Manchu Lakshmi: ‘ఇలాంటి వాళ్ల తల బహిరంగంగా నరకాలి’.. ప్రణీత్ హనుమంతుపై మంచు లక్ష్మి తీవ్ర ఆగ్రహం

0
45
Manchu Lakshmi: 'ఇలాంటి వాళ్ల తల బహిరంగంగా నరకాలి'.. ప్రణీత్ హనుమంతుపై మంచు లక్ష్మి తీవ్ర ఆగ్రహం

ప్రముఖ యూట్యూబర్, నటుడు ప్రణీత్ హనుమంతు వివాదం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. వావి వరసలు మరిచిపోయి తండ్రీ, కూతుళ్ల అనుబంధ మీద అతను చేసిన దారుణమైన కామెంట్స్ పట్ల చాలా మంది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి సీతక్క ఈ వివాదంపై స్పందించారు. సదరు యూట్యూబర్ పై కఠిన చర్యలకు ఆదేశించారు. మరోవైపు సాయి ధరమ్ తేజ్, మంచు మనోజ్, సుధీర్ బాబు సహా పలువురు సినీ ప్రముఖులు ఈ విషయంపై ఘాటుగా స్పందించారు. ప్రణీత్ హనుమంతు విషయాన్ని సీరియస్ గా తీసుకోవాలని సోషల్ మీడియా వేదికగా పిలుపునిచ్చారు. తాజాగా మంచు లక్ష్మి ప్రణీత్ హనుమంతు వివాదంపై స్పందించారు. ఈ సందర్భంగా చాలా ఎమోషనల్ గా మాట్లాడిన ఆమె.. చిన్న పిల్లల పట్ల ఇలా అసభ్యకరంగా ప్రవర్తించే వాళ్ల తలని బహిరంగంగా నరకాలన్నారు. మంచు లక్ష్మి నటించిన ‘ఆదిపర్వం సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజైన సినిమా టీజర్లు, ట్రైలర్ అభిమానులను ఆకట్టుకున్నాయి. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో తాజాగా ఆది పర్వం యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించింది. మంచు లక్ష్మి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగానే ప్రణీత్ హనుమంతు వ్యవహారంపై స్పందించారు మంచు లక్ష్మి.

మంత్రి సీతక్క ఆగ్రహం

మరోవైపు మంత్రి సీతక్క ప్రణీత్ హనుమంతుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తండ్రీకూతుళ్ళ మధ్య ఉండే అనుబంధాన్ని అసభ్యంగా వక్రీకరించడం దారుణమన్నారు మంత్రి.  సామాజిక మాధ్యమాల్లో రెచ్చిపోయి మాట్లాడిన దుర్మార్గుల పట్ల తమ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందన్నారు. ప్రణీత్ హనుమంతుపై ఇప్ప టికే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఇలాంటివి పునరావృతం కాకుండా, అసభ్యకర ప్రచారాలు చేయకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు సీతక్క.

ఇవి కూడా చదవండి

మంచు మనోజ్ స్ట్రాంగ్ వార్నింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here