Manchu Vishnu: ప్రణీత్ హనుమంతు ఇష్యూపై స్పందించిన మంచు విష్ణు.. 48 గంటల డైడ్ లైన్‌తో స్ట్రాంగ్ వార్నింగ్

0
33
ప్రణీత్ హనుమంతు ఇష్యూపై స్పందించిన మంచు విష్ణు..48 గంటల డైడ్ లైన్

చిన్న పిల్లలపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన ప్రముఖ యూట్యూబర్, నటుడు, ప్రణీత్ హనుమంతును ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. బెంగళూరులో ఉన్న అతనిని తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వావి వరసలు మరచి తండ్రీ కూతుళ్ల అనుబంధంపై ప్రణీత్ అండ్ గ్యాంగ్ చేసిన వెకిలి కామెంట్స్, అందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలయ్యాయి. మొదట మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఈ చీకటి వ్యవహారాన్ని బయటపెట్టాడు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, తెలంగాణ పోలీసులను ట్యాగ్ చేసి ట్వీట్ చేశారు. ఆ తర్వాత మంచు మనోజ్, కార్తికేయ, మంచు విష్ణు, విశ్వక్ సేన్ తదితరులు ఈ విషయంపై ఘాటుగా రియాక్ట్ అయ్యారు. అందరూ ముక్తకంఠంతో ప్రణీత్ హనుమంతు అండ్ గ్యాంగ్ ని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని కోరారు. ఎట్టకేలకు బుధవారం ప్రణీత్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. మిగతా ముగ్గురిని కూడా అరెస్ట్ చేస్తామని వెల్లడించారు. ఇదిలా ఉంటే ప్రణీత్ హనుమంతు వివాదంపై మా అధ్యక్షులు మంచు విష్ణు స్పందించారు. హీరోయిన్స్ మీద, సినిమా వాళ్ల మీద అసభ్యకర కామెంట్స్ చేస్తూ చేసిన వీడియోలను, ట్రో లింగ్ వీడియోస్ ని 48 గంటల్లో తొలగించాలంటూ డెడ్ లైన్ ఇచ్చారు. లేకుంటే కఠిన చర్యలు తప్పవంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

‘తెలుగు వాళ్లంటే చాలా మర్యాదస్తులు, పద్ధతిగా ఉంటారు. మన సంస్కృతి, ఆచార వ్యవహారాలను ఫాలో అవుతారని ప్రపంచమంతా అనుకుంటూ ఉంటారు. కానీ ఈ మధ్య కాలంలో తెలుగు వాళ్లు యూట్యూబ్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికల్లో అసభ్యకరంగా ప్రవర్తిస్త్ఉన్నారు. దీని వల్ల మొత్తం తెలుగు వాళ్లకు చెడ్డ పేరు వస్తుంది. అసలు తెలుగు వాళ్లు ఎందుకిలా దారుణంగా ప్రవర్తిస్తున్నారన్న ప్రశ్న నాకు ఎదురవుతోంది. ఒక మంచి కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన ప్రణీత్ హనుమంతు, అతని స్నేహితులు ఇలా ఇంత నీచంగా ఎందుకు ప్రవర్తించారో అర్థం కావడం లేదు. ఇందులో ఆనందం ఏముంది? ఒక చంటి బిడ్డ గురించి నీచంగా మాట్లాడాల్సిన అవసరం ఏముంది? మీకు తల్లి, అక్క, చెల్లి, భార్య లేరా? ఈ విషయంలో బ్రహ్మానందం కూడా నాకు కాల్ చేసి చాలా బాధపడ్డారు. తన ఫోటోలను చెత్త మీమ్స్ కి వాడుతున్నారని.. ఇలాంటి వాటిని వెంటనే ఆపాలని కోరారు. ఇలా ట్రోలింగ్ వీడియోస్ వేసే వారికి ఒక్కటే చెబుతున్నా.. హీరోయిన్స్ మీద, సినిమా వాళ్ల మీద అసభ్యకర కామెంట్స్ చేస్తూ చేసిన రోస్టింగ్ వీడియోలను, ట్రోలింగ్ వీడియోలను నా వీడియో బయటకు వచ్చిన 48 గంటల్లో తొలగించండి. లేదంటే మీ మీద చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది’ అని వీడియోలో హెచ్చరించారు మంచు విష్ణు.

ఇవి కూడా చదవండి



మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here