Mamitha Baiju: అయ్య బాబోయ్.. ఇంత క్యూట్‏గా డాన్స్ చేసిందేంటీ.. కుర్రాళ్లను ఫిదా చేస్తోన్న ప్రేమలు బ్యూటీ..

0
29
వారెవ్వా.. ఈ అమ్మడి డాన్స్ అదిరిపోయింది.. కళ్లు తిప్పుకోలేరు..

తెలుగు సినీ పరిశ్రమలో మలయాళీ హీరోయిన్లకు ఉండే క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆల్ మోస్ట్ కేరళ అమ్మాయిలే చక్కరం తిప్పేస్తున్నారు. ఒక్క సినిమాతోనే అందం, అభినయంతో కుర్రాళ్ల హృదయాలను దొచేస్తున్నారు. ఇప్పటికే తెలుగు తెరపై ఓ రేంజ్ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరోయిన్స్ అంతా మలయాళీ ముద్దుగుమ్మలు కావడం విశేషం. అందులో మమితా బైజు ఒకరు. దశబ్దా కాలంగా మలయాళంలో పలు సినిమాలు చేసిన ఈ బ్యూటీ.. ఒక్కసారిగా ప్రేమలు సినిమాతో సెన్సెషన్ అయ్యింది. మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఈ సినిమాను తెలుగులోకి డబ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. తెలుగుతోపాటు తమిళంలోనూ ఈ సినిమా సక్సెస్ కాగా.. దక్షిణాదిలో మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది మమితా. ఈ మూవీలో రీను పాత్రలో మమితా నటనకు, క్యూట్ నెస్ చూసి ఫిదా అయిపోయారు. ఇక అబ్బాయిలకు మమితా ఫేవరెట్ అయిపోయింది.

ప్రేమలు సినిమా తర్వాత మమితా ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది. ముఖ్యంగా అబ్బాయిలలో ఓ రేంజ్ క్రేజ్ వచ్చేసింది. దీంతో ఇటు తెలుగులోనూ ఈ బ్యూటీకి అవకాశాలు వస్తున్నాయి. ఇప్పుడిప్పుడే మమితా తెలుగుతోపాటు తమిళంలోనూ వరుస ఆఫర్స్ వస్తున్నాయని టాక్. అలాగే సోషల్ మీడియాలో మమితా ఏ పోస్ట్ చేసినా క్షణాల్లో వైరలవుతుంది. ఈ బ్యూటీ చైల్డ్ హుడ్ ఫోటోస్, వీడియోస్ తెగ షేర్ చేస్తున్నారు ఫ్యాన్స్.ఈ క్రమంలో తాజాగా మమితాకు సంబంధించిన ఓల్డ్ వీడియో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.

కొన్నాళ్ల క్రితం ఓ ఈవెంట్లో చీరకట్టులో మెరిసింది మమితా.. అలాగే గురు సినిమాలో ఐశ్వర్య రాయ్ చేసిన బర్సోరే మేఘ పాటకు ఎంతో అందంగా డాన్స్ చేసి అందరిని ఫిదా చేసింది. ప్రస్తుతం ఆమె డాన్స్ వీడియో నెట్టింట వైరలవుతుండగా.,. ఇంత క్యూట్ గా డాన్స్ చేసిందేంటీ.. ? ఎంత బాగా డాన్స్ చేసిందో అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here