పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది హీరోయిన్ నభా నటేశ్. ఈ సినిమా తర్వాత తెలుగులో వరుస ఆఫర్స్ అందుకుంది. కానీ ఉన్నట్లుండి సినిమాలకు దూరమైపోయింది. చాలా కాలం తర్వాత ఇప్పుడిప్పుడే తిరిగి సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుంది.
అయితే తాను సినిమాలకు కొన్నాళ్లపాటు దూరకావడానికి కారణం యాక్సిడెంట్ అంటోంది. కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడు యాక్సిడెంట్ జరిగిందని.. భుజానికి తీవ్ర గాయం కావడంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చానని తెలిపింది. ప్రస్తుతం ప్రియదర్శి జోడిగా డార్లింగ్ అనే సినిమాతో అడియన్స్ ముందుకు రాబోతుంది.
ఈ సినిమా ప్రమోషన్లలో నభా నటేష్ మాట్లాడుతూ.. కెరీర్ మంచి పీక్స్ లో ఉన్నప్పుడే యాక్సిడెంట్ జరిగిందని.. ఓ రకమైన మైండ్ సెట్ లోకి వెళ్లిపోయానని.. కానీ ఆపరేషన్ అయిన పదిరోజులకే షూటింగ్ లో పాల్గొన్నానని తెలిపింది. దీంతో తన హెల్త్ మళ్లీ ఎఫెక్ట్ అయిపోయిందని.. ఇంకో సర్జరీ జరిగిందని తెలిపింది.
దీంతో తన శరీరానికి కచ్చితంగా రెస్ట్ ఇవ్వాలనిపించిందని.. అందుకే ఆరోగ్యం పై పూర్తిగా దృష్టి పెట్టి చాలా కేర్ తీసుకొని 6 నెలలపాటు విశ్రాంతి తీసుకున్నట్లు చెప్పుకొచ్చింది. ఫిజికల్ గా ఫిట్ లేకుంటే సినిమాలు చేయలేమని.. అందుకే సమయం తీసుకున్నానని, ఫిజికల్ గా మెంటల్ గా స్ట్రాంగ్ అయ్యాకే మళ్లీ సినిమాలు చేస్తున్నట్లు తెలిపింది.
చాలా గ్యాప్ తర్వాత డార్లింగ్ సినిమాతో అడియన్స్ ముందుకు వస్తున్నానని.. ఇస్మార్ట్ శంకర్ లాంటి కమర్షియల్ హిట్ తర్వాత డార్లింగ్ ఎందుకు చేస్తున్నావని చాలా మంది అడిగారు. కానీ ఇప్పుడు కంటెంట్ అనేది న్యూకమర్షియల్ అని ప్రేక్షకులకు తెలుసు. కథ నచ్చి ఒప్పుకున్నానని తెలిపింది.