రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘మిస్టర్ బచ్చన్’. బాలీవుడ్లో వచ్చిన రైడ్ చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. హరీష్ శంకర్, రవితేజ కాంబినేషన్లో వస్తున్న మూడో చిత్రం కావడం విశేషం. వీరిద్దరి కాంబినేషన్లో ఇది వరకు వచ్చిన షాక్, మిరపకాయ్ ప్రేక్షకులను మెప్పించిన విషయం తెలిసిందే. దీంతో ఈ చిత్రంతో హ్యాట్రిక్ కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది.
ఇదిలా ఉంటే ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదల తేదీని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఆగస్టు 15వ తేదీన ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకురానున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. కాగా ఆగస్టు 14వ తేదీ నుంచి ప్రీమియర్స్ ప్రారంభంకానున్నాయి. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని తెలిపారు.
వాస్తవానికి ఈ సినిమా అక్టోబర్‌లో విడుదల చేద్దామని తొలుత చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. అయితే పుష్ప 2 చిత్రం విడుదల వాయిదా పడిన నేపథ్యంలో మిస్టర్ బచ్చన్‌ను అనుకున్న తేదీ కంటే ముందుగానే తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. ఈ సినిమాలో రవితేజ అమితాబ్ అభిమానిగా నటించనున్నారు. నిజజీవితంలోనూ రవితేజ అమితాబ్ ఫ్యాన్ అనే విషయం తెలిసిందే.
ఇక మిస్టర్ బచ్చన్ సినిమా కథ విషయానికొస్తే.. ఇందులో రవితేజ నిజాయితీగల ఆదాయపు పన్ను అధికారిగా కనిపించనున్నారు. ఓ బడా రాజకీయ నేత ఇంటిలో జరిగిన తర్వాత కథ ఏ విధంగా వెళ్తున్నది కథ సారాంశం. ఈ సినిమాలో హీరో రవితేజ పక్కన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తోంది. భాగ్యశ్రీ నటిస్తున్న తొలి సినిమా ఇదే. ఇక జగపతి బాబు విలన్‌గా నటిస్తున్నారు. కాగా ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసింది.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..