పోస్టర్ ఆసక్తిని కలిగించింది. అలాగే ఇటీవల ఈ వెబ్ సిరీస్ టీజర్ కూడా విడుదల చేయగా.. ప్రేక్షకులలో క్యూరియాసిటీని కలిగించింది. ఇక ఇప్పుడు నాగేంద్రన్స్ హానీమూన్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది.

ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఆగస్ట్ 17 నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ చేయనున్నారు. మలయాళంతోపాటు తెలుగు, తమిళం, ఇతర భాషలలో కూడా రిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది. ఈ వెబ్ సిరీస్ లో గ్రేస్ ఆంటోని, కని కుశృతి, శ్వేత మీనన్, ఆల్పీ పంజికరణ్, నిరంజన అనూప్ కీలకపాత్రలు పోషించారు. డైరెక్టర్ రెంజీ ఫణిక్కర్ దర్శక్తవం వహించిన కామెడీ వెబ్ సిరీస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here