యూట్యూబ్ ట్రోలర్స్‌పై మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఫోకస్ పాట్టింది. సినిమావాళ్లపై డార్క్ కామెడీ చేస్తున్న ట్రోలర్స్ అకౌంట్స్‌ని యూట్యూబ్ సహకారంతో మూవీ అసోసియేషన్ డిలీట్ చేయిస్తుంది. సినిమా వాళ్లపై తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకోమంటూ మూవీ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు ఇప్పటికే వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇటీవల చిన్న పిల్లల పై యూట్యూబ్ లో అసభ్యకరంగా మాట్లాడుతూ వీడియోలు చేసిన ప్రవీణ్ హనుమంతు అనే వ్యక్తి పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తండ్రి కూతురు బంధం పై పిచ్చి పిచ్చి కామెంట్స్ చేస్తూ పైశాచిక ఆనందాన్ని పోతున్న ప్రవీణ్ హనుమంత్ పై సామాన్యుల దగ్గర నుంచి సినీ సెలబ్రిటీల వరకు అందరూ మండిపడుతున్నారు. ఈ విషయం పై మంచు విష్ణు మాట్లాడుతూ.. ఇలాంటి దారుణాలు సోషల్ మీడియాలో ఎక్కువవాడుతున్నాయి. ఇలాంటివాటిని కట్టడి చేయాలి అని అన్నారు. అలాగే సినిమా వాళ్ళ పై కూడా కొంతమంది పిచ్చి పిచ్చి కామెంట్స్ చేస్తున్నారు. అలాంటి వారికి 48 గంటలు టైం ఇస్తున్న అని విష్ణు వార్నింగ్ ఇచ్చారు.
ఈ క్రమంలో ఐదు యూట్యూబ్ ఛానళ్లపై మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ చర్యలు తీసుకుంది. నటీనటులపై అసభ్యంగా దుష్ప్రచారం చేస్తున్న ఐదు యూట్యూబ్ ఛానళ్లను మూవీ అసోసియేషన్ టెర్మినేట్ చేసింది. ఇది ప్రారంభం మాత్రమే అంటూ.. యూట్యూబర్లకు మా హెచ్చరికలు పంపింది.
రెండ్రోజుల క్రితం సినిమా వాళ్లపై అసభ్యంగా ట్రోలింగ్ వీడియోలు చేస్తున్న ట్రోలర్లకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు మంచు విష్ణు. మహిళలను అత్యంత జుగుప్సాకరంగా వర్ణించడం ఏ మాత్రం సమర్థనీయం కాదని మంచు విష్ణు తేల్చి చెప్పారు. నటీనటులపై అసభ్యకర వీడియోలు, మీమ్స్ చేస్తున్న వారి అకౌంట్లను 48 గంటల్లో డిలీట్ చేయాలంటూ వార్నింగ్ ఇచ్చిన విష్ణు… ఇప్పుడు ఆయనే స్వయంగా యాక్షన్‌లోకి దిగారు. సినీ ఇండస్ట్రీపై ట్రోల్స్ చేస్తున్న పలు ఛానల్స్‌ని యూట్యూబ్ సహకారంతో టెర్మినేట్ చేయిస్తున్నారు.
మంచు విష్ణు ఇన్ స్టా..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.