Tuesday, November 5, 2024
Google search engine
HomeUncategorizedMartin Telugu Movie Review, Dhruva Sarja, Vaibhavi Shandilya

Martin Telugu Movie Review, Dhruva Sarja, Vaibhavi Shandilya

Martin Movie Review in Telugu

విడుదల తేదీ : అక్టోబర్ 11, 2024

123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5

నటీనటులు : ధృవ్ సార్జా, వైభవి సంధిల్య, అన్వేషి జైన్, నికిత్ ధీర్, అచ్యుత్ కుమార్

దర్శకుడు : ఏ పి అర్జున్

నిర్మాతలు : ఉదయ్ కే మెహతా

సంగీత దర్శకుడు : మణిశర్మ, రవి బస్రూర్(నేపథ్య సంగీతం)

సినిమాటోగ్రఫీ : సత్య హెగ్డే

ఎడిటర్ : ఎం ప్రకాష్, మహేష్ ఎస్ రెడ్డి

సంబంధిత లింక్స్: ట్రైలర్


ఈ దసరా కానుకగా రిలీజ్ కి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో కన్నడ భారీ పాన్ ఇండియా చిత్రం “మార్టిన్” కూడా ఒకటి. ధృవ్ సార్జా నటించిన ఈ చిత్రం పలు కారణాలు చేత మార్నింగ్ షోస్ క్యాన్సిల్ చేసుకున్న ఈ చిత్రం మధ్యాహ్నం షోస్ తో మొదలైంది. మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం.

కథ:

ఇక కథలోకి వస్తే.. పలు దేశాల్లో పేరు మోసిన మార్టిన్(?) అనే గ్యాంగ్ స్టర్ అసలు ఎలా ఉంటాడో ఎవరికీ తెలీదు. అయితే పాకిస్తాన్ లో జరిగిన ఓ అటాక్ లో భారత నావికా దళానికి చెందిన అర్జున్(ధృవ్ సార్జా) అక్కడ పోలీసులకి దొరుకుతాడు. దీనితో వారు అతని మెమొరీ తుడిచెయ్యాలని డ్రగ్ ఇంజెక్షన్ ఇస్తారు. దీనితో మెల్లగా అతను ఎవరో మర్చిపోతాడు. తర్వాత తనకి గతం ఎలా గుర్తొస్తుంది. అసలు ఆ మార్టిన్ ఎవరు? ఈ అర్జున్ కి ఏమన్నా సంబంధం ఉందా? ఈ ఇద్దరికీ మధ్యలో ఉన్న కొన్ని కంటైనర్లలో ఏముంది? చివరికి ఎవరు మార్టిన్? ఎవరు అర్జున్ అనేవి తెలియాలి అంటే ఈ సినిమాని చూడాలి.

ప్లస్ పాయింట్స్:

ఈ సినిమాలో ధృవ్ సార్జా డ్యూయల్ షేడ్స్ ని బాగా హ్యాండిల్ చేసాడని చెప్పాలి. మంచి మ్యాచో పర్సనాలిటీతో సాలిడ్ ఫైట్ సీక్వెన్స్ లలో ఆకట్టుకున్నాడు అలాగే కొన్ని డాన్స్ మూమెంట్స్ కూడా బాగున్నాయి. అలాగే తన సరసన నటించిన వైభవి సంధిల్య మంచి లుక్స్ లో కనిపించి ఆకట్టుకుంది. అలాగే తనకి ధృవ్ సార్జా నడుమ కొన్ని సీన్స్ వరకు ఓకే అనిపిస్తాయి.

ఇంకా నటి అన్వేషి జైన్ గతంలో తెలుగులో రామారావు ఆన్ డ్యూటీలో స్పెషల్ సాంగ్ లో చేసి మళ్ళీ ఈ సినిమాలో కనిపించారు. ఇందులో తన రోల్ గ్లామర్ ట్రీట్ ఇస్తుంది. ఇంకా ఇతర నటీనటులు తమ రోల్స్ మేరకు బాగానే చేశారు. ఇంకా సినిమా క్లైమాక్స్ పోర్షన్ తర్వాత వచ్చే ఒక్క సీన్ మాత్రం కొంచెం బెటర్ గా అనిపిస్తుంది.

మైనస్ పాయింట్స్:

చాలా నెలలు నుంచి కన్నడ సినిమాలో భారీ అంచనాలు ఉన్న సినిమాగా దీనిని హైప్ చేస్తూ ప్రమోట్ చేశారు. అందుకు తగ్గట్టుగానే ఈ సినిమా ట్రైలర్ కట్స్ అవీ చూసి కొందరు ఎగ్జైట్ అవ్వొచ్చు కానీ వారిని ఈ చిత్రం దారుణంగా నీరు గారుస్తుంది అని చెప్పాలి.

