Mirchi Madhavi: అప్పుడు వదిలేసి.. ఇప్పుడు కావాలంటే ఎలా.. రాజ్ తరుణ్, లావణ్య వ్యవహరంపై మిర్చి మాధవి కామెంట్స్..

0
14
రాజ్ తరుణ్, లావణ్య వ్యవహరంపై మిర్చి మాధవి కామెంట్స్..

కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో తీవ్ర దుమారం సృష్టి్స్తోన్న న్యూస్ రాజ్ తరుణ్, లావణ్య. ఇన్నాళ్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా వరుస హిట్స్ అందుకుంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న రాజ్ తరుణ్, ఇప్పుడు పర్సనల్ విషయాలతో వార్తలలో నిలుస్తున్నాడు. తనను ప్రేమించి మోసం చేశాడని.. 11 సంవత్సరాలు సహజీవనం చేసి ఇప్పుడు వదిలించుకోవాలని చూస్తున్నాడంటూ లావణ్య అనే అమ్మాయి రాజ్ తరుణ్ పై ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అలాగే హీరోయిన్ మాల్వీ మల్హోత్రా కారణంగానే తనను దూరం పెడుతున్నాడంటూ ఆమె పై కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే లావణ్య పై మాల్వీ కూడా కంప్లైంట్ ఇవ్వగా.. వీరిద్దరి వ్యవహరంలో రోజుకో ట్విస్ట్ బయపడుతుంది. ఇక మాల్వీ, లావణ్య ఒకరిపై మరొకరు కేసులు పెడుతుండగా.. తాజాగా రాజ్ తరుణ్, లావణ్య వ్యవహరంపై గుప్పెడంత మనసు నటి మిర్చి మాధవి ఆసక్తికర కామెంట్స్ చేశారు.

గుర్రాన్ని చెరువు వరకూ తీసుకుని వెళ్లగలం కానీ…నీళ్లు తాగించలేం కదా.. ఇష్టం లేని కాపురం కూడా అంతే అని అన్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మిర్చి మాధవి మాట్లాడుతూ.. ఓవైపు పెళ్లి అయ్యిందని చెప్తూనే .. మరో వ్యక్తితో పెళ్లి చేయాలని కేసులు పెట్టడాన్ని చూస్తే లావణ్య కన్ఫ్యూజన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. లావణ్య ఎన్ని చెప్పినా రాజ్ తరుణ్ నాకు వద్దు అంటున్నాడు. అంటే వద్దు అంటే వద్దు అనే అర్థం. వదిలించుకోవాలని చూస్తున్నాడా.. ? లేదా పక్కన పెడితే ఆ అమ్మాయిని మానసికంగా వద్దు అనుకుంటున్నాడు.. ఇక ఎలా కనెక్ట్ అవుతాడు. మొన్నటి వరకు కలిసి ఉంటే ఆ అమ్మాయి మస్తాన్ సాయితో ఎలా ఉంటుంది. ఆధారాలు చూపిస్తున్నారు కదా. ఆమెకు అసలు క్లారిటీ లేదు. రాజ్ తరుణ్ కావాలని కేసు పెట్టావ్.. అటు మస్తాన్ సాయి కావాలని కేసు పెట్టావ్.. పెళ్లైందని అంటున్నావ్.. మళ్లీ పెళ్లి చేసుకోవడం లేదని అంటున్నారు. రాజ్ తరుణ్ ను అంతగా ప్రేమిస్తే మరో వ్యక్తితో ఎలా ఉన్నావ్.. ఇది బొమ్మలాట కాదు కదా.. రాజ్ తరుణ్ మానసికంగా ఆమెను భరించలేను అంటున్నాడు. వద్దు అనుకున్నాక ఎవరూ ఉండలేరు.

అతడి కోసం న్యాయ పోరాటం చేస్తా.. సూసైడ్ చేసుకుంటా అంటే.. గుర్రాన్ని నీళ్ల వరకూ తీసుకొని వెళ్లగళం.. కానీ తాగించలేం కదా.. మూవ్ ఆన్ అయిపోవాలి. వద్దు అనుకున్న బంధం వద్దు అంతే.. పెళ్లి చేసుకున్న వాళ్ల బంధమే నిలబడటం లేదు.. పెళ్లే కాకుండా బంధం నిలబడాలి అంటే ఎలా..? ఈరోజు ఇన్ని కేసులు పెట్టుకుంటే మరి ఆరోజు ఎందుకు ముందుకు రాలేదు. ఇన్నాళ్ల తర్వాత ఇప్పుడు అన్యాయం జరిగిందంటే ఎవరు నమ్ముతారు.. నీ దగ్గర డబ్బులు తీసుకుంటే తిరిగి ఆ డబ్బుల్ని తీసుకే.. లేదు నన్ను వాడుకున్నాడంటే అతని కూడా నువ్వు వాడకున్నట్టే కదా..అతడిని కూడా వాడబడ్డాడు. రెండు చేతులు కలిస్తేనే కదా చప్పట్లు.. గతం గతః అనుకుని మూవ్ ఆన్ అయిపోవాలి. అమ్మాయికి ఆ అబ్బాయికి జీవితాలు బాగుంటాయి. సులభంగా దొరుకుతుంది అంటే దానికి వాల్యూ ఉండదు” అంటూ చెప్పుకొచ్చింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here