Wednesday, November 6, 2024
Google search engine
HomeUncategorizedMS Dhoni Birthday: ఎంఎస్ ధోని పుట్టినరోజు వేడుకలో సల్మాన్ ఖాన్ సందడి.. భర్త పాదాలు...

MS Dhoni Birthday: ఎంఎస్ ధోని పుట్టినరోజు వేడుకలో సల్మాన్ ఖాన్ సందడి.. భర్త పాదాలు తాకి ఆశీర్వాదం తీసుకున్న సాక్షి

ముఖేష్ అంబానీ ఇంట అనంత్ అంబానీ పెళ్లి వేడుకలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. ఈ పెళ్లి వేడుకల్లో భాగంగా సంగీత వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగమైన తర్వాత MS ధోని తన పుట్టినరోజును జరుపుకున్నారు. జూలై 7వ తేదీ 1981లో జన్మించిన ధోనీ తన 43వ పుట్టినరోజును ముంబైలో కేక్ కట్ చేసి జరుపుకున్నాడు. ఈ పుట్టిన రోజు కార్యక్రమంలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కూడా పాల్గొన్నారు. పుట్టినరోజు కేక్‌ను కట్ చేసిన తర్వాత.. ధోనీ ముందుగా తన చేతులతో తన భార్య సాక్షికి తినిపించగా.. అనంతరం ధోనీ తన చేతులతో సల్మాన్ ఖాన్‌కు కేక్ తినిపించడం కూడా కనిపించింది. పుట్టినరోజు వేడుకలో భార్య సాక్షి భర్త ధోనీ పాదాలను తాకి నమస్కరించింది.

ధోనీ బర్త్ డే పార్టీలో సల్మాన్ ఖాన్ నల్ల చొక్కా, జీన్స్ ధరించి కనిపించాడు. బర్త్‌డే బాయ్ ధోని టీ-షర్ట్.. బ్లాక్ జీన్స్‌లో కనిపించాడు. ముంబయిలో జరిగిన పుట్టినరోజు వేడుకల్లో గమనించదగ్గ విషయం ఏమిటంటే ధోని ఒకటి కాదు మూడు కేక్‌లను కట్ చేశాడు. అందులో ఒక కేక్‌పై 7వ సంఖ్య కూడా రాసి ఉంది. ఈ 3 కేక్‌లలో ఒకటి సల్మాన్‌ఖాన్‌దే అని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

సల్మాన్ ఖాన్‌కి కేక్ తినిపించిన ధోనీ

అయితే 7 అని రాసి ఉన్న కేక్‌ను ముందుగా ధోనీ కట్ చేశాడు. కేక్ కట్ చేసిన అనంతరం ముందుగా తన సతీమణి సాక్షికి తినిపించాడు. దీని తర్వాత సల్మాన్ ఖాన్ కు పుట్టినరోజు కేక్‌ను ధోనీ తన హస్తాలతో తినిపించాడు.

MS ధోని సల్మాన్ ఖాన్‌తో కలిసి కేక్ కట్ చేసి తన పుట్టినరోజును జరుపుకున్నారు.

ధోనీ కేక్ కట్ చేసిన తర్వాత భార్య సాక్షి రెండు చేతులతో ఆయన పాదాలను తాకి నమస్కారం చేసింది. సాక్షి ఇలా చేయడం చూసి పార్టీ హాలులో సందడి నెలకొంది. సాక్షి పాదాలను తాకి నమస్కరించిన వెంటనే చేతులు పైకెత్తి ఆశీర్వదించారు. ధోనీ ఇలా చేయడంతో పార్టీ హాల్ వాతావరణం మరింత ఆహ్లాదకరంగా మారింది.

పార్టీలో సందడే సందడి

ధోనీ పుట్టినరోజు పండగ కంటే తక్కువ కాదు!

ధోనీ పుట్టినరోజు అంటే అతనికి వేడుక మాత్రమే కాదు.. అతని అభిమానులకు ఇది పండుగ. ఇది ధోని ఫ్యాన్స్ ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా జరుపుకునే పండుగ. అది రాంచీకి చెందిన అతని సొంత వ్యక్తులు కావచ్చు లేదా చెన్నైకి చెందిన మహి అభిమానులు కావచ్చు. ఆంధ్రప్రదేశ్ ప్రజలైనా, మధ్యప్రదేశ్ ప్రజలైనా.. అంటే భారతదేశం మొత్తం ఈ ప్రత్యేకమైన రోజును తనదైన శైలిలో జరుపుకుంటున్నారు.

మరిన్ని క్రికట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments