Wednesday, January 1, 2025
Google search engine
HomeUncategorizedNag Ashwin: నాగ్ అశ్విన్ షాకింగ్ పోస్ట్.. ఆ సినిమానే ఇన్‌డైరెక్ట్‌గా టార్గెట్ చేశారా..

Nag Ashwin: నాగ్ అశ్విన్ షాకింగ్ పోస్ట్.. ఆ సినిమానే ఇన్‌డైరెక్ట్‌గా టార్గెట్ చేశారా..

ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 AD’ ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్లను సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ చిత్రం 1000 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. ఈ విషయాన్ని స్వయంగా నిర్మాతే సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమాలో చాలామంది స్టార్స్ నటించారు. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కీలక పాత్రలో నటించారు. అలాగే టాలీవుడ్ నుంచి కూడా చాలా మంది ఈ సినిమాలో కనిపించారు. ముఖ్యంగా విజయ్ దేవరకొండ ఈ సినిమాలో అర్జునిడిగా కనిపించాడు. ఇదిలా ఉంటే రీసెంట్ గా  దర్శకుడు నాగ్ అశ్విన్ షేర్ చేసిన ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. నాగ్ అశ్విన్ పోస్ట్‌ పై నెటిజన్స్ గుసగుసలాడుకుంటున్నారు. ఇంతకూ నాగ్ అశ్విన్ ఏమని షేర్ చేశాడంటే..

ఇది కూడా చదవండి : అమ్మబాబోయ్..!! హేమ కూతుర్ని చూశారా..? ఆమె అందం ముందు హీరోయిన్స్ కూడా పనికిరారు

నాగ్ అశ్విన్ 5 ఏళ్ల కష్టానికి ఫలితంగా ‘కల్కి 2898 AD’ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ చిత్రాన్ని ‘వైజయంతీ మూవీస్’ నిర్మించింది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే, దిశాపటాని హీరోయిన్స్ గా నటించారు.  సినిమా విజయం సాధించిన తర్వాత, నాగ్ అశ్విన్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఓ పోస్ట్ ను పంచుకున్నాడు.

ఇది కూడా చదవండి :Anjala Zaveri: ఓర్నీ..! టాలీవుడ్ విలన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న అంజలా జవేరి.. ఆయన ఎవరంటే

“ఈ మైలురాయి, ఈ సంఖ్య మాలాంటి టీమ్ కు నిజంగా చాలా పెద్దది. ఎలాంటి అసభ్యపదజాలం, రక్తపాతం, రెచ్చగొట్టే సన్నివేశాలు లేకుండా ఇది సాధించడం గమనార్హం. మా వెనుక నిలిచిన ప్రేక్షకులకు, నటీనటులకు ధన్యవాదాలు’ అని నాగ్ అశ్విన్ పోస్ట్ చేశాడు. అయితే ఆ తర్వాత ఈ పోస్ట్‌ను తొలగించాడు. నాగ్ అశ్విన్ ఈ పోస్ట్ ను ఓ బ్లాక్ బస్టర్ మూవీని దృష్టిలో ఉంచుకొనే చేశారని కొందరు అభిప్రాయపడుతున్నారు. ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ‘యానిమల్’ సినిమా తీసి బాలీవుడ్‌లో పెద్ద విజయాన్ని అందుకున్నాడు. ఆ సినిమా కలెక్షన్లు కూడా దాదాపు 1000 కోట్ల రూపాయలకు చేరువైంది. అయితే సినిమాలో అశ్లీలత, అధిక రక్తపాతం, మహిళలను కించపరిచే సన్నివేశాలు, రెచ్చగొట్టే సన్నివేశాలు ఉన్నాయని చాలా విమర్శలు వచ్చాయి. కానీ సందీప్ అవేమి పట్టించుకోలేదు. అనుకున్నట్టుగా యానిమల్ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టి చూపించాడు సందీప్. ‘యానిమల్’ సినిమాను ప్రస్తావిస్తూ నాగ్ అశ్విన్ ఈ పోస్ట్ పెట్టాడని కొంతమంది నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతానికి నాగీ తన పోస్ట్ తొలగించాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments