Manamey OTT: ఓటీటీలోకి శర్వానంద్ లేటెస్ట్ హిట్ మూవీ.. ఎక్కడ.? స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

0
26
Manamey OTT: ఓటీటీలోకి శర్వానంద్ లేటెస్ట్ హిట్ మూవీ.. ఎక్కడ.? స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

Manamey OTT: ఓటీటీలోకి శర్వానంద్ లేటెస్ట్ హిట్ మూవీ.. ఎక్కడ.? స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

ఓటీటీ లవర్స్ కు ప్రతి శుక్రవారం పండగనే చెప్పాలి. వారం వారం పదుల సంఖ్యలో సినిమాలు, సిరీస్‌లు రిలీజ్ అవుతూ సందడి చేస్తున్నాయి. థియేటర్స్‌లో కొత్త సినిమాలు రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకుంటుండగా.. ఇప్పుడు ఓటీటీలోనూ సూపర్ హిట్ సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. థియేటర్స్‌లో సినిమాలను మిస్ అయిన వారు.. ఫ్యామిలీతో కలిసి సరదాగా ఇంట్లో కూర్చొని ఓటీటీలో సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు ఓ హిట్ సినిమా ఓటీటీలోకి రావడానికి రెడీ అవుతుంది. ఆ సినిమానే మనమే.. శర్వానంద్ హీరోగా నటించిన సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో శర్వానంద్ కు జోడీగా కృతిశెట్టి హీరోయిన్ గా చేసింది. థియేటర్స్ లో విడుదలైన ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది.

శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాతో శర్వానంద్ చార్మింగ్ స్టార్ అనే ట్యాగ్ ను సొంతం చేసుకున్నాడు. ఈ సినిమాలో సీరత్ కపూర్, రాహుల్ రవీంద్రన్, శివ కందుకూరి, ఆయేషా ఖాన్ కీలక పాత్రల్లో కనిపించారు. జూన్ 7న ఈ సినిమా రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో శర్వా, కృతి జోడీకి మంచి మార్కులు పడ్డాయి. ఈ ఇద్దరూ స్క్రీన్ మీద చక్కగా నటించారు. వీరి కెమిస్ట్రీ ఆకట్టుకుంది.

ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి రానుంది. మనమే సినిమా డిజిటల్ హక్కులు హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్ని ప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకుంది. జూలై 12 నుంచి స్ట్రీమింగ్ అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. అంతే కాదు ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్ లో ఓటీటీలో రిలీజ్ చేయనున్నారు. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో మనమే సినిమా అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది. త్వరలోనే దీని పై అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుంది. చాలా కాలం తర్వాత శర్వానంద్ ఈ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. అటు కృతి శెట్టి కూడా వరుస ఫ్లాప్స్ తర్వాత మనమే సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.

 

View this post on Instagram

 

A post shared by Sharwanand (@imsharwanand)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here