Malvi Malhotra: రాజ్ తరుణ్‏తో ప్రేమాయణం.. లావణ్య ఆరోపణలపై స్పందించిన హీరోయిన్..

0
26
లావణ్య ఆరోపణలపై స్పందించిన హీరోయిన్..

లావణ్య వర్సెస్ రాజ్ తరుణ్.. నిన్నటి నుంచి ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తున్న న్యూస్. హీరో రాజ్ తరుణ్ తనను ప్రేమించి మోసం చేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది లావణ్య అనే అమ్మాయి. నటి మాల్వీ మల్హోత్రా మాయలో పడి తనను రాజ్‌తరుణ్ దూరం పెడుతున్నారని వాపోయింది. రాజ్, తను 11 ఏళ్లు ప్రేమలో ఉన్నామని.. కానీ ఇప్పుడు మాల్వీ మల్హోత్ర కారణంగానే తనను రాజ్ నిర్లక్ష్యం చేస్తున్నాడని.. తనను వదిలించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడని తన కంప్లైంట్ లో పేర్కొంది లావణ్య. మాల్వీ మల్హోత్రతో పాటు ఆమె కుటుంబసభ్యులపై కూడా ఫిర్యాదు చేసింది. రాజ్‌తరుణ్‌ లేకపోతే తాను ఉండలేననీ.. అతనితోనే కలసి బతకాలని కోరుకుంటున్నానని.. తనకు రాజ్ ను దూరం చేయాలనే మాల్వీ మల్హోత్ర కుటుంబసభ్యులు తనను బెదిరిస్తున్నారని వాపోయింది. తాజాగా ఈ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు బయటపడుతున్నాయి.

ఇప్పటికే లావణ్యకు నార్సింగ్ పోలీసులు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఫిర్యాదుకు సంబంధించిన ఆధారాలను సమర్పించాలని పేర్కొన్నారు. తనకు ప్రాణహానీ ఉందని.. రక్షణ కల్పించాలని పోలీసులను కోరింది లావణ్య. బాధితురాలి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. తాజాగా లావణ్య తనపై చేస్తున్న ఆరోపణలపై స్పందించింది హీరోయిన్ మాల్వీ మల్హోత్రా. అసలు లావణ్య ఎవరో కూడా తనకు తెలియదని.. రాజ్ తరుణ్ గురించి మాట్లాడుతూ తనను దూషించిందని.. తన పరువుకు భంగం కలిగించేలా మాట్లాడుతుందని.. దీనిపై సైబరాబాద్ కమిషనర్‏ను కలుస్తున్నట్లు తెలిపింది.

మాల్వీ మల్హోత్ర మాట్లాడుతూ.. ” నాకు లావణ్య ఎవరో అసలు తెలియదు. గత సెప్టెంబర్ లో మొదటిసారి నాకు మెసేజ్ పెట్టింది. రాజ్‏తో కలిసి నేను సినిమాలో నటించాను. రాజ్‏ను వదిలేయాలని నాకు అసభ్యకరంగా మెసేజ్‏లు పెట్టింది. లావణ్య కారణంగా నేను రాజ్ 6 నెలల మాట్లాడుకోలేదు. నా కుటుంబ సభ్యులను సైతం బెదిరించింది. మా పేరెంట్స్‏కు సైతం కాల్ చేసి బెదిరించింది. మాకు హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రితో ఎలాంటి సానిహిత్యం లేదు. మా ఫ్యామిలీకి ఎలాంటి పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ లేదు. నేను రాజ్ తరుణ్ కో- స్టార్స్ మాత్రమే. నా పరువుకు భంగం కలిగించేలా మెసేజ్ చేయడంతో పాటు, కుటుంబాన్ని ఇష్టమొచ్చినట్లు తిట్టింది. అన్ని ఆధారాలతో సైబరాబాద్ కమిషనర్‏ను కలుస్తున్నాను” అని తెలిపింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here