Wednesday, December 25, 2024
Google search engine
HomeUncategorizedMurari Movie: ఘట్టమనేని వారి వివాహ ఆహ్వానము.. మురారి సినిమా వెడ్డింగ్ కార్డ్స్ చూశారా..?

Murari Movie: ఘట్టమనేని వారి వివాహ ఆహ్వానము.. మురారి సినిమా వెడ్డింగ్ కార్డ్స్ చూశారా..?

దక్షిణాది చిత్రపరిశ్రమలో కొంతకాలంగా రీరిలీజ్ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్స్ అయిన సినిమాలు ఇప్పుడు మళ్లీ రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. గతంలో డిజాస్టర్స్ అయిన మూవీస్ ఇప్పుడు భారీగా వసూళ్లు రాబడుతున్నాయి. అలాగే తమ అభిమాన హీరో చిత్రాలను మరోసారి థియేటర్లలో చూసేందుకు ఫ్యా్న్స్ కూడా తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దీంతో తెలుగు, తమిళంలో రీరిలీజ్ ట్రెండ్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. హీరోల పుట్టినరోజు.. ప్రత్యేకమైన రోజులను పురస్కరించుకుని అభిమానులకు ఇష్టమైన సినిమాలను మళ్లీ విడుదల చేస్తున్నారు. ఇప్పటికే మహేష్ బాబు, రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్, చిరంజీవి, విజయ్ దళపతి ఇలా స్టార్ హీరోస్ అందరి సినిమాలు విడుదల కాగా.. ఇప్పుడు మరోసారి మహేష్ సూపర్ హిట్ మూవీని ఫ్యాన్స్ ముందుకు తీసుకువస్తున్నారు. మహేష్ బాబు పుట్టినరోజు పురస్కరించుకుని ఓ హిట్ మూవీని మరోసారి రిలీజ్ చేస్తున్నారు. అదే మురారి.

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన మురారి.. ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. 2001లో విడుదలైన ఈ మూవీకి మంచి వసూళ్లు రాబట్టింది. ఇందులో మహేష్ సరసన సోనాలి బింద్రే కథానాయికగా నటించగా.. లక్ష్మీ, కైకాల సత్యనారాయణ, గొల్లపూడి మారుతీరావు, అన్నపూర్ణ కీలకపాత్రలు పోషించగా.. మెలోడీ బ్రహ్మా మణిశర్మ అద్భుతమైన సంగీతం అందించారు. ఇప్పటికీ ఈ సినిమాలోని సాంగ్స్ ఎక్కడో ఒక చోట వినిపిస్తూనే ఉన్నాయి. ఈసినిమా మహేష్ కెరీర్‏లోనే అద్భుతమైన సినిమాగా నిలిచిపోయింది. ఇందులో మహేష్, సోనాలి కెమిస్ట్రీకి అడియన్స్ ఫిదా అయ్యారు. ఇక ఇప్పుడు ఈ సినిమాను మరోసారి అడియన్స్ ముందుకు తీసుకువస్తున్నారు. ఆగస్ట్ 9న మహేష్ పుట్టినరోజు సందర్భంగా మరోసారి ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఇందుకు అఫీషియల్ అనౌన్మెంట్ కూడా వచ్చింది.

Murari

Murari

అయితే మురారి సినిమా రీరిలీజ్ అవుతుండగా.. అభిమానులు వినూత్నంగా ప్లాన్ చేశారు. ఘట్టమనేని వారి వివాహ ఆహ్వాన పత్రీక అంటూ పెళ్లి కార్డుల రూపంలో డిజైన్ చేసి ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నారు. ప్రస్తుతం ఈ మురారి వెడ్డింగ్ ఇన్విటేషన్స్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం మహేష్ బాబు.. డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. చాలారోజులుగా ఈ మూవీ కోసమే స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది. అలాగే ఈ సినిమాలో మహేష్ న్యూలుక్ లో కనిపించనున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments