Manchu Vishnu: తెలుగు యూట్యూబ‌ర్‌ల‌కు.. మంచు విష్ణు వార్నింగ్ !!

0
16
తెలుగు యూట్యూబ‌ర్‌ల‌కు.. మంచు విష్ణు వార్నింగ్ !!

ట్రోలింగ్ పోస్టులు పెడితే ఊరుకోబోమని తెలుగు యూట్యూబ‌ర్‌ల‌కు మంచు విష్ణు వార్నింగ్ ఇచ్చారు. 48 గంటల్లోగా అలాంటి వీడియోలు డిలీట్‌ చేయండంటూ డెడ్‌లైన్‌ విధించారు. లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు విష్ణు. యూట్యూబర్లు తమ తీరు మార్చుకోకుంటే లీగల్‌ యాక్షన్‌కు దిగుతామని చెప్పారు. ఇటీవల యూట్యూబర్ ప్రణీత్‌ హనుమంతు చేసిన కొన్ని డబుల్‌ మీనింగ్‌ కామెంట్లు, దానికి ఆయన స్నేహితులు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర దుమారమే రేపాయి. ఈ విషయమై ఇప్పటికే టాలీవుడ్ సెలబ్రెటీలు బలంగా రియాక్ట్ అయ్యారు. తాజాగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు స్పందించారు. మహిళను కేవలం సెక్సువల్‌గా మాత్రమే చూస్తోన్నారంటూ మంచు విష్ణు ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలను అత్యంత జుగుప్సాకరంగా వర్ణించడం ఏ మాత్రం సమర్థనీయం కాదన్నారు. మీ ఇంట్లో తల్లి, చెల్లి, భార్య, కూతుళ్లు లేరా.. అంటూ ప్రశ్నించారు. మహిళను గౌరవించనప్పుడు మనిషిగా బతికి వేస్ట్.. అని అన్నారు. నటీనటులపై ఇలాంటి వీడియోలు చేస్తున్న యూట్యూబర్లు, ట్రోలర్లకి విష్ణు వార్నింగ్ ఇచ్చారు. 48 గంటల్లోపు ఆ వీడియోలను డిలీట్ చేయకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించాడు. నటీనటులపై చెత్త వీడియోలు, మీమ్స్‌ వెంటనే డిలీట్ చేయండి. 48 గంటల్లో డిలీట్ అవ్వాలి. లేకపోతే యూట్యూబ్‌తో కలసి రివ్యూ చేసి మీ అకౌంట్లు బ్లాక్ చేయిస్తాం. అలాగే చట్టపరమైన చర్యలు తీసుకునే ఏర్పాట్లు చేస్తాను అని విష్ణు వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు ప్రణీత్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు ఆయన్ను ఇప్పటికే అరెస్ట్ చేశారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఎయిర్‌పోర్ట్‌ సిబ్బంది చెంప చెళ్లుమ‌నిపించిన మహిళ అరెస్ట్‌

తుపాకీ గురిపెట్టి.. వంట చేయించుకున్న ఉగ్రవాదులు

చెల్లెలి మృతదేహాన్ని 5 కి.మీ. భుజంపై మోసుకెళ్లిన అన్నలు

రోజుకు ఒక్కసారైనా నవ్వాలి.. జపాన్‌లో చట్టం

పాడుబడ్డ బావిలో వింత శబ్దాలు.. ఏంటని తొంగి చూసిన వారికి మైండ్ బ్లాక్

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here