హీరోయిజంని బాగా ఎలివేట్ చేసేందుకు ఏంటీ నాన్సెన్స్ అనే రేంజ్ లో కథనం సినిమాలో కనిపిస్తుంది. ఇక ఒకానొక టైం లో అయితే పరమ బోరింగ్ ఫీల్ కూడా వచ్చేస్తుంది. సినిమాలో యాక్షన్ సీన్స్ కూడా అంత ఎగ్జైట్ చెయ్యవు. ట్రైలర్ లో చూసి ఏదో కొత్త రకం భారీ సినిమా చూడొచ్చు అనుకునేవారికి అదే రొటీన్ యాక్షన్ డ్రామాని ఇచ్చి వదిలారు. వీటితో ఆడియెన్స్ కి తల గోక్కోవడం తప్ప ఇంకేమి తోచదు.

అలాగే సినిమాలో ఒక్క పోస్ట్ క్లైమాక్స్ మినహా ఓవర్ బిల్డప్ గా అంతా సాగుతుంది. ఒక్కటంటే ఒక్క ఎగ్జైటింగ్ ఎలిమెంట్ లేకుండా ఈ సినిమా సాగదీతగా బోరింగ్ గా అనిపిస్తుంది. అలాగే ఒక టైం తర్వాత సినిమా మరింత రొటీన్ గా అనిపించక కూడా మానదు. ఇంకా సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ కూడా అంత ఇంట్రెస్టింగ్ గా అనిపించవు. హీరోకి ఎలాగో మంచి మ్యాచో పర్సనాలిటీ ఉంది కాబట్టి ఇంకాస్త సాలిడ్ లెవెల్లో ఆ సీన్స్ ని చూపించినా యాక్షన్ పార్ట్ వరకు ఓకే అనిపించి ఉండొచ్చు. కానీ అవేవి ఉండకుండా సాగుతుంది.

సాంకేతిక వర్గం:

ఈ సినిమాలో చాలా చోట్ల నిర్మాణ విలువలు మాత్రం సాలిడ్ లెవెల్లో ఉన్నాయి. పెట్టిన భారీ ఖర్చు అంతా కనిపిస్తుంది. కానీ కొన్ని చోట్ల మాత్రం వరస్ట్ గా అనిపిస్తాయి. క్లైమాక్స్ ఫైట్ లో హీరో యాంటీ హీరో నడుమ ఫైట్ లో విఎఫ్ఎక్స్ చాలా వీక్ గా ఉన్నాయి. ఇక వీటితో పాటుగా మణిశర్మ పాటలు పర్వాలేదు కానీ రవి బసృర్ నేపథ్య సంగీతం ఎక్కదు. సినెమాటోగ్రఫీ బాగుంది గ్రాండ్ విజువల్స్ ని చూపించారు. ఎడిటింగ్ విభాగంలో కే ఎం ప్రకాష్ చెయ్యడానికి ఏమీ లేదు.

ఇక ఈ చిత్రానికి కథ, దర్శకత్వం విషయానికి వస్తే యాక్షన్ కింగ్ అర్జున్ సార్జా కథ అందించారు. అయితే దేశ భక్తి నేపథ్యంలో ఏదో గ్రాండ్ లెవెల్లో ప్లాన్ చేశారు కానీ ఇది ఏమాత్రం వర్కౌట్ అవ్వలేదు. ఏపీ అర్జున్ దర్శకత్వం కథ ప్రకారం ఏదో మ్యానేజ్ చేశారు కానీ లేని పోనీ ఆర్భాటాలకు పోయి సినిమాని ఏమాత్రం ఎంగేజింగ్ గా లేకుండా తెరకెక్కించారు. వీటితో తన వర్క్ బిలో యావరేజ్ గానే ఉంటుంది.

తీర్పు:

ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “మార్టిన్” లో పెద్దగా విషయం లేదు. సినిమా మొత్తంలో కూడా ధృవ్ సార్జా నటుడుగా పర్వాలేదు అనిపిస్తాడు. కానీ ఎంత యాక్షన్ మూవీ లవర్స్ అయినా కూడా మార్టిన్ చూస్తే బాగా డిజప్పాయింట్ అవుతున్నారు. ఒక్క మెప్పించే ఎలిమెంట్ కూడా ఆడియెన్స్ ని సినిమాలో ఎంగేజ్ చెయ్యలేదు. ముఖ్యంగా కథనంలో పస లేదు, చాలా చప్పగా సినిమా సాగుతుంది. వీటితో మార్టిన్ మాత్రం ఒక బోరింగ్ యాక్షన్ ఫ్లిక్ గా మిగిలిపోయింది.

123telugu.com Rating: 2/5

Reviewed by 123telugu Team

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments