భారతీయుడు సినిమా ఎలా ఉంది? అంచనాలను చేరుకుందా? లేదా? అనే మాటలు ఇప్పుడు వినిపించడం లేదు. మార్నింగ్ షో పడకముందు నుంచే ఓవర్సీస్ నుంచి వచ్చిన రివ్యూలు మిశ్రమంగానే వినిపించాయి.
పెట్టిన ఖర్చు స్క్రీన్ మీద బలంగా కనిపించిందన్నవారు, కథ విషయంలో ఎగ్జయిట్ అయి మాట్లాడలేదు. ఎమోషన్స్ పరంగానూ మెచ్చుకోలు ఎక్కడా వినిపించలేదు. ఇవే ప్రేక్షకుల నుంచి వినిపిస్తున్న మాటలు.
కల్కి తర్వాత కమల్ కెరీర్లో విడుదలైన మూవీ కాబట్టి, పర్ఫెక్ట్ గా టార్గెట్ చేస్తే, ప్యాన్ ఇండియా రేంజ్లో భారీ నెంబర్ బాక్సాఫీస్ దగ్గర కనిపిస్తుందని ట్రేడ్ వర్గాల్లోనూ ఆశలు కనిపించాయి. అయితే కథ బలంగా లేకపోవడంతో ఆ ఆశల మీద నీళ్లు చల్లినట్టు అయింది. దీని వల్ల సర్ఫిరాకి మరింత మేలు జరిగిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అక్షయ్‌కుమార్ కెరీర్లో 150వ సినిమాగా రిలీజ్ అయింది సర్ఫిరా సినిమా. సుధ కొంగరకి బాలీవుడ్లో మరో హిట్ తెచ్చిపెట్టింది ఈ సినిమా. ప్రొడ్యూసర్లుగా జ్యోతిక, సూర్య సూపర్ హ్యాపీగా ఉన్నారు. ఈ సినిమా ప్రమోషన్లలో ఉన్నప్పుడే అక్షయ్‌కుమార్‌కి కోవిడ్ పాజిటివ్ అని తేలింది.
తెలుగు, తమిళంలో సూపర్‌డూపర్ హిట్ అయిన ఆకాశం నీ హద్దురా సినిమాను హిందీలో సర్ఫిరా పేరుతో తెరకెక్కించారు సుధ. సౌత్‌లో కమల్ సినిమా రిలీజ్ అయినా, నార్త్ లో బేఫికర్‌గా సర్ఫిరాని విడుదల చేశారు. కమల్ సినిమా మిక్స్డ్ టాక్, సర్ఫిరాకి సర్‌ప్లస్‌గా కలిసొచ్చిందని అంటున్నారు ముంబై క్రిటిక్స్